న్యూఢిల్లీ:నైరుతి రుతుపవనాలు వెళ్లిపోవడంతో దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.గురువారం(అక్టోబర్3)ఢిల్లీలో కాలుష్యం పెరిగినట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) సూచించింది.ఢిల్లీ-గజియాబాద్ బోర్డర్‌లోని ఆనంద్ విహార్‌లో ఏక్యూఏ ఏకంగా 389గా నమోదైంది.దీంతో ఢిల్లీలో అత్యంత కాలుష్య ప్రాంతంగా ఆనంద్‌విహార్ రికార్డులకెక్కింది.
ఆనంద్ విహార్ తర్వాత ముండ్కా,ద్వారకా, వాజీపూర్‌లలోనూ కాలుష్యం ఏక్యూఐపై 200 పాయింట్లుగా నమోదైంది.అయితే గురుగ్రామ్,ఫరీదాబాద్‌లలో మాత్రం కాలుష్యం ఏక్యూఐపై అత్యంత తక్కువగా 58,85గా రికార్డయింది.
ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గించడానికి పంజాబ్,హర్యానా ప్రభుత్వాలు కేవలం సమావేశాలు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గురువారమే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యంపై చర్యలేవి: సుప్రీంకోర్టు ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment