స్థిరీకరణకు అవకాశం...విదేశీ పెట్టుబడులపైనా దృష్టి
ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల అంచనా
బక్రీద్ సందర్భంగా నేడు ఎక్సే్చంజీలకు సెలవు
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారం మార్కెట్లో స్థిరీకరణ (కన్సాలిడేషన్) అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు స్థూల ఆరి్థక గణాంకాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వచ్చే వారం రోజుల్లో 3 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి.
ఇందులో డీ డెవలప్‌మెంట్ ఇంజనీర్స్, ఆమ్కే ఫిన్ ట్రేడ్ పబ్లిక్ ఇష్యూలు జూలై 19న, స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ ఐపీఓ జూలై 20న ప్రారంభం కానున్నాయి. బక్రీద్ సందర్భంగా నేడు (సోమవారం) ఎక్సే్చంజీలకు సెలవు. ‘‘వివిధ మంత్రిత్వ శాఖలు ప్రకటిస్తున్న ‘అధికారం చేపట్టిన తొలి 100 రోజుల ప్రణాళిక’లను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటుచేసుకుంటే సాంకేతికంగా నిఫ్టీకి 22,800–23,100 శ్రేణిలో కీలక మద్దతు లభించే వీలుంది. కొనుగోళ్లు జరిగి 23,600 స్థాయిని చేధించగలిగే 24,000 మైలురాయిని అందుకోవచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.
కేంద్రంలోని కొత్త ప్రభుత్వం మూలధన వ్యయాలకు ప్రాధాన్యత కొనసాగిస్తుందనే ఆశలతో గతవారం అభివృద్ధి ఆధారిత రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 77,145 వద్ద సరికొత్త రికార్డు నెలకొల్పంది. నిఫ్టీ 175 పాయింట్లు బలపడి 23,490 వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. కాగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
ప్రపంచ పరిణామాలు
బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, నార్వేల కేంద్ర బ్యాంకులు ఈ వారంలో ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు వెల్లడించనున్నాయి. దాదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల కోతకే మొగ్గు చూపొచ్చనేది ఆరి్థకవేత్తల అంచనా. యూరోజోన్ మే ద్రవ్యోల్బణం డేటా మంగళవారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య సమావేశ నిర్ణయాల వివరాలు (మినిట్స్) బుధవారం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పరపతి సమావేశం గురువారం, అమెరికా జూన్ ప్రథమార్థపు సేవా, తయారీ రంగ గణాంకాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి.
గతవారంలో రూ.11,730 కోట్ల పెట్టుబడులు
ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు ఆచూతూచి వ్యవహరించిన విదేశీ ఇన్వెస్టర్లు తరువాత దేశీయ మార్కెట్లోకి బలమైన పునరాగమనం చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం, రానున్న బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు, రాయితీలు లభిస్తాయనే ఆశలతో భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. గత వారం (జులై 14తో ముగిసిన వారం)లో విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీల్లో రూ.11,730 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇదే సమయంలో నికర అమ్మకాలు (జూన్ 1– 14 వరకు) రూ.3,064 కోట్లుగా ఉన్నాయి.
మరోవైపు ఈ నెలలో (జూన్ 14 వరకు) ఎఫ్‌పీఐలు డెట్ మార్కెట్ లో రూ.5,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ‘‘దేశంలో సంకీర్ణ కూటమి ఉన్నప్పటికీ, వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడడం విధాన సంస్కరణలు, ఆరి్థక వృద్ధి కొనసాగింపుపై అంచనాలను పెంచింది’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. ఇక మేలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుండి రూ. 25,586 కోట్లను ఉపసంహరించుకున్నారు, ఏప్రిల్‌లో రూ. 8,700 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అదే మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్లు నికర పెట్టుబడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment