Do This If Your Child's Nose Bleeds - Sakshi
Sakshi News home page

చిన్నారుల ముక్కు నుంచి రక్తం వస్తుందా? చాలావరకు ఇది..

Published Sun, Jul 23 2023 11:37 AM | Last Updated on Sun, Jul 23 2023 12:34 PM

Do This If Your Childs Nose Bleeds - Sakshi

ఈ సీజన్‌లో పిల్లలు వానల్లో తడిసి, జలుబు చేసి ముక్కు చీదినప్పుడు రక్తం రావచ్చు. చిన్నారుల ముక్కు నుంచి రక్తస్రావం జరగడాన్ని ఎపిస్టాక్సిస్‌ అంటారు. చాలావరకు ఇది ఏమాత్రం ఆందోళనకరం కాదు. పిల్లల ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...

  • పిల్లలు కాస్త ముందుకు ఒంగి కూర్చునేలా చూడాలి
  • నోటితో గాలిపీల్చుకొమ్మని చెప్పాలి.
  • రక్తస్రావం అవుతున్న ముక్కు రంధ్రం వైపు భాగాన్ని బొటనవేలు, చూపుడువేలుతో కాసేపు అలాగే నొక్కి పట్టి ఉంచాలి.
  • ముక్కుపైన ఐస్‌ప్యాక్‌ లేదా కోల్డ్‌ ప్యాక్‌ ఉంచాలి.
  • వాళ్లు గట్టిగా ముక్కు చీదకుండా చూడాలి.
  • రక్తస్రావం తగ్గాక మళ్లీ అలా జరగకుండా ఉండేందుకు పిల్లల వేళ్ల గోళ్లు కత్తిరిస్తూ, వాళ్లు ముక్కులో వేళ్లు పెట్టుకుని గిల్లుకోకుండా చూడాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో రక్తస్రావం తప్పక ఆగిపోతుంది. ఒకవేళ ఆగకపోతే తక్షణం డాక్టర్‌ / ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ను కలవాలి.

(చదవండి: ఏజెన్సీ ప్రాంతాలను కలవరపెట్టే 'మలేరియా'..తస్మాత్‌ జాగ్రత్త లేదంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement