మారుతున్న వాతావరణానికి అనుగుణంగా చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మాన్‌సూన్ తేమ, ఊహించని వర్షపు జల్లుల నుంచి మనల్ని మనం రక్షించు కోవాలి. ఆఫీసులకు, బయటికి వెళ్లేవాళ్లు, గొడుగు, రెయిన్‌కోట్ లాంటివి కచ్చితంగా తీసుకెళ్లాలి. ఈ సీజన్‌లో కూడా మాయిశ్చరైజర్ వాడాలా? నీళ్లు ఎక్కువ తాగాలా? తక్కువ తాగాలా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
వర్షాకాలం పాటించాల్సిన సౌందర్య చిట్కాలు
వర్షాకాలంలో హెవీ మేకప్ కాకుండా, తేలికపాటి, వాటర్ ప్రూఫ్ లైట్ మేకప్ ఎంచుకోవాలి. ఫౌండేషన్ , కన్సీలర్‌ను సెట్ చేయడానికి సెట్టింగ్ స్ప్రే వాడితే బెటర్.
టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, చర్మాన్ని లోపలినుంచి ఆరోగ్యంగా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగాలి.
మాయిశ్చరైజర్: వాతావరణం తేమగా ఉంటుంది కనుక చర్మరంధ్రాలు మూసుకోకుండా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి తేలికపాటి మాయిశ్చరైజర్‌ని వాడాలి.
మేఘావృతమైన రోజులలో కూడా, సూర్యుని యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. అందుకే కనీస SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలి.
చర్మంలోని సహజ నూనెలను తొలగించే కఠినమైన ఉత్పత్తులకు బదులుగా మీ చర్మానికి తగినట్టుగా, సున్నితమైన, నూనె లేని సువాసన లేని క్లెన్సర్‌ను ఎంచుకోండి.
తడి జుట్టును అలాగే వదిలేయకుండా సహజంగా ఆరేలా చూసుకోవడం. తప్పదు అనుకుంటే డ్రైయ్యర్ వాడాలి. జుట్టు చిట్లిపోకుండా ఉండటానికి కండీషనర్ లేదా హెయిర్ సీరమ్‌ని ఉపయోగించండి.
అలాగే సున్నితమైన క్లెన్సర్ లేదా మేకప్ రిమూవర్ సాయంతో రాత్రి పడుకునేందుకు మేకప్‌ను పూర్తిగా తొలగించండి. లేదంటే ముఖంపై ఉన్న మేకప్ చర్మానికి హాని చేస్తుంది. మొటిమలు రావచ్చు. అందుకే తేనె వంటి ఇతర సహజ మాయిశ్చరైజర్ పదార్ధాలు ఉన్న సీరమ్‌ను ఎంచుకుంటే మంచిది.
Comments
Please login to add a commentAdd a comment