Paddy cultivation
-
వరి చేలోనే కూరగాయలు, చేపలు!
మాగాణి చేను అనగానే మనకు ఒక్క వరి పంట (Paddy) మాత్రమే మదిలో మెదులుతుంది. అయితే, మాగాణి పొలంలో వరి పంటతో పాటు కూరగాయ పంటలు, చేపల సాగు (aquaculture) కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించుకునే సరికొత్త సమీకృత సేద్య నమూనా ఇది. కాకినాడ జిల్లా (Kakinada District) పిఠాపురం మండలం పి.రాయవరం గ్రామానికి చెందిన యువ రైతు కరుపురెడ్డి వెంకటేష్ నమూనా క్షేత్రం ఇందుకు ఒక ఉదాహరణ. 1.20 ఎకరాల భూమిలో వరితో పాటు అనేక రకాల కూరగాయ పంటలు, కందకంలో చేపల సాగు దర్శనమిస్తాయి. ఏడాదికి ఎకరం వరి సాగులో సాధారణంగా రూ. 40 వేల ఆదాయం వస్తుంది. అయితే, సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వెంకటేష్ రూ. లక్షకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఈయన వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల రైతులకు సైతం ఆదర్శంగా నిలిచారు.ఎకరానికి రూ. లక్ష ఆదాయంవెంకటేష్ వ్యవసాయ క్షేత్రం విసీర్ణం ఎకరం 20 సెంట్లు. కాగా, చుట్టూతా విశాలమైన గట్టు 55 సెంట్లలో, గట్టు పక్కనే చుట్టూతా 20 సెంట్లలో తవ్విన కందకంలో చేపల పెంపకం, మధ్యలో మిగిలిన 45 సెంట్ల విస్తీర్ణంలో వరి పంట పండిస్తున్నారు. మాగాణిలో ఒకే పంటగా వరి సాగు చేస్తే ఎకరానికి మహా అయితే రూ.40 వేల ఆదాయం వస్తుంది. దీనికి భిన్నంగా తన పొలంలో గట్టు మీద పండ్ల చెట్లు, కూరగాయ పంటలు, ఆకు కూరలు.. గట్టు పక్కనే తవ్విన కందకం (లేదా కాలువ)లో చేపలు పెంచుతున్నారు. మధ్యలోని పొలంలో వరి సాగు చేస్తున్నారు. ఈ విధంగా సమీకృత ప్రకృతి సేద్యం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.లక్ష ఆదాయం సంపాదిస్తున్నారు. మాగాణి పొలాల్లో కూడా వరి తప్ప వేరే పండదు అనే అపోహను వదిలిపెట్టి పలు రకాల పంటలు పండించుకోవటం ద్వారా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో ఈ సమీకృతి ప్రకృతి సేద్య నమూనా తెలియజెప్తోంది. వెంకటేష్ వ్యవసాయ క్షేత్రం రైతులకు, ఇతర సిబ్బందికి రాష్ట్ర స్థాయి శిక్షణ ఇవ్వటానికి కూడా ఉపయోగపడుతుండటం విశేషం. – విఎస్విఎస్ వరప్రసాద్, సాక్షి, పిఠాపురంఇతర రైతులకు ఆదర్శంయువ రైతు వెంకటేష్ సమీకృత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరితో పాటు చేపలు, కూరగాయ పంటల సాగుపై ఆసక్తి చూపటంతో శిక్షణ ఇచ్చాం. ఆచరణలో పెట్టి, మంచి ఫలితాలు సాదించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. ఆయన పొలాన్నే రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రదర్శన క్షేత్రంగా వినియోగిస్తున్నాం. – ఎలియాజర్ (94416 56083), జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి, కాకినాడరెండేళ్లలోనే మంచి ఫలితాలునాకున్న 1.2 ఎకరాల పొలంలో గతంలో వరి మాత్రమే సాగు చేసే వాడిని. ఏడాదికి పెట్టుబడి పోను అతి కష్టం మీద రూ. 40 వేల వరకు ఆదాయం వచ్చేది. ఆ దశలో 2020లో మా జిల్లాలో చేపట్టిన పకృతి వ్యవసాయం చేయాలనిపించి ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లాప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్ను సంప్రదించాను. ఆయన నా ఆసక్తిని గమనించి దుర్గాడ రైతు గుండ్ర శివ చక్రం ద్వారా నాకు సమీకృత సాగుపై శిక్షణ ఇప్పించారు. సార్వా వరి కోసిన తర్వాత, అదేవిధంగా దాళ్వా పంట కోసిన తర్వాత నేలను సారవంతం చేసే 20 రకాల పచ్చిరొట్ట పంటలను పెంచి, కలిదున్నేస్తున్నా. దీని వల్ల భూమి సారవంతమవుతోంది. ఎద్దులతోనే దుక్కి, దమ్ము చేస్తాం. జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు వాడుతున్నాం. రెండేళ్లలోనే మంచి ఫలితాలు వచ్చాయి. మా కుటుంబానికి వాడుకోగా మిగిలిన కూరగాయల ఇతరులకు ఇస్తున్నాం. బొచ్చె, కొర్రమీను వంటి చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం వస్తోంది. రసాయనాలు వాడకుండా పెంచటం వల్ల మా పంటలకు మంచి డిమాండ్ ఉంటోంది. సంతృప్తికరంగా ఆదాయం పొందటంతో పాటు రైతుల శిక్షణ కేంద్రంగా మా పొలం మారినందుకు చాలా సంతోషంగా ఉంది. – కరుపురెడ్డి వెంకటేష్ (63024 19274),పి.రాయవరం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా -
యాసంగిలోనూ వరిసాగే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగి సీజన్లోనూ రైతు లు వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు. సీజన్ ప్రారంభమై నెలరోజులు కాగా, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25.61 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగ య్యాయి. ఇందులోనూ ఆయా జిల్లాల్లో 26 శాతం నుంచి 50 శాతం వరకు వరి సాగవడం గమనార్హం.యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎక రాలు కాగా, పెరిగిన నీటివసతి, సన్నవడ్లకు రూ. 500 బోనస్‌తో 79 లక్షల ఎకరాల వరకు సాగవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో అత్యధికంగా 63 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని భావి స్తోంది. ఇందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ ఏర్పా ట్లు చేసింది. ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో పంటల సాగు పూర్తవుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఏడు జిల్లాల్లో 75 శాతం పూర్తి కావొచ్చిన పంటల సాగుకూరగాయలు, జొన్న, వేరుశనగ, మొక్కజొన్న, శనగ, కందులు, పొగాకు వంటి పంటలు వేసే జిల్లాల్లో..ఇప్పటి వరకు 51శాతం నుంచి 75శాతం వరకు పంటల సాగు పూర్తయింది. » ఆదిలాబాద్, నిర్మల్, జనగాం, నిజామాబాద్, ఖమ్మం, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పంటలు వేగంగా సాగవుతున్నాయి. » 25 శాతం కన్నా తక్కువగా మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మెదక్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో పంటలు సాగయ్యాయి. » ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వరి సాగు ఆలస్యమవుతోంది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో వరిసాగు విస్తీర్ణం తగ్గనుండగా, ఆరుతడి పంటలు ఎక్కువగా సాగవనున్నాయి.» మరో 12 జిల్లాల్లో 25 శాతం కన్నా అధికంగా 50 శాతం లోపు పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ పేర్కొంది. 3.65 లక్షల టన్నుల యూరియా వినియోగం..ఈ యాసంగి సీజన్లో 19.60 లక్షల మెట్రిక్ టన్నుల మేర వివిధ రకాల ఎరువులు అవసరమవుతాయని ప్ర భుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతి పాదనలు పంపగా, దశల వారీగా సరఫరా అయినట్టు మార్క్‌ఫెడ్ తెలిపింది. ఇప్పటి వరకు 3.65 లక్షల ట న్నుల యూరియా, 1.10 లక్షల టన్నుల డీఏపీ, 3.79 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 24వేల టన్నుల పొటాష్, 19వేల టన్నుల సూపర్ ఫాస్ఫేట్ను రైతులు కొనుగోలు చేశారు. 3.61 లక్షల టన్నుల యూరియా, 24వేల టన్నుల డీఏపీ, 2.15 లక్షల టన్నుల కాంప్లెక్స్, 38వేల టన్నుల పొటాష్ , 17వేల టన్నుల సూపర్ ఫాస్ఫేట్ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నట్టు మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
చి‘వరి’కి పొరుగు కూలీలే దిక్కు
సాక్షి, పెద్దపల్లి: యాసంగి సాగు పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. పల్లెల్లో కూలీల కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో రైతులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వలస కూలీలను తీసుకొస్తున్నారు. స్థానిక కూలీలకు రెట్టింపు కూలి చెల్లిస్తేనే వ్యవసాయ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం పెరిగిన డిమాండ్ మేరకు స్థానిక మహిళలకు రూ.500 నుంచి రూ.600, పురుషులకు రూ.1,000 వరకు కూలి చెల్లిస్తున్నారు. గతంతో పోల్చితే రెట్టింపు కూలి చెల్లించాల్సి రావడంతో అన్నదాతలపై పెట్టుబడి పెరుగుతోంది.పొలాలు దూరంగా ఉండడంతో.. ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించడం, అదనంగా అల్పాహారం, టీ సమకూర్చడం రైతులపై ఆర్థిక భారానికి కారణమవుతోంది. మరికొన్నిచోట్ల పురుషులకు ఇతర ఖర్చుల కింద రూ.100 చెల్లిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఎకరాలో వరి నాట్లు వేసేందుకు రూ.4,000 – రూ.4,500 వరకు ఖర్చు ఉండేది. ప్రస్తుతం రూ.6 వేలకు పైగా అవుతోంది. అదికూడా కేవలం కూలీలకు చెల్లించాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. స్థానిక మహిళలకు రూ.5,500 చొప్పున.. ఎకరాలో వరి నాట్లు వేసేందుకు గంపగుత్తకు ఇస్తున్నా.. అదనంగా నారు పంచేందుకు రూ.1,000తో పురుషులను ఏర్పాటు చేయాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. అదే వలస కూలీలకు.. వరి నాట్ల బాధ్యత గంపగుత్తకు ఇస్తే.. ఎకరాకు రూ.5,500తోనే మొత్తం పనులు చూసుకుంటున్నారు. దీంతో అదనపు భారం తగ్గడంతోపాటు, తక్కువ సమయంలోనే నాట్లు పూర్తవుతున్నాయి. ఫలితంగా రైతులు పక్కరాష్ట్రాల కూలీల వైపే మొగ్గు చూపుతున్నారు.యంత్రాలు, వలస కూలీలే ఆధారం..కూలీల కొరతతో రైతులు వరినాట్లు వేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీనిని అధిగమించేందుకు అన్నదాతలు కొన్నేళ్లుగా వలస కూలీలు, యంత్రాలపై ఆధారపడుతున్నారు. యంత్రాల కొరతతోపాటు కొన్ని నేలల్లో నాట్లు వేసే పరిస్థితి లేక.. మనుషులతో నాట్లు వేయిస్తే అధిక దిగుబడి వస్తుందని రైతులు వలస కూలీల కోసం ఎదురు చూస్తున్నారు. కోల్‌కతా, మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి, చంద్రాపూర్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కార్మికులు వరి నాట్లు వేసేందుకు జిల్లాకు వలస వస్తున్నారు. కొంతమంది స్థానికులు ఆయా ప్రాంతాలకు చెందిన వలస కార్మికులను గ్రామాలకు తీసుకొచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారు. వారితో ఎకరాకు ఒక ధరను ఒప్పందం చేసుకొని.. రైతుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేసుకుని వరి నాట్లు వేయిస్తున్నారు.వలస కూలీలకు డిమాండ్జిల్లాలో ఈ యాసంగిలో 2,04,433 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా, 1,91,351 ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా సిద్ధం చేశారు. వలస కూలీల గ్రూపులుగా వచ్చి తక్కువ సమయంలోనే ఎక్కువ పని చేస్తుండటంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. నాట్లు వేసేందుకు ఎకరాకు రూ.5,000 నుంచి రూ.5,500 వసూలు చేస్తున్నారు. డిమాండ్ అధికంగా ఉన్న గ్రామాల్లో రూ.6 వేల వరకు తీసుకుంటున్నారు. డిమాండ్‌ను బట్టి ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క తేదీ ఇస్తూ బుక్ చేసుకొని వరి నాట్లు వేస్తున్నారు. వీరి రాకతో కూలీల కొరత తీరుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రోజూ రూ.2 వేలు వస్తాయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు నాలుగు ఎకరాల్లో వరి నాట్లు వేస్తాం. నాకు రోజూ రూ.2 వేల కూలి గిట్టుబాటవుతుంది. ప్రతీ సీజన్లో రెండునెలలు ఇక్కడే మాకు పనులు దొరకుతాయి. రైతులు బాగా చూసుకుంటున్నారు.– బబుల్, కూలీ, కోల్కత్తాపది రోజులైంది వచ్చి..నేను కోల్కత్తా నుంచి వచ్చి పదిరోజులైంది. తెల్లారగానే పంట పొలాల్లోకి వెళ్తాం. రాత్రి వరకూ నాట్లు వేస్తాం. అందరం కలసికట్టుగానే ఉంటాం. ఇక్కడి వారికంటే మంచిగా నాట్లు వేస్తాం. మా రాష్ట్రంలో పనులు లేవు. –మంగళ్, కూలీ, కోల్కత్తామంది కూలీలను తీసుకొస్తా.. యాసంగి, వానాకాలంలో వరినాట్ల కోసం ఏటా పశ్చిమబెంగాల్, కోల్కత్తా నుంచి సుమారు 560 మందికి కూలీలను తీసుకొస్తా. రైతులకు ఎదురవుతున్న కూలీల కొరతను అధిగమించేందుకు ఎనిమిదేళ్లుగా ఏటా ఇలాగే చేస్తున్నా.– కసిరెడ్డి మల్లారెడ్డి, ఏజెంట్, గుండ్లపల్లి -
మెరిసిన వరి రైతు... మునిగిన పత్తి రైతు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆలోచన మారుతోంది. కష్టంతో కూడుకున్న వాణిజ్య పంటల కంటే సంప్రదాయ వరి సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులతో పెరిగిన సాగునీటి వనరులతోపాటు కష్టం, ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ అనే ఉద్దేశంతో వరి వైపు మళ్లుతున్నారు. దీనితో ఏటేటా రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరితోపాటు పత్తి కూడా ప్రధాన పంటగా కొనసాగుతోంది. కానీ పత్తి ధరలు పడిపోతుండటం, దాని సాగు ఖర్చు ఎక్కువగా ఉండటంతో ఆ రైతులు మెల్లగా వరి సాగు చేపడుతున్నారని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. పదేళ్ల క్రితం వరకు కరీంనగర్, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో సాగునీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో ఎక్కువగా పత్తిసాగు చేసేవారు. ఇప్పుడీ ప్రాంతాల్లో పత్తి తగ్గిపోయి, వరి పెరిగింది. ప్రస్తుతం నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో అధికంగా.. ఖమ్మం, వరంగల్‌లలో ఓ మోస్తరుగా పత్తి సాగు జరుగుతోంది. కానీ భవిష్యత్తులో ఈ జిల్లాల్లోనూ సాగు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి మాత్రమేకాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు పట్ల కూడా రైతుల్లో ఆసక్తి తగ్గుతోందని పేర్కొంటున్నారు. ఈ ఏడాది మునిగిన పత్తి రైతు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 43.76 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 2022 సంవత్సరంతో పోలిస్తే ఇది సుమారు 7 లక్షల ఎకరాల మేర తక్కువ. కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్ధతు ధర రూ.7,521గా నిర్ణయించింది. కానీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహించడంతో రైతుకు గిట్టుబాటు ధర అందలేదు. సెప్టెంబర్ లో కురిసిన వర్షాలు, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పంట దిగుబడి కూడా తగ్గింది. పైగా పత్తి ధర తగ్గడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. రాష్ట్రంలోని పలు వ్యవసాయ మార్కెట్లలో పత్తి క్వింటాల్‌కు రూ.5,300 నుంచి రూ.7,000 వరకు మాత్రమే ధర పలికింది. దేశంలోనే మూడో స్థానం ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా 2.74 కోట్ల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. అత్యధిక సాగులో మహారాష్ట్ర, గుజరాత్ తొలి రెండు స్థానాల్లో.. తెలంగాణ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 1.60 కోట్ల టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. అందులో తెలంగాణలో 25.33 లక్షల టన్నుల మేర వస్తుందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇన్నాళ్లూ ఒక ఏడాది ధర గిట్టుబాటు కాకపోయినా.. మరుసటి ఏడాదైనా అందుతుందన్న ఆశతో రైతులు పత్తి సాగును కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ గత రెండు, మూడేళ్లుగా తెలంగాణ రైతులు పత్తికి బదులు ఇతర పంటల వైపు చూస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.వరి దిగుబడి పెరగడంతో ఆనందం ఈ ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులకు వాతావరణం కూడా కలసి వచ్చి0ది. రాష్ట్రంలో సుమారు 66 లక్షల ఎకరాల్లో వరిసాగవగా.. అందులో 40 లక్షల ఎకరాల్లో సన్న రకాలు, 26 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు వేశారు. వరి కోతకు వచ్చే వరకు అకాల వర్షాల బాధలేకపోవడం, గతంతో పోలిస్తే చీడ, పీడలు, తెగుళ్లు తక్కువగా ఉండటంతో ఈసారి వరి దిగుబడి భారీగా పెరిగింది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం వరి దిగుబడి 150 లక్షల మెట్రిక్ టన్నులకుపైనే. వరికి మద్దతు ధర రూ.2,320కాగా... నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో మేలు రకం సన్న ధాన్యాన్ని రూ.2,500 నుంచి రూ.3,000 ధరతో మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేశారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా బియ్యానికి పెరిగిన డిమాండ్‌తో ధరలు పెరిగాయి. ఇక 70 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కనీస మద్ధతు ధరకు తీసుకుంటుండటం, గతంలో కన్నా దిగుబడి పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రాలకు వచ్చే సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామనడంపైనా హర్షం వ్యక్తమవుతోంది. -
దేశవ్యాప్తంగా పెరిగిన ఖరీఫ్ సాగు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. వరి, పప్పులు, పెసర, రాగి, మొక్కజొన్న, నూనెగింజలు, చెరకు తదితర పంటలు కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు 904 లక్షల హెక్టార్లలో సాగైనట్లు ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి 879.22 లక్షల హెక్టార్లలోనే రైతులు పంటలను సాగు చేశారని పేర్కొంది. అదేవిధంగా, గత ఏడాది 263.01 లక్షల హెక్టార్లలో వరి సాగు కాగా ఈ ఏడాది 276.91 హెక్టార్లలో సాగు చేశారు. గతేడాది ఇదే సమయానికి 99.71 లక్షల హెక్టార్లలో పప్పు «ధాన్యాలు సాగు జరగ్గా, ఈ ఏడాది 110.61 లక్షల హెక్టార్లకు పెరిగింది. వీటితో పాటు గతేడాది 174.53 లక్షల హెక్టార్లలో నూనెగింజల సాగవగా ఈసారి 179.69 లక్షల హెక్టార్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది. గతేడాదితో పోలిస్తే ముతక తృణ ధాన్యాలు, చెరకు సాగు కూడా పెరిగింది. సాగు పెరగడంతో పప్పు, నూనెగింజల ధరలు తగ్గొచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. -
దేశంలో సాధారణ స్థితికి వరిసాగు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా విస్తరించిన రుతు పవనాలు, జోరుగా కురుస్తున్న వర్షాలతో వరి సాగు విస్తీర్ణం సాధారణ స్థాయికి చేరుకుంటోందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి వరి 23.7 మిలియన్ హెక్టార్లలో సాగవగా, ఈ ఏడాది జూలై 27 నాటికి 21.5 మిలియన్ హెక్టార్లలో సాగైందని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే కాస్త తక్కువే అయినప్పటికీ ఐదేళ్ల సగటుతో పోలిస్తే 2.2 శాతం మేర అధికమేనని తెలిపింది. ఈ ఏడాది మొత్తంగా 40.15 మిలియన్ హెక్టార్లలో వరి సాగు కానుందని అంచనా వేసింది. ఇక వేరుశెనగ, సోయాబీన్, పొద్దు తిరుగుడు వంటి నూనెగింజల సాగు గత ఏడాది కంటే 3.8 శాతం ఎక్కువగా, 17.16 మిలియన్ హెక్టార్లలో సాగయ్యాయని వివరించింది. పప్పుధాన్యాల సాగు సైతం 14 శాతం మేర పెరిగి, 10.2 మిలియన్ హెక్టార్లలో సాగైందని వెల్లడించింది. -
దుక్కి చేయని సేద్యం.. దుఃఖం లేని భాగ్యం!
వరి సాగులో రసాయనిక ఎరువులు, సాగు నీటి వాడకాన్ని దిగుబడి తగ్గకుండా తొలి ఏడాదే సగానికి తగ్గించుకోగలమా? వరి పొలాల నుంచి వెలువడే మిథేన్ వాయువు (బొగ్గుపులుసు వాయువు కంటే ఇది భూతా΄ాన్ని 20 రెట్లు ఎక్కువగా పెంచుతోంది) ని అరికట్టే మార్గం ఏమిటి? ఏటా దుక్కి చేసే పంట భూముల్లో నుంచి ఏటా హెక్టారుకు 20 టన్నుల మట్టి వానకు గాలికి కొట్టుకుపోతోంది.దీన్ని ఆపటం ద్వారా భూసారాన్ని పరిరక్షించుకోగలమా? భారీ ఖర్చుతో నిర్మించిన రిజర్వాయర్లు కొద్ది ఏళ్లలోనే పూడికతో నిండిపోకుండా చెయ్యగలమా..? భూగర్భజలాలు వర్షాకాలంలో (రెండు నెలలుగా మంచి వర్షాలు పడుతున్నప్పటికీ) కూడా అడుగంటే వుంటున్నాయెందుకు? ఈ పెద్ద ప్రశ్నలన్నింటికీ సమాధానం ‘ఒక్కటే’ అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు.. అవును.. సాగు పద్ధతిని మార్చుకోవటం అనే ఒక్క పని చేస్తే చాలు..వరి, పత్తి వంటి తదితర పంటల సాగును ’సగుణ రీజెనరేటివ్ టెక్నిక్’ (ఎస్.ఆర్. టి.) అనే నోటిల్లేజ్ ఆరుతడి పద్ధతిలోకి మార్చుకుంటే పై సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని అనుభవపూర్వకంగా చెబుతున్నారు రైతు శాస్త్రవేత్త చంద్రశేఖర్.పొలాన్ని దున్ని ఒక్కసారి ఎత్తుమడులను ఏర్పాటు చేస్తే చాలు.. 20 ఏళ్లు మళ్లీ దున్నే పని లేకుండానే ఏటా మూడు పంటలు పండించుకోవచ్చు.వరి దగ్గర నుంచి పత్తి, పప్పుధాన్యాలు, కూరగాయ పంటలను సాగు చేస్తూ చంద్రశేఖర్ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు.రసాయనాలను తగుమాత్రంగా వాడుతూ ఖర్చును, శ్రమను తగ్గించుకొని దిగుబడులతో΄ాటు సేంద్రియ కర్బనాన్ని సైతం 0.3% నుంచి 1.5%కి పెంపొందించానన్నారు.జమ్మికుంటలోని జి.ఎన్.ఎన్.ఎస్. ప్రశాశం కేవీకే ఆవరణలో ఎస్.ఆర్.టి. పద్ధతిలో శాశ్వత ఎత్తుమడులపై ఆరుతడి వరి సాగుకు ఇటీవల శ్రీకారం చుట్టారు. చంద్రశేఖర్ స్వయంగా హాజరై రైతులకు, శాస్త్రవేత్తలకు మెళకువలు నేర్పించారు. ఇతర వివరాలకు.. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వరరావు (98485 73710)ను సంప్రదింవచ్చు.1. 136 సెం.మీ. దూరంలో మార్కింగ్ చేసుకొని.. 100 సెం.మీ. వెడల్పుతో శాశ్వత బెడ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. రెండు వైపులా కాలువలు ఉండాలి.2. ఎస్.ఆర్.టి. ఫ్రేమ్‌తో బెజ్జాలు వేసుకొని బెడ్‌పై వరి విత్తనాలను 5 వరుసలుగా విత్తుకోవాలి. మొక్కలు, వరుసల మధ్య దూరం 25 సెం.మీ.లు.3. కాలువల్లో నీరు పెట్టుకొని.. వరి విత్తనాలను ఇలా విత్తుకోవచ్చు..4. మహరాష్ట్రలోని చంద్రశేఖర్ పొలంలో ఎత్తుమడులపై వరి పంట ఇది. పొలం అంతా ఒకే మాదిరిగా పెరిగి కోతకు సిద్ధమైన దృశ్యం.5. వరి పంటలో నీటిని నిరంతరం నిల్వ ఉంచకూడదు. అవసరాన్ని బట్టి ఆరుతడులు ఇవ్వాలి. ఒక్కసారి మాత్రమే యూరియా వేయాలి.6. విత్తనాలు వేసిన తర్వాత కలుపు మొలవకుండా ఎంపిక చేసిన గడ్డి మందును పిచికారీ చేయాలి.భూమిని పంట వేసిన ప్రతి సారీ దున్నకుండా వ్యవసాయం (నోటిల్లేజ్ / జీరోటిల్లేజ్ వ్యవసాయం) చెయ్యగలిగితే భూమి కోతను అరికట్టి భూసారాన్ని పెంపొందించుకోవటానికి అంతకుమించి మరో ఉత్తమ మార్గం ఉండదు. ఈ పద్ధతిని దీర్ఘకాలం సాగులో ఉండే పండ్ల తోటల్లో త్రికరణశుద్ధితో అనుసరించే ప్రకృతి/సేంద్రియ వ్యవసాయదారులు చాలా మంది కనిపిస్తుంటారు. అయితే, మూడు, నాలుగు నెలల్లో పూర్తయ్యే సీజనల్ పంటలను నోటిల్లేజ్ పద్ధతిలో శ్రద్ధగా సాగు చేసే రైతులు మాత్రం అత్యంత అరుదు. ఈ కోవకు చెందిన వారే చంద్రశేఖర్ హరి భడ్సావ్లే(74).మహారాష్ట్ర రాయ్‌గడ్ జిల్లా కర్జత్ తాలూకాలోని దహివాలి సమీపంలో చంద్రశేఖర్ హరి భడ్సావ్లే వ్యవసాయ క్షేత్రం ‘సగుణబాగ్’ ఉంది. మహారాష్ట్రలో అగ్రిబిఎస్సీ చదివిన తర్వాత అమెరికాలో ఎం.ఎస్.(ఫుడ్ టెక్) చదువుకొని ఇంటికి తిరిగి వచ్చి.. 48 ఏళ్ల క్రితం వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టిన చంద్రశేఖర్ అప్పటి నుంచి మొక్కవోని దీక్షతో 55 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. సుదీర్ఘ సేద్య అనుభవాన్ని రంగరించి వెలువరించిన అనేక ఆవిష్కరణలతో ఎత్తుమడులపై నోటిల్లేజ్ సాగును ఈయన కొత్తపుంతలు తొక్కిస్తున్నారు.ఆరుతడి వరి దగ్గర నుంచి పత్తి, పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి పదికి పైగా పంటలను సాగు చేస్తూ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. ఒకటి తర్వాత మరొకటి పంటల మార్పిడి చేస్తూ ఖర్చుల్ని తగ్గించుకుంటూ దిగుబడులతో΄ాటు పనిలోపనిగా భూసారాన్ని సైతం పెంపొందిస్తున్నారు. తగుమాత్రంగా రసాయనిక ఎరువులతో ΄ాటు కలుపు మందును వాడుతున్నారు. గత 12 ఏళ్లుగా నోటిల్లేజ్ సాగులో చక్కని ఫలితాలు సాధిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ సాగు పద్ధతిని ఇప్పుడు కనీసం మరో పది వేల మంది అనుసరిస్తున్నారు.రసాయనాలు వాడకుండా పూర్తిగా ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించే సాగు పద్ధతిగా ‘రీజెనరేటివ్ అగ్రికల్చర్’ (పునరుజ్జీవన వ్యవసాయం) అనే మాట వాడుకలో ఉంది. అయితే, ఈ మాటకు తనదైన శైలిలో సరికొత్త అర్థం చెబుతున్నారు చంద్రశేఖర్.ఎత్తుమడులపై ఆరుతడి పంట (వరి కావచ్చు, మరొకటి కావచ్చు) కోసిన తర్వాత మోళ్లు మిగులుతాయి. వాటి కింద నేలలో వేర్లుంటాయి. మరో పంట వేసుకోవటానికి వీలుగా ఈ మోళ్లను వదిలించుకొని శుభ్రం చేయటం ఎలాగన్నది పెద్ద సమస్య.అయితే, ఈ సమస్యనే చంద్రశేఖర్ అద్భుతమైన పరిష్కారంగా మార్చుకున్నారు. మోళ్లను వేర్లతో సహా పీకెయ్యటమో, కాల్చెయ్యటమో కాకుండా.. వాటిని ఒక చిన్న పనితో పొలంలో కురిసే వాన నీటిని అక్కడికక్కడే ఒడిసిపట్ఠి భూమిలోకి ఇంకింపజేసేందుకు చక్కని సాధనంగా మార్చుకుంటున్నారు. మోళ్లపై కలుపుమందు చల్లటంతో నిర్జీవమవుతాయి. తిరిగి మొలకెత్తవు. కుళ్లిపోతాయి. అప్పుడు తదుపరి పంట విత్తనాలను మనుషులతోనో లేదా సీడ్ డిబ్లర్తోనో కోవచ్చు.మోళ్లు, వేర్లు కుళ్లిపోయి పోషకాలు పంటకు అందుబాటులోకి వస్తాయి. ఆఖాళీల ద్వారా వాన నీరు వేగంగా ఇంకుతుంటుంది. వేరు వ్యవస్థలో మట్టికి పుష్కలంగా గాలి, పోషకాలు అందుతాయి. సూక్ష్మజీవరాశి, వాన΄ాములతో ΄ాటు సేంద్రియ కర్బనం పెరుగుతుంది. పంట కోసిన తర్వాత మోళ్లపై కలుపు మందు చల్లుతున్న కారణంగానే ఈ ప్రక్రియ సౌలభ్యకరంగా, వేగవంతంగా జరుగుతోందని చంద్రశేఖర్ చెబుతారు. నోటిల్లేజ్ సాగు పద్ధతిలో ఇది అత్యంత కీలకమైన అంశమని ఆయన అంటున్నారు.‘సగుణ’తో సకల ప్రయోజనాలు!నేను అగ్రికల్చర్ బీఎస్సీ, అమెరికాలో ఎమ్మెస్ చదివి కూడా 48 ఏళ్లుగా 55 ఎకరాల్లో శ్రద్ధగా వ్యవసాయం చేస్తున్నా. గత పన్నెండేళ్లుగా ఎస్.ఆర్.టి. పద్ధతిలో దుక్కి దున్నకుండా వరుసగా అనేక పంటలు పండిస్తున్న అనుభవంతో చెబుతున్నా. నోటిల్లేజ్ సాగు రైతులకు సౌలభ్యకరంగా, అనేక రకాలుగా ప్రయోజనకరంగా ఉంది.ప్రతి పంటకూ ముందు, వెనుక దుక్కి దున్నటం వల్ల వానకు, గాలికి భూమి కోతకు గురై ఏటా హెక్టారుకు 20 టన్నుల మట్టి కొట్టుకుపోతోంది. దుక్కి చేయకుండా విత్తనాలు వేస్తున్నందు వల్ల సాయిల్ అగ్రిగేషన్ జరిగి పొలంలో మట్టి వానకు, గాలికి కొట్టుకుపోవటం ఆగిపోతుంది. రసాయనిక కలుపు మందులు వాడటం వల్ల కలుపు సమస్య తీరిపోతుంది. ΄ాత పంటల మోళ్లు, వేర్లు కుళ్లటం వల్ల పోషకాల పునర్వినియోగం జరుగుతుంది.ఆ రంధ్రాల ద్వారా పొలంలోనే వాన నీటి సంరక్షణ అత్యంత సమర్థవంతంగా జరుగుతుంది. బెట్టను తట్టుకునే శక్తి పంటలకు కలుగుతుంది. నీటిని నిల్వగట్టే పద్ధతిలో సాగయ్యే వరి పొలం మాదిరిగా మిథేన్ వాయువు వెలువడదు. కాబట్టి, భూతాపం గణనీయంగా తగ్గుతుంది. కలుపు మందు వల్ల కలిగే నష్టంతో పోల్చితే రైతుకు, భూమికి, పర్యావరణానికి ఒనగూడే ప్రయోజనాలు చాలా ఎక్కువ.నానా బాధలు పడి సాగు చేసే రైతు ఎప్పుడూ దుఃఖంతోనే ఉంటున్నాడు. ఎస్.ఆర్.టి. సాగు పద్ధతి వల్ల రైతులకు సంతోషం కలుగుతోంది. అగ్రిటూరిజం కూడా ఇందుకు తోడ్పడుతోంది. అందరూ ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. భూతా΄ాన్ని తట్టుకునే శక్తి, ఖర్చులు తగ్గించి, దిగుబడులు పెంచే శక్తి ‘సగుణ’ సాగు పద్ధతికి ఉందని నా అనుభవంలో రుజువైంది.శాశ్వత ఎత్తుమడులపై ఖరీఫ్‌లో వరిని ఆరుతడి పద్ధతుల్లో సాగు చేయటం, ఆ తర్వాత అవే మడులపై 2,3 పంటలుగా పప్పుధాన్యాలు/ నూనెగింజలు/ కూరగాయలను పంట మార్పిడి ΄ాటిస్తూ సాగు చేస్తున్నాం. వరిలో ఖర్చు 29% తగ్గి దిగుబడి 61% పెరిగింది. పత్తి సాగు ఖర్చు 17% తగ్గి దిగుబడి 96% పెరిగింది. నాతో ΄ాటు మహారాష్ట్రలోని పది వేల మంది రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎవరైనా వచ్చి చూడొచ్చు. – చంద్రశేఖర్ హరి భడ్సావ్లే (98222 82623), సగుణ రీజెనరేటివ్ టెక్నిక్ ఆవిష్కర్త, రైతు శాస్త్రవేత్త, మహారాష్ట్ర, https://sugunafoundation.ngo/– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
సన్న బియ్యం పెద్ద లొల్లి
-
సేంద్రియ ఉత్పత్తులే ఆరోగ్య రక్షణలో కీలకం
-
మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటలనే సాగుచేస్తున్న రైతులు
-
తెగుళ్లను తట్టుకోవడం NLR 3238 ప్రత్యేకత
-
ఎరువులు, పురుగుమందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయం
-
పెద్దగా కూలీల అవసరం లేకుండానే వరిని సాగుచేసే అవకాశం
-
వెద పద్ధతిలో వరి సాగు చేస్తున్న రైతులు
-
వరిసాగు పైపైకి.. పప్పు ధాన్యాలు కిందకి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలు, పెరిగిన భూగర్భ జలాల లభ్యత కారణంగా వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత ఏడాది ఖరీఫ్‌లో వరిసాగు దేశ వ్యాప్తంగా 3.45 కోట్ల హెక్టార్లుగా ఉంటే ఈ ఏడాది అది 15 లక్షల హెక్టార్లు (4 శాతం) మేర పెరిగి 3.60 కోట్ల హెక్టార్లకు చేరిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే ఈ ఏడాది పప్పుధాన్యాల సాగు మాత్రం 6 శాతం మేర తగ్గింది. గత ఏడాది మొత్తంగా పప్పుధాన్యాల సాగు 1.26 కోట్ల హెక్టార్ల మేర ఉంటే అది ఈ ఏడాది 12 లక్షల హెక్టార్ల మేర తగ్గి 1.14 కోట్ల హెక్టార్లకు పరిమితం అయ్యిందని వివరించింది. ముఖ్యంగా కందుల సాగు బాగా తగ్గిందని వెల్లడించింది. -
తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో నాట్లు పూర్తి
-
డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగు...!
-
వరికి బదులుగా ఆరుతడి పంటల సాగు
-
వరిలో అగ్గి తెగులు నివారణ
-
జోరందుకున్న ఖరీఫ్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే సాగునీరు విడుదల చేయడంతో పాటు ముందే వైఎస్సార్ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఖరీఫ్–2022లో దెబ్బతిన్న పంటలకు బీమా పరిహారం అందించడంతో పాటు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేశారు. అవసరమైనన్ని ఎరువులు, పురుగు మందుల నిల్వల్ని అందుబాటులో ఉంచారు. కానీ.. జూన్‌లో రుతు పవనాలు మొహం చాటేయడంతో రైతులు ఒకింత కలవరపాటుకు గురయ్యారు. దీంతో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేయగా.. పది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రైతులంతా జోరు పెంచి సార్వా సాగుకు శ్రీకారం చుట్టారు. సాగుకు ముందే రూ.5,040.43 కోట్ల సాయం సీజన్‌కు ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా కింద 52.31 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.7,500 చొప్పున రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు ఖరీఫ్–2022లో పంటలు దెబ్బతిన్న 10.20 లక్షల మందికి రూ.1,117.21 కోట్ల బీమా పరిహారాన్ని అందించారు. ఆర్బీకేల ద్వారా 5.73 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సిద్ధం చేయగా.. ఇప్పటికే 5.15 లక్షల టన్నులను రైతులకు పంపిణీ చేశారు. ఇందులో ప్రధానంగా 1.52 లక్షల టన్నుల వరి, 2.91 లక్షల టన్నుల వేరుశనగ, 39 వేల టన్నుల పచ్చిరొట్ట విత్తనాలు అందించారు. నాన్ సబ్సిడీ విత్తనాలకు సంబంధించి పత్తి 14.15 క్వింటాళ్లు, మిరప 60 కేజీలు, సోయాబీన్ 137 క్వింటాళ్లను రైతులకు విక్రయించారు. సీజన్‌కు 17.44 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. 14.75 లక్షల టన్నులు అందుబాటులో ఉంచారు. ఇందులో ఇప్పటికే 4.59 లక్షల టన్నులు విక్రయించారు. ఆర్బీకేల ద్వారా 5.60 లక్షల టన్నుల సరఫరా లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 1.59 లక్షల టన్నులు నిల్వ చేశారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆర్బీకేల్లో అవసరమైన పురుగుల మందులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. 23 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు ఖరీఫ్ సాగు లక్ష్యం 89.37 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 23 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. 39.70 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 9.62 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇతర పంటల విషయానికొస్తే 5.12 లక్షల ఎకరాల్లో పత్తి, 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 4.6 లక్షల ఎకరాల్లో అపరాలు, 1.35 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, పంటలు వేశారు. 9 ఎకరాల్లో వరి వేశా 9 ఎకరాల్లో స్వర్ణ రకం వరి సాగు చేస్తున్నా. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ముదురు దశకు చేరుకున్న పంటకు మేలు చేస్తాయి. మా గ్రామంలో పంట బాగానే ఉంది. కాస్త ఆలస్యంగా నాట్లు వేసిన వారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. వర్షాలు రెండ్రోజులు తెరిపిస్తే నీరు కిందకు దిగిపోతే నాట్లకు ఇబ్బంది ఉండదు. – కె.శ్రీనివాసరెడ్డి, పసలపూడి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా స్వల్పకాలిక రకాలే మేలు ఈ వర్షాలతో పత్తి, ఆముదం, కంది వంటి పంటలకు ఇబ్బంది ఉండదు. ఇప్పటివరకు నారుమడులు వేయకపోతే మాత్రం బీపీటీ–5204, ఎన్‌ఎల్‌ఆర్–34449, ఎంటీయూ–1153, ఎంటీయూ–1156, ఎంటీయూ–1010, ఐఆర్–64 వంటి స్వల్పకాలిక రకాలను సాగు చేసుకుంటే మేలు. ఉత్తరకోస్తా, కృష్ణాడెల్టాలో వెద పద్ధతిలో సాగు చేసే రైతులు పడిపోని రకాలను ఎంపిక చేసుకోవాలి. – టి.శ్రీనివాస్, ప్రధాన శాస్త్రవేత్త, వరి పరిశోధనా కేంద్రం, మార్టేరు ఈ సూచనలు పాటిస్తే మేలు విత్తిన 15 రోజుల్లోపు నారుమడులు, వెదజల్లిన పొలాలు 3 రోజుల కంటే ఎక్కువ నీట మునిగి ఉంటే మొలక శాతం దెబ్బతినకుండా నీరు తీయగలిగితే ఇబ్బంది ఉండదు. ఒకవేళ మొలక దెబ్బతింటే మాత్రం మళ్లీ నారు ఊడ్చుకోవచ్చు లేదా స్వల్పకాలిక రకాలు సాగు చేసుకోవచ్చు. విత్తిన 15–30 రోజులలోపు ఉన్న పొలాలు 5 రోజుల కంటే ఎక్కువ నీట మునిగితే.. నీరు పూర్తిగా తీసివేసి 5 సెంట్ల నారుమడికి ఒక కిలో యూరియా, ఒక కిలో ఎంవోపీ బూస్టర్ డోస్‌గా వేసుకుంటే వారం రోజుల్లో కొత్త ఆకు చిగురిస్తుంది. నారుమడి కుళ్లకుండా లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్బన్‌డిజమ్ మందును పిచికారీ చేసుకోవాలి. – ఎం.గిరిజారాణి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, వరి పరిశోధనా కేంద్రం, మచిలీపట్నం -
యాదాద్రిలో కాంగ్రెస్‌కు షాక్! కేసీఆర్ సమక్షంలో కారెక్కిన అనిల్ కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ వచ్చాక అద్భుతాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ధరణిలో భూమి వచ్చిందంటే ఎవడూ మార్చలేడని.. నీ భూమి హక్కు నీ బొటన వేలుతో మాత్రమే మార్చేలా తీసుకొచ్చామన్నారు. ధరణిలో సమస్యలు ఉంటే ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎలా రావాలని అని ప్రశ్నించారు. ధరణితో భూమి సేఫ్ అని, రైతు బంధు డబ్బులు నేరుగా బ్యాంకులోనే పడతాయని చెప్పారు. గులాబీ గూటికి యాదాద్రి నేతలు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రగతి భవన్లో వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. అనిల్ కుమార్, శేఖర్ రెడ్డి చెరో పదవి తీసుకొని పని చేయాలని సూచించారు. అనిల్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు జిమ్మేదారి తనదని అన్నారు. అనేక అవమానాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. గత ముఖ్యమంత్రులు కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. కరెంట్ లేక గతంలో పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. 24 గంటల కరెంట్ ఇస్తామంటే ఎవరూ నమ్మలేదని.. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని అన్నారు. ‘24 గంటల కరెంట్‌తో రైతులు ఎప్పుడైనా పొలానికి నీళ్లు పెట్టుకోవచ్చు. రాష్ట్రంలోప్రస్తుతం మూడు పంటలు పండుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని రైసు మిల్లులన్నీ ధాన్యంతో నిండిపోయాయి. రైతు బాగుంటేనే పదిమందికి అన్నం పెడతాడు. బస్వాపూర్ ప్రాజెక్టుతో భువనగిరి, ఆలేరులో కరువే రాదు. 8 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే దాని అప్పు ఎప్పుడో తేరిపోయింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. -
ఎకరంలో 46 రకాల వరిసాగు రైతులందరికీ ఆదర్శం
-
డ్రోన్లతో వెదసాగు సక్సెస్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వరిసాగులో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ ముందుకు సాగుతోంది. దేశంలోనే మొదటిసారిగా వ్యవసాయ డ్రోన్ల వినియోగంపై రైతులకు, గ్రామీణ యువతకు అవగాహన కల్పిస్తూ, వ్యవసాయంలో రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపును నిజం చేస్తోంది. ఇప్పటివరకు 10 ప్రధాన పంటల్లో డ్రోన్లతో పురుగుమందులు చల్లడానికి ప్రామాణికాలను తయారుచేసి, శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా వెదపద్ధతి(విత్తనాలు వెదజల్లడం)లో విత్తనాలు చల్లే ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు సకాలంలో పడకపోవడంతో రైతులు సకాలంలో వరినాట్లు వేయలేకపోతున్నారు. ఖరీఫ్ సాగు ఆలస్యం అవుతోంది. దీంతో రైతులు వెదసాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వరిసాగులో 21 శాతం వరకు వెదపద్ధతిలోనే జరుగుతున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వెదపద్ధతిలో గత ఏడాది 100 ఎకరాల్లో వరి, మినుము, పచ్చి రొట్ట సాగుచేశారు. దుక్కి దున్నిన తరువాత నుంచి అన్ని పంటల్లో డ్రోన్లతో అన్ని రకాల పనులు చేసుకోవచ్చని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతను జోడించి డ్రోన్లతో వరి విత్తనాలను వెదజల్లించాలని వర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. సమయం, డబ్బు ఆదా డ్రోన్లతో వెదపద్ధతిలో తక్కువ విత్తనాలు సరిపోతాయి. సమయం, డబ్బు ఆదా అవుతాయి. మొదటి ఏడాది ఫలితాలను విశే్లషించిన తర్వాత వెదపద్ధతిలో విత్తనాలను నాటడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని గుర్తించారు. రెండో సంవత్సరం ఫలితాలు ఆశాజనకంగా వస్తే దుక్కి నుంచి కోత వరకు డ్రోన్లను ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ట్రాక్టర్లు, చేతితో చల్లే పద్ధతిలో ఎకరానికి 16 నుంచి 30 కిలోల వరకు విత్తనాలు వినియోగిస్తున్నారు. అదే డ్రోన్ ద్వారా చల్లితే 8 నుంచి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి. గత ఏడాదిగా డ్రోన్ల సాయంతో విత్తనాలు చల్లడం, ఎరువులు (యూరియా, డీఏపీ) వేయడం, పురుగుమందుల పిచికారీలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఎకరం పొలంలో మూడు నిమిషాల్లో విత్తనాలు చల్లవచ్చు. 50 కిలోల రసాయనిక ఎరువును ఎనిమిది నిమిషాల్లో చల్లవచ్చు. ఎకరా విత్తనాలు విత్తుకునేందుకు రూ.400 నుంచి రూ.500 ఖర్చవుతుంది. విత్తనాల్లో 25 శాతం ఆదా అవుతాయి. పురుగుమందుల వ్యయం 25 శాతం తగ్గడమేగాక చల్లే ఖర్చులో రూ.400 ఆదా అవుతాయి. గత ఏడాది వెదపద్ధతిలో చేసిన సాగు ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వడంతో ఈ విధానంపై పరిశోధనలను ముమ్మరం చేసింది. డీజీసీఏ అనుమతితో శిక్షణ దేశంలో ఎక్కడా లేనివిధంగా డ్రోన్లను వినియోగించడంతోపాటు డీజీసీఏ అనుమతి తీసు కుని వ్యవసాయ డ్రోన్ పైలట్లకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శిక్షణ ఇస్తోంది. వర్సిటీలోని శిక్షణ కేంద్రంలో ఇప్పటివరకు 217 మంది రైతులు, గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి సరి్టఫికెట్లు అందజేసింది. మరో వందమంది వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చింది. తిరుపతి, పులివెందులలో డ్రో¯Œ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు అధునాతన సాంకేతికత ఆధునిక వ్యవసాయ విధానాలను రైతులకు అందించేందుకు దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ల ద్వారా వ్యవసాయాన్ని ప్రయోగాత్మంగా చేపట్టి మంచి ఫలితాలను సాధించాం. వెదపద్ధతిలో వరిసాగు, పురుగుమందులు, ఎరువుల పిచికారీలో మంచి ఫలితాలు వచ్చాయి. మరికొంత సాంకేతికతను రైతులకు అందించేందుకు రోబో టెక్నాలజీపై ప్రయోగాలు చేపట్టాం. అధునాతన సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం. – డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, వీసీ, ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ -
వరి సాగులో ఈ మెళకువలు పాటిస్తే ... లక్షల్లో లాభాలు
-
కోటిన్నర ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే వానాకాలం సీజన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ పంటల ప్రణాళికను ఖరారు చేసింది. ఇందులో భాగంగా కోటిన్నర ఎకరాల్లో పంటలు సాగయ్యేలా చూడాలని నిర్ణయించింది. అత్యధికంగా 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని ప్రతిపాదించింది. ఇక 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని వ్యవసాయశాఖ రైతులకు పిలుపునిచ్చింది. కంది, మొక్కజొన్న 8 లక్షల ఎకరాల చొప్పున, సోయాబీన్ 5 లక్షల ఎకరాలు, పెసర లక్ష ఎకరాలు, మినుములు 50 వేల ఎకరాల్లో సాగును ప్రతిపాదించారు. మొత్తం సాగుకు ప్రతిపాదించిన కోటిన్నర ఎకరాల్లో 10 లక్షల ఎకరాలు ఉద్యాన పంటలున్నాయని వ్యవసాయ శాఖ తెలిపింది. గతేడాది 1.46 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని వెల్లడించింది. 18.47 లక్షల క్వింటాళ్ల విత్తనాలు.. ఉద్యాన పంటలను మినహాయించి చూస్తే 1.40 కోట్ల ఎకరాల్లో ఆహార, వాణిజ్య పంటలు సాగవుతాయి. అందుకోసం 18.47 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయశాఖ పేర్కొంది. విత్తనాలకు కొరత లేదని, 1.82 కోట్ల ఎకరాలకు సరిపడా 22.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. అకాల వర్షాల నుంచి బయటపడేలా ముందస్తు నాట్లు.. ఈ ఏడాది యాసంగిలో రెండు దఫాలు పెద్ద ఎత్తున అకాల వర్షాలు రావడంతో లక్షలాది ఎకరాల పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వానాకాలం, యాసంగి సీజన్లను ముందుకు జరపడం వల్ల నష్టాన్ని నివారించవచ్చని భావిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టింది. సీజన్‌ను ముందుకు జరపడంతో పాటు తక్కువ కాలపరిమితి కలిగిన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని, అకాల వర్షాలు, వడగళ్లను తట్టుకునే రకా లను రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఎక్కువ సమయం తీసుకునే పంట రకాలను ప్రోత్సహించకూడదని ప్రభుత్వం భావిస్తోంది. 135 రోజుల మధ్యస్థం, 125 రోజుల తక్కువ కాలపరిమితి వెరైటీలను రైతులు వేసుకోవాలని సూచించింది. కాగా, ఐదు రకాల మధ్యస్థ కాల పరిమితి కలిగిన వరి వంగడాలు, స్వల్పకాలిక వ్యవధి కలిగిన 10 రకాల వరి వెరైటీలను వేసుకోవాలని రైతులకు సూచించింది. వానాకాలంలో జూన్ 10–20వ తేదీల మధ్య నారు వేయాలని చెప్పింది. ఈ మార్పులవల్ల ఇబ్బందులు ఉండవని పేర్కొంది. అలాగే యాసంగిలో స్వల్పకాలిక రకాలను మాత్రం వేయాలని స్పష్టం చేసింది. వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలని సూచించింది. యాసంగిలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 10 మధ్య నార్లను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. -
పంటలకు రుణ పరిమితి...'వరి, పత్తికి ఎకరాకు రూ. 45 వేలు'
సాక్షి, హైదరాబాద్: వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, మిర్చి తదితర పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రుణ పరిమితి) పెరిగింది. కొన్ని కొత్త రకాల పంటలకు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను ఖరారు చేశారు. రానున్న వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఖరారు చేసింది. రాష్ట్రంలో పండించే దాదాపు 123 రకాల పంటలకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రుణాలు ఇవ్వాలన్న దానిపై టెస్కాబ్ భారీ కసరత్తు చేసింది. సాగు ఖర్చు, ఉత్పాదకత, నీటి వసతి ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. సంబంధిత రుణ పరిమితి నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ)కి పంపించింది. తాము ఖరారు చేసినట్లుగా రైతులకు పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పత్తి, వరి పంటలకు ఎకరానికి రూ.45 వేలు ఖరారు చేసింది. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నచోట వరికి 2022–23లో రూ.36 వేల నుంచి రూ.40 వేల పంట రుణాలను ఇవ్వగా ఈసారి రూ. 42 వేల నుంచి రూ. 45 వేలకు పెంచింది. అలాగే శ్రీ పద్ధతిలో సాగు చేసే వరికి రూ. 36 వేల నుంచి రూ. 38 వేలుగా ఖరారు చేసింది. ఇక వరి విత్తనోత్పత్తికి కూడా రూ.5 వేలు అదనంగా పెంచింది. 2022–23లో రూ. 45 వేలుండగా, ఇప్పుడు రూ. 50 వేలుగా ఖరారు చేసింది. ఇక పత్తికి గతేడాది రుణ పరిమితి రూ. 38 వేల నుంచి రూ. 40 వేలు ఉండగా, ఇప్పుడు దాన్ని రూ. 42 వేల నుంచి రూ. 45 వేల వరకు పెంచింది. ఆయిల్‌పాంకు ఎకరానికి రూ. 42 వేల రుణం... ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతేడాది మాదిరిగానే ఆయిల్‌పాం పంటలు సాగు చేసే రైతులకు రుణ పరిమితి ఖరారు చేసింది. ఎకరానికి రూ. 40 వేల నుంచి రూ. 42 వేల వరకు రుణ పరిమితి ఉండగా, ఈసారి కూడా అంతే ఖరారు చేసింది. ఇక కీలకమైన మిర్చికి రూ. 75 వేల నుంచి రూ. 80 వేల వరకు పెంచింది. సాగునీటి వసతి ఉన్నచోట మినుము పంటకు ఎకరాకు రూ. 18–21 వేలు, సాగునీటి వసతి లేని చోట రూ. 15–17 వేలు ఖరారు చేశారు. సేంద్రీయ పద్ధతిలో పండించే మినుముకు రూ. 18–21 వేలు ఖరారు చేశారు. శనగకు రూ. 24 నుంచి రూ. 26 వేలు చేశారు. సాగునీటి వసతి కలిగిన ఏరియాలో మొక్కజొన్నకు రూ. 30–34 వేలుగా, నీటి వసతి లేనిచోట రూ. 26–28 వేలు ఖరారైంది. కందికి సాగునీటి వసతి ప్రాంతాల్లో రూ. 21–24 వేలు, సాగునీటి వసతి లేని ప్రాంతాల్లో రూ. 18–21 వేలు ఖరారు చేశారు. సోయాబీన్‌కు రూ. 26 వేల నుంచి రూ. 28 వేలు ఇస్తారు. సోయా విత్తనోత్పత్తి రైతులకు రూ. 34 వేల నుంచి రూ. 36 వేల వరకు ఇస్తారు. ఉల్లి సాగుకు రూ.45 వేలు ఉల్లిగడ్డ సాగుకు గతంలో ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.42 వేలు ఇవ్వగా, ఇప్పుడు రూ. 40 వేల నుంచి రూ. 45 వేలకు పెంచారు. పట్టుకు రూ. 35 వేల నుంచి రూ. 40 వేలుగా ఖరారు చేశారు. ఇక పత్తి విత్తనాన్ని సాగు చేసే రైతులకు గణనీయంగా పెంచారు. గతంలో రూ. 1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు ఉండగా, ఇప్పుడు రూ. 1.30 లక్షల నుంచి రూ. లక్షన్నరకు ఖరారు చేశారు. పసుపు సాగుకు రూ. 80 వేల నుంచి రూ. 85 వేల వరకు ఇస్తారు. టస్సర్ కల్చర్ (ఒకరకమైన పట్టు) సాగుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఇస్తారు. -
సరి లేదు ‘వరి’కేదీ!.. రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో నాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరిసాగు గత ఏడాది రికార్డును బద్దలు కొట్టింది. కొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ చరిత్రలోనే ఎన్నడూలేనంత అత్యధికంగా ఈ వానాకాలం సీజన్లో ఇప్పటివరకు సాగవడమే కాకుండా ఇంకా ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటివరకు 62.12 లక్షల ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారు. ఈ నెలాఖరు వరకు సీజన్ కొనసాగనున్నందున ఇంకా నాట్లు పడతాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది (2021) కూడా రికార్డు స్థాయిలో ఏకంగా 61.94 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. ఇతర పంటలు ఎక్కువగా సాగు చేయాలని వ్యవసాయ శాఖ చెబుతున్నా..సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడం, నీటి వనరులు పుష్కలంగా ఉండటం, పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో పాటు ఉచిత విద్యుత్‌తో రైతులు వరి వైపే మొగ్గు చూపుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈసారి ధాన్యపు సిరులు రాష్ట్రాన్ని ముంచెత్తనున్నాయి. ఏటా పెరుగుతున్న సాగు రాష్ట్రంలో వరి సాగు ఏడాదికేడాదికీ పెరిగిపోతోంది. తెలంగాణ రాకముందు 2013లో 29.16 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఇప్పుడు అంతకు రెట్టింపు పైగానే సాగు కావడం విశేషం. ఈ ఏడాది మొత్తం 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 45 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేయాలని ప్రతిపాదించింది. అదే సమయంలో పత్తి సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలుగా పేర్కొంది. బుధవారం నాటికి 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అయితే పత్తి 49.58 లక్షల ఎకరాలకే పరిమితమైంది. కీలకమైన సమయంలో వర్షాలు కురవడం వల్ల వేసిన పత్తి కూడా లక్షలాది ఎకరాల్లో దెబ్బతింది. రెండోసారి వేసే వీలు కూడా లేకుండాపోయింది. మొత్తం మీద వర్షాలు పత్తి సాగు పెరగకుండా అడ్డుకున్నాయి. దీంతో వరి సాగు గణనీయంగా పెరిగింది. కంది ప్రతిపాదిత సాగు లక్ష్యం 15 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 5.57 లక్షల ఎకరాల్లో సాగైంది. సోయాబీన్ లక్ష్యం 3.88 లక్షల ఎకరాలు కాగా, 4.29 లక్షల ఎకరాల్లో వేశారు. మొక్కజొన్న 8.18 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 6.14 లక్షల ఎకరాల్లో సాగైంది. పంటల సాగులో నల్లగొండ టాప్.. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో వంద శాతానికి పైగా వానాకాలం సీజన్ పంటలు సాగయ్యాయి. 11.14 లక్షల ఎకరాల సాగుతో నల్లగొండ టాప్‌లో నిలిచింది. 7.75 లక్షల ఎకరాలతో సంగారెడ్డి, 6 లక్షల ఎకరాలతో వికారాబాద్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. సూర్యాపేట (5.91 లక్షలు), ఆదిలాబాద్ (5.61 లక్షలు), ఖమ్మం (5.56 లక్షలు), కామారెడ్డి (5.12 లక్షలు), నిజామాబాద్ (5.10 లక్షలు), నాగర్‌కర్నూల్ (5.10 లక్షలు) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అత్యంత తక్కువగా మేడ్చల్ (20 వేలు), ములుగు (1.27 లక్షలు), వనపర్తి (2.21 లక్షలు) ఎకరాల్లో సాగయ్యాయి. నీటి వనరులు పెరగడం,ఉచిత విద్యుత్ వల్లే.. వరి రికార్డు స్థాయిలో సాగైంది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ ప్రాంతంలో వరి అంతంతే. కానీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కాళేశ్వరంతో రిజర్వాయర్లు నిండిపోవడం, పుష్కలంగా నీటి వనరులు అందుబాటులోకి రావడం, ఉచితంగా 24 గంటలూ కరెంటు ఇస్తుండటంతో రైతులు వరి సాగువైపు మళ్లుతున్నారు. కేంద్రం కొనకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం కొంటుందన్న ధీమాతో వరి వేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చైర్మన్, తెలంగాణ రైతుబంధు సమితి -
తెలంగాణలో వరి సాగే అత్యధికం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సాగు 1.28 కోట్ల ఎకరాలకు చేరింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 58,28,686 ఎకరాల్లో వరి నాట్లు వేసినట్టు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి గురువారం అందచేసిన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది 45 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకోగా, అదనంగా మరో 13.28 లక్షల ఎకరాలు ఎక్కువే వరినాట్లు వేశారు. దీంతో ఈ వానాకాలంలో అన్ని పంటల కంటే వరి సాగు అత్యధికంగా జరిగినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తరువాత పత్తి 48,95,905 ఎకరాల్లో సాగైంది. వానాకాలంలో అత్యధికంగా 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాల ని సర్కారు నిర్ణయించింది. రైతులు సైతం పత్తి సాగుకు మొగ్గు చూపినా ఈ జూలై, ఆగసులో కురిసిన భారీ వర్షాలతో పంట నష్టంతో పాటు మళ్లీ సాగుచేయలేని పరిస్థి తి ఏర్పడింది. దీంతో పత్తిసాగు తగ్గింది. -
అరకొరగానే వరి! కారణాలివేనా? కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. గత దశాబ్ద కాలంలో తొలిసారిగా ఈ ఏడాది వరి సాగు 24 శాతం మేర తగ్గినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే జూలై 8 నాటికి తెలంగాణలోనూ వరి సాగు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. జూన్‌లో రుతుపవనాల రాకలో జాప్యం జరగడం, పప్పు ధాన్యాలు, నూనెగింజల మద్దతు ధరలను ప్రభుత్వం భారీగా పెంచిన నేపథ్యంలో వాటి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఈ నెల 8న వ్యవసాయ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత ఏడాది ఈ సమయానికి దేశవ్యాప్తంగా 94.99 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారు. అయితే ఈ ఏడాది కేవలం 72.24 లక్షల హెక్టార్లలో (24% తక్కువ) మాత్రమే వరి నాట్లు పడ్డాయి. 2012 జూలై 11 నాటికి 96.7 లక్షల హెక్టార్లలో వరి సాగవగా, ఆ తర్వాత ఏడాదిలో గరిష్టంగా 1.25 కోట్ల హెక్టార్ల మేర సాగు జరిగింది. వరి ఎక్కువగా సాగు చేసే ఛత్తీస్‌గఢ్‌లో గత ఏడాది ఇదే సమయానికి 15.14 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ ఏడాది ఏకంగా 6.19 లక్షల హెక్టార్ల మేర తగ్గి కేవలం 8.95 లక్షల హెక్టార్లకే పరిమితం అయ్యింది. తెలంగాణలో గత ఏడాది జూలై 8 నాటికి 93 వేల హెక్టార్లలో వరి వేయగా, ఈ ఏడాది కేవలం 53 వేల హెక్టార్లలో మాత్రమే సాగయ్యింది. వరికి స్వల్పం..ఇతర పంటలకు భారీగా.. రుతుపవనాల వైఫల్యానికి తోడు ఈ ఏడాది వరి మద్దతు ధరను కేవలం రూ.100 మాత్రమే పెంచడం..రైతులు వరి సాగుకు మొగ్గు చూపక పోవడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. మరోవైపు వంట నూనెలు, పప్పుధాన్యాల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా వాటి మద్దతు ధరలను కేంద్రం గణనీయంగా పెంచింది. ఈ కారణంగానే రైతులు వరి సాగును తగ్గించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం వరి సాగు విస్తీర్ణం తగ్గితే దాని ప్రభావం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిరుపేదలకు సరఫరా చేసే బియ్యం పంపిణీపై పడే ప్రమాదముంది. ఈ దృష్ట్యా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వరి నాట్లు పెంచాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రాలను కోరారు. దేశంలో బియ్యం నిల్వలకు కొరత లేదని, అంతర్జాతీయ డిమాండ్ దృష్ట్యా, ఎక్కువ ఉత్పత్తి చేస్తే మంచి ధర వస్తుందని తెలిపారు. -
సాప్ట్వేర్ కొలువు వదిలి దేశీ వరి వంగడాలను సంరక్షిస్తున్న యువ ఇంజనీర్
ఆయనో సాఫ్ట్వేర్ ఇంజనీర్.. బిట్స్ పిలానీలో మాస్టర్ డిగ్రీ చదివారు. ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో ఐదేళ్లు పనిచేశారు. స్వతహాగా రచయిత కావడంతో సాఫ్ట్వేర్ కొలువు వదిలి సృజనాత్మక రంగంలో అడుగుపెట్టారు. ఇంకా ఏదో చేయాలన్న తపన.. సరిగ్గా అదే సమయంలో కేరళకు చెందిన ఎర్ర బియ్యం (నవార)లో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకొని ఆశ్చర్య పోయారు. ఇలాంటి పురాతన ధాన్యపు సిరులపై అధ్యయనంకోసం 8 రాష్ట్రాల్లో పర్యటించారు. 251 పురాతన వరి రకాలను సేకరించారు. వాటిని సంరక్షిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలని ప్రతినబూనారు. ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఆయనే నందం రఘువీర్. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఈయన గడిచిన నాలుగేళ్లుగా పురాతన విత్తనాలను సంరక్షించే కృషిలో నిమగ్నమయ్యారు. వాటిని యువ రైతులకు అందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో దేశీ విత్తన బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తనతో కలిసొచ్చే రైతులతో తొలిదశలో 8 జిల్లాల్లో విత్తన నిధులను ఏర్పాటు చేయబోతున్నారు. దేశీ వంగడాల విశిష్టతను వివరించే పుస్తక రచన చేస్తున్నారు. పురాతన విత్తన సంపదను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలన్న సంకల్పంతో ఉద్యమిస్తున్న రఘువీర్ ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... పోషక విలువలతో పాటు 14 శాతానికి పైగా ఫైబర్ కలిగిన ‘నవార’ బియ్యం తిన్న తర్వాత నా ఆలోచన మారింది. అసలు ఇలా ఎన్ని రకాల పురాతన వరి రకాలు ఉన్నాయో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో నాలుగేళ్ల క్రితం తొలి అడుగు వేశా. తమిళనాడు, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌లలో పర్యటించాను. ఎక్కువ భాగం ఆదివాసీల నుంచి విత్తనాలు సేకరించాను. వాటిని ఎలా దాచుకోవాలి. ఎలా సంరక్షించాలి. ఎలా సాగు చేయాలో వారి దగ్గర నేర్చుకున్నా. నా పర్యటనలో పురాతన వరి విత్తన సంరక్షణోద్యమ పితామహుడు డాక్టర్ దేవల్దేవ్ (ఒడిషా) వద్ద నెల రోజుల పాటు శిక్షణ పొందా. ఈయన వద్ద ప్రపంచంలో మరెక్కడా లేని 1500కు పైగా వంగడాలున్నాయి. దేశీ వంగడాల పరిరక్షణకు కృషి చేస్తున్న డాక్టర్ వందనా శివను కలిసాను. పురాతన వంగడాలపై విశిష్ట కృషి చేసిన ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.హెచ్.రిచారియా నుంచి సేకరించిన విత్తనాలతో డెహ్రాడూన్ సమీపంలో 50 ఎకరాల్లో ‘నవధాన్య’ పేరిట విత్తన పరిరక్షణకు నడుం బిగించారు. ఆమె వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. 251 దేశీ వరి రకాల సేకరణ ఇప్పటి వరకు 251 రకాల అత్యంత పురాతనమైన వరి విత్తనాలను సేకరించాను. వీటిలో భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) కల్గిన వంగడాలు 10కి పైగా ఉన్నాయి. పెనమలూరులో 1.3 ఎకరాల్లో ఈ విత్తనాల సంరక్షణ చేస్తున్నా. ఇప్పటి వరకు 48 మంది రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాను. నేను నేర్చుకున్న విషయాలను పుస్తక రూపంలో తెచ్చే పనిలో ఉన్నా. ఇందులో పురాతన వరి రకాలు, వాటి వివరాలు,æ గొప్పదనం, చరిత్ర, ఔషధ గుణాలు, వంటకాలు వంటి వివరాలుంటాయి. ఈ ఏడాది 8 జిల్లాలలో విత్తన నిధులను ఏర్పాటు చేస్తున్నా. గిరిజన ప్రాంతమైన పెదబయలు మండలంలో దేశీ విత్తన నిధిని ఏర్పాటు చేస్తున్నా. రూ. 50 వేల నికరాదాయం ప్రకతి వ్యవసాయంలో పురాతన వరి రకాలను సాగు చేస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎకరాలో ఖర్చులు పోను 50 వేలు నికర లాభం పొందవచ్చు.« ధాన్యాన్ని 4 నెలల పాటు నిల్వ చేసి.. బియ్యంగా మార్చి అమ్మగలిగితే దీనికి రెట్టింపు ఆదాయం ఆర్జించొచ్చు. తగిన జాగ్రత్తలతో విత్తనంగా అమ్మితే చక్కని ఆదాయం పొందవచ్చు. దేశీ వరి విత్తనోత్పత్తిలో మెలకువలు తక్కువ స్థలంలో ఎక్కవ రకాలు పండించాలనుకుంటే ఖచ్చితంగా రకానికి రకానికి మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండాలి. మధ్యలో గుడ్డ కట్టాలి. ఒకేసారి పుష్పించకుండా ఉండేలా నాటుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా దేశవాళీ వరి సంరక్షణ పేరిట ఒక ఎకరంలో 100 రకాలు సాగు చేస్తే వాటిలో ఉండే ఔషధ గుణాలు, చీడపీడలను తట్టుకునే లక్షణాలు, సువాసనలను కోల్పోతాయి. కేంద్రం భౌగోళిక గుర్తింపునిచ్చిన వాటిలో ప్రధానంగా నవార, పాలకడ్ మిట్ట, పొక్కలి, వాయనాడ్ గంధకసాల, కాలానమక్, కైపాడ్, జోహా, అజారా ఘణసాల్, అంబెమొహర్, తులైపాంజ్, గోవిందో బోగ్, కటార్ని, చౌకోహ, సీరగ సాంబ రకాలు ఉన్నాయి. ఎర్ర బియ్యంలో 100 రకాలు, నల్ల బియ్యంలో 20 రకాలకు పైగా మన దేశంలోనే ఉన్నాయి. ఎకరాకు 13 నుంచి 30 బస్తాల దిగుబడినిచ్చే పురాతన రకాలున్నాయి. మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువ. ధర కూడా ఎక్కువే. 70 నుంచి 240 రోజుల్లో పండే పురాతన వరి రకాలు నా దగ్గర ఉన్నాయి. – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి దేశీ వరి వంగడాల ప్రత్యేకతలు నవర: రెడ్ రైస్ (ఎర్ర బియ్యం). కేరళకి చెందిన ఈ రకానికి 2007లో భౌగోళిక గుర్తింపు వచ్చింది. వీటిలో పీచు పదార్థం ఎక్కువ. ఒక రోజు నాన బెట్టి, ఒక గంటసేపు ఉడికించాలి. అత్యంత బలవర్ధకమైన బియ్యమిది. డయాబెటిక్ వారికి అత్యంత సురక్షితమైన ఆహారం. పాలక్కడ్ మట్ట: కేరళకు చెందిన మరో ఎర్ర బియ్యపు రకం. చోళ రాజులు తినేవారట. ముంపును తట్టుకునే పంట ఇది. ఇడ్లీ తరహా వంటలకు అనుకూలం. పోక్కలి: ఉప్పు నీటిలో పెరిగే రకం. కేరళలో ఎర్నాకుళం, త్రిస్సూర్ పరిసరాల్లో సాగు చేస్తారు. ఇది కూడా ఎర్ర బియ్యమే. వరి పొలంలో చేపలను పెంచే సమీకృత వ్యవసాయానికి ఇది అనుకూలం. ఇందులో ప్రొటీన్స్ అధికంగా ఉంటాయి. అధిక శక్తినిస్తుంది. సముద్రవేటకు వెళ్లే జాలర్లు ఎక్కువగా వాడుతుంటారు. వయనాడు గంధకశాల: కేరళలోని వయనాడు కొండల మీద పెరిగే సుగంధ భరితమైన రకమిది. ఈనికSదశలో మంచి సువాసన వెదజల్లుతుంది. పూర్వం పండుగల వేళ ప్రసాదాల తయారీకి ఉపయోగించేవారు. ఆదివాసీలు నేటికీ అధికంగా పండిస్తున్నారు. కాలానమక్: అత్యంత సువాసన కల్గిన తెల్ల వరి రకమిది. ధాన్యపు పొట్టు నల్లగా ఉంటుంది. బియ్యం తెల్లగా ఉంటుంది. క్రీ.పూ. 600 ఏళ్ల నాటి రకం ఇది. గౌతమ బుద్ధుని కాలంలోనూ పండించినట్టు చారిత్రక ఆధారాలున్నాయట. కపిలవస్తు (నేపాల్), ఉత్తరప్రదేశ్‌లలో నేటికీ సాగులో ఉంది. చకావో: మణిపూర్ బ్లాక్ రైస్ అని దీనికి పేరు. పంట కాలం 120 రోజులు. ఔషధ విలువలు కల్గిన నల్ల బియ్యం. వీటిలో యాంటి ఆక్సిడెంట్స్ అధికం. మార్కెట్లో ఈ రకం బియ్యానికి మంచి డిమాండ్ ఉంది. పాయసం తరహా వంటకాలకు బాగా అనువైనది. ప్రతి రైతూ పండించుకొని తినాలి! నేను ప్రతి రైతునూ కోరుకునేది ఒక్కటే. తనకున్న భూమిలో కొంత భాగంలోనైనా తన కోసం పోషకాలు, ఔషధ విలువలు కలిగిన పంటలు పండించుకోవాలి. పురాతన వరి, కూరగాయలు, దుంప రకాలS విత్తనాలు నేటికీ అందుబాటులో ఉన్నాయి. అధిక దిగుబడి మాయలో పడిపోకుండా ప్రతీ రైతు పురాతన వరి విత్తనాలను సేకరించి తాము తినడానికి పండించుకోవాలి. విత్తనాన్ని సంరక్షించు కోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రపంచాన్ని ఎవరూ మార్చలేరు. ముందుగా మనం మారి, ఆ తర్వాత పది మందికీ చెబితే ఖచ్చితంగా పది మందైనా మన బాటలోకి వస్తారు. ఈ స్ఫూర్తితో నేను ఈ ఉద్యమంలో ముందుకెళ్తున్నాను. – నందం రఘువీర్ (70138 20099), దేశీ వంగడాల సంరక్షకుడిగా మారిన యువ ఇంజనీర్, పెనమలూరు, కృష్ణా జిల్లా -
ఏపీకి 19.02 లక్షల టన్నుల ఎరువులు
సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్–2022 సీజన్లో ఏపీకి రూ.19.02 లక్షల టన్నుల ఎరువులను కేటాయించనున్నట్టు కేంద్ర, వ్యవసాయ, ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శులు ప్రియరంజన్, నీరజ వెల్లడించారు. ఖరీఫ్ సన్నద్ధతపై వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖ కమిషనర్లతో సోమవారం ఢిల్లీ నుంచి వారు సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో సాగవుతున్న ఖరీఫ్ పంటల విస్తీర్ణం, పంటలు, భూసార పరిస్థితులపై చర్చించారు. ఐదేళ్లుగా ఎరువుల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని రానున్న ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువుల కేటాయింపుపై ప్రకటన చేశారు. ఎరువుల వాడకాన్ని తగ్గించేలా రైతులను చైతన్య పరచి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచేలా కృషి చేయాలని సూచించారు. వరి సాగు లక్ష్యం 16.33 లక్షల హెక్టార్లు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో 57.32 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. వీటిలో ప్రధానంగా వరి 16.33 లక్షల హెక్టార్లు, వేరు శనగ 7.30 లక్షల హెక్టార్లు, పత్తి 6.24 లక్షల హెక్టార్లు, కంది 2.70 లక్షల హెక్టార్లు, మినుము లక్ష హెక్టార్లు, పెసర 14 వేల హెక్టార్లు, జొన్న 17 వేల హెక్టార్లు, మొక్కజొన్న 1.16 లక్షల హెక్టార్లు, నువ్వులు 13 వేల హెక్టార్లు, రాగి 26 వేల హెక్టార్లు, మిరప 1.80 లక్షల హెక్టార్లు, కూరగాయలు 2.65 లక్షల హెక్టార్లు ఇతర వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు కలుపుకొని మొత్తం 57.32 లక్షల హెక్టార్లుగా అంచనా వేశామన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 79.8 శాతం నేలల్లో నత్రజని, 15.80 శాతం నేలల్లో భాస్వరం, 14.71 శాతం నేలల్లో పొటాష్, 35 శాతం నేలల్లో జింక్, 24 శాతం నేలల్లో ఐరన్, 17 శాతం నేలల్లో బోరాన్ లభ్యత తక్కువగా ఉన్న విషయాన్ని భూసార పరీక్షల్లో గుర్తించినట్టు కమిషనర్ తెలిపారు. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం రాష్ట్రానికి యూరియా 8 లక్షల టన్నులు, డీఏపీ 2.25 లక్షల టన్నులు, ఎంవోపీ 1.41 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 6.41 లక్షల టన్నులు, ఎస్ఎస్పీ 95 వేల టన్నులు.. మొత్తం 19.02 లక్షల టన్నులు అవసరమని కమిషనర్ కోరగా.. ఆ మేరకు ఏపీకి ఎరువులను కేటాయిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ, ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శులు ప్రియరంజన్, నీరజలు ప్రకటించారు. -
వరికి.. ‘సిరి’సాటి
సాక్షి, అమరావతి: మైదాన ప్రాంతాలతో పోల్చితే బోర్ల కింద వరి సాగు చేసేందుకు రైతన్నలకు వ్యయ ప్రయాసలు అధికం. సీజన్ ఏదైనప్పటికీ బోర్ల కింద వరినే ఆనవాయితీగా పండిస్తూ పెట్టుబడుల భారంతో నష్టపోతున్న అన్నదాతలను ఆరుతడి పంటల వైపు మళ్లించేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామాల్లో విస్తృ్తత అవగాహన.. రాష్ట్రంలో సుమారు 12 లక్షల బోర్లు ఉండగా వాటి కింద 24.63 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 11.25 లక్షల ఎకరాల్లో సుమారు పది లక్షల మంది రైతులు దశాబ్దాలుగా వరినే నమ్ముకున్నారు. దశల వారీగా ఆరుతడి పంటల వైపు మళ్లించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుత రబీ సీజన్లో ప్రయోగాత్మకంగా బోర్ల కింద 615 క్లస్టర్ల పరిధిలో 30,750 ఎకరాల్లో వరికి బదులు అపరాలు, చిరుధాన్యాలు, నూనెగింజల పంటల సాగును ప్రోత్సహించేందుకు రూ.11.28 కోట్లతో కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ ఫలితాలను బట్టి రానున్న రెండేళ్లలో కనీసం 3 లక్షల ఎకరాల్లో రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ఆర్బీకేల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. బోర్ల కింద సాగు చేసే రైతులతో సమావేశాలు నిర్వహించి ఆరుతడి పంటల సాగుతో చేకూరే ప్రయోజనాలపై చైతన్యం చేస్తున్నారు. వీడియో సందేశాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపిస్తున్నారు. ఆర్బీకే సిబ్బందితో పాటు వలంటీర్లు రైతుల ఇళ్లకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. గ్రామ కూడళ్లలో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి అవగాహన పెంపొందిస్తున్నారు. రైతులకు ప్రోత్సాహకాలు బోర్ల కింద ఆరుతడి పంటలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను అందించనుంది. హెక్టార్‌కు రూ.15 వేల సబ్సిడీతో స్ప్రింకర్లు అందిస్తారు. వాటితో పాటు చిరుధాన్యాలకు రూ.6 వేలు, అపరాలకు రూ.9 వేలు, నూనెగింజలకు రూ.10 వేల విలువైన విత్తనాలు, విత్తన శుద్ధి కెమికల్స్, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలు ఆర్బీకేల ద్వారా అందజేస్తారు. రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన దాల్ ప్రాసెసింగ్ మిషన్లను 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్ ఇంట్రస్ట్ గ్రూప్స్(ఎఫ్ఐజీ)లకు అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు పండించే గ్రూపులకు 50 యూనిట్లు చొప్పున ఇస్తారు. ఎకరం పొలంలో వరి పండించే నీటితో సుమారు 8 ఎకరాల్లో ఆరుతడి పంటలను సాగు చేయవచ్చు. పైగా పెట్టుబడి కూడా సగానికి తగ్గిపోతుంది. బోర్ల కింద, ఆయకట్టు చివరి భూముల్లో వరికి బదులు పెసర, మినుము, ఉలవలు, జొన్న, వేరుశనగ వేసుకోవచ్చు. నేల స్వభావం, నీటి లభ్యత మేరకు పంటలను ఎంపిక చేసుకుని పండిస్తే మంచి దిగుబడులొస్తాయి. ఒత్తిడి లేకుండా అవగాహన రానున్న నాలుగు సీజన్లలో దశలవారీగా కనీసం 3 లక్షల ఎకరాల్లో పంటల మార్పిడి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రైతులపై ఒత్తిడి లేకుండా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ పథకాలను అనుసంధానిస్తూ రాయితీలు అందిస్తున్నాం. – అరుణ్‌కుమార్,కమిషనర్, వ్యవసాయ శాఖ -
తడారని నేలపై తప్పని వరి..!
యాసంగిలో వరిసాగు వద్దని ప్రభుత్వం చెప్తుండటంతో రైతులు గందరగోళంలో పడ్డారు. చెరువులు, ప్రాజెక్టుల కింద, కాల్వల వెంట ఉన్న భూముల్లో నీరు నిలిచి ఉంటోందని.. అలాంటిచోట్ల వరి తప్ప మరేం సాగుచేయలేమని స్పష్టం చేస్తున్నారు. వరి వద్దంటే వాటిని బీడుగా వదిలేయాల్సిందేనని వాపోతున్నారు. తడి ఎక్కువగా ఉండే భూముల్లో ఎలాంటి పంటలు వేయచ్చన్న దానిపై వ్యవసాయ శాఖ స్పష్టమైన ప్రణాళిక ఏదీ ఇవ్వలేదని గుర్తుచేస్తున్నారు. తెలియని కొత్త పంటలు వేయలేక.. ఒకవేళ వేస్తే ప్రభుత్వం నుంచి తగిన సాయం అందుతుందో, లేదోనన్నది తేలక.. వరిసాగువైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వరినాట్లు జోరందుకున్నాయి. గత పదిరోజుల్లోనే దాదాపు 80వేల ఎకరాల్లో నాట్లు పడినట్టు అంచనా. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో సాధారణంగా యాసంగి సీజన్లో 22,19,326 ఎకరాల్లో వరిసాగు చేస్తారు. అంతకుముందటి ఏడాది 38.62 లక్షల ఎకరాల్లో వరివేయగా, గతేడాది 52,78,636 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈసారి యాసంగిలోనూ ఎక్కువ మంది రైతులు వరిసాగుకే మొగ్గుచూపుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై తగిన కార్యాచరణ లేకపోవడమే దీనికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. విత్తనాల సబ్సిడీ ఏమోగానీ అసలు ఏయే విత్తనాలు ఏమేర అందుబాటులో ఉన్నాయన్నది కూడా తెలియని పరిస్థితి ఉందని రైతులు చెప్తున్నారు. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇదీ.. కరీంనగర్ జిల్లాలో చెరువులు, కాల్వలను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వరివేస్తున్నారు. ఇక్కడ 312 గ్రామ పంచాయతీల పరిధిలో 1,218 చెరువులు ఉన్నాయి. ఎస్సారెస్పీ కాలువలు సుమారు 120 కిలోమీటర్ల పొడవున ఉండగా.. ఉప కాలువలు మరో 500 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ప్రాజెక్టుల నుంచి నీరు వదిలినప్పుడు ప్రధాన కాల్వలను ఆనుకుని ఉన్న భూములు తడిగా మారుతున్నాయి. వాటిల్లో గత్యంతరం లేక వరి సాగు చేయాల్సి వస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జూరాల, భీమా, కేఎల్ఐ, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా ఏడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఏటా 2,500కు పైగా చెరువుల్లో కృష్ణా జలాలను నింపడంతో రైతులు వరిసాగుకే మొగ్గుచూపుతున్నారు. పొలాల్లో నీరు నిలిచి ఉండటం వల్ల పలు ప్రాంతాల్లో వరి తప్ప మరేమీ వేయలేని పరిస్థితి ఉంది. నారాయణపేట, గద్వాల, జోగుళాంబ, వనపర్తి జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలకు అవకాశమున్నా.. విత్తనాలు, మార్కెటింగ్, మద్దతు ధరపై స్పష్టత లేదని రైతులు చెప్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే వేల ఎకరాల్లో వరినాట్లు వేశారు. మిగతాచోట్ల పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఏఎమ్మార్పీ, నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద వరిసాగుకే రైతులు మొగ్గుచూపుతున్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఆసిఫ్‌నగర్ కాలువ, తూములు దెబ్బతిన్నాయి. దీంతో పరిసరాల్లోని వందల ఎకరాల్లో జాలు పారుతోంది. అక్కడ వరి తప్ప మరేమీ సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మినహా సాగునీటి వనరులున్న నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని సరస్వతి కాలువ, కడెం ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతలు, గోదావరి తీరాల్లో రైతులు వరి సాగుకే మొగ్గుచూపుతున్నారు. ఆయా చోట్ల ఇతర పంటలు సరిగా పండవని పేర్కొంటున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నిజాంసాగర్, శ్రీరాంసాగర్, పోచారం, కౌలాస్‌నాలా, రామడుగు ప్రాజెక్టుల కింద 2 లక్షల ఎకరాలకుపైగా వరిసాగుకు చర్యలు చేపట్టారు. ఇక్కడ వరి తప్ప ఇతర పంటలపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ఖమ్మం జిల్లా రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో వరి సాగుకే సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 8 మండలాల్లో ఇప్పటికే 7,923 ఎకరాలకు సరిపడా వరి నార్లు పోశారు. ఆరు మండలాల్లో 131 ఎకరాల్లో నాట్లు కూడా వేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాల్వల ఆయకట్టు, పాలేరు రిజర్వాయర్, వైరా రిజర్వాయర్ ఆయకట్టులో తరి భూములు కావడంతో వరి తప్ప ఇతర పంటలు సాగు చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరుతడి పంటలకు ఎక్కువ అవకాశం ఉంది. కానీ విత్తనాలు, మార్కెటింగ్ , మద్దతు ధర వంటి అంశాలపై స్పష్టత లేనందునే వరి సాగువైపు వెళ్లాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. జాలువారిన నేలలో మరేం వేయాలి మా పంట పొలాలవైపు కాలువ తీశారు. అంతకుముందు మాగాణిగా ఉండగా ఏ పంటలు వేసినా పండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. నేల తడిగా ఉంటోంది. అలాంటప్పుడు వరి తప్ప ఏ పంట వేయలేం. వేసినా నష్టపోవాల్సిందే. – సింగిరెడ్డి ముత్యంరెడ్డి, మొగ్ధంపూర్, కరీంనగర్ మండలం శనగ వేస్తే మొలక రాలేదు కొన్నేళ్లుగా 15 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. ఇటీవలి ఖరీఫ్‌లో ఐదెకరాల్లో శనగ వేశాం. భూమిలో తడి ఎక్కువగా ఉన్న కారణంగా నెల రోజులైనా మొలక రాలేదు. దాన్ని దున్నేసి వరి వేస్తున్నాం. – బోధ శైలేందర్, రుద్రూర్, నిజామాబాద్ వేరే దారి లేకనే.. నాకు మూడెకరాల భూమి ఉంది. అది కూడా చెరువు పక్కనే ఉంటుంది. వరి తప్ప వేరే పంట వేసినా పండదు. వేరే దారి లేకనే యాసంగిలో వరి వేయక తప్పడం లేదు. – సూరకంటి ప్రశాంత్‌రెడ్డి, చామన్‌పల్లి, నిర్మల్ జిల్లా -
‘యాసంగి’ యమా స్పీడ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్ పంటల సాగు జోరందుకుంది. వానాకాలంలో వర్షాలు పుష్కలంగా కురవడంతో చెరువులు, కుంటలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు సైతం పెరగడంతో సాగు పనులు చకచకా సాగుతున్నాయి. యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 46,49,676 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచింది. ఇప్పటివరకు 8,06,511 ఎకరాల్లో (17 శాతం) వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయంలో కేవలం 4,63,744 ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ ఏడాది రెట్టింపు వేగంతో పంటల విస్తీర్ణం పెరుగుతున్నట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనవరి నాటికి లెక్కతేలనున్న వరి విస్తీర్ణం ధాన్యం కొనుగోలుపై కేంద్రం పలు ఆంక్షలు విధించిన క్రమంలో యాసంగి సీజన్లో వరిసాగు వద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సూచనలు చేస్తోంది. వాస్తవానికి యాసంగిలో రాష్ట్రంలో సగటున 52.80 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యేది. ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయలేమని కేంద్రం తేల్చిచెప్పడంతో వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలవైపు రైతుల దృష్టి పెట్టారు. ఈక్రమంలో ఈ ఏడాది వరిసాగును 21 లక్షల ఎకరాలకు తగ్గించేలా ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించింది. దీంతో ఈ సీజన్లో వరిసాగు 31.01 లక్షల ఎకరాల్లో ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటివరకు 1,737 ఎకరాల్లోనే వరి సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా వరినాట్లు డిసెంబర్లో మొదలై జనవరి రెండో వారంకల్లా గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ప్రస్తుతం వరినాట్లు ప్రారంభ దశలో ఉండటంతో విస్తీర్ణం ఏమేరకు తగ్గుదల ఉంటుందో చూడాలి. నాగర్‌కర్నూల్‌లో అత్యధికం... యాసంగి సీజన్ పంటల సాగులో నాగర్‌కర్నూల్ జిల్లా ముందు వరుసలో ఉంది. ఈ జిల్లాలో ఇప్పటికే 76 శాతం మేర పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలో 61 శాతం, వనపర్తి జిల్లాలో 39 శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 36 శాతం, గద్వాల జిల్లాలో 35 శాతం పంటలు సాగైనట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈ నెల రెండోవారం నుంచి సాగు పుంజుకునే అవకాశాలున్నాయి. నెలాఖరుకల్లా సాధారణ సాగు విస్తీర్ణాన్ని చేరుకునే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
తెలంగాణ: ధాన్యం అమ్ముడుగాక.. మరో రైతు ఆత్మహత్య
సాక్షి, ఏటూరునాగారం(వరంగల్): ధాన్యం కొనుగోళ్లలో కొనసాగుతున్న తీవ్ర జాప్యం ఓ అన్నదాతను బలిగొంది. కోసిన కొంత పంట అమ్ముడు కాక.. మిగిలిన పంట కోసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక.. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పుల భారం భరించలేక ధాన్యం రాశివద్దే పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివాపురంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బెతెల్లి కుమార్ (43) రైతు తనకున్న రెండెకరాల సొంత భూమితోపాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మొత్తం 8 ఎకరాల్లో వరి సాగు చేశాడు. అందులో 6 ఎకరాల వరి పంట కోయించాడు. శివాపురంలో ధాన్యం కేంద్రం ప్రారంభమైనా అధికారులు కొనుగోళ్లు మొదలు పెట్టలేదు. తేమశాతం తగ్గేందుకు 6 ఎకరాల ధాన్యాన్ని ఇంటి పెరడులో ఆరబోశాడు. ఉదయం ఆరబోయడం, రాత్రి కుప్పపోయడం చేస్తున్నాడు. అధికారులు కొనుగోళ్లు ప్రారంభిస్తే తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో మరో రెండు ఎకరాల వరి కోతకు వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. గత ఏడాది అప్పు రూ.3లక్షల భారం నెత్తిమీద ఉంది. దీనికితోడు ఇటీవల కురిసిన వర్షాలకు వరినేలబారిగా దిగుబడి తగ్గింది. ఇటు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేక.. మిగతా వరిని కోసేందుకు డబ్బులు లేకపోవడం.. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కొన్నిరోజులు దిగులుగా ఉన్నాడు. మంగళవారం రాత్రి పెరడులో ఉన్న ధాన్యం రాశివద్దే పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఏటూరునాగారం, అక్కడినుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశాడు. మృతునికి భార్య రాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
వరి కొనుగోలు కేంద్రాలుండవు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రగతిభవన్‌లో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ముగిసింది. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణతో పాటు ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో పంటలసాగుపై కేసీఆర్.. మంత్రులతో చర్చించారు. అనంతరం కోవిడ్ టీకాల పురోగతి, ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యంపై సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. (చదవండి: 'ప్లాన్'తో పంటలేద్దాం..) యాసంగిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలుండవు.. సుమారు ఐదు గంటల పాటు సాగిన తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో వేసవిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని తెలిపారు. బాయిల్డ్ రైసును కొనబోమని కేంద్రం చేతులెత్తేసిందన్నారు. కనుక రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకుని.. పంటలసాగుపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. స్వంత వినియోగం, విత్తన కంపెనీలతో ముందస్తు ఒప్పందం కోసం వరి సాగు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం మాత్రం రైతుల నుంచి వరి కొనుగోలు చేయలదేని కేసీఆర్ స్పష్టం చేశారు. వరి ధాన్యం బఫర్ స్టాక్ పెట్టుకోవడం కేంద్రం బాధ్యతని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని మండిపడ్డారు. తన సామాజిక బాధ్యతను కేంద్రం విస్మరిస్తోందని అన్నారు. తన విధానాలతో రైతాంగాన్ని కేంద్రం గందరగోళ పరుస్తోందని తెలిపారు. లాభ నష్టాలు బేరీజు వేసుకుంటే అది ప్రభుత్వం అవుతుందా? అని నిలదీశారు. పలు దేశాల్లో ఒమిక్రాన్ పరిస్థితిపై చర్చించిన సీఎం కేసీఆర్.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కొత్త వేరియంట్ నేపథ్యంలో ఏవిధంగా అప్రమత్తంగా ఉన్నామన్న దాని గురించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నివేదిక అందజేశారు. కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేశాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రలకు సూచించారు. చదవండి: ఒమిక్రాన్ గుబులు.. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు 185 మంది -
వరిసాగుపై ప్రభుత్వానిది పూటకో మాట
సాక్షి, హైదరాబాద్: వరి సాగుపై పూటకో మాట చెప్పి రాష్ట్రప్రభుత్వం రైతులను గందరగోళంలోకి నెడుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన లేఖ ప్రకారం రాష్ట్రప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కచ్చితంగా ధాన్యం కొనుగోలు చేస్తుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన భూసార పరీక్షల నిధులను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. శనివారం అరుణ మీడియాతో మాట్లాడుతూ యాసంగిలో రైతులను వరి వేయొద్దని చెప్పిన రాష్ట్ర సర్కార్.. రాత్రికి రాత్రి వారిని ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమంటే ఎలా? అని ప్రశ్నించారు. -
కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయిండు, అక్కడ ఏం పనుంది: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: పంజాబ్ రైతులకు కేసీఆర్ మూడు లక్షలు ఇస్తానంటూ ప్రకటించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ననిప్పులు చెరిగారు. తెలంగాణలో చనిపోయిన రైతులకు ఏం ఇస్తున్నావంటూ నిలదీశారు. నీ అనాలోచిత నిర్ణయాల వల్ల చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వావా అని సూటిగా ప్రశ్నించారు. చనిపోయిన రైతులకు రూ. 25 లక్షలు ఇచ్చి ఆ తరువాత కేంద్రాన్ని అడగాలని హితవు పలికారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని బండి సంజయ్ విమర్శించారు. చదవండి: నిప్పులాంటి నిజం! సిలిండర్‌పై ఎక్స్ట్రా వసూళ్లు, మొత్తం లెక్కిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే! కేసీఆర్ దీక్ష చేస్తే ఢిల్లీ దిగొచ్చిందంటున్నారు, సీఎం కేసీఆర్ దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా? పంజాబ్ రైతుల కోసమా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని ఫాంహౌజ్ నుంచి ధర్నా చౌక్ దగ్గరకు తీసుకొచ్చామన్నారు. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయాడు? అక్కడ ఏం పనుందని ప్రశ్నించారు. వారం రోజుల నుంచి ధాన్యం కొనమని చెబితే కొనలేదని దుయ్యబట్టారు. వానాకాలం పటం కొంటవా? కొనవా అని మొత్తుకున్నట్లు ప్రస్తావించారు ‘రైతుల గురించి ఆలోచించే పార్టీ బీజేపీ. రైస్ మిల్లర్ల గురించి ఆలోచించే పార్టీ టీఆర్ఎస్. కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తే మాపై దాడులు చేశారు. కేసీఆర్ మాటలకు ప్రజలు ఆశ్యర్యానికి గురవుతున్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనేందుకు కేంద్ర ఒప్పుకుందా? లేదా?. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తేవద్దు అంటే ఎక్కడ పోసుకోమంటావు. నీ ఫాంహౌజ్‌లో పోసుకోమంటావా’ అని సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చదవండి: ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు.. -
వరిపై సీఎం కేసీఆర్ నిరసన గళం.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: వరి కొనుగోలు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ధర్నాపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా యాసంగిలో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తామనేది త్వరలో నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. గత ఖరీఫ్‌లో 32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నుల(25 శాతం పెంపు) బియ్యం కొనుగోలు పెంచే అంశం పరిశీలనలో ఉందని పేర్కొంది. గత రబీ సీజన్లో ఇచ్చిన హామీ మేరకు మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. చదవండి: CM KCR: కేంద్రంపై యుద్ధం ఆగదు.. ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు అయితే బాయిల్డ్ రైస్‌ను కొనే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పంట వైవిధ్యం అవసరమని, దేశంలో వరి పంట సాగు ఎక్కువైందని, ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని కేంద్రం పేర్కొంది. గత రబీ సీజన్లో (2021) పండిన పారా బాయిల్డ్ రైస్ 44.7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొంటామని చెప్పినట్లు, అందులో ఇంకా మిగిలి ఉన్న పారా బాయిల్డ్ రైస్ సేకరణ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. చదవండి: దిక్కుమాలిన ప్రభుత్వం కేంద్రంలో ఉంది: సీఎం కేసీఆర్ ‘ప్రస్తుతం దేశంలో పారా బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేదు. ఈ తరహా రైస్‌ను వినియోగించే రాష్ట్రాలు స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇకమీదట పారా బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని తెలంగాణ ప్రభుత్వానికి చెప్పాం. అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. దేశవ్యాప్తంగా వరి, గోధుమ పంటల దిగుబడి దేశీయ అవసరాలకు మించి జరుగుతోంది. గోధుమ పండించే చాలా రాష్ట్రాల్లో వరి కూడా సాగు చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం పప్పు దినుసులు, నూనె గింజలకు డిమాండ్ చాలా ఉంది. వాటిని ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్నాము. ఈ పరిస్థితుల్లోనే పంట మార్పిడి చేసి పప్పు దినుసులు, నూనె గింజల సాగు చేయమని అన్ని రాష్ట్రాలలో రైతులను కోరుతున్నాము. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లు పోతే ఆహార ధాన్యాలు నిల్వ చేయడానికి కూడా స్థలం ఉండదు. పంజాబ్ రాష్ట్రంలో వరి పండించినంతగా వినియోగం ఉండదు. అక్కడ 90% సేకరణకు కారణమిదే. తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా ప్రజలు వరి వినియోగిస్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకిరాని ఇతర వినియోగదారులు కూడా ఉంటారు. ఏ విషయంలోనూ రాష్ట్రాలను కేంద్రం ఒత్తిడి చేయదు. వాస్తవ పరిస్థితికి అనుగుణంగా చర్చలు జరిపి ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తోంది. తదుపరి రబీ సీజన్లో ఎంత కొంటామనేది రాష్ట్రాలో సమావేశం జరిపి, దిగుబడి అంచనాలను చూసి నిర్ణయం తీసుకుంటాం’ అని కేంద్రం స్పష్టం చేసింది. -
దిక్కుమాలిన ప్రభుత్వం కేంద్రంలో ఉంది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: వరి కొనుగోలు అంశంపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య చెలరేగుతున్న మంట ఇప్పట్లో చల్లారేట్లు లేదు. ధాన్యాన్ని కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం మహా దర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఈ ధర్నలో సీఎం కేసీఆర్‌తో సహా, మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొన్నారు. చదవండి: ఇందిరాపార్క్ ధర్నా ముగిశాక రాజ్‌భవన్‌కు టీఆర్ఎస్ పాదయాత్ర? ఈ మేరకు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో పండించే వడ్లను కొంటరా.. కొనరా అని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గోస తెలంగాణలోనే కాదు..దేశం మొత్తం ఉందన్నారు.. రైతు చట్టాలను రద్దు చేయండని ఏడాదిగా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారని గుర్తు చేశారు. వానాకాలం పంటనే కొనే దిక్కు లేదు కానీ కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను ఎక్కడి నుంచి కొంటుందని ఎద్దేవా చేశారు. చదవండి: టీఆర్ఎస్ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్.. నాగలితో ఎమ్మెల్యే కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశాన్ని పాలించిన అన్ని పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రస్తుత ఈ దుస్థితికి కారణం ఆ పార్టీలేనని విమర్శించారు. వాస్తవాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు మాట్లాడుతోందని మండిపడ్డారు. హంగర్ ఇండెక్స్‌లో భారత దేశం 101 స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కంటే భారత్ దీన స్థితిలో ఉందన్నారు. బీజేపీ అబద్ధాలు మాట్లాడుతూ అడ్డగోలు పాలన చేస్తోందని మండిపడ్డారు. ‘ఐటీఆర్ ప్రాజెక్టు ఇవ్వమంటే ఇవ్లేదు.. ప్రతి జిల్లాకు నవోదయాలు ఇవ్వమంటే ఇవ్వలే. చాలా ఓపికతో ఉన్నాం. ఈ సభలో కూడా బీజేపీకి సీఐడీలు ఉన్నారు. నిన్న కూడా ప్రధానికి లేఖ రాసిన. వడ్లు కొంటరా, కొనరా అని అడిగితే ఉలుకు పలుకు లేదు. రైతులు ఇబ్బంది పడతారనే యాసంగిలో వడ్లు వేయొద్దని చెప్పిన. పదవులను చిత్తు కాగితాల్లా ఎన్నిసార్లు వదిలేశామో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. రైతు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజీ పోరాటం చేస్తాం. అనేక సమస్యలను పెండింగ్‌లో పెట్టారు. కుల గణన చేయాలని తీర్మాణం చేసి పంపితే ఇప్పటి వరకు దిక్కు లేదు. సమస్యలను పక్కకు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. నీళ్లివ్వకుండా రాష్ట్రాల మధ్య తగాదాలు పెడుతున్నారు. సమస్యలను ఎత్తి చూపితే పాకిస్తాన్ అని విద్వేషాలు రెచ్చగొడుతోంది బీజేపీ. కరెంట్ కోసం తెలంగాణ 30ఏళ్లు ఏడ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే కరెంట్ సమస్య తీరింది. కరెంట్ మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెబుతోంది. రైతు కడుపు నిండా కరెంట్ ఇచ్చేది తెలంగాణే. బీజేపీకి చరమగీతం పాడితేనే ఈ దేశానికి విముక్తి’ అని సీఎం కేసీఆర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. -
‘బండి సంజయ్ రెండు చెంపలు పగులకొట్టి రైతులకు క్షమాపణ చెప్పాలి'
సాక్షి, రాజన్న సిరిసిల్లా జిల్లా: వానాకాలం పంటను పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం కొంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 52 వేల మెట్రిక్ టన్నులు కొన్నామని, ఇంకా 3 లక్షల టన్నుల పంట కొన్సాల్సి ఉందన్నారు. తడిసిన దాన్యం కూడా కొనే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 4,743 దాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా దాన్యం సేకరిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం దాన్యం కొనుగోలు విషయములో కేంద్రం రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉండాలని హితవు పలికారు. రాష్ట్రంలో వ్యవసాయానికి నీటి వసతులకు కేంద్రం ఎలాంటి సహాయాన్ని అందించలేదని విమర్శించారు. చదవండి: Seethakka: జైభీమ్ మూవీ ఆస్కార్ అవార్డు గెలుస్తుంది యాసంగి దాన్యం కొనుగోలుపై కేంద్రం పునఃసమీక్షించుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై గురువారం ఇందిరా పార్క్ వద్ద దర్నాకు కూర్చోబోతున్నామని తెలిపారు. కేంద్రానికి తెలంగాణ ధనం కావాలి కానీ, దాన్యం వద్దు అనే కేంద్ర విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం రెండు నాలుకల ధోరణిని ఎండగట్టబోతున్నామని పేర్కొన్నారు. స్థానిక బీజేపీ ఆసత్య ప్రచారాన్ని నమ్మి వరి వేస్తే రైతు నష్ట పోతారని అన్నారు. చదవండి: మనం ఏ స్థాయిలో ఉన్నా డ్రెస్సు, అడ్రెస్సు మారకూడదు: ఉప రాష్ట్రపతి యాసంగి వరి దాన్యం కేంద్రం కొనే విషయం నిజమైతే, పూర్తి పంట కొంటామని రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులను మోసం చేస్తున్న బండి సంజయ్ రెండు చెంపలు పగులకొట్టి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలను నమ్మాలని, పనికిమాలిన వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. -
హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
-
హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
-
హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: వరి కొనుగోలు వ్యవహరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా.. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రైతులు మంగళవారం ఉదయం నుంచి రాస్తారోకో చేస్తున్నారు. ఈ క్రమంలో బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ధర్నా చేశారు. జాతీయ రహదారిపై రైతులు ఒడ్లుపోసి తగలబెట్టారు. దీంతో బీబీనగర్-హైదరాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. (చదవండి: ధాన్యం మద్దతు ధర పొందాలంటే..) ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు, యాసంగి వరిపంట విషయంలో కేంద్రానికి, రాష్ట్రప్రభుత్వాన్ని మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడం లేదని, రైతులు యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నది. చదవండి: నెగిటివ్ రిపోర్టు వద్దనేసరికి రోడ్లన్నీ జామ్! -
Telangana: ‘వరి’పరి విధాలు!
సాక్షి, నిజామాబాద్: ఎరుపు రంగులోని వడ్లు.. లోపల నల్లటి బియ్యం.. సాధారణంగా కనిపించే ధాన్యం.. లోపల ఎర్రని బియ్యం.. ఇలా ఎన్నో రకాలు. కొన్నింటిలో పోషకాలు చాలా ఎక్కువ. మరికొన్నింటి దిగుబడి ఎక్కువ. బాగా చిన్నగా ఉండేవి కొన్ని, గుండ్రంగా ధనియాల్లా కనిపించే బియ్యం రకాలు ఇంకొన్ని.. ఇవన్నీ ఎక్కడెక్కడో కాదు. ఒకేచోట పండుతున్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరుకు చెందిన నాగుల చిన్నగంగారాం పూర్తి సేంద్రియ విధానంలో వీటిని పండిస్తున్నారు. పొలాన్నే ప్రయోగశాలగా మార్చి.. ఒక యోగా గురువు వద్ద సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత గురించి తెలుసుకున్న చిన్న గంగారాం.. 2007లో సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టారు. ఏకంగా 110 రకాల వరి విత్తనాలను సేకరించి సాగుచేస్తున్నారు. ఇందులో మన దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు పలు ఇతర దేశాల వరి రకాలు కూడా ఉండటం గమనార్హం. తాను సాగు చేసిన వివిధ రకాల వరి విత్తనాలను ఇప్పటికే 8 రాష్ట్రాలకు చెందిన 570 మంది రైతులకు అందించారు. బియ్యం నుంచి మొలకలు తెప్పించి.. సాధారణంగా ధాన్యం నుంచే మొలకలు వస్తాయి. కానీ గంగారాం బియ్యం నుంచి మొలకలు తెప్పించి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా చేశారు. అమెరికా నుంచి తెచ్చిన కాలిఫోర్నియా రైస్, ఇటలీ నుంచి తెచ్చిన రిసోట రకం బియ్యం నుంచి మొలకలు వచ్చేలా చేసి సాగు చేశారు. రోజుకో రకం బియ్యం తింటూ.. మన దేశంలో వందేళ్ల క్రితం 40వేల రకాల వరి విత్తనాలు ఉండేవని, వాటిలో 30 వేల రకాలు కనుమరుగయ్యాయని గంగారాం చెప్పారు. మిగతా రకాలను ఔత్సాహిక రైతులు కాపాడుతూ వస్తున్నారని తెలిపారు. అందులో కొన్ని దేశవాళీ రకాలు ఎంతో ప్రత్యేకమైనవని వెల్లడించారు. తనవద్ద ఉన్న 110 రకాల్లో 30 రకాలను రోజూ ఒక రకం బియ్యం అన్నం తింటున్నానని తెలిపారు. ఇన్ని రకాల వరిసాగును ఆయన నాలుగు ఎకరాల్లో చేస్తున్నారు. గంగారాం వద్ద ఉన్న వరి విత్తనాల్లో ప్రత్యేకమైన కొన్ని.. కృష్ణవీహి: ధాన్యం ఎర్రరంగులో, బియ్యం నల్లరంగులో ఉంటాయి. రెండు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. రామ్‌లక్ష్మణ్: ఈ రకం వరిలో రెండు బియ్యం గింజలు ఉంటాయి. ధాన్యం తెల్లగా, బియ్యం గోధుమ రంగులో ఉంటుంది. కాలజీర: పరమాన్నం (పాయసం) స్పెషల్. పైరు ఏకంగా 5 అడుగుల ఎత్తు పెరుగుతుంది. విష్ణుభోగ్: గింజ బాగా చిన్నగా ఉంటుంది. 135 రోజుల పంట. చిన్నపొన్ను: తమిళనాడు రకం. ధనియాల మాదిరిగా ఉంటాయి. పైరు 2 అడుగుల వరకు పెరుగుతుంది. గంగాగోల్డెన్ బ్రౌన్‌రైస్: అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి గోల్డెన్ బ్రౌన్‌రైస్ (బియ్యం) తీసుకొచ్చి వాటి నుంచి మొలకెత్తించారు. ఇది ఒక అడుగు ఎత్తు మాత్రమే పెరిగే రకం. గంగా స్వీట్ బ్రౌన్‌రైస్: ఇది ఒక అడుగు మాత్రమే పెరుగుతుంది. నష్టం తక్కువ. గింజలు త్వరగా రాలిపడవు. మెడిసినల్ రెడ్‌రైస్: ధాన్యం సాధారణ రంగులో ఉన్నా.. బియ్యం ఎరుపురంగులో ఉంటాయి. ఈ బియ్యంలో 18 రకాల పోషకాలు ఉంటాయి. ఐదేళ్లు దాటినా ఈ ధాన్యం బూజు, దుబ్బ, పురుగు పట్టదు. ఇది దేశవాళీ రకం. కుంకుమ బంతులు (బుడుమ వడ్లు): తెలంగాణలోని నల్లగొండ ప్రాంతానికి చెందినవి. దిగుబడి తక్కువ అయినా బలం ఎక్కువ. గంగా గ్రీన్ బ్లాక్ రైస్: ఇది జపాన్ నాటురకం. ధాన్యం, బియ్యం నల్లగా ఉంటాయి. దిగుబడి ఎక్కువగా వస్తుంది. రిసోట రైస్: ఇది ఇటలీ రకం. ధాన్యం లావుగా గుగ్గిళ్లలా ఉంటుంది. ప్రతి గింజకు ముల్లు ఉంటుంది. రత్నాచోళి: పోషకాలు ఉన్న ఈ బియ్యం తింటే కండరాలు గట్టి పడతాయని చెప్తారు. మాపిళ్లై సాంబ: ఈ బియ్యం తింటే వీర్య కణాలు, అండకణాలు పెరుగుతాయని గంగారాం చెబుతున్నారు. గంగా జపనీ గ్రీన్ బ్లాక్‌రైస్: ఇది 110 రోజుల పంట. ధాన్యం, బియ్యం నల్లగా ఉంటాయి. కర్పూకౌని: ఈ బియ్యం తింటే శరీరంలోని పనికిరాని కొవ్వు కరిగి బరువు తగ్గుతారని చెప్తారు. గంగా రూబీ రెడ్‌రైస్: వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ బియ్యం చిరుధాన్యాలతో సమానం. ఫర్బిడెన్ రైస్: ఇది చైనా రకం. ఈ బియ్యం నీళ్లల్లో వేస్తే వండే పని లేకుండా రెండుగంటల్లో అన్నం అవుతుంది. -
Telangana: సాగులో సరికొత్త ‘వరి’వడి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొందరు రైతులు వరిలో కొత్త రకాల వంగడాలు సాగు చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలతో బ్లాక్ రైస్ (నల్ల ధాన్యం), రెడ్ రైస్, బాస్మతి, కూజ్ పటియాలా, రత్నచోడీ, ఇంద్రాణి.. ఇలా విభిన్న రకాల వరి పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొందరు సేంద్రియ ఎరువులు వాడుతూ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందుతున్నారు. కొన్ని రకాల ధాన్యానికి స్థానికంగా బాగా డిమాండ్ ఉండటంతో వీటి సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. కొందరు పండించిన ధాన్యంలో కొంత ఇంటి అవసరాలకు వాడుకుంటున్నారు. మిగిలింది తెలిసిన వారికి ఇవ్వడంతో పాటు అవసరమైన వారికి విత్తనాలుగానూ అందిస్తున్నారు. మోత్కూరు/హుజూర్‌నగర్‌రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన రైతు దేవరపల్లి విద్యాసాగర్‌రెడ్డి సాధారణంగా తనకున్న 25 ఎకరాల వ్యవసాయ భూమిలో 15 ఎకరాల్లో వరి సాగు చేస్తాడు. వానాకాలం పంటగా పూస బాస్మతి వరిని అర ఎకరంలో సాగు చేశాడు. భువనగిరిలోని ఓ ప్రైవేట్ దుకాణంలో ఈ రకం విత్తనాలను కిలోకు రూ.200 చొప్పున 12 కిలోలు కొనుగోలు చేశాడు. సాధారణ రకం వరి సాగులానే దీనికి కూడా సస్యరక్షణ చర్యలు చేపట్టాడు. మొత్తం మీద అర ఎకరం సాగుకు రూ.10 వేల పెట్టుబడి పెట్టాడు. సుమారు 20 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాడు. కిలో రూ.80 నుంచి రూ.100 పలుకుతుందని ఆశిస్తున్నాడు. లక్కవరంలోనూ.. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన రైతు రణపంగురాజు కూడా ఎకరం పది గుంటల పొలంలో పూస బాస్మతి (1503) సాగు చేశాడు. దీని కోసం రూ.18 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. అయితే తాను అనుకున్న దానికంటే అధికంగా ఎకరానికి 30 బస్తాల చొప్పున దిగుబడి రావడం, మార్కెట్లో బాస్మతికి మంచి గిరాకీ ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కొత్త వంగడాలపై దృష్టి సారించాలి నేను బాస్మతి సాగు చేశా. దిగుబడి తక్కువగా వస్తుందని కొంత మంది రైతులు చెప్పారు. కానీ ధైర్యం చేసి సాగు చేశా. అంచనాలకు మించి దిగుబడి వచ్చింది. రైతులు కొత్తరకపు వరి వంగడాలపై దృష్టి సారించాలి. – రైతు రణపంగురాజు, లక్కవరం బ్లాక్, రెడ్‌తో భారీ లాభాలు చివ్వెంల (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రానికి చెందిన యువరైతు ఇట్టమళ్ల స్టాలిన్ నూతన వరి వంగడాలను సేద్యం చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నాడు. గత సంవత్సరం నుంచి రెండు ఎకరాల్లో బ్లాక్, రెడ్ రైస్ వంగడాలను నాటి ఎకరాకు రూ.1.50 లక్షలు లాభం పొందుతున్నాడు. ఎకరాకు 10 కేజీల వరి విత్తనాలు నారుగా పోసి నాటడంతో పాటు దానికి కావాల్సిన సేంద్రియ ఎరువులు స్థానికంగా సేకరించి వేస్తున్నాడు. ప్రతి పంటకు ఎకరాకు 20–25 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. పండించిన పంటను స్థానికంగా వరి విత్తనాలకు విక్రయిస్తున్నాడు. క్వింటాల్‌కు రూ.10 వేల చొప్పున ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి రైతులు వచ్చి కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక పంట వేస్తూ పెట్టుబడి పోగా ఎకరానికి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు లాభాలు పొందుతున్నాడు. బ్లాక్ రైస్, 1119 జోరు నిడమనూరు/బీబీనగర్: నల్లగొండ జిల్లా నిడమనూరు, సోమోరిగూడెం, నారమ్మగూడెంలలో రైతులు వరిలో బ్లాక్ రైస్, 1119 రకాలను సాగు చేస్తున్నారు. నిడమనూరు మండలంలోని నారమ్మగూడెంలో కొండా శ్రీనివాసరెడ్డి తన వ్యవసాయబూమిలో ఖరీఫ్‌లో బ్లాక్ రైస్ సాగు చేశాడు. 120 నుంచి 130 రోజుల పంట. దీనిలో సన్న, దొడ్డు రకం రెండూ ఉన్నాయి. ఇవి నల్లగా ఉంటాయి. మధుమేహంతో బాధపడుతున్నవారు బ్లాక్ రైస్ బియ్యాన్ని వాడడానికి ఇష్టపడుతున్నారు. మండల కేంద్రానికి చెందిన బొల్లం శ్రీనివాస్‌యాదవ్ అతని సోదరుడు కూడా నిడమనూరులో కొంత, మండలంలోని సోమోరిగూడెంలో ఎకరంలో బ్లాక్ రైస్‌ను సాగు చేశారు. ఈసారి మరిన్ని ఎకరాల్లో.. పంట దిగుబడి బాగానే వస్తుందని అనుకుంటున్న. రెండు ఎకరాల్లో సాగు చేశా. ఇంటి అవసరాలకు పోను తెలిసిన వారికి ఇవ్వాలని అనుకుం టున్నా. గతంలోనూ తెలిసిన వారికి ఇచ్చా. ఎక్కువ మొత్తంలో సాగు చేస్తే మార్కెట్ చేసుకో వాల్సి ఉంటుంది. ఈసారి ఎక్కువ ఎకరాల్లో సాగు చేస్తా. –కొండా శ్రీనివాసరెడ్డి గొల్లగూడెంలో.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బాత్క వెంకటేష్ 20 గుంటల భూమిలో బ్లాక్ రైస్ సాగు చేశాడు. రూ.450 కేజీ చొప్పున విత్తనాలు కొనుగోలు చేశాడు. వరి సాగు మాదిరిగానే మెళుకువలు పాటిస్తూ పంటను పండించాడు. ప్రసుత్తం పంట బాగా రాగా సుమారు 5 అడుగుల ఎత్తున ధాన్యం గొలుసులు పెరిగాయి. మరో 5 రోజుల్లో చేనును కోయనున్నట్లు, పంట బాగా వచ్చినట్లు వెంకటేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇతను బ్లాక్ రైస్ సాగు చేస్తున్నాడని తెలియగానే కొందరు టీచర్లు, ఉద్యోగులు..ధాన్యం తమకు విక్రయించాలని కోరారు. ఈసారి 5 ఎకరాలలో ఈ రకం సాగు చేస్తానని వెంకటేష్ చెబుతున్నాడు, ఒకే రైతు.. పలు రకాలు రాజాపేట: ఎప్పటికీ ఒకే వరి రకం పంటలు సేద్యం చేయకుండా విభిన్న వంగ డాలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమిల గ్రామానికి చెందిన పులి భూపాల్. బ్లాక్ రైస్, రత్నచోడి గుంట, ఇంద్రాణి, మహరాజ, కూజ్ పటియాలా వంటి రకాలను తనకు ఉన్న 10 ఎకరాలకు గాను 3 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. ఇందుకు ఎకరాకు రూ.40 వేల వరకు ఖర్చు చేశాడు. మార్కెట్లో బ్లాక్‌రైస్, నవార్, రత్నచోడీ వంటి వరి ధాన్యానికి డిమాండ్ ఉండటంతో వాటి సాగు చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం బ్లాక్ రైస్ కిలో రూ. 250, నవార్ కిలో రూ.120 చొప్పున సొంతంగా విక్రయిస్తున్నట్లు వివరించాడు. సేంద్రియ పద్ధతిలో బ్లాక్‌రైస్, నవార్ సాగు ప్రస్తుత పరిస్థితుల్లో బ్లాక్‌రైస్, నవార్ వంటి వివిధ రకాల వరి ధాన్యం వైపు ప్రజలు మక్కువ చూపుతున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తే ప్రతి పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కేజీ ధర రూ.220 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. డిమాండ్‌ను బట్టి సొంతంగా మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో వివిధ రకాల వరి ధాన్యం సేద్యం చేస్తున్నా. – పులి భూపాల్ కూజ్ పటియాలాతో ఖుషీ ఆత్మకూరు (ఎం): యాదాద్రి భువనగిరిజిల్లా ఆత్మకూర్ (ఎం) మండలం టి.రేపాక గ్రామానికి చెందిన రైతు బండ యాదగిరి మూడు ఎకరాల్లో కూజ్ పటియాలా రకం సాగు చేస్తున్నాడు. 1010 రకం వడ్లు పండిస్తే సరైన ధర లేక పోవడం, ప్రభుత్వం కొనుగోలు చేయక పోవడం లాంటి సమస్యలు వస్తుండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపాడు. వడ్లను సిద్దిపేటలో ఓ రైతు నుంచి కిలోకు రూ.100 చొప్పున తీసుకువచ్చాడు. పంట కాలం నాలుగు నెలలు. సేంద్రియ పద్ధతిలో వేప నూనె, పంచగవ్వ, స్థానికంగా దొరికే దినుసులతో కషాయాలను తయారు చేసి పంటకు పిచికారీ చేస్తున్నాడు. ఈ రకం వరి పంటతో మంచి లాభం పొందే అవకాశం ఉందని యాదగిరి తెలిపాడు. సేంద్రీయ పద్ధతులు పాటించి సాగు చేయడమే కాకుండా మంచి బలవర్థకమైన, ప్రొటీన్లు, ఔషధగుణాలు కలిగిన ధాన్యం కావడంతో స్థానికంగా ఈ రకానికి బాగా డిమాండ్ ఉంది. ఎకరానికి 50 బస్తాల వరకు దిగుబడి రాగా క్వింటాల్ రూ. 8 వేల చొప్పున అమ్ముతున్నాడు. సాగు విస్తీర్ణం పెంచుతా బాస్మతి వరి సాగు విస్తీర్ణం పెంచుతా. వానాకాలంలో అర ఎకరం సాగు చేశాను. తెగుళ్ల బాధ పెద్దగా లేదు. దిగుబడి ఆశాజనకంగా ఉంది. సుమారు 40 బస్తాల ధాన్యం రావచ్చు. ఇప్పటికే పది మంది రైతులు పొలంలోని బాస్మతి వరి పంటను పరిశీలించారు. వారంతా బాస్మతి సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. – దేవరపల్లి విద్యాసాగర్‌రెడ్డి -
Telangana: యాసంగి వడ్లేవీ కొనం
సాక్షి, హైదరాబాద్: ‘వచ్చే యాసంగి సీజన్‌తో సహా ఏ యాసంగిలోనూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదు. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి. ప్రస్తుత వానాకాలంతో పాటు భవిష్యత్‌లో ఏ వానాకాలం సీజన్లోనైనా ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. అయితే ఎఫ్‌సీఐ ద్వారా ఏ సీజన్లోనూ బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. యాసంగి దొడ్డు వడ్లలో నూక ఎక్కువ ఉంటుందనే కారణంతో ధాన్యం కొనుగోలు బాధ్యతల నుంచి ఎఫ్‌సీఐ తప్పుకున్న తర్వాత ఆ వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం తెగేసి చెప్పింది. ఈ యాసంగిలో పెసలు, మినుములు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలని వినమ్రంగా చెప్తున్నాం’అని వ్యవ సాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి,పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కుండబద్దలు కొట్టారు. శనివారం మంత్రుల నివాస సముదాయంలో ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ‘విత్తన కంపెనీలతో ముందస్తు ఒప్పందం చేసుకుని సాగు చేసే రైతులతో ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని జిల్లాల్లో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుని వరి సాగు చేసే సంప్రదాయం ఉంది. కానీ, ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే నమ్మకంతో సాగు చేయకండి’అని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రైతాంగాన్ని గందరగోళానికి గురిచేయొద్దు.. ‘గత యాసంగిలో మిల్లింగ్ చేసిన 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం నేటికీ తీసుకోలేదు. రైతులను రోడ్ల మీదకు తెచ్చి ధర్నాలు, నిరసనల ద్వారా లబ్ధిపొందాలని కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను క్రమంగా నియంత్రించి కార్పొరేట్లకు అప్పగించే కుట్ర జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర నేతలు తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు చేస్తామనే ఉత్తర్వులను కేంద్రం నుంచి ఇప్పించాలి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు మద్దతిచ్చాం’అని నిరంజన్‌రెడ్డి చెప్పారు. ‘రైతాంగానికి కేంద్రం మేలు చేయాలనుకుంటే కరోనా నేపథ్యంలో చేపట్టిన 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని మరో ఐదారు నెలలు పొడిగించాలి. రాష్ట్రాలు బియ్యం ఎగుమతి చేసుకోవచ్చని కేంద్రం చెప్తోంది, కానీ, బియ్యం ఎగుమతి విధానాలు రాష్ట్రం పరిధిలో ఉండవు. వ్యవసాయ ఉత్పత్తులను కొనాల్సిన బాధ్యత కేంద్రం మీదే ఉంటుంది. తన బాధ్యత నిర్వర్తించకుండా రాష్ట్రాలను బాధ్యులను చేయడం సరికాదు’అని నిరంజన్‌రెడ్డి అన్నారు. పత్తికి ధర తగ్గితే కొనుగోలు కేంద్రాలు... ‘యాసంగిలో ఉష్ణోగ్రతలను తట్టుకునే వరి వంగడాలను రూపొందించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థను కోరాం. ప్రస్తుతం యాసంగిలో సాగుకు సంబంధించి అన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. యాసంగికి అవసరమైన ఎరువుల సరఫరా కోసం త్వరలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిని కలుస్తాం. పంటల సాగులో రైతులకు ఎలాంటి షరతులు పెట్టం. ప్రస్తుతం పత్తి సాగు చేసిన రైతులు ఎంఎస్పీ కంటే అదనపు ధర పొందుతున్నారు. ఎంఎస్పీ కంటే దిగువకు పత్తి ధర పడిపోతే సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. రాష్ట్రంలో సాగునీటి రంగం అభివృద్ధితో పాటు రైతు సంక్షేమానికి సీఎం తీసుకున్న నిర్ణయాలతో ఈ ఏడాది వానాకాలంలో 1.41 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో 62.08 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అయితే ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్న కొన్ని పరిస్థితులను రైతులకు వివరించేందుకు వ్యవసాయ, పౌర సరఫరాల, మార్కెటింగ్ శాఖల అధికారులు ప్రయత్నిస్తున్నారు’అని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. కామారెడ్డిలో ధాన్యం కుప్ప వద్ద రైతు మరణంపై కలెక్టర్ నివేదిక అందిందని, అది సహజ మరణమని పేర్కొన్నారు. కాగా, మిల్లులకు ధాన్యం తెస్తున్న రైతులను నియంత్రించేందుకు స్థానిక అధికారులు టోకెన్లు ఇస్తున్నారని గంగుల వెల్లడించారు. మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్, మార్కెటింగ్ ఓఎస్డీ జనార్దన్‌రావు పాల్గొన్నారు. ధాన్యం కొంటామని ప్రకటిస్తే కాళ్లు పట్టుకుంటా.. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి: ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధమని చెప్పే ధైర్యం బీజేపీ నాయకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు లేదు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రంతో ప్రకటన చేయిస్తే ఆయన కాళ్లు పట్టుకుంటానని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి సహకార సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించి మాట్లాడారు. ఖరీఫ్ ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేకపోవడంతో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ రూ.25 వేల కోట్లు కేటాయించి కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తెలంగాణకు దొంగచాటుగా తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. వచ్చే యాసంగిలో వరి పంట కొనడం సాధ్యంకాదని, రైతులు ఆరు తడి పంటలు వేసుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుతో ఎకరాకు రూ.3 లక్షల వరకు పొందే అవకాశం ఉందని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు, రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అభ్యంతరకరం, అవమానకరం. ఈ విషయంలో కేంద్రం వద్దకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రెండు పర్యాయాలు వెళ్లినా నిర్లిప్తవైఖరే చూపుతోంది. ధాన్యం కొనుగోలు చేస్తే కేంద్రంతో పంచాయితీ ఉండదు. – నిరంజన్‌రెడ్డి ప్రభుత్వపరంగా ధాన్యం కొనుగోలుకు సూర్యాపేట జిల్లాలో 247 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించాం. ఇప్పటి వరకు ఐదు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులు రావడం లేదు. రాష్ట్రంలో కోతలు జరుగుతున్న కొద్దీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. – గంగుల -
యాసంగిలో వరి వద్దు.. ప్రభుత్వం కొనదు: నిరంజన్ రెడ్డి
-
యాసంగిలో వరి వద్దు.. ప్రభుత్వం కొనదు: నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో యాసంగిలో వరి వేయవద్దు.. ప్రభుత్వం కొనలేదని బదనాం వద్దు’’ అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. యాసంగి పంటల సాగుపై ప్రభుత్వ వైఖరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి వరి వడ్లను, బాయిల్డ్ రైస్‌ను భవిష్యత్‌లో ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వ విధానం ప్రకటిస్తున్నాం. యాసంగిలో వరి వేయవద్దు.. దానికి బదులు ఇతర పంటలు వేసుకోవాలి’’ అని తెలిపారు. (చదవండి: కేంద్రం, ఎఫ్‌సీఐ నిర్ణయాన్ని మార్చుకోవాలి) ‘‘విత్తన కంపెనీలతో ఒప్పందం ఉంటే రైతులు యాసంగిలో వరి సాగు చేయవచ్చు. రైస్ మిల్లులతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు వరి వేసుకోవచ్చు. అయితే వీటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అనుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్స్‌పోర్ట్స్ అనుమతులు ఉండవు. రైతుల వద్ద వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రైతులు అర్ధం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి’’ అని నిరంజన్ రెడ్డి తెలిపారు. చదవండి: ‘వరి’ని నిషేధిత జాబితాలో చేర్చారా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు -
ఆర్బీకే స్థాయిలోనే.. ఫాంగేట్ వద్దే ధాన్యం కొనుగోలు: సీఎం జగన్
-
వరి రైతుకు వరం!
సాక్షి, అమరావతి: రైతులు పండించిన పంటకు మంచి ధర లభించేలా ధాన్యం సేకరణ విధానాలను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) స్థాయిలో ఫామ్ గేట్ వద్దే ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. మోసాలు, అవినీతికి తావు లేకుండా పారదర్శక విధానంలో కొనుగోళ్లు జరగాలని ఆదేశించారు. రైతులకు మంచి ధర దక్కేలా ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రను తొలగిస్తున్నామని చెప్పారు. రైతులకు మేలు చేసే కొత్త విధానాన్ని సవాల్‌గా తీసుకుని అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రుల బృందంతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అవగాహన పెంచాలి ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలుండాలని సీఎం జగన్ ఆదేశించారు. తప్పిదాలు, మోసాలు జరగకుండా, వేగంగా చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఇ–క్రాప్ బుకింగ్, ఈ – కేవైసీ నమోదు చేయాలని సూచించారు. వ్యవసాయ సలహా మండళ్లు, వీఏఏలు, వలంటీర్ల ద్వారా రైతుల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని, ఆధార్ నంబర్ ఆధారంగా రైతులకు చెల్లింపులు చేయాలని ఆదేశించారు. కరపత్రాలు, ఆర్బీకేల్లో బోర్డులు ధాన్యం సేకరణపై అవగాహన కల్పించేందుకు ఆర్బీకేలు, వలంటీర్ల ద్వారా ప్రతి రైతు ఇంటికీ వెళ్లి కరపత్రాలను అందజేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ధాన్యం సేకరణ వివరాలతో కూడిన బోర్డులను ఆర్బీకేల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. రైతులు మంచి ధర పొందడానికి వీలుగా తగిన సలహాలు, సూచనలతో కరపత్రాలను రూపొందించాలన్నారు. ఎలాంటి మినహాయింపులు లేకుండా రైతులకు పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధర అందాలని స్పష్టం చేశారు. మిల్లర్ల పాత్ర తొలగింపు ధాన్యం కొనుగోళ్లలో మోసాలను నివారించే చర్యల్లో భాగంగా మిల్లర్ల పాత్రను పూర్తిగా తొలగించామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. రైతుల ముంగిటే ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ధాన్యం సేకరణలో అవకతవకలకు ఏమాత్రం ఆస్కారం ఉండకూడదని, నాణ్యతను నిర్ధారించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సేకరణ అంచనా 50 లక్షల మెట్రిక్ టన్నులు ఖరీఫ్‌లో వరి సాగు, దిగుబడుల అంచనా వివరాలను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు అందజేశారు. 15.66 లక్షల హెక్టార్లలో వరి సాగు చేపట్టగా దాదాపు 87 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా దిగుబడి రావచ్చని అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. 6,884 ఆర్బీకేల పరిధిలో వరి సాగు చేపట్టినట్లు వెల్లడించారు. సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్‌శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, అగ్రి మార్కెటింగ్ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, మార్కెటింగ్ స్పెషల్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, ఏపీఎస్సీఎస్సీఎల్ వీసీ అండ్ ఎండీ జి.వీరపాండ్యన్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
యాసంగి వరిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో వరి సాగుచేస్తే, ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందో, లేదో కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. దొంగదీక్షలు చేసే బీజేపీ రాష్ట్ర నాయకులు యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ప్రధాని, కేంద్ర పెద్దలను ఒప్పించాలని సవాల్ చేశారు. పంజాబ్‌లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణ విషయంలో ఎందుకు వివక్ష చూపుతోందని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. రైతు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటుధర కల్పించడంతోపాటు కొనుగోలు బాధ్యత కూడా కేంద్రానిదేనని అన్నారు. కేంద్రప్రభుత్వం కేవలం మద్దతు ధర ప్రకటించి మిన్నకుండి పోతోందని, తెలంగాణ ప్రభుత్వమే రైతుల సంక్షేమం దృష్ట్యా నష్టాన్ని భరించి కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. పంట వచ్చిన ప్రతిసారి ధాన్యం కొనుగోళ్లపై ఎఫ్‌సీఐని అడుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతోందని విచారం వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరి వ్యవసాయానికి గొడ్డలిపెట్టులా ఉందని విమర్శించారు. కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకుంటుంటే రాష్ట్రంలోని బీజేపీ నాయకులు రాజకీయలబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వరి పంట వేస్తే రైతుబంధు, రైతుబీమా నిలిపివేస్తారని చేస్తున్న ప్రచారం నిరాధారమైనదని, సీఎం కేసీఆర్ బతికున్నంత కాలం ఈ పథకాలు కొనసాగుతాయన్నారు. షర్మిలను అమ్మ అనే పిలిచాను: మంత్రి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల పట్ల చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ‘నేను ఎవరి పేరిటా ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఏకవచనం వాడలేదు. చివరన అమ్మా అని కూడా అన్నాను‘ అని మంత్రి వివరించారు. అయి నా తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగితే విచారం వ్యక్తం చేస్తున్న ట్టు తెలిపారు. ‘షర్మిల నా కుమార్తె కంటే పెద్దది.. నా సోదరి కంటే చిన్నది’ అని పేర్కొన్నారు. తన తండ్రి సమకాలికుడైన సీఎం కేసీఆర్‌ను షర్మిల ఏకవచనంతో సంబోధించడం సంస్కారమేనా అని ప్రశ్నించారు. -
తెలంగాణ: ‘వరి-ఉరి’పై బండి సంజయ్ దీక్ష
సాక్షి, హైదరాబాద్: వరి సాగు, రైతుల సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గురువారం రైతు దీక్ష చేపట్టారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఉదయం 11కు మొదలైన ఈ నిరసన దీక్ష మద్యాహ్నం 2 గంటల దాకా కొనసాగనుంది. వరి వేస్తే రైతుకు ఉరే అనే టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బండి సంజయ్ ఈ దీక్ష చేపట్టనున్నారు. చదవండి: దళిత బంధుపై దాఖలైన 4 పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు కాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారని, రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, రైతు వ్యతిరేక వైఖరి విడనాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వరి-ఉరి ప్రభుత్వ వైఖరిపై ఈ రైతు దీక్ష చేపడుతన్నట్లు తెలిపారు. -
ఆహార ధాన్యాల సాగు.. బాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముగిసింది. చివర్లో ‘గులాబ్’ తుపాను గుబులు పుట్టించినప్పటికీ ఆశించిన స్థాయిలో కురిసిన వర్షాలతో సాగు సజావుగా సాగింది. గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఏడాది విస్తీర్ణంలో కాస్త తగ్గినప్పటికీ ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం మాత్రం కాస్త పెరిగింది. వరితో సహా మిరప, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్, ఉల్లి లక్ష్యానికి మించి సాగయ్యాయి. మొత్తమ్మీద 96.4 శాతం మేర సాధారణ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో నూరు శాతం అధిగమించగా, కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 99 శాతం మేర సాగయ్యాయి. ఇక విశాఖపట్నం మినహా మిగిలిన జిల్లాల్లో 90–96 శాతం మేర అయితే.. విశాఖలో మాత్రం 87 శాతం మేర మాత్రమే పంటలు సాగయ్యాయి. రాయలసీమలో ‘వరి’ సిరులు ఖరీఫ్‌లో వరి సాధారణ విస్తీర్ణం 38.40 లక్షల ఎకరాలు. 2019లో అది 38.15 లక్షల ఎకరాలు అయితే, 2020లో 38.52 లక్షల ఎకరాల్లో సాగయింది. అదే ఈ ఏడాది 39.17లక్షల ఎకరాల్లో సాగైంది. విశాఖ (95 శాతం), శ్రీకాకుళం (96 శాతం), పశ్చిమగోదావరి (97 శాతం) జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో నూరు శాతానికి మించి వరి సాగైంది. అత్యధికంగా రాయలసీమలోని చిత్తూరులో 193 శాతం, వైఎస్సార్ కడపలో 133 శాతం, అనంతపురంలో 125 శాతం, కర్నూలులో 100 శాతం మేర వరి సాగైంది. పెరిగిన మిరప, మొక్కజొన్న, అపరాలు ► గడిచిన సీజన్‌తో పోలిస్తే ఈసారి మిరప, మొక్కజొన్న రికార్డు స్థాయిలో సాగయ్యాయి. ► మిరప దాదాపు 1.24 లక్షల ఎకరాల్లో అదనంగా సాగైంది. దీని సాధారణ విస్తీర్ణం 3.40 లక్షల ఎకరాలైతే.. గతేడాది 3.43 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది ఏకంగా 4.67 లక్షల ఎకరాల్లో సాగైంది. ► ఇక మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలు కాగా.. గతేడాది 2.81 లక్షల ఎకరాల్లో సాగైంది. తొలిసారిగా ఈ ఏడాది 3.08 లక్షల ఎకరాల్లో సాగైంది. ► అపరాల సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. గత ఖరీఫ్‌లో 6.76 లక్షల ఎకరాల్లో సాగైన అపరాలు ఈసారి 7.41 లక్షల ఎకరాల్లో సాగైంది. తగ్గిన వేరుశనగ, పత్తి సాగు ఇక ఖరీఫ్‌లో నూనె గింజల సాధారణ విస్తీర్ణం 18.97 లక్షల ఎకరాలు కాగా.. గత సీజన్లో 19.22 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 17.37 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. గతేడాదితో పోలిస్తే 2 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. అలాగే, గతేడాది 18.41 లక్షల ఎకరాల్లో సాగైన వేరుశనగ ఈ ఏడాది 16.26 లక్షల ఎకరాలకే పరిమితమైంది. 14.73 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన పత్తి 12.86 లక్షల ఎకరాల్లో సాగైంది. -
Telangana: బోరు బావుల కింద వరి సాగుకు చెక్..!
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో బోరు బావుల కింద వరికి బదులుగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిం చాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కమిషనర్ రఘునందన్ రావు మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు. యాసంగి సీజన్లో ఉత్పత్తి చేసిన బాయిల్డ్ రైస్‌ను తెలంగాణ నుంచి తీసుకునే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో ఆ సీజన్లో వరి సాగును పూర్తిగా నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సీఎం కేసీఆర్ సమక్షంలో జరిగిన వ్యవసాయ శాఖ ఉన్నత స్థాయి సమీక్షలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో రైతులను వరి సాగు నుంచి ఎలా మళ్లించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే యాసంగి సీజన్లో బోరుబావుల కింద వరి సాగును నియంత్రించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 26 లక్షల బోరుబావులు ఉన్నాయి. గత యాసంగిలో మొత్తం 53 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఒక్క బోరు బావులు కిందనే 46 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో వరి సాగు నుంచి రైతుల్ని మళ్ళించి పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు సాగు చేసేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. నేటి నుంచి రైతు సదస్సులు మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, కమిషనరేట్‌లోని ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం నుంచి క్షేత్రస్థాయిలో రైతు అవగాహన సదస్సులు ప్రారంభించాలని, ఈ నెలాఖరు కల్లా ముగించాలని డీఏవోలకు సూచించారు. వ్యవసాయ శాఖ నిర్ణయం -
కొనుగోళ్లకు అధిక ప్రా'ధాన్యం'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి. కోవిడ్ ఉధృతి పెరిగిన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ యంత్రాంగమే తమ ముంగిటకు వచ్చి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కోతలు ముందుగా ప్రారంభమైన పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొనుగోళ్లు ఇప్పటికే ఊపందుకున్నాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 6,731 మంది రైతుల నుంచి రూ.181.07 కోట్ల విలువైన 96,916 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. నెల్లూరు జిల్లాలో 3,398 మంది రైతుల నుంచి రూ.90.20 కోట్ల విలువైన 47,807 టన్నులు, ప్రకాశం జిల్లాలో 1,514మంది రైతుల నుంచి రూ.23.52 కోట్ల విలువైన 12,506 టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే సేకరించారు. ఈ మూడు జిల్లాల్లో వారం రోజుల వ్యవధిలోనే రూ.294.79 కోట్ల విలువైన 1,57,229 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రికార్డు స్థాయిలో వరి సాగు చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది రబీలో రికార్డు స్థాయిలో 23,61,937 ఎకరాల్లో వరి సాగయ్యింది. హెక్టారుకు సగటున 7,025 కేజీల చొప్పున సుమారు 66.37 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అందులో కనీసం 45లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న రబీ ధాన్యంతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 48 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. మాసూళ్లను పూర్తి చేసిన రైతులు ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. ‘కృష్ణా’లో అత్యధికంగా 428 కేంద్రాలు ఇప్పటివరకు 50 వేల మంది రైతులు రైతు భరోసా కేంద్రాల్లో తమ పంట వివరాలను నమోదు చేసుకోగా.. వీటికి అనుబంధంగా ఏర్పాటు చేసిన 1,552 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. గ్రేడ్–ఏ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,880, కామన్ వెరైటీ ధాన్యానికి రూ.1,860 చొప్పున కనీస మద్దతు ధర చెల్లిస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 428 కేంద్రాలు ఏర్పాటు చేయగా, తూర్పు గోదావరిలో 373, పశ్చిమ గోదావరిలో 350, నెల్లూరు జిల్లాలో 183, ప్రకాశం జిల్లాలో 144, గుంటూరు జిల్లాలో 67, కడపలో 6, విజయనగరంలో ఒకటి చొప్పున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది లేకుండా.. వరుసగా రెండో ఏడాది కూడా సాగునీరు పుష్కలంగా ఇవ్వడంతో గత రబీతో పోలిస్తే ఈ ఏడాది రబీలో సాగు విస్తీర్ణం పెరిగింది. మంచి దిగుబడులొస్తాయని అంచనా వేశారు. కోతలు ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కొనుగోలు సమయంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కరోనా సాకుతో దళారులు చెప్పే మాయమాటల్ని నమ్మి రైతులెవరూ మోసపోవద్దు. కనీస మద్దతు ధర కంటే ఒక్క రూపాయి తక్కువకు కూడా ఏ ఒక్కరూ ధాన్యాన్ని అమ్ముకోవద్దు. సకాలంలో చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – కోన శశిధర్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ -
సాగు లక్ష్యం 24.03 లక్షల హెక్టార్లు
సాక్షి, అమరావతి: అధికారికంగా ప్రారంభమైన రబీ సీజన్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రణాళికను ఖరారు చేసింది. 24.03 లక్షల హెక్టార్లలో ఈసారి పలు రకాల పంటల్ని సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఏడాది కన్నా 33 వేల హెక్టార్లు ఎక్కువ. రబీకి పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. రబీకి సంబంధించిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసింది. మేలైన ఎరువులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల నుంచే ఆర్డరు చేసుకునేలా వ్యవసాయ శాఖ పెద్దఎత్తున రైతుల్లో అవగాహన కల్పిస్తోంది. రబీ సాగు ప్రణాళిక ఇలా.. రబీ సీజన్ అక్టోబర్ నుంచి అధికారికంగా మొదలైంది. ఈ సీజన్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. ఈ సీజన్లో ప్రధానంగా పండించే పంటల్లో వరి, శనగ, పెసర, మినుము, మొక్కజొన్న, పొగాకు తదితర పంటలున్నాయి. 8.05 లక్షల హెక్టార్లలో వరిని సాగు చేయించడం ద్వారా 57.12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. 4.03 లక్షల హెక్టార్లలో శనగ, 3.85 లక్షల హెక్టార్లలో మినుము, 1.36 లక్షల హెక్టార్లలో పెసర, 70 వేల హెక్టార్లలో పొగాకు సాగు విస్తీర్ణంగా ఉంది. ఆర్బీకేల వద్ద సబ్సిడీ విత్తనాలు గ్రామాలలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల నుంచే మేలైన విత్తనాలు, ఎరువులు తీసుకుంటే భరోసా ఉంటుందని ఏపీ సీడ్స్, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాయి. ముందుగా పరీక్షించిన విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ రైతులకు సరఫరా చేస్తుంది. రబీలో రైతులకు సరఫరా చేసేందుకు విత్తనాభివృద్ధి సంస్థ 4,08,151 క్వింటాళ్ల వివిధ రకాల వంగడాలను సిద్ధం చేసింది. ఇందులో చిరుధాన్యాలైన కొర్ర, ఊద, అరిక, సామ, ఆండ్రు కొర్రలు వంటివి కూడా ఉన్నాయి. ఎరువుల పరిస్థితి రబీ సీజన్‌కు కావాల్సిన మొత్తం ఎరువులు 25.04 లక్షల టన్నులు ఉండొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఏయే నెలలో ఎంతెంత అవసరం ఉంటుందో అంచనా వేసి ఆ మేరకు సిద్ధం చేసింది. అక్టోబర్ నుంచి మార్చి వరకు 10 లక్షల టన్నుల యూరియా, 2.50 లక్షల టన్నుల డీఏపీ, 2 లక్షల టన్నుల మ్యూరేట్ పొటాషియం, 9 లక్షల టన్నుల కాంప్లెక్స్, లక్షన్నర టన్నుల ఎస్ఎస్పీ (సింగిల్ సూపర్ ఫాస్పేట్), 4 టన్నులు ఇతర ఎరువులు కావాల్సి ఉంటాయని భావిస్తోంది. -
మూడో పంట పండింది
జనగామ: వరి సాగు ఏడాదికి ఎన్నిసార్లు సాగు చేస్తారని అడిగితే ఎవరైనా రెండు సార్లు అంటూ సమాధానం చెబుతారు. కానీ జనగామ జిల్లా రైతులు మాత్రం మూడుసార్లు సాగు చేస్తామని అంటారు. ఏటా రబీ, వానాకాలం సాగు మధ్యలో కత్తెర పంటను సాగుతో అదనపు ఆదాయం సాధిస్తారు. మూడో పంట (కత్తెర) సాగుకు అనుకూలమైన నేలలు ఉండటంతో రైతులకు కలసి వస్తుంది. ఏప్రిల్ చివరి వారం నుంచి సాగు పనులు మొదలుపెట్టి, ఆగస్టు మొదటి వారంలో కోతలను ప్రారంభిస్తారు. ఈసారి గోదావరి జలాల పరుగులతో పాటు జోరుగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరగడంతో జిల్లాలో సుమారు 30 వేల ఎకరాలకు పైగా కత్తెర పంట సాగు చేయగా, 54 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. కొనుగోళ్లు ప్రారంభం కత్తెర పంటకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న జనగామ జిల్లాలో ఆగస్టు 24వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యా యి. ఎకరాకు 30 బస్తాలకుపైగా దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పది వేల బస్తాలకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు అంచనా. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కొనుగోళ్లకు అనుమతులు లేకపోవడంతో ప్రైవేట్ వ్యా పారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత ఆధారంగా క్వింటా ధాన్యానికి రూ.1,220 నుంచి రూ.1440 వరకు ధర లభిస్తోంది. -
ఖరీఫ్‌కు సమృద్ధిగా వంగడాలు
‘సేద్య’మేవ జయతే అంటూ సర్కారు నినదిస్తోంది. కర్షక వీరుల అవసరాలు తీర్చేందుకు నేనున్నానంటూ ఉరకలేస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులకు ఎన్నో సేవలతోపాటు ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తామని ప్రకటించింది. ఇప్పటికే వరి విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నకిలీ విత్తనాల నుంచి అన్నదాతలను కాపాడేందుకు నాణ్య మైన విత్తనాలు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. ఆకివీడు: ఖరీఫ్ వరి సాగుకు విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు చేపట్టింది. ఇప్పటికే వంగడాలను ఏపీ సీడ్స్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం పెరగనుంది. చెరకు సాగు తగ్గడంతో ఆయా ప్రాంతాల్లో వరి సాగు చేపట్టేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో సాధారణ ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 2.20 లక్షల హెక్టార్లు కాగా, ఈ సారి అదనంగా మరో 5 వేల హెక్టార్లలో సేద్యానికి రైతులు సిద్ధమవుతారని వ్యవసాయాధికారుల అంచనా. మొత్తం మీద 2.25 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు జరగనుంది. దీనికి 1.12 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. రైత్వారీగా 85 శాతం విత్తనాలను సమకూరుస్తుండగా, మరో 15 శాతం విత్తనాభివృద్ధి సంస్థలు, ఏపీ సీడ్స్ ద్వారా ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది. 936 ఆర్బీకేల ద్వారా విత్తనాలు సరఫరా రైతులకు విశిష్ట సేవలందించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం 936 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాల్లో ఇప్పటికే సుమారు 5,215 క్వింటాళ్ల విత్తనాల కోసం రైతులు ఇండెంట్లు పెట్టారు. దీనిలో 3,092 క్వింటాళ్లు ఆయా కేంద్రాలకు సరఫరా చేయగా వాటిని రైతులకు రాయితీపై ఇప్పటికే అందించారు. మెట్ట ప్రాంతంలో నాట్లు ప్రారంభించగా, డెల్టా ప్రాంతంలో నారుమళ్లు సిద్ధమవుతున్నాయి. ఖరీఫ్ సాగు వంగడాలు ఇవే.. ఖరీఫ్‌లో సాగుకు అనుకూలమైన వంగడాలపై ఈ ఏడాది ప్రభుత్వం, అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం నిర్దేశించిన వెరైటీలు సాగు చేస్తే మద్దతు ధర లభిస్తుందని సూచించారు. దీనికనుగుణంగా రైతులు ఖరీఫ్‌లో ఎంటీయూ–1061, 1064, 1121, 7029(స్వర్ణ), 1121, 5204(బీపీటీ), 3291(సోనా మసూరి) వంగడాలను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎంటీయూ–1010, 1156, 1075, 1001, 20471 రకాలతోపాటు సంపద స్వర్ణ వంగడాన్ని సాగు చేయొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. సబ్సిడీ వర్తించని రైతులకూ విత్తనాలు.. సబ్సిడీ వర్తించని రైతులు కూడా ఆర్బీకేల నుంచి వరి విత్తనాలను కొనే అవకాశం ప్రభుత్వం కలి్పంచింది. పూర్తి ధరకు నాణ్యమైన విత్తనాలను కొనవచ్చని స్పష్టం చేసింది. ఆర్బీకేల్లోని కియోస్‌్కల నుంచిగాని, గ్రామ వ్యవసాయ సహాయకుల నుంచిగానీ ఆర్డర్ చేసిన 48 గంటల్లో రైతు ఇళ్ల ముంగిటకే విత్తనాలు సరఫరా చేసేలా ఏపీ సీడ్స్ ఏర్పాట్లు చేసింది. నాణ్యమైన విత్తనాలు ఆర్బీకేల నుంచే అందించి నకిలీ విత్తన వ్యాపారులకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. నాణ్యమైన పంట పండించండి రైతులకు నాణ్యమైన విత్తనాలను ఏపీ సీడ్స్ ద్వారా సబ్సిడీపై అందజేస్తున్నాం. విత్తనాల దగ్గర నుంచి పంట పండించే వరకూ ప్రభుత్వమే పెట్టుబడులు పెడుతుంది. నాణ్యమైన పంట పండించి ఇవ్వండి. మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. – పీవీఎల్ నర్శింహరాజు, వైఎస్సార్ సీపీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి విత్తనాలు బాగున్నాయి ప్రభుత్వం సబ్సిడీపై నాణ్యమైన విత్తనాల్ని అందజేసింది. విత్తు నాణ్యమైనదైతేనే దిగుబడి బాగుంటుంది. మంచి పంట పండించడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించడం ఎంతో ఆనందంగా ఉంది. సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. – సలాది నాగకళ్యాణ్, రైతు, విస్సాకోడేరు, పాలకోడేరు మండలం అధికంగా విత్తనాల సరఫరా ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనం అందజేయడమే కాకుండా గతంలో కంటే అధికంగా విత్తనాలను çసబ్సిడీపై అందిస్తున్నాం. 5,215 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని రైతులు ఆర్బీకేలో రిజి్రస్టేషన్ చేయించుకున్నారు. దానిలో 3,092 క్వింటాళ్ల వరి విత్తనాలు సరఫరా చేశాం. గతంలో 1000 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే రైతులు కొనేవారు. – ఎండీ గౌసియాబేగం, వ్యవసాయ సంచాలకులు, పశ్చిమగోదావరి -
పత్తి వేస్తే పంట పండినట్టే!
సాక్షి, హైదరాబాద్: పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే రాష్ట్రంలో వానాకాలం, యాసంగి కలిపి ఏడాదికి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేయాలని వ్యవసాయ రంగ నిపు ణులు ప్రభుత్వానికి, రైతులకు సూచించారు. ఇక వరి కంటే పత్తి పంటే లాభదాయకమని తేల్చి చెప్పారు. తెలంగాణలో వానాకాలం పంటగా 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో కందులు వేయడం మం చిదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శుక్రవారం వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగ నిపుణులు చేసిన ముఖ్యమైన సూచనలివీ... వరిని ఎక్కువగా పండించడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర అవసరాలు, బియ్యం మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో రెండు పంటలకు కలిపి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పండించాలి. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేస్తే రైతుకు ధర రాదు. ఈ 65 లక్షల ఎకరాల్లో సన్న, దొడ్డు రకాలు కలిపి వానాకాలంలో 40 లక్షల ఎకరాలు, యాసంగిలో 25 లక్షల ఎకరాలు సాగు చేయాలి. వరితో పోల్చుకుంటే పత్తి సాగు చాలా లాభదాయకం. కాల్వల ద్వారా వచ్చే నీటితో పత్తిని సాగు చేస్తే ఎక్కువ దిగుబడితోపాటు నాణ్యమైన పత్తి వస్తుంది. వరిలో ఎకరానికి 30 వేల నికర ఆదాయం వస్తే, పత్తి పంటకు ఎకరానికి అన్ని ఖర్చులు పోను 50 వేల వరకు ఆదాయం వస్తుంది. తెలంగాణలో 65 నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు చేయడం శ్రేయస్కరం. కందులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెలంగాణలో వర్షాకాలం పంటగా కందులను 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో సాగు చేయడం ఉత్తమం. వర్షాకాలంలో మక్కలు పండించకపోవడం చాలా మంచిది. వర్షాకాలంలో మక్కల దిగుబడి ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే వస్తుంది. అదే యాసంగిలో 40 నుంచి 45 క్వింటాళ్ల వరకు ఉంటుంది. మక్కలకు మార్కెట్లో డిమాండ్ కూడా అంతగా లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ అవసరాలకు తగినట్టు యాసంగిలో మాత్రమే మక్కలు సాగు చేసుకోవడం మంచిది. 18న సీఎం వీడియో కాన్ఫరెన్స్... వ్యవసాయరంగ నిపుణులు చేసిన సూచనలపై ప్రభుత్వం చర్చించిన తర్వాత నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసే విధానాన్ని ఖరారు చేస్తుంది. అనంతరం సమగ్ర వ్యవసాయ విధానం, పంటల సాగు పద్ధతులపై క్షేత్రస్థాయి అధికారులు, రైతుబంధు సమితులతో ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. వాస్తవానికి శుక్రవారం ఈ వీడియో కాన్ఫరెన్స్ జరగాల్సి ఉండగా.. అది ఈ నెల 18కి వాయిదా పడింది. -
వరిలో కలుపు తీసే పరికరం
వరి సాగు చేస్తూ కలుపుతీతకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి ఇంటర్ విద్యార్థి సులభంగా కలుపుతీసే పరికరాన్ని అతి తక్కువ ఖర్చుతో రూపొందించి ఇంజనీర్లను సైతం అబ్బురపరుస్తోంది. కోల్‌కతాలోని విజ్ఞానభారతి సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో వ్యవసాయం విభాగంలో ఈ పరికరానికి ప్రధమ బహుమతి లభించింది. ప్రశంసాపత్రం, జ్ఞాపికతోపాటు రూ. 11 వేల నగదు బహుమతిని అందుకున్న అశోక్ రాష్ట్రపతి భవన్లో జరిగే ఆవిష్కరణల ఉత్సవానికి ఎంపికైన నలుగురిలో ఒక్కరుగా నిలవడం విశేషం. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే. తారకరామారావు తదితరుల ప్రశంసలను సైతం అశోక్ అందుకున్నాడు. సృజనాత్మక పరికరం ఆవిష్కరణతో పిన్న వయసులోనే తన ప్రత్యేకతను చాటుకున్న ఆ విద్యార్థి పేరు గొర్రె అశోక్. ఊరు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని అంజలిపురం. మూడెకరాల రైతు గొర్రె నాగరాజు, సావిత్రి దంపతుల కుమారుడైన అశోక్ దేవరకొం డ పట్టణంలో ఒకేషనల్ జూనియర్ కాలేజీలో వ్యవసాయం కోర్సు రెండో సంవత్సరం చదువుతున్నాడు. నాగరాజు తనకున్న మూడెకరాలతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నారు. వరి మాగాణుల్లో కలుపు తీసే వారికి నడుము నొప్పి సమస్యగా మారింది. నడుము వంచాల్సిన పని లేకుండా నిలబడే ముదురు కలుపును సమర్థవంతంగా తీయటం ఎలా? అని అశోక్ ఆలోచించాడు. దీనికి ఏదైనా పరికరం రూపొందించి తమ తల్లిదండ్రులతోపాటు ఇతర రైతులు, వ్యవసాయ కార్మికులు సులువుగా పనులు చేసుకునేందుకు తోడ్పడేలా ఏదైనా పరికరం తయారు చేయాలనుకున్నాడు. ‘నేను తప్ప అందరూ ఇంజినీర్లే’ కోల్‌కతాలో జరిగిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో వ్యవసాయం విభాగంలో 120కి పైగా ప్రాజెక్టులను ప్రదర్శించారు. అందులో అశోక్ రూపొందించిన కలుపు తీత పరికరానికి ప్రథమ బహుమతి లభించింది. ‘అక్కడికి వచ్చిన వారందరూ బీటెక్ చదివిన వారే. నేను ఒక్కడినే ఇంటర్ విద్యార్థిని. అయినా నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం, ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ప్రత్యేక ప్రశంసలు తనకు ఎంతో ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగించాయ’ని అన్నాడు అశోక్. తనతోపాటు సైన్స్ ఫెస్టివల్లో పాల్గొనవారు కొందరు సెన్సార్లు అమర్చిన యంత్రాలను తయారు చేశారని, 30–40 వేల రూపాయల ఖరీదైన యంత్ర పరికరాలు తయారు చేశారని అంటూ.. మన దేశంలో 65 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులేనని, అంత ఖరీదైన యంత్ర పరికరాలను మన చిన్న రైతులు ఎలా ఉపయోగించగలరని అశోక్ ప్రశ్నిస్తున్నాడు. ఒంటి చేత్తో కలుపు తీయవచ్చు కూలీలు వరి నాట్లు వేసేటప్పుడు సాళ్లు సాఫీగా రావు, గజిబిజిగా వస్తాయి. అలాంటప్పుడు యంత్రాలతో కలుపు నిర్మూలన సాధ్యం కాదు. తాను తయారు చేసిన పరికరంతో సాళ్లు సరిగ్గా పాటించని వరి పొలంలో కూడా నిలబడి, ఒంటి చేత్తోనే సునాయాసంగా తీసేయవచ్చని, ముఖ్యంగా ముదురు కలుపు మొక్కలను సైతం సులువుగా నిర్మూలించవచ్చని అశోక్ తెలిపాడు. రూ. 250ల తోనే ఈ పరికరాన్ని సుమారు నెల రోజుల క్రితం తయారు చేశానన్నాడు. సైకిల్ బ్రేక్, ఐరన్ రాyŠ (చిన్నపాటి సీకు), ఇనుప కట్టర్లను ఉపయోగించి కలుపు తీత పరికరాన్ని రూపొందించాడు. ఇవన్నీ కూడా స్వల్ప ఖరీదైనవే కాకుండా, పాత ఇనుప సామాన్ల దుకాణాల్లో కూడా దొరుకుతాయన్నాడు. ఒక బ్లేడ్ కిందకు, మరో బ్లేడ్ పైకి ఉండేలా ఏర్పాటు చేయడం వల్ల.. ఈ బ్లేడ్ల మధ్యలో కలుపు మొక్కను ఉంచినప్పుడు కలుపు మొక్క తెగిపోకుండా వేర్లతో సహా పీకడానికి అవకాశం ఉంటుందన్నాడు. సాధారణంగా ముదురు కలుపు మొక్కలను చేతులతో పట్టుకొని పీకినప్పుడు వ్యవసాయ కూలీల చేతులు బొబ్బలు పొక్కుతుంటాయని, తాను రూపొందించిన పరికరంతో ఆ సమస్య ఉండబోదన్నారు. ఇది మూడో ఆవిష్కరణ అశోక్ ఇప్పటికి మూడు ఆవిష్కరణలు వెలువరించాడు. చెవిటి వారికి ఉపయోగపడే అలారాన్ని తయారు చేశాడు. అదేమాదిరిగా, చిన్న రైతులకు నాలుగు రకాలుగా ఉపయోగపడే యంత్ర పరికరాన్ని తయారు చేశాడు. ఇది పత్తి, మిరప పొలాల్లో కలుపు తీయడానికి, విత్తనాలు విత్తుకునే సమయంలో అచ్చు తీయడానికి, ఆరబోసిన ధాన్యాలను కుప్ప చేయడానికి, కళ్లాల్లో గడ్డిని పోగు చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ధర రూ. 2 వేలు. అయితే, అప్పట్లో తన ఆవిష్కరణలను ఎవరికి చూపించాలో తెలియలేదన్నాడు. మూడో ఆవిష్కరణను వెలువరించడం, ప్రాచుర్యంలోకి తేవడానికి చాలా మంది తోడ్పడ్డారని అన్నాడు. నల్లగొండ జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, సికింద్రాబాద్‌లోని స్వచ్ఛంద సంస్థ పల్లెసృజన సహకారంతోనే తన ఆలోచనలను ఆచరణలోకి తెచ్చి, ప్రదర్శనలకు తీసుకువెళ్లగలిగానని అశోక్ కృతజ్ఞతలు తెలిపాడు. వరిలో కలుపు తీసే పరికరం(ధర రూ. 250) కావాలని 16 ఆర్డర్లు వచ్చాయన్నాడు. సెలవు రోజుల్లో వీటిని తయారు చేసి వారికి అందిస్తానని అశోక్ (86885 33637 నంబరులో ఉ. 7–9 గం., సా. 5–9 గంటల మధ్య సంప్రదించవచ్చు) వివరించాడు. – కొలను రాము, సాక్షి, చందంపేట, నల్లగొండ జిల్లా -
సిరులు పండాయి!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి రికార్డు స్థాయిలో ఉత్పత్తి అవుతుందని సర్కారు అంచనా వేస్తోంది. 21 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టే దిశగా వరి ఉత్పత్తి కానుందని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది 20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టగా, ఇప్పుడు దాన్ని కూడా దాటేస్తుందని అధికారులు అంచనా. గత ఖరీఫ్‌లో 61.55 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాగా, ఈ ఖరీఫ్‌లో 66.07 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కానుందని వెల్లడించాయి. 2019–20 ఖరీఫ్ సీజన్ గత నెలాఖరుతో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ పంటల మొదటి ముందస్తు అంచనా నివేదికను అర్థ గణాంక శాఖ తాజాగా విడుదల చేయగా, వివరాలను వ్యవసాయ శాఖ వర్గాలు విశ్లేషించాయి. ఈ ఏడాది 28.75 లక్షల ఎకరాల్లో నాట్లు పడతాయని, 59.57 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ తన ప్రణాళికలో ప్రకటించింది. కానీ నైరుతి రుతుపవనాలతో పెద్ద ఎత్తున వర్షాలు కురవడం, జలాశయాలు, చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లడంతో 31.67 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. దీంతో వరి రికార్డులను బద్దలుకొట్టనుంది. పత్తి ఉత్పత్తి కూడా భారీనే... ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, 1.10 కోట్ల ఎకరాల్లో సాగయ్యింది. అందులో అత్యధికంగా పత్తి సాగైంది. దాని సాధారణ సాగు విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 46.48 లక్షల ఎకరాల్లో (108 శాతం) సాగైంది. పప్పు ధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా... 9.42 లక్షల (91 శాతం) ఎకరాల్లో సాగు చేశారు. పత్తి గతేడాది 41 లక్షల బేళ్లు ఉత్పత్తి కాగా, ఈసారి 45.93 లక్షల బేళ్లు ఉత్పత్తి అవుతుందని సర్కారు అంచనా వేసింది. మొక్కజొన్న 13.79 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని పేర్కొంది. ఇక కందులు 7.11 లక్షల ఎకరాల్లో సాగు కాగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రానున్నట్లు పేర్కొంది. జొన్నలు 42 వేల మెట్రిక్ టన్నులు, పెసర 45 వేల మెట్రిక్ టన్నులు, వేరుశనగ 30 వేల మెట్రిక్ టన్నులు, సోయాబీన్ 2.82 లక్షల మెట్రిక్ టన్నులు, పసుపు 3.14 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కానుందని అంచనా వేసింది. ఉత్పత్తి పెరుగుతుం డటంతో సర్కారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై దృష్టి సారించింది. దీని ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలని నిర్ణయిం చారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు. మరోవైపు నైరుతి సీజన్లో కురిసిన వర్షాలతో రబీ సీజన్ కూడా ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. -
దిగుబడికి దెబ్బే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 670 మండలాలకుగాను 394 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఈ ప్రభావం పంట దిగుబడులపై కూడా ఉంటుందని వ్యవసాయ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ.. రెండు సీజన్లలో కలిపి 186.41 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం కాగా అందులో ఒక్క ఖరీఫ్‌లోనే అత్యధికంగా 98.07 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం, అదును తప్పి కురుస్తున్న వర్షాలతో పంటల సాగు గాడి తప్పింది. ఫలితంగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. అలాగే, రాష్ట్రంలో చిరుధాన్యాలు, నూనె గింజల పంటల పరిస్థితి కూడా ఇంతే. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయడానికి ఏం చేయాలో అర్ధంకాక వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు తలలుపట్టుకుంటున్నారు. దిగుబడి తగ్గితే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ప్రస్తుతం ఉన్న 30 శాతం వ్యవసాయ రంగం వాటా తగ్గి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆహార సంరక్షణ రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో 16.55 శాతం అధికంగా వృద్ధి సాధించడం సాధ్యమయ్యే పనిగా కనిపించడంలేదు. ప్రధాన పంటల పరిస్థితి ఇలా.. వ్యవసాయ, అనుబంధ రంగాలలో గుర్తించిన 23 అభివృద్ధి సూచికలలో 9 పంటల్ని ఎంపిక చేశారు. వాటిలో వరి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, ప్రత్తి, చెరకు, పొగాకు ఉన్నాయి. అయితే, వీటిల్లో ప్రస్తుతం ఏ ఒక్క పంట కూడా సరిగ్గాలేదు. 2018–19లో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 186.41 లక్షల మెట్రిక్ టన్నులు. గత ఏడాదితో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ. వరిలో 14 శాతం, మొక్కజొన్నలో 15 శాతం, అపరాలలో 33 శాతం, నూనె? గింజల్లో 30 శాతం పెరుగుదల నమోదు చేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటికే రాయలసీమలో ప్రధాన పంట అయిన వేరుశనగ గాడి తప్పింది. ఇప్పటికే తొలిదశలో పంట దెబ్బతింది. ప్రస్తుత ఖరీఫ్‌లో వేరుశనగ దిగుబడిని 10.28 లక్షల టన్నులుగా అంచనా వేసినా అది ఇప్పుడు 2–3 లక్షల టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదు. భారీగా తగ్గనున్న దిగుబడి ఇదిలా ఉంటే.. ఖరీఫ్‌లో మొత్తం 98.07 లక్షల టన్నుల దిగుబడి లక్ష్యం కాగా.. ప్రస్తుత అంచనాల ప్రకారం దాదాపు 20 లక్షల టన్నులకు పైగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షాధార పంటలు సాగుచేసే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పంట ఉత్పత్తులు చేతికి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇక్కడ వర్షాభావంతో వేసిన పంటలు వేసినట్టే ఎండిపోతున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా యావత్తు తీవ్ర లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటోంది. తుపానో, వాయుగుండమో వస్తే తప్ప ఇక్కడి పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశంలేదు. రాయలసీమలో ప్రధాన ఖరీఫ్ పంట వేరుశనగను సుమారు 9.25 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉంటే అధికారిక లెక్కల ప్రకారమే 6.60 లక్షల హెక్టార్లలో విత్తనాలు పడ్డాయి. అయితే, ఈ పంటలో మూడొంతులు వాడు ముఖం పట్టింది. ఫలితంగా దిగుబడి లక్ష్యం 10.28 లక్షల మెట్రిక్ టన్నులు నెరవేరే సూచనలు కనిపించడంలేదు. అపరాలదీ అదే పరిస్థితి. వరి సాగు విస్తీర్ణం కూడా లక్ష్యానికి దూరంగానే ఉంది. వరి పంట చేతికి రావడానికి ఇంకా చాలా సమయం ఉన్నందున దిగుబడులు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. దేశంలో 7.3మిలియన్ టన్నుల అధిక దిగుబడి గత ఏడాది కంటే ఈ ఏడాది దేశంలో ఆహార ధాన్యాల దిగుబడి 284.80 మిలియన్ టన్నులకు చేరే అవకాశముందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత ఏడాది కంటే ఇది 7.3 మిలియన్ టన్నులు ఎక్కువని కేంద్రం చెబుతుంటే రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వరుస కరువులతో రైతులు అల్లాడుతున్నారు. దిగుబడులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు భావిస్తున్నారు. దేశంలో చిరు ధాన్యాల ఉత్పత్తి గత ఏడాది కంటే 7.3 శాతం, అపరాలు 9 శాతం పెరిగితే రాష్ట్రంలో ఈ పంటలు సైతం తిరోగమనంలో ఉండడం గమనార్హం. -
జీలుగ చేనులో నేరుగా వరి!
దుక్కి చేసుకున్న పొలంలో వరి విత్తనాన్ని ట్రాక్టర్‌కు అనుసంధానించిన సీడ్ డ్రిల్‌తో నేరుగా విత్తడం(డైరెక్ట్ సీడింగ్) తెలిసిందే. వరి సాగులో శ్రమను, ఖర్చును చాలా వరకు తగ్గించడానికి.. కాలువ నీరు ఆలస్యంగా వచ్చినప్పుడు సీజన్ దాటిపోకుండా చూడటానికి.. వరి నాట్ల కాలంలో కూలీల కొరతను అధిగమించడానికి కూడా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. అయితే, పచ్చి రొట్ట ఎరువు పంటైన జీలుగను విత్తి 25 రోజుల తర్వాత.. అదే పొలంలో నేరుగా వరి విత్తనాన్ని విత్తుకునేందుకు ఉపకరించే హేపీ సీడర్‌ను పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించింది. ప్రెస్ వీల్ టెక్నాలజీతో ఈ హేపీ సీడర్ తయారైంది. వరి విత్తనాన్ని భూమిలో సాళ్లుగా వేయడంతోపాటు.. జీలుగ మొక్కలు ముక్కలు ముక్కలై వరి సాళ్ల మధ్య ఆచ్ఛాదనగా వేయడం హేపీ సీడర్ ప్రత్యేకత. పంజాబ్‌లోని ముక్త్సర్ జిల్లా గోనియాన కృషి వికాస కేంద్రంలో 2016 రబీలో దీన్ని తొలిగా పరీక్షించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని కేవీకే అసోసియేట్ డైరెక్టర్ (శిక్షణ) డాక్టర్ నిర్మల్జిత్ సింగ్ ధాలివాల్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 2017లో 80 ఎకరాల్లో దీని ద్వారా నేరుగా వరి విత్తనాన్ని విత్తినప్పుడు కూడా మంచి ఫలితాలు వచ్చాయి. పంజాబ్‌లో రైతులు విరివిగా వాడుతున్నారు. ప్రెస్వీల్ టెక్నాలజీతో కూడిన ఈ సీడ్ డ్రిల్‌తో రోజుకు 6–7 ఎకరాలు విత్తవచ్చు. ఖరీదు రూ. 2 లక్షల వరకు ఉంటుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కృషి విజ్ఞాన కేంద్రాలు దీన్ని ప్రయోగాత్మకంగా వినియోగించదలచుకుంటే తాము సాంకేతిక సహాయాన్ని అందిస్తామని డా. నిర్మల్జిత్ సింగ్ (98556 20914) చెప్పారు. kvkmuktsar@pau.edu -
ఒకటికి ఏడు పనులు చేసే యంత్రం
వరి సాగులో నాటు దగ్గరి నుంచి వివిధ దశల్లో అనేక పనులను ఒకే ఒక్క చిన్నపాటి యంత్రంతో చేయగలిగితే? అది నిజంగా అద్హుతమే. వరి సాగు ఖర్చులు తలకు మించిన భారంగా పరిణమిస్తున్న ఈ తరుణంలో రైతుకు నిజంగా వరమే అవుతుంది. కన్నూరు(కేరళ)లోని సెయింట్ థామస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు ఒకటికి ఏడు పనులను చేసే ఇటువంటి అద్భుత యంత్రాన్ని ఇటీవల ఆవిష్కరించారు. వరి పొలంలో దమ్ము చేయటం, వరి నాట్లు వేయడం నుంచి పొలంలోకి నీరు తోడటం, వరి కోతలు కోయడం, ధాన్యం నూర్పిడి చేయడం, తూర్పారబట్టడం, ధాన్యాన్ని బియ్యంగా మార్చడం.. వంటి ఏడు రకాల పనులను ఈ ఒక్క యంత్రం చేసేస్తుంది. మెకానికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు అభిషై, లిపిన్, రిజున్, అక్షయ్ బృందం ఈ యంత్రానికి రూపకల్పన చేసింది. అభిషై బృందం స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేసి పేటెంట్ కోసం ధరఖాస్తు చేసింది. ఈ బహుళ ప్రయోజనకర వ్యవసాయ యంత్రం బ8రువు మొత్తం కలిపితే 624 కిలోలు మాత్రమే. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తేగల పారిశ్రామికవేత్త కోసం వెదుకుతున్నామని అభిషై ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఏదేమైనా 4 నెలల్లో రైతులకు అందుబాటులోకి తేవాలని ఆశిస్తున్నామన్నారు. వరి రైతుకు ఖర్చు తగ్గి నికరాదాయం మూడు రెట్లు పెరుగుతుందన్నారు. వానపాముల మాదిరిగా రైతుకు ఎంతో మేలు చేసే ఈ యంత్రానికి ‘మన్నిర’(మళయాళంలో వానపాము) అని పేరు పెట్టామని అభిషై(80758 36523, 94951 24870) ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 15 హెచ్‌పి సామర్థ్యం గల పాత ఇంజిన్‌ను ఉపయోగించి ప్రొటోటైప్‌ను రూపొందించారు. కొత్త ఇంజిన్‌తో తయారు చేస్తే ఈ డీజిల్ యంత్రం ఖరీదు రూ. 2.5 లక్షల వరకు ఉండొచ్చట. రైతుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్న ఈ యువ ఇంజినీర్లకు ‘సాక్షి’ జేజేలు పలుకుతోంది! యంత్రాన్ని ఆవిష్కరించిన విద్యార్థుల బృందం -
గజగిరిగుట్టలో రాతి మనిషి గుట్టు!
సాక్షి, హైదరాబాద్: 4,000 ఏళ్ల క్రితం రాతియుగం మనిషి ఏం తిన్నాడు? చిరుధాన్యాలు వాటంతటవే పెరిగాయా.. సాగు చేసేవారా..? వరి సాగు ఎప్పుడు మొదలైంది? అసలు వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది? ఇలాంటి ఆసక్తికర విషయాల నిగ్గు తేల్చే అన్వే షణ ఇప్పటివరకు దక్షిణ భారతంలో జరగలేదు. వేల ఏళ్ల నాటి మానవ అవశేషాల ఆధారంగా కొన్ని అం శాలు తెలుసుకున్నా ఆ నాటి పర్యావరణం, జీవ జాలం, ఉపద్రవాలపై పక్కా ఆధారాలు సేకరించే అధ్యయనాలు చేయలేదు. కానీ తొలిసారి హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీ (హెచ్‌సీయూ) ఇందుకు నడుం బిగించింది. ఆది మానవుల మనుగడలో కొత్త కోణాలు ఆవిష్కరించే బృహత్ అన్వేషణను మొదలు పెట్టింది. తవ్వకాల్లో సేకరించే ఆధారాల విశ్లేషణకు లండన్ వర్సిటీ సాంకేతిక సహకారం తీసుకుంటోంది. వేల ఏళ్ల నాటి ధాన్యపు గింజలు, పుప్పొడి, మానవులు, జంతువుల అవశేషాల ఆధారంగా ఆహారపు అలవాట్లు, మనుగడ, జీవజాలాన్ని చెల్లాచెదురు చేసిన ప్రకృతి విపత్తులు.. ఇలా అన్ని అంశాలను పరిశోధించబోతోంది. ఇందుకు జనగామ సమీపంలో కొన్నె, రామచంద్రాపురం శివారులోని గజగిరిగుట్టను ఎంచుకున్నారు. పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా లభించడంతో హెచ్‌సీయూ ప్రొఫెసర్ కె.పుల్లారావు ఆధ్వర్యంలో వర్సిటీ పరిశోధక విద్యార్థుల బృందం శనివారం ఇక్కడ తవ్వకాలు ప్రారంభించింది. ఈ గుట్టపై వేల ఏళ్లనాటి మానవ ఆవాస జాడలున్నాయి. ఇక్కడి గజగిరిగుట్ట వద్ద దాన్ని రూఢీ చేసే ఆధారాలు గతంలో లభ్యమయ్యాయి. బూడిదగుట్టగా మారిన ప్రాంతంపై గతంలో ప్రొఫెసర్ పుల్లారావు ఆధ్వర్యంలో జరిగిన ప్రాథమిక అధ్యయనంలో.. తొలి చారిత్రక యుగం, బృహత్ శిలాయుగం, కొత్తరాతియుగాలకు చెందిన ఆవాసా లు అక్కడ ఉన్నట్లు తేలింది. అక్కడి భూమిలోని ఒక్కో పొర ఒక్కో కాలం ఆధారాలు అందించే అవకాశం ఉండటంతో అధ్యయనానికి ఈ ప్రాం తమే అనువైనదని హెచ్‌సీయూ గుర్తించింది. గతంలో ఓ సదస్సులో లండన్ వర్సిటీ చరిత్ర విభాగాధిపతి డోరియన్ ఫుల్లర్‌తో ప్రొఫెసర్ పుల్లారావు భేటీ అయి దీనిపై చర్చించారు. ఈ అన్వేషణలో సేకరించిన నమూనాలను ఆ వర్సిటీ ల్యాబ్‌లలో ఆధునిక పద్ధతుల్లో విశ్లేషించేందుకు వీలుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎలా విశ్లేషిస్తారు..? సాధారణంగా ధాన్యం గింజపై చిన్న బొడిపె ఉంటుంది. మొక్కతో గింజను అనుసంధానించేది ఈ బొడిపే. మట్టి పొరల్లో ఆ బొడిపె తాలూకు అవశేషాలు, పుష్పాల పుప్పొడి అవశేషాలు సేకరిస్తారు. వీటిలో చాలా అవశేషాలు కంటికి కనిపించవు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే విశ్లేషించగలుగుతారు. అలాగే ‘యాక్సలేటర్ మాస్ స్పెక్ట్రోమిట్రీ (ఏఎంఎస్)’విధానాన్నీ అనుసరించనున్నారు. ఇందుకు లండన్ వర్సిటీ సహకరించనుంది. -
సమీకృత సేంద్రియ సేద్య పతాక.. తిలగర్!
సముద్ర తీర ప్రాంతాల్లో రైతులకు తమిళనాడుకు చెందిన వృద్ధ రైతు తిలగర్ (60) ఆచరిస్తున్న సమీకృత సేంద్రియ సేద్య పద్ధతి రైతాంగానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది. తిలగర్ నాగపట్టినం జిల్లా సిర్కజి తాలూకా కొడంకుడిలో తనకున్న ఎకరం పావు పొలంలో దశాబ్దాలుగా రసాయనిక పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నా.. పెద్దగా నికరాదాయాన్ని కళ్ల జూసిన సందర్భాల్లేవు. బోరు నీటి ఆధారంగానే సేద్యం చేస్తున్న తిలగర్ ఈ నేపథ్యంలో.. సమీకృత సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టారు. వరుసగా మూడేళ్లు కరువు వచ్చినా మెరుగైన నికరాదాయాన్ని పొందుతున్నారు. సేంద్రియ వ్యవసాయోద్యమకారుడు దివంగత నమ్మాళ్వార్ చూపిన బాటలో మూడేళ్ల క్రితం నుంచి సేంద్రియ పద్ధతిని అనుసరిస్తున్నారు. వ్యవసాయ పనులన్నీ తిలగర్ కుటుంబ సభ్యులే చేసుకుంటారు. చెరువు.. కోళ్ల షెడ్డు.. వరి పొలం.. పావెకరంలో చెరువు తవ్వారు. అది చేపల చెరువు మాత్రమే కాదు, పక్కనే ఉన్న ఎకరం వరి పొలానికి నీరందించే నీటి కుంట కూడా. చెరువులో పూరి పాకను నిర్మించి, చుట్టూ ఇనుప మెష్ ఏర్పాటు చేసి కోళ్ల ఫామ్‌గా మార్చారు. ఆ కోళ్ల పెంట నేరుగా చెరువు నీటిలోకి పడుతుంది. చెరువు నీటిలో బొచ్చె, బంగారుతీగ వంటి 3 రకాలకు చెందిన వెయ్యి మంచినీటి కార్పు చేప పిల్లలను వదులుతుంటారు. కోళ్ల పెంట వల్ల చెరువు నీటికి చేపలకు అవసరమైన ప్లవకాలను ప్రకృతిసిద్ధంగా అందుబాటులోకి తెస్తున్నాయి. దీనికి తోడు అడపా దడపా పంచగవ్యను చల్లుతూ ఉంటారు. కాబట్టి, చేపల కోసం ప్రత్యేకంగా మేత అంటూ ఏమీ వేయడం లేదు. 2016లో సేకరించిన గణాంకాల ప్రకారం.. వెయ్యి చేపపిల్లలను వదిలిన 8 నెలల్లో 600 కిలోల చేపల దిగుబడి వచ్చింది. తిలగర్ ప్రత్యేకత ఏమిటంటే.. చేపలను సజీవంగా తన చెరువు వద్దనే నేరుగా వినియోగదారులకు అమ్ముతూ ఉంటారు. కిలో రూ. 150 చొప్పున.. రూ. 90 వేల ఆదాయం పొందుతున్నారు. చేపల చెరువు నీటితో వరి సాగు చేపల చెరువులోని నీటిని పక్కనే ఉన్న వరి పొలానికి పారిస్తున్నారు. వరి పొలానికి పంచగవ్య తప్ప మరేమీ ఎరువు వేయటం లేదు. ఎకరానికి 40 బస్తాల వరకు ధాన్యం దిగుబడి పొందుతున్నారు. తిలగర్ తన పొలం వద్దనే దేశీ ఆవుతోపాటు మేకలు, బాతులను పెంచుతున్నారు. గట్ల మీద కొబ్బరి, మామిడి, జామ చెట్లను పెంచుతూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. వ్యవసాయం, పశుపోషణ పరస్పర ఆధారితమైనవి కావడంతో వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడు.. సమీకృత సేంద్రియ సేద్యం ప్రధానంగా చిన్న కమతాలుండి సొంత రెక్కల కష్టంపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకునే చిన్న, సన్నకారు రైతులకు ఆహార, ఆదాయ భద్రత లభిస్తుందనడంలో సందేహం లేదు. సేంద్రియ సర్టిఫికేషన్ ఇవ్వబోతున్నాం జిల్లా కలెక్టర్ పళనిస్వామి స్వయంగా తిలగర్ క్షేత్రాన్ని సందర్శించి అభినందించడంతోపాటు ఉత్తమ రైతు పురస్కారంతో సత్కరించారు. ఇతర రైతులను సైతం సమీకృత సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కృషి చేయమని అధికారులను ఆదేశించారు. తిలగర్ వ్యవసాయోత్పత్తులకు పీజీఎస్–ఇండియా కింద సేంద్రియ సర్టిఫికేషన్‌ను అందించబోతున్నాం. – ఆర్. రవిచంద్రన్ (094440 63174, 095007 82105)మత్స్య శాఖ సహాయ సంచాలకుడు,నాగపట్టినం, తమిళనాడు -
యాసంగి జోరు!
జిల్లాలో యాసంగి పంటల సాగు జోరుగా సాగుతోంది. రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. రబీలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1,83,426 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 1,73,305 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. పంటల సాగు విస్తీర్ణం 94 శాతంగా నమోదైంది. మరో వారం రోజుల్లో వంద శాతం పంటలు సాగయ్యే అవకాశాలు న్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. సాక్షి, కామారెడ్డి: జిల్లాలో వరి సాగు లక్ష్యానికి మించి నాట్లు వేశారు. 54,360 ఎకరాల్లో వరి పంట సాగవుతుందని అధికారులు అంచనా వేయగా.. 61,510 ఎకరాల్లో వరి సాగైంది. మరో ఐదారువేల ఎకరాల్లో నాట్లు పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద 31,913 ఎకరాల్లో, పోచారం ప్రాజెక్టు కింద 3,806 ఎకరాల్లో, కౌలాస్‌నాలా ప్రాజెక్టు కింద 3,500 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. జిల్లాలో వరి సాగు విస్తీర్ణంలో సగం ప్రాజెక్టుల కిందనే ఉండగా.. మిగతా సాగు విస్తీర్ణం బోర్లు, బావులపై ఆధారపడి ఉంది. తగ్గిన మొక్కజొన్న సాగు... జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం సాధారణానికం టే తగ్గింది. యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 44,043 ఎకరాలుకాగా 39,554 ఎకరాల్లో మక్క వేశారు. మక్క దాదాపు బోర్లు, బావుల దగ్గరే సాగవుతోంది. 10,933 ఎకరాల్లో జొన్న సాగవుతుందని అంచనా వేయగా.. 7832 ఎకరాల్లో సాగైంది. శనగ పంట 44,903 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేస్తే 49,316 ఎకరాల్లో సాగు చేశారు. పొద్దుతిరుగుడు సాగు గణనీయంగా తగ్గిపోయింది. సాధారణ సాగు విస్తీర్ణం 2,458 ఎకరాలు కాగా.. 440 ఎకరాల్లో మాత్రమే పంట సాగు చేశారు. చెరుకు సాగు విస్తీర్ణం ఈసారి పెరిగింది. సాధారణ విస్తీర్ణం 5,883 ఎకరాలు కాగా 7,643 ఎకరాల్లో చెరుకు సాగు చేశారు. తగ్గుతున్న భూగర్భ జలాలు.. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తుండడంతో బోర్లు ఎక్కువ సేపు నడుపుతున్నారు. దీంతో బోర్లలో నీటి ఊటలు తగ్గుతున్నాయి. ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోతున్న పరిస్థితుల్లో 24 గంటల కరెంటు మరింత దెబ్బతీస్తోంది. కొన్నిచోట్ల ఇప్పటికే భూగర్భ జలమట్టం దెబ్బతిని యాసంగి పంటలకు నష్టం కలుగుతోంది. ఇదే పరిస్థితి ముందుముందు ఉంటే మరింత నష్టం తప్పదంటున్నారు. ఎకరం వరి వేసిన... ఎకరం వరి పంట వేసిన. బోరు మంచిగనే పోసేది. ఈ మధ్యన బోర్ల ఊట తగ్గింది. నీళ్లకు తిప్పలైతదనే కొంత బీడు పెట్టినం. వేసిన ఎకరం పంట గూడ ఎట్ల గట్టెక్కుతదోననే భయం ఉన్నది. 24 గంటల కరెంటుతోని కొంత ఇబ్బంది అయితుంది. – నాగరాజు, రైతు, పోల్కంపేట, లింగంపేట మండలం ఇప్పుడైతే మంచిగనే ఉన్నది... బోర్లు మంచిగ పోస్తున్నయని మూడెకరాలల్లో వరి వేసిన. అవసరం ఉన్నంత మేరకు బోరు నడుపుతున్నం. మిగతా సమయం బందు పెడుతున్నం. ఈసారి పంట మంచిగనే ఉన్నది. మా ఊళ్లె అన్ని బోర్లు బాగానే ఉన్నయి. బోర్లు ఎత్తిపోకుంటే ఏ ఇబ్బంది ఉండదు. – దేవేందర్‌రెడ్డి, రైతు, ఒంటరిపల్లి, లింగంపేట మండలం -
ఆశాజనకంగా రబీసాగు
వంగూరు : రబీలో సాగుచేసిన పంటలన్నీ ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వంగూరు మండలంలోని వివిధ గ్రామాల్లో గత నాలుగేళ్లనుంచి లేని సాగు ఈఏడాది రబీలో రైతులు పెద్ద ఎత్తున వేరుశనగ, వరి సాగుచేశారు. దాదాపు ఏడు వేల ఎకరాల్లో వేరుశనగ, వెయ్యి ఎకరాల్లో వరి సాగుచేశారు. పంటలు అధిక దిగుబడి ఇచ్చేందుకు అవసరమైన సాగునీరు, విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండడం, క్రిమికీటకాలు సోకకపోవడంతో ఎలాగైనా ఈసారి రబీలో అధిక దిగుబడి పొంది అప్పుల ఊబిలో నుంచి బయటపడతామన్న నమ్మకంతో రైతులు ఉన్నారు. గతేడాది 3వేల ఎకరాల్లో.. గతేడాది కేవలం 3వేల ఎకరాల్లోనే వేరుశనగ, వంద ఎకరాల్లోనే వరి సాగు చేశారు. ఈఏడాది రబీలో పంటలు సాగుచేసేందుకు అనుగుణంగా వర్షాలు రావడం, డిండివాగు సాగడం, ప్రాజెక్టులోకి నీరు చేరుకోవడం తదితర కారణాలతో భూగర్భజలాలు భారీగా వృద్ధి చెందాయి. దీంతో వ్యవసాయ బోరుబావుల్లో నీటిమట్టం పెరిగింది. రైతులు పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం అప్పులు తీసుకువచ్చి పంటలు సాగుచేశారు. అక్కడక్కడా దెబ్బతిన్న పంటలు వేరుశనగ ప్రారంభంలో లద్దె పురుగు తగిలి అక్కడక్కడా పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలతో లద్దెపురుగు నివారణ జరిగింది. దీంతో రబీలో సాగుచేసిన పంటలన్నీ ఆశాజనకంగా ఉన్నాయి. గత నాలుగేళ్ల నుంచి ఎప్పుడు కూడా రబీలో రైతులు ఇంత పెద్ద ఎత్తున సాగుచేసిన దాఖలాలు లేవు. కొంతమంది రైతులైతే దెబ్బతిన్న పత్తిపంటను తొలగించి బోర్లకింద వేరుశనగ పంటలు వేశారు. ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున వేరుశనగ దిగుబడి ఉంటుందని రైతులు అంటున్నారు. పంటలు ఆశాజనకమే.. గతంలో కంటే ఈఏడాది రబీలో రైతులు అధికంగా వేరుశనగ, వరి సాగుచేశారు. గతానికంటే ఈసారి క్రిమికీటకాలు తక్కువగా ఉండడంతో రైతులకు పెట్టుబడులు కూడా తగ్గాయి. భూగర్భజలాలు అధికంగా ఉండడంతో ఏమాత్రం ఎండిపోకుండా రైతులు వారి పంటలకు తడి వేస్తున్నారు. ఏది ఏమైనా గతానికంటే రబీలో పంటలు ఆశాజనకంగానే ఉన్నాయని చెప్పవచ్చు. – తనూజారాజు, ఏఓ, వంగూరు -
నారు ధరకు రెక్కలు !
సెంటు నారు ధర రూ.250 నుంచి రూ.650 కిరాయితో మరింత భారం దివిసీమకు వస్తున్న పామర్రు, మొవ్వ, గుడివాడ, బందరు ప్రాంత రైతులు అవనిగడ్డ : వరినారు ధరకు రెక్కలొచ్చాయి. సాగునీరు అందక చాలా ప్రాంతాల్లో రైతులు నారుమళ్లు పోయలేదు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పంటకాలువలకు నీటిని విడుదల చేయడంతోపాటు వర్షాలు కురుస్తుండడంతో నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో వరినారుకు డిమాండ్ పెరిగింది. సెంటు నారు రూ.250 నుంచి రూ.650 వరకు పలుకుతోంది. గత ఏడాది సెంటు నారు రూ.200 నుంచి రూ.250 మాత్రమే ఉంది. గత ఏడాది సాగునీరు సరిగా అందక పోవడం, వర్షాలు లేకపోవడంతో జిల్లావ్యాప్తంగా 30శాతం వరి సాగు చేయలేదు. ఈ ఏడాది కూడా పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని... గత ఏడాది చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి సాగునీరు వచ్చే వరకు చాలాచోట్ల నారుమళ్లు పోయలేదు. గత ఐదు రోజుల నుంచి పంటకాలువకు సాగునీరు విడుదల చేయడంతో రైతులు నాట్లు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మిగిలిన ప్రాంతాలకంటే దివిసీమలో వరిసాగు ఆలస్యంగా జరుగుతుంది. బోర్లు, మురుగునీటి సాయంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు నారుమళ్లు పోశారు. పామర్రు, మొవ్వ, గుడివాడ, మచిలీపట్నం నుంచి రైతులు నారుకోసం దివిసీమ బాట పట్టారు. గతంలో సెంటు నారు రూ.250 ధర ఉండగా.. ప్రస్తుతం రూ.650కు పలుకుతోంది. పామర్రు, మొవ్వ మండలాలకు నారు తీసుకెళ్లాలంటే రూ.1,000 నుంచి రూ.1,500 కిరాయి అవుతోంది. ట్రక్కు ఆటోకు రెండు ఎకరాలకు సరిపడా నారుపడుతుంది. కొనుగోలుతోపాటు కిరాయి కలిపి సెంటు నారు రూ.1,200 నుంచి రూ.1,500 అవుతోంది. ఇంత చెల్లించి నారు తీసుకెళ్లి నాట్లు వేస్తే పంటకాలువకు సక్రమంగా సాగునీరు వస్తుందో.. రాదో.. అని కొంతమంది రైతులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
ఖానాపూర్ (వరంగల్): వరి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం ధర్మారావుపేటకు చెందిన తేజావత్ వెంకన్న (50) రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటారు దగ్గర ఫీజును సరిచేస్తున్న క్రమంలో షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. వెంకన్నకు భార్య అచ్చి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
ఖరీఫ్ కాలం తిరగబడింది
- 57 శాతానికి పడిన వరి సాగు - ఆహార ధాన్యాల సాగు 69 శాతానికి పరిమితం - సగానికి పైగా ఎండిన పత్తి - ఆరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావం - నేటి నుంచి ప్రారంభం కానున్న రబీ సీజన్ సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ బుధవారంతో ముగిసింది. నేటి నుంచి రబీ మొదలుకానుంది. 2015-16 ఖరీఫ్ రైతును అధోగతిపాలు చేసింది. సీజన్ ప్రారంభంలో ఊరించిన వర్షాలు ఆ తరువాత మొఖం చాటేయడంతో రైతులు రెండు విధాలుగా నష్టపోయారు. ఈ ఏడాది జూన్‌లో రుతుపవనాలు సకాలంలో వచ్చి భారీ వర్షాలు కురవడంతో ఆశపడిన అన్నదాతలు పెద్దఎత్తున విత్తనాలు చల్లారు. పత్తి, మొక్కజొన్న, సోయా సహా ఇతర విత్తనాలను సాధారణానికి మించి చల్లారు. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురియకపోవడంతో వేసిన పంటలన్నీ ప్రాథమిక దశలోనే ఎండిపోయాయి. సెప్టెం బర్లో వర్షాలు కురిసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పత్తి, సోయా పంటలు సగానికిపైగా ఎండిపోయాయి. ప్రాజెక్టుల్లోకి నీరు చేరకపోవడంతో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లాల్లో నూటికి నూరు శాతం పంటలు చేతికి రాకుండాపోయాయి. రెండు మూడు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ కరువు తాండవిస్తోంది. దీంతో ఈసారి ఆహారధాన్యాల కొరత రాష్ట్రాన్ని వెంటాడే అవకాశాలున్నాయి. 69 శాతానికి పడిపోయిన ఆహారధాన్యాల సాగు ఈ ఖరీఫ్‌లో 1.03 కోట్ల ఎకరాల్లో సాధారణ పంటల సాగు జరగాల్సి ఉండగా 88.90 లక్షల ఎకరాల్లో (86%) సాగు జరిగింది. అందులో ఆహారధాన్యాలు 51.62 లక్షల ఎకరాలకు గాను... 35.77 లక్షల ఎకరాల్లోనే (69%) సాగయ్యాయి. ఆహారధాన్యాల సాగులో కీలకమైన వరి సాగు 26.47 లక్షల ఎకరాలకు గాను... 15.17 లక్షల ఎకరాల్లో (57%) మాత్రమే సాగు జరిగింది. కరువు కారణంగా వేసిన పంటలు కూడా దిగుబడి రాకుండా పోయాయి. లక్షలాది ఎకరాల్లో వేసిన పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలు ఎండిపోయాయి. ఈసారి ఖరీఫ్‌లో ఆహారధాన్యాల దిగుబడి 22 శాతానికే పరిమితమవుతుందని ఆర్థికగణాంకశాఖ అంచనా వేసింది. దీనిని బట్టి ఈసారి రాష్ట్రాన్ని ఆహారధాన్యాల కొరత పీడించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పత్తి 103%, సోయాబీన్ 142% సాగు జరిగినా అవి చేతికి వచ్చే పరిస్థితి అంతంతే. ఆరు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు జూన్ నెలలో సాధారణంగా 127 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 220.3 మిల్లీమీటర్లు (మి.మీ.) కురిసింది. ఏకంగా 73% అదనపు వర్షపాతం ఆ నెలలో నమోదైంది. జూలైలో సాధారణంగా 238 మి.మీల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... కేవలం 80.2 మి.మీ.లే కురిసింది. 66 శాతం లోటు నమోదైంది. ఆగస్టు నెలలో 218.7 మి.మీ.లకు గాను... 151మి.మీలు (-31%), జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు 655.8 మి.మీలకు గాను 552 మి.మీ. (-14%) నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. మిగిలిన 4 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా 459 మండలాలకు గాను... 226 మండలాల్లో వర్షాభావం నెలకొంది. -
వరి సేద్యానికి కొత్త ఊపిరి!
పుబ్బ కార్తె (సెప్టెంబర్ 13 వరకు) వ్యవసాయం బడుగు రైతుకు తలకు మించిన భారంగా మారింది. ప్రజలు ప్రధాన ఆహారంగా వరి సాగు చేసే రైతుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అప్పోసొప్పో చేసి పెడుతున్న ఖర్చు కూడా రైతుకు తిరిగి రానంత అధ్వాన్న స్థాయిలోనే.. కనీస మద్దతు ధర పెరుగుదల ఆగిపోయింది. కాదు.. కాదు.. పాలకులు ఆపేశారు. చిన్న రైతుకు చేదోడుగా నిలిచే తక్కువ ఖరీదులో మేలైన యంత్ర పరికరాలకూ కొరతే. పులి మీద పుట్రలా.. ఈ ఏడాది కరువు కాటేసింది... అయితే, ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రకృతి ప్రకోపం తడిసి మోపెడైన ఇంతటి పెను సంక్షోభ కాలంలోనూ.. అన్నదాతలు సేద్యాన్ని వొదులుకోలేకపోతున్నారు. దశాబ్దాలుగా అనుదినం తమ జీవితంలో భాగమైపోయిన వరి సాగును ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న తపనే వారిని వెలుగుదారులు వెదికేందుకు పురికొల్పుతోంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా వరి సేద్యాన్ని సృజనాత్మకంగా కొత్తపుంతలు తొక్కిస్తున్న ‘రైతు శాస్త్రవేత్త’లకు కొదవ లేని సుసంపన్నమైన వ్యవసాయ సంస్కృతి మనది. సాధారణ వరి రకాలను టన్నుల కొద్దీ పండించి నష్టాల పాలవ్వడానికి బదులు.. ఔషధ విలువలున్న సంప్రదాయ వరి వంగడాలను అపురూపంగా గుండెలకు హత్తుకొని.. తక్కువ ఖర్చుతో సేంద్రియ సేద్యం ద్వారా అధికంగా నికరాదాయం పొందుతున్నవారున్నారు. తమ పొలాల్లో ప్రత్యేక అవసరాల కోసం తక్కువ ఖర్చుతోనే కొత్త యంత్ర పరికరాలను ఆవిష్కరిస్తున్న సృజనశీలురున్నారు. వరి సేద్యానికి కొత్త ఊపిర్లూదుతున్న ఇటువంటి 30 మంది అన్నదాతలను భారతీయ వరి పరిశోధనా స్థానం (ఐ.ఐ.ఆర్.ఆర్.) ఇటీవల సముచిత రీతిన సత్కరించింది. దేశం నలుమూలల నుంచి ఆవిష్కర్తలను ఎంపికచేసి ‘రైస్ ఇన్నోవేటర్స్ 2015’ పేరిట పురస్కారాలను అందజేసింది. రైతుల ఆవిష్కరణలకు.. సృజనాత్మక, సుస్థిర, సేంద్రియ సాగు పద్ధతులకు తగిన రీతిలో గుర్తింపునివ్వడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేయడమే ఈ అవార్డుల లక్ష్యమని ఐ.ఐ.ఆర్.ఆర్. డెరైక్టర్ వి. రవీంద్రబాబు వివరించారు. ఐ.ఐ.ఆర్.ఆర్. పురస్కారాలను అందుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు రైతు శాస్త్రవేత్తలున్నారు. వరి సేద్యానికి కొత్త ఊపిర్లూదుతున్న వీరికి ‘సాక్షి’ అభినందనలు తెలియజేస్తున్నది. వారి విశిష్ట కృషి గురించి ‘సాగుబడి’ పాఠకుల కోసం.. ‘మండవ వీడర్’.. ఖండాంతర ఖ్యాతి ‘శ్రీ’ వంటి ఆరుతడి వరి సాగు పద్ధతిలో కలుపు నివారణ పెద్ద సమస్య. కలుపు తీతకు అప్పటికి వాడుతున్న కోనో వీడర్‌తో సమస్యలున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఉపయోగపడే వీడర్‌ను ఖమ్మం జిల్లా చిన్న మండవ గ్రామానికి చెందిన రైతు శాస్త్రవేత్త పర్చా కిషన్‌రావు (94411 23197) ఆవిష్కరించారు. దీనికి తమ గ్రామం పేరుతో ‘మండవ వీడర్’ అని పేరుపెట్టారు. మహిళలు కూడా అలసిపోకుండా, సులువుగా ఉపయోగించడానికి వీలుగా ఈ వీడర్‌ను ఆయన రూపొందించారు. కోనోవీడర్ కన్నా ఇది బరువు తక్కువ. కోనోవీడర్‌కు 10-15 నట్లు, బోల్టులు ఉంటాయి. మరమ్మతులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మండవ వీడర్‌కు ఒక్క బోల్టూ, నట్టు లేదు కాబట్టి మన్నిక ఎక్కువ. హేండిల్ పట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. దీన్ని ఉపయోగించే మనిషి ఎక్కువ శ్రమ పడనక్కర్లేదు. దీని పళ్లు ఐదు అంగుళాల వెడల్పు ఉండటం వల్ల దీన్ని వాడుతున్నప్పుడు వరి మొక్క దెబ్బతినదు. దీని తయారీకి రూ.700-800కు మించి ఖర్చవదు. ఇన్ని సుగుణాలుండ బట్టే ఈ వీడర్ రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఏడు రాష్ట్రాల్లో రైతుల ఆదరణ పొందుతోంది. అంతేకాదు. మొరాకో, అఫ్ఘనిస్తాన్, సిఎర్రా లియోన్, నేపాల్ వంటి అనేక దేశాల్లోనూ దీన్ని వాడుతుండడం విశేషం. ఈ ఆవిష్కరణపై కిషన్‌రావు పేటెంట్ తీసుకోలేదు. దీని డిజైన్లను ఇంటర్నెట్లో అందరికీ అందుబాటులో ఉంచారు. దేశవిదేశాల్లో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఈ వీడర్‌ను స్థానికంగా తయారు చేసి.. రైతులకు అందిస్తున్నాయి. ఖరగ్‌పూర్ ఐఐటీ, బాపట్ల వ్యవసాయ ఇంజినీరింగ్ కాలేజీ నిపుణులు మండవ వీడర్ సామర్థ్యంపై అధ్యయనం చేసి ప్రశంసించడం విశేషం. ఇంజినీరింగ్ పట్టభద్రుడైన కిషన్‌రావు మక్కువతో సేద్యాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. 34 ఏళ్లుగా సేంద్రియ వరి సేద్యం చేస్తున్నారు. 30 సెం.మీ. డ్రమ్ సీడర్, పవర్ వీడర్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన మూడెకరాల అభ్యుదయ రైతు షేక్ ఇమాం సాహెబ్ (97048 12836). 14 ఏళ్లుగా వరి సాగు చేస్తున్నారు. సాధారణ డ్రమ్ సీడర్ ద్వారా విత్తితే వరుసల మధ్య 20 సెం.మీ. దూరం మాత్రమే ఉంటున్నది. దీంతో కలుపుతీతకు కోనోవీడర్ వాడకం ఇబ్బందిగా మారడంతో అధిక ఖర్చుతో మనుషులతో కలుపు తీయించాల్సి వచ్చేది. ఈ సమస్యను అధిగమించడానికి వరుసల మధ్య 30 సెం.మీ.ల దూరం ఉంచేలా కేసింగ్ పైప్‌తో డ్రమ్‌సీడర్‌ను రూపొందించారు. అందుకు తగినట్లుగా పవర్ వీడర్‌ను కూడా తయారు చేసుకున్నారు. ఇమాం సాహెబ్ ఆవిష్కరణలు తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందాయి. సంప్రదాయ సేంద్రియ సేద్య పద్ధతి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గద్దె సతీష్ బాబు (99125 11244) రైతు కుటుంబంలో పుట్టి ఎం.కాం. చదివినా వ్యవసాయ వృత్తిని చేపట్టారు. గత 19 ఏళ్లుగా సంప్రదాయ సేంద్రియ సేద్య పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. 22 హెక్టార్ల ఆసామి అయిన సతీష్ బాబు తన పొలంలోని సగం విస్తీర్ణంలో ఈ ఏడాది వరి సాగు చేస్తే.. మిగతా సగం విస్తీర్ణంలో పంట వేయరు. విరామం ఇస్తారు. సహజసిద్ధంగా భూసారం పెంపుదలకు ఇది అవసరమని భావిస్తారు. పంట వేసిన పొలంలో కోతలు పూర్తయిన తర్వాత పొలంలోని కొంత విస్తీర్ణంలో గేదెలను కట్టేస్తారు. అవి రాత్రి, పగలు అక్కడే ఉండి గడ్డి మేస్తుంటాయి. వాటి పేడ, మూత్రం సహజంగా భూమిని సారవంతం చేస్తాయి. వారం తర్వాత గేదెలను మరి కొంత దూరానికి తరలిస్తారు. ఆ విధంగా ఈ ఏడాది పంట పండించిన పొలాన్ని వచ్చే ఏడాది అంతా పశువులను కట్టేయడం ద్వారా సారవంతం చేస్తుంటారు. ఈ సంవత్సరం పంట వేయని పొలంలో వచ్చే ఏడాది పంట వేస్తారు. పశువుల పేడ, మూత్రంతో పంట భూమిని సారవంతం చేస్తున్నందున.. పంట బలంగా పెరుగుతున్నదని, చీడపీడల బెడదే లేదని సతీష్ బాబు తెలిపారు. రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తులు పండించి, నేరుగా వినియోగదారులకు విక్రయించడం ద్వారా అధిక నికరాదాయం పొందుతున్నారు. దీనితోపాటు, పాడి పశువులు ఆరుబయట తిరుగుతూ ఉంటాయి. దీని వల్ల నాణ్యమైన పాల దిగుబడి వస్తున్నది. ఖమ్మం జిల్లాలో చాలా మంది రైతులు ఈ పద్ధతిని అనుసరించి పంటలు పండిస్తున్నారని సతీష్ బాబు తెలిపారు. డ్రిప్‌తో వరి సాగు నీటిని నిల్వగట్టే పద్ధతిలో వరి సాగుకు చాలా నీరు అవసరమవుతుంది. ఈ కరువు కాలంలో వరి సాగు కొనసాగాలన్నా, రైతు నిలదొక్కుకోవాలన్నా తక్కువ నీటిని వాడుకుంటూ ఎక్కువ దిగుబడి సాధించాలి. కరీంనగర్ జిల్లా మెట్పల్లి మండలం చింతల్‌పేటకు చెందిన యువ సన్నకారు రైతు తోట్ల మహిపాల్ యాదవ్ (94402 10032) ఈ దిశగా ముందడుగు వేశారు. 9వ తరగతి చదువుకున్న మహిపాల్ వరి పొలంలో డ్రిప్ ద్వారానే ద్రవ ఎరువులను వాడి అధిక దిగుబడి పొందారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంట పండించే ఈ పద్ధతిపై ఈ కరువు కాలంలో ఇతర రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఐదేళ్లుగా వెద పద్ధతిలో వరి సాగు తెలుగు నాట వరి సేద్యంలో ప్రఖ్యాతినొందిన సీనియర్ రైతు నెక్కంటి సుబ్బారావు (94912 54567). పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన ఆయన 55 ఏళ్లుగా వరి సాగు చేస్తున్నారు. ధాయ్చుంగ్, ఐఆర్-8, గ్రీన్ సూపర్ రైస్ వంటి మేలైన వరి వంగడాలను తొలుత పండించి తెలుగు నాట ఇతర రైతులకు అందించడంలో ఆయనకు ఆయనే సాటి. వరి సాగులో ఖర్చును, కూలీల అవసరాన్ని తగ్గించడం కోసం ఐదేళ్ల క్రితం నుంచి ఆయన కృషి చేస్తున్నారు. ఖరీఫ్‌లోను, దాళ్వాలోనూ దమ్ము చేసిన తర్వాత విత్తనాన్ని వెదజల్లుతున్నారు లేదా డ్రమ్‌సీడర్ వాడుతున్నారు. ఎకరానికి రూ. ఐదు వేల వరకు ఖర్చు తగ్గుతున్నదని సుబ్బారావు తెలిపారు. గోదావరి జిల్లాల్లో చాలా మంది రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. నాట్లు వేసినప్పటికన్నా ఎక్కువ పిలకలు రావడంతోపాటు చీడపీడల బెడద ఉండటం లేదని ఆయన అన్నారు. సేకరణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్; ఫొటోలు: నాగరాజు -
వరిసాగు పావుశాతమే!
సాక్షి, హైదరాబాద్: సాగు నీటి వనరులు సక్రమంగా లేకపోవడంతో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం దాదాపు పావు శాతానికే పరిమితమైంది. ఖరీఫ్‌లో 26.47 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగాల్సి ఉండగా 6.67 లక్షల ఎకరాల్లోనే వరినాట్లు పడినట్లు వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ ఖరీఫ్‌లో మొత్తం 1.03 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 76.07 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగింది. పత్తి నూరు శాతం విస్తీర్ణంలో సాగు జరిగింది. అయితే వర్షాలు సకాలంలో కురవకపోవడంతో అనేక చోట్ల వేసిన పత్తి ఎండిపోయింది. ప్రస్తుత వర్షాలకు కాస్త కోలుకున్నట్లేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సోయాబీన్ లక్ష్యానికి మించి 6.27 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే 90 శాతం ఎండిపోయిందని చెబుతున్నారు. వర్షాలు కురుస్తున్నా.. 19 శాతం లోటు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నప్పటికీ రాష్ర్టంలో 19 శాతం వర్షపాత లోటు కనిపిస్తోంది. బుధవారం నాటికి 44.8 సెం.మీ. వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 36.2 సెం.మీ. మాత్రమే కురిసింది. దీంతో నిజామాబాద్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. గతేడాది జూన్‌లో 12.56 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు లభిస్తే అదే ఏడాది జూలైలో 12.73 మీటర్ల లోతుకి నీరు అడుగంటాయి. గత ఏడాది జూలైతో పోలిస్తే ఏకంగా 2.17 మీటర్ల లోతుకి కూరుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... బంగాళాఖాతంలో అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కరీంనగర్, మంథనిలో 11 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రుద్రూరు, కాళేశ్వరంలో 10 సెంటీమీటర్ల చొప్పున పడింది. కోటగిరిలో 9 సెం.మీ., వర్ని, బెజ్జంకిలో 8 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
కలవరిమాయె..
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో సాగు చేసిన వరి వివిధ దశల్లో ఉంది. వాతావరణం అనుకూలించకపోవటంతో దీనికి చీడపీడలు ఆశించి నష్ట పరుస్తున్నాయి. వీటిని ఎలా నివారించాలో జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ జె.హేమంత్‌కుమార్ (99896 23813), డాక్టర్ ఎం.వెంకట్రాములు (89856 20346), డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు (83329 51138) వివరించారు. సుడిదోమ గోధుమ వర్ణపు లేదా తెల్లమచ్చ దోమలు దుబ్బుల అడుగున నీటిమట్టంపై ఉండి దుబ్బుల నుండి రసాన్ని పీలుస్తాయి. పైరు సుడులు సుడులుగా ఎండిపోతోంది. దోమ ఆశించినప్పుడు పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీల బాటలు వదలాలి. దీని నివారణకు బుప్రొపెజిన్ 1.6 మి.లీ లేదా ఇతోఫెన్ప్రాక్స్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్, ఎథిప్రొల్ 0.25 గ్రాములు లేదా మోనోక్రొటోఫాస్ 2.2 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయచాలి. కంకినల్లి కంకినల్లినే నల్లకంకి అని కూడా అంటారు. ఈ నల్లులు కంటికి కనబడని సూక్ష్మసాలీడు వర్గానికి చెందిన పురుగులు. ఇవి ఆశించిన ఆకులపై పసుపు రంగు చారలు ఏర్పడుతాయి. క్రమేపి ఆకుతొడిమెల లోపల, ఆకు ఈనెల్లో వృద్ధి చెందుతాయి. ఆకు అడుగు భాగం, ఈనెలు, ఆకు తొడిమలపై నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. గింజలపైనా నల్లటి మచ్చలు ఏర్పడి పాలుపోసుకోక తాలు గింజలు అవుతాయి. దీని నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లేదా డైకోపాల్ 5 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మెడవిరుపు తెగులు ఈ తెగులు సోకిన వరి ఆకులపై ముదురు గోధుమ రంగు అంచుతో మధ్యలో బూడిద రంగు నూలు కండె ఆకారపు మచ్చలు ఏర్పడుతాయి. ఈ తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు ఎండిపోయి తగులబడినట్లు కనిపిస్తాయి. వెన్నుల మెడ భాగంలో ఇది ఆశించటం వల్ల వెన్నులు విరిగి కిందకు వాలిపోతాయి. దీని నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథయొలేన్ 1.5 మి.లీ లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొట్టకుళ్లు తెగులు పోటాకు తొడిమలపై నల్లని, లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి వెన్నులు పొట్టలో కుళ్లిపోతాయి. వెన్ను పాక్షికంగా మాత్రమే బయటకు వస్తుంది. వెన్నులు తాలు గింజలుగా ఏర్పడుతాయి. గింజలు రంగుమారుతాయి. రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండి, మంచుపడటం, వాతావరణం చల్లగా ఉండటం, గాలిలో తేమ ఎక్కువగా ఉంటే ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు పొట్ట దశలో ఒకసారి, వారం రోజుల తరువాత రెండోసారి కార్బండిజమ్ లీటర్ నీటిలో గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మానిపండు తెగులు పూతదశలో గాలిలో ఎక్కువ తేమశాతం ఉన్న, మంచు లేదా మబ్బులతో కూడిన వర్షపు జల్లులు ఈ తెగులు వృద్ధికి దోహదపడుతాయి. అండాశయంలో ఈ శిలీంధ్రం పెరుగుదల వల్ల ఆకుమచ్చ రంగు ముద్దగా అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత పసుపు రంగులోకి మారి చివరకు నల్లబడిపోతుంది. దీని నివారణకు ప్రొపికొనజోల్ 1మి.లీ లేదా కార్బండిజమ్ గ్రాము, లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి వెన్నులు పైకి వచ్చు దశలో ఒకసారి, వారం రోజుల తరువాత రెండోసారి పిచికారీ చేయాలి. -
నెర్రెలు బారిన పొలాలు
ఖానాపూర్ : మండలంలో సుమారు 1000 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. బాధన్‌కుర్తి, బీర్నం ది, పాత ఎల్లాపూర్, మందపల్లి, దిలావర్పూర్ తదితర గ్రామాల్లో వర్షాధార ంపై ఆధారపడి సాగు చేసిన పంటలు ఇప్పటికే ఎండిపోగా, వ్యవసాయ బావుల కింద సాగు చేసిన కొద్ది పాటి పంటలు కూడా విద్యుత్ కోతలతో నీరందక ఎండిపోతున్నాయి. దీనికి తోడు లోవోల్టేజీ సమస్యతో తరచూ మోటార్లు కాలిపోవడంతో ఆర్థిక భారం పడుతోంది. వేళాపాల లేని కరెంటు కోతలతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా రాత్రిళ్లు జాగారం చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల అధికారులు ఏడుగంటలకు బదులు నాలుగు గంటలకు కుదించినా, కనీసం రెండుగంటలైనా సరఫరా ఇవ్వడం లేదంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. కార్యాలయాలు ముట్టడించి, పర్నీచర్ ధ్వంసం చేయడంతోపాటు సిబ్బందిని నిర్బంధిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇటీవల అర్ధరాత్రి సైతం రైతులు కార్యాలయాల వద్ద ఆందోళన చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. సాగు భారమైనా.. సాగు భారమైనా రైతులు ఆయిలింజిన్లు, జనరేటర్లతో పంటలు వేయాల్సిన దుస్థితి నెలకొంది. వేసిన పంట చేతికస్తుందో లేదోననే ఆందోళన రైతుల్లో తీవ్రమైంది. కళ్లముందే పంటలు ఎండిపోతుంటే చూడలేక సాగు నీటిని పంటకు అందించేందుకు రైతులు అదనపు భారమైన కొత్త జనరేటర్లు కొనుగోలు చేస్తు న్నారు. చి‘వరికి’ పంట చేతికందేవరకు దే వుడిపైనే భారం వేసి ఆదాయానికి మించి పెట్టుబడి పెడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి ఎడాపెడా విద్యుత్ కోతలను భరించలేక పలువురు రైతులు రూ. 20 వేలకుపైగా వెచ్చించి ఆయిలింజిన్లు, జనరేటర్ కొనుగోలు చేసి పంటలకు నీరందిస్తున్నారు. మరికొందరు అద్దెకు తెచ్చి పంటలను కాపాడుకుంటున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతు ఆయిలింజిన్, జనరేటర్ కొని అదనపు భారం మోస్తున్నాడు. ఒక గంట ఆయిలింజన్ నడవాలంటే లీటర్ డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఖరీఫ్‌లో వరి సాగు అంతంతే..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : కార్తెలు కరిగిపోతున్నాయి. వరుణుడు ‘విశ్వరూపం’ చూపించడం లేదు. చిరుజల్లులతోనే సరిపెడుతున్నాడు. ముసురుతోనే మురిపిస్తున్నాడు. కనీసం భూమైనా తడవడం లేదు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఇప్పటికీ వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచింది. కనీసం జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. నారుమళ్లు బీళ్లుగా మారుతున్నాయి. వరిసాగు జిల్లాలో ఇప్పటివరకు పది శాతానికి కూడా నోచుకోలేదు. ఈ ఖరీ్‌ఫ్‌లో 1.45 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ, ఇప్పటివరకు 850 ఎకరాలలో మాత్రమే సాగైంది. ఫలితంగా ఈ ఏడాది వరిధాన్యం సాగు లేక అందరికీ అన్నంపెట్టే రైతన్నకే మెతుకు కరువయ్యే పరిస్థితి వస్తోంది. ఇప్పటికే బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. రాబోవు రోజుల్లో వర్షాభావంతో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉంది. నాటుకు వెనుకడుగు.. ఈ ఖరీఫ్ ఆరంభంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి వా ణిజ్య పంటలైన పత్తి, సోయాబీన్ పంటలు రైతులు సా గు చేశారు. అనంతరం వర్షాలు కురవక పోవడంతో విత్తనాలు భూమిలోనే వట్టిపోయాయి. బావులు, బోర్లు ఉన్న రైతులు విత్తనాలను కాపాడుకోగలిగారు. ఇప్పటికి పంటలను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఏటా తొలక రి జల్లులతో వరి విత్తనాలు అలికి 25 నుంచి 35 రోజుల మధ్య వ్యవధిలో వచ్చిన నారును నాట్లుగా వేసేవారు. ఈ ఏడాది వర్షాలు లేక విత్తనాలు చాలా ప్రాంతాల్లో అలకలేదు. నీటి సౌకర్యం ఉన్న కొద్ది మంది రైతులు విత్తనాలు అలికినా.. నాట్లు వేయడానికి వెనకడుగు వేస్తున్నారు. మొలక వచ్చిన నారు నాట్లు వేసుకునే గడువు దాటిపోవడంతో నారుమళ్లలో పశువులను వదులుతున్నారు. బోరుబావుల నుంచి నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా అందిస్తామంటే కరెంటు ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? తెలయడం లేదని రైతులు పేర్కొంటున్నారు. వర్షాలు సరైన సమయంలో పడితే ఇప్పటి వరకు 70 శాతం నాట్లు వేసుకుని ఎరువులు చల్లుకునే వారు. గతేడాది అతివృష్టి వల్ల పంటలు నష్టపోగా ఈ ఏడాది అనావృష్టితో కరువు పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి. స్వల్పకాలిక వరి విత్తనాలు 90 నుంచి 100 రోజుల్లో పంట చేతికొచ్చే విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పొలంలో 3 నుంచి 5 మీ.మీ. నీరు ఉన్నప్పుడే నారు వేసుకోవాలంటున్నారు. తీవ్రమైన వర్షప్రభావం జిల్లాలో వాతావరణం అనుకూలంగా లేక ఈ ఖరీఫ్‌లో 16లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్య వసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు 11.20 లక్షల ఎకరాల్లో విత్తనాలు విత్తారు. జూలై 28 వరకు సాధారణ వర్షపాతం 486.3 మిల్లీమీటర్లు కురువాల్సి ఉండగా 216.5 మాత్రమే పడింది. లోటు వర్షపాతం నమోదైంది. గతేడాదిలో ఈరోజు వరకు 829 మీ.మీ కురిసింది. 48 శాతం అధికంగా నమోదైంది. జలాశయాలు, చెరువులు నిండుకుండల తలపించాయి. వాగులు ఉప్పొంగి పంటలను తీవ్రంగా నష్ట పరిచాయి. ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైంది. పంటలు పూర్తిస్థాయిలో సాగు చేసుకోవడానికి జూలైలో కురిసే వర్షాలే కీలకం. ఆగస్టులో కురిసే వర్షాలతో స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పత్తి, సోయాబీన్ పంటలు వేసుకోరాదని విత్తుకునే గడువు ముగిసిందని ఇప్పుడు విత్తుకుం టే పంటనష్టం వాటిల్లుతుందని వ్యవసాయ అధికారు లు సూచిస్తున్నారు.ఎక్కువగా ప్రత్యామ్నాయ పంట లైన నువ్వులు, పొద్దుతిరుగుడు, కంది, ఆముదం, జొన్న పంటలు వేసుకోవాలని ఈ పంటలు ఆగస్టు 10వ తేదీ వరకు విత్తుకోవచ్చని తెలుపుతున్నారు. విత్తుకోలేక ఇళ్లలోనే నిల్వ జిల్లాలో సాగుకు అనుగుణంగా విత్తనాల ప్రణాళికను వ్యవసాయ అధికారులు రూపొందించారు. వరి విత్తనాలు 10 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. 4,200 క్వింటాళ్లు రైతులు తీసికెళ్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కొనుగోలు చేసినవి విత్తుకునేందుకు వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసుకోలేదు. వర్షాలు కురిస్తే విత్తుకుంటామని ఇళ్లలోనే నిల్వ చేసుకుని నిరీక్షిస్తున్నారు. సోయాబీన్ 90 వేల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు 82 వేల క్విం టాళ్లు రైతులు తీసుకె ళ్లారు. వర్షాలు లేక విత్తనాలు మొ లకెత్తక పోవడంతో రెండు, మూడుసార్లు విత్తుకున్నా రు. కందులు 600 క్వింటాళ్లకు 350 క్వింటాళ్ల విత్తనా లు విత్తుకున్నారు. ఇతర విత్తనాలు కొనుగోలు చేసిన వర్షాలు లేకపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు. -
ఆశల సాగుకు...
ఖరీఫ్ సాగుకు అన్నదాతలు సన్నద్ధం వడివడిగా నారుమడులు నాట్లు వేసేందుకు రైతాంగం ముమ్మర కసరత్తు పాలకులు పట్టించుకోకపోయినా వరుణుడు కరుణించాడు. జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరుగా వర్షాలు కురవడంతో అన్నదాతలు కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బోర్ల కింద నారుమడులు పోసినవారు నాట్లకు సిద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల నారుమడులు వాడుబట్టిన దశలో వర్షాలు కురవడంతో జీవం పోసుకున్నాయి. అన్నదాతల్లో ఆనందాన్ని నింపాయి. చల్లపల్లి : జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు అన్నదాతల్లో సరికొత్త ఆశలు రేకెత్తించాయి. రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ఈసారి ఖరీఫ్‌లో 6.34లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేయనున్నారు. ఇప్పటికే బోర్ల సాయంతో ఉయ్యూరు, పామర్రు, గుడివాడ మండలాల్లోని పలు ప్రాంతాల్లో నారుమడులు పోశారు. మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలకు ఆయా ప్రాంతాల్లో వరినాట్లు పనులు ప్రారంభించారు. మొత్తంమీద వాతావరణం చల్లబడి పలుచోట్ల వర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు . నారుమడులకు జీవం పోసిన వర్షం మొవ్వ, గుడివాడ, తోట్లవల్లూరు మండలాల్లో పోసిన నారుమడులకు సరిగా నీరందక నైలిచ్చి వాడుబట్టాయి. ఈ నేపథ్యంలో గత మూడు రోజుల్లో జిల్లాలో 64మి.మీ సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో ఆయా మండలాల్లో నారుమడులు మళ్లీ జీవం పోసుకున్నాయి. దివిసీమలోని ఆరు మండలాలతోపాటు మచిలీపట్నం, పెడన, మొవ్వ మండలాల్లో రైతులు నారుమడులు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 15లోపు నారుమడులు జూలై 15వ తేదీలోపు ఖరీఫ్ సాగుకు నారుమడులు పోసుకుంటేనే ఎక్కువ సాగు చేసే బీపీటీ-5204, 1061 వరి రకాలు సక్రమంగా దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. దీంతో పంటబోదెలు, మురుగు కాలువల్లో చేరిన వర్షం నీటితో అయినా నారుమడులు పోసుకునేందుకు రైతులు ఆతృత పడుతున్నారు. ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో వర్షాలు కురుస్తాయని రైతులు భరోసాగా ఉన్నారు. ఈ ఖరీఫ్‌కు పంటకాలువల ద్వారా సకాలంలో సాగునీరు అందే పరిస్థితి లేకపోవడంతో జిల్లా రైతులు వరుణుడుపైనే కొండంత ఆశలు పెట్టుకుని ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. -
నాగలి కదిలింది..
వేద పండితుల జపాలే ఫలించాయో.. అన్నదాతల ఆక్రందనలే వినిపించాయో మరి.. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. వానమ్మను పంపి నెర్రెలు బారిన నేల తల్లికి ఊరట కలిగించాడు. ఖరీఫ్ పంటలకు ప్రాణం పోసేందుకు ఊతమిచ్చాడు. ఆలస్యంగానైనా తొలకరి పలకరించటంతో తేరుకున్న రైతన్నలు సాగు పనులకు శ్రీకారం చుట్టారు. రేపల్ల్లె/కొరిటెపాడు(గుంటూరు): జిల్లా వ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి వర్షపు జల్లులు పడటంతో అన్నదాతల్లో ఆశలు చిగురించారుు. కొంతమేరైనా పంట పొలాలు తడవటంతో ఖరీఫ్ పనులకు సిద్ధమయ్యూరు. ఇప్పటికే విత్తనాలను సిద్ధం చేసుకున్నవారు వ్యవసాయ పరికరాలకు పని చెప్పేందుకు సన్నాహాలు ప్రారంభించారు. జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 8.64 సెంటీ మీటర్లు కాగా గురువారం వరకు ఒక్క చినుకూ రాలకపోవటంతో అటు రైతులు, ఇటు అధికారులు తీవ్రంగా ఆందోళన చెందారు. ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే పరిస్థితి నెలకొనటం అందరికీ కలవరం కలిగించింది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 13.85 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 25,778 ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు వేశారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడటం, ఇవి కొనసాగే అవకాశాలుండటంతో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. శుక్రవారం నూజెండ్ల మండలంలో అత్యధికంగా 2.40 సెంటీ మీటర్ల వర్షం పడగా జిల్లాలో సగటున 0.41 సెం.మీ వర్షపాతం నమోదైంది. వర్షపాతం వివరాలు.. జిల్లాలో శుక్రవారం నూజెండ్ల మండలంలో అత్యధికంగా 2.40 సెంటీమీటర్లు, అత్యల్పంగా మాచర్ల మండలంలో 0.10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సగటున 0.41 సెం.మీ వర్షం పడింది. అమృతలూరు మండలంలో 2.02 సెం.మీ, బాపట్లలో 2, తుళ్లూరులో 1.64, అమరావతిలో 1.38, మంగళగిరిలో 1.34, వెల్దుర్తిలో 1.32, పెదనందిపాడులో 1.26, తాడికొండలో 1.22, భట్టిప్రోలులో 1.10, వట్టిచెరుకూరులో 0.92, తాడేపల్లిలో 0.86, పెదకాకానిలో 0.86, ఫిరంగిపురం లో 0.66, సత్తెనపల్లిలో 0.64, గుంటూరు లో 0.60, అచ్చంపేటలో 0.56, ప్రత్తిపాడులో 0.52, మేడికొండూరులో 0.44, క్రోసూరులో 0.36, పెదకూరపాడులో 0.22, యడ్లపాడులో 0.20, నాదెండ్ల లో 0.16, నరసరావుపేటలో 0.14, ముప్పాళ్ల మండలంలో 0.12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఖరీఫ్ విత్తనాలు సిద్ధం
అందుబాటులో పత్తి, వరి, మొక్కజొన్న, జీలుగ, సోయూబీన్ జిల్లాలో 5,40,450 హెక్టార్ల విస్తీర్ణంలో పంటల సాగు వ్యవసాయ శాఖ అంచనా ఎమ్మార్పీకి మించి అమ్మితే చర్యలు జేడీఏ రామారావు హెచ్చరిక వరంగల్, న్యూస్‌లైన్: ఖరీఫ్ సాగుకు అవసరమైన విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. సీజన్లో ముందుగా అవసరమైన పత్తి విత్తనాలపై వ్యవసాయ శాఖ దృష్టి కేంద్రీకరిం చింది. ఇదేకాకుండా... ప్రధానమైన వరి, మొక్కజొన్న, మిర్చి, వేరుశనగతోపాటు సబ్సిడీపై అందించే పలు విత్తనాలు మార్కెట్‌కు చేరుకున్నాయి. జూన్ ప్రారంభమైనందున రుతుపవనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయనే సమాచారంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇటీవల కురిసిన ఒకటిరెండు వర్షాలతో పొడి దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. నీటి వనరులు అం దుబాటులో ఉన్న కొందరు రైతులు పత్తి, మొక్కజొన్న, వరి విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ముందు జాగ్రత్తగా విత్తనాల కొనుగోళ్లు సైతం సాగిస్తున్నారు. మరో ఒకటి, రెండు వర్షాలుకురిస్తే విత్తనాల కొనుగోళ్లు ఊపందుకునే అవకాశముంది. ఈ ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 5,40,450 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు వివిధ పంటలను సాగు చేస్తారనే అంచనాతో వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తొలకరికి ముందే విత్తనాలు మార్కెట్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటే రైతుల నుంచి ఒత్తిడి తగ్గుతుందనే అంచనాతో వారు ముందుకు సాగుతున్నారు. పత్తి : జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణం 2,28,207 హెక్టార్లు కాగా... గత ఖరీఫ్‌లో 2,43,585 హెక్టార్ల విస్తీర్ణంలో సాగైంది. ఈ ఖరీఫ్‌లో 2,75,000 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. దీనినుగుణంగా వారు పత్తి విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్‌కు 14,56,200 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు ఇదివరకే ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం మార్కెట్లోకి 9,50,000 పత్తి విత్తన ప్యాకెట్లు మార్కెట్లోకి వచ్చాయి. బీటీ -2 రకం 450 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ. 930లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సుమారు 2 లక్షల ప్యాకెట్ల మేరకు విక్రయించినట్లు అంచనా. వరి : 1,60,000 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగవుతుందని అధికారుల అంచనా. దీనికనుగుణంగా 1,50,000 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నట్లు ఏపీసీడ్స్ అధికారులు తెలిపారు. బీపీటీ-5204 సాంబమసూరి, ఎంటీయూ-1001, 1010, 7029 రకాల వరి విత్తనాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వరి విత్తనాలకు సంబంధించి కిలోకు రూ.5 సబ్సిడీ ఇస్తున్నారు. మొక్కజొన్న : 73,000 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. దీనికి అవసరమైన వ వివిధ కంపెనీలకు చెందిన 5,000 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో పెట్టినట్లు తెలిపారు. మొక్కజొన్న విత్తనాలను కిలోకు రూ.25 సబ్సిడీ కింద అందజేస్తున్నారు. జీలుగ : జిల్లాలో 4,000 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు అవసరం కాగా... ఇప్పటివరకు 2500 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నారుు. కిలోకు రూ.25 సబ్సిడీపై వీటిని విక్రయిస్తున్నారు. సోయాబీన్ : 300 ఎకరాల విస్తీర్ణంలో రైతులు సోయాబీన్ సాగు చేస్తారని అధికారుల అంచనా. ఈ మేరకు 300 క్వింటాళ్ల విత్తనాలు అవరమవుతాయి. ప్రస్తుతం 180 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. 33 శాతం సబ్సీడీపై కిలోకు రూ.78 చొప్పున వీటిని విక్రయిస్తున్నారు. మినుములు : జూన్ మొదటి వారంలో మినుము విత్తనాలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఏపీ సీడ్ జిల్లా మేనేజర్ సదానందం తెలిపారు. అందుబాటులో అన్నిరకాల విత్తనాలు ఈ ఖరీఫ్‌లో విత్తన సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. గతంలో పత్తి విత్తనాల కోసం రైతులు పోటీపడేవారు. ఇప్పుడు అన్ని రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాం. ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవు. బ్లాక్ మార్కెట్, అదనంగా ధర వసూలు చేస్తే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. - రామారావు, వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్