మండించే ఎండల నుంచి ఉపశమనంగా వర్షాకాలం వచ్చేసింది. అయితే వర్షంతోపాటు కొన్ని రకాల ఇబ్బందులు, జలుబు, జ్వరం లాంటివి వెంటే వస్తాయి. అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నారుల్లో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. చిన్న పిల్లలు ఆరోగ్యం, చర్య సంరక్షణ చాలా అవసరం.
ఈ నేపథ్యంలో మారికో లిమిటెడ్ చీఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా వోరా అందించే చిట్కాలను పరిశీలిద్దాం.
పెద్దవారితో పోలిస్తే శిశువు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది దాదాపు 30శాతం పల్చగా, సుకుమారంగా ఉంటుంది. పెళుసుగా , పొడిగా ఉండి తొందరగా వాతావరణ పరిస్థితుల ప్రభావానికి లోనవుతుంది. దీంతో చర్మం ఎరుపెక్కడం, ఇన్ఫెక్షన్లు లాంటి వివిధ చర్మ సమస్యలొస్తాయి.
పాపాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పరిశుభ్రత, మాయిశ్చరైజేషన్ రెండూ చాలా అవసరం. వర్జిన్(పచ్చి) కొబ్బరి నూతోనె పాపాయి మృదువైన చర్మానికి మసాజ్ చేయాలి.
వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఆధారిత నరిషింగ్ లోషన్ లేదా క్రీంతో క్రమం తప్పకుండా బేబీ బాడీని మాయిశ్చరైజ్ చేయాలి. తల్లి పాలలో లభించే పోషకాలుండే ఈ ఆయిల్ శిశువు చర్మాన్ని 24 గంటలూ తేమగా ఉంచేలా సాయపడుతుంది. చర్మానికి తగిన పోషణ కూడా అందుతుంది.
బలమైన ఎముకలు, కండరాల అభివృద్ధి , నరాల అభివృద్ధిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.
దీనితో పాటు, బిడ్డకు సరైన దుస్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వర్షాలకి ఉష్ణోగ్రతలు తగ్గి, గాలిలో తేమ పెరుగుతుంది. దీంతో చిన్నారికి చెమటలు పట్టే అవకాశం ఎక్కువ. కనుక వదులుగా ఉండే దుస్తులను వాడాలి.
అలాగే సింథటిక్ దుస్తులు కాకుండా మెత్తటి కాటన్, చలికి రక్షణగా ఉలెన్ దుస్తులను వాడాలి. లేదంటే అధిక చెమటతో, పొక్కులు, దద్దుర్లు వస్తాయి. ఈ సీజన్‌లో డైపర్‌లను తరచుగా మార్చుతూ అక్కడి చర్మం తడిగా లేకుండా చూసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment