సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా విస్తరించిన రుతు పవనాలు, జోరుగా కురుస్తున్న వర్షాలతో వరి సాగు విస్తీర్ణం సాధారణ స్థాయికి చేరుకుంటోందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి వరి 23.7 మిలియన్ హెక్టార్లలో సాగవగా, ఈ ఏడాది జూలై 27 నాటికి 21.5 మిలియన్ హెక్టార్లలో సాగైందని పేర్కొంది.
గత ఏడాదితో పోలిస్తే కాస్త తక్కువే అయినప్పటికీ ఐదేళ్ల సగటుతో పోలిస్తే 2.2 శాతం మేర అధికమేనని తెలిపింది. ఈ ఏడాది మొత్తంగా 40.15 మిలియన్ హెక్టార్లలో వరి సాగు కానుందని అంచనా వేసింది. ఇక వేరుశెనగ, సోయాబీన్, పొద్దు తిరుగుడు వంటి నూనెగింజల సాగు గత ఏడాది కంటే 3.8 శాతం ఎక్కువగా, 17.16 మిలియన్ హెక్టార్లలో సాగయ్యాయని వివరించింది. పప్పుధాన్యాల సాగు సైతం 14 శాతం మేర పెరిగి, 10.2 మిలియన్ హెక్టార్లలో సాగైందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment