నిన్న మొన్నటి దాకా చెమటలు పట్టించిన ఎండలు కాస్తా ఇప్పుడు మబ్బుల వెనక దాక్కుని, వానలు కురిపిస్తున్నాయి. వానలు ఆహ్లాదంగానే ఉంటాయి. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధులను కూడా వెంట మోసు కొస్తాయి. ఈ అనారోగ్యాలతో పోరాడటానికి. రోగనిరోధకశక్తి బలంగా ఉండటం చాలా ముఖ్యం. వర్షాకాలంలో వ్యాధి నిరోధక శక్తిని మరింత పెంచుకోవడానికి నిత్యం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం. ఆ మార్పులేమిటో, ఈ సీజన్‌లో ఏ ఆహారం తీసుకుంటే మందో చూద్దాం...
ముసురు పట్టినప్పుడు వేడి వేడి టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే వాటికి బదులు గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ వంటివి తీసుకోవాలి. దాంతోపాటు అల్లం, మిరియాలు, తేనెతో తయారు చేసిన టీ సేవిస్తే.. ఆరోగ్యానికి చాలా మంది. అదేవిధంగా బజ్జీలు, పునుగులు, బోండాలకు బదులు వేడి వేడి ఉగ్గాణి, సెనగ, పెసర గుగ్గిళ్లు, చుడువా, సగ్గుబియ్యం కిచిడీ మంది. పుదీనా, తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటితో కషాయం కాచుకుని తాగితే మంది. రాగులు, సోయాబీన్, పెసలు, మెుక్కజొన్న వంటి పప్పుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యల దరిచేరవు. వీటితోపాటు పోషక విలువలు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు అంటే దానిమ్మ, ఆపిల్, స్ట్రాబెర్రీ, అరటì , క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలి కూర వంటివి తీసుకుంటే మంచిది.
అల్లం: ఇది శరీర కణ జాలాలకు పోషకాలను సమీకరించడానికి, సరఫరా చేయడానికి తోడ్పడుతుంది. ఈ రోజుల్లో జలుబు, దగ్గు వంటి సమస్యలు సర్వసాధారణం. అల్లం కఫాన్ని తగ్గిస్తుంది కాబట్టి అల్లం టీ తాగితే జలుబు, దగ్గు దూరం అవుతాయి. ఫ్లూతో పోరాడటానికి అల్లం తోడ్పడుతుంది. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తినీ మెరుగుపరుస్తాయి. టీలు, సప్‌లు, కూరల్లో అల్లాన్ని ఎక్కువ ఉపయోగిస్తే వ్యాధి నిరోధకతను పెంచుకోవచ్చు.
నేరేడు పండు... ఈ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాల ఫైటోకెమికల్సూ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. నేరేడులో క్యాలరీలు తక్కువ. వానాకాలంలో వచ్చే అతిసార, కలరా వ్యాధులతో పాటు ఇతరత్రా ఇన్ఫెక్షన్లకీ నేరేడు ఔషధంలా పనిచేస్తుంది.
తులసి... ఈ కాలంలో రోజూ తులసి ఆకులను నమలడం ద్వారా అనారోగ్యాల నుంచి రక్షణ పొందవచ్చు. ఐదు తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులు తిని.. నీటిని తాగాలి. తులసి రోగనిరోధక వ్యవస్థను బూస్ట్ చేస్తుంది.
నిమ్మ... నిమ్మరసంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచే సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాదు, శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
మిరియాలు... నల్ల మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. జీవక్రియలను పెంచుతాయి. దగ్గు, గొంతు నొప్పి ఉన్నట్లయితే నల్ల మిరియాలను పొడి చేసి నిద్రవేళకు ముందు వేడి పాలలో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
పసుపు... పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. రోజూ రాత్రిపూట చిటికడు పసుపు కలిపిన వేడి పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
లవంగం... ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. వర్షాకాలంలో లవంగాలను తీసుకుంటే గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
దాల్చిన చెక్క... అద్భుత ఔషధ గుణాలెన్నో దాగి ఉన్న దాల్చిన చెక్క మధుమేహులకు రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. రోజూ గ్లాసు పాలలో దాల్చిన చెక్క పొడి కలుపుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, శరీరంలో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గించే గుణం దీనిలో ఇమిడి ఉంది.
వీటికి దూరంగా ఉండటం మేలు!
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలంటే చక్కెర పదార్థాలకి దరంగా ఉండాలి. ముఖ్యంగా ఐస్ క్రీం, కేక్, క్యాండీ, చాక్లెట్, కూల్‌డ్రింక్స్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. చాలామంది ప్యాక్ చేసిన ఆహారాలని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అధిక ఉప్పు ఆటో ఇమ్యూన్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఆల్కహాల్, ధూమపానం కూడా శరీరాన్ని బలహీనంగా మారుస్తాయి. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉంటే మేలు.
(చదవండి: టాయిలెట్ క్లీనర్.. కానీ మనం కూల్‌డ్రింక్స్‌లా తాగేస్తున్నామా..!)
Comments
Please login to add a commentAdd a comment