
సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంలో ఈనెల 21న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయవ్య బంగాళా ఖాతం నుంచి దాని పరసర ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. మరఠ్వాడ దాని పరిసర ప్రాంతం మీదుగా రాష్ట్ర సరిహద్దు వరకు ఉపరితల అవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టం నుంచి 2.1 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ప్రధానంగా దక్షిణ, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలో 1.09 సెం. మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నారాయణపేట్ జిల్లాలో 7.9 సెం.మీ., వనపర్తి జిల్లాలో 5.1సెం.మీ., మహబూబ్‌నగర్ జిల్లాలో 4.1సెం.మీ., నిర్మల్ జిల్లాలో 2.8 సెం.మీ. వర్షం కురిసినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment