సాక్షి, హైదరాబాద్: వరి సాగు, రైతుల సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గురువారం రైతు దీక్ష చేపట్టారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఉదయం 11కు మొదలైన ఈ నిరసన దీక్ష మద్యాహ్నం 2 గంటల దాకా కొనసాగనుంది. వరి వేస్తే రైతుకు ఉరే అనే టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బండి సంజయ్ ఈ దీక్ష చేపట్టనున్నారు.
చదవండి: దళిత బంధుపై దాఖలైన 4 పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
కాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారని, రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదని బండి సంజయ్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, రైతు వ్యతిరేక వైఖరి విడనాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వరి-ఉరి ప్రభుత్వ వైఖరిపై ఈ రైతు దీక్ష చేపడుతన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment