
సాక్షి, హైదరాబాద్: పంజాబ్ రైతులకు కేసీఆర్ మూడు లక్షలు ఇస్తానంటూ ప్రకటించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ననిప్పులు చెరిగారు. తెలంగాణలో చనిపోయిన రైతులకు ఏం ఇస్తున్నావంటూ నిలదీశారు. నీ అనాలోచిత నిర్ణయాల వల్ల చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వావా అని సూటిగా ప్రశ్నించారు. చనిపోయిన రైతులకు రూ. 25 లక్షలు ఇచ్చి ఆ తరువాత కేంద్రాన్ని అడగాలని హితవు పలికారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని బండి సంజయ్ విమర్శించారు.
చదవండి: నిప్పులాంటి నిజం! సిలిండర్‌పై ఎక్స్‌ట్రా వసూళ్లు, మొత్తం లెక్కిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే!
కేసీఆర్ దీక్ష చేస్తే ఢిల్లీ దిగొచ్చిందంటున్నారు, సీఎం కేసీఆర్ దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా? పంజాబ్ రైతుల కోసమా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని ఫాంహౌజ్ నుంచి ధర్నా చౌక్ దగ్గరకు తీసుకొచ్చామన్నారు. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయాడు? అక్కడ ఏం పనుందని ప్రశ్నించారు. వారం రోజుల నుంచి ధాన్యం కొనమని చెబితే కొనలేదని దుయ్యబట్టారు. వానాకాలం పటం కొంటవా? కొనవా అని మొత్తుకున్నట్లు ప్రస్తావించారు
‘రైతుల గురించి ఆలోచించే పార్టీ బీజేపీ. రైస్ మిల్లర్ల గురించి ఆలోచించే పార్టీ టీఆర్‌ఎస్. కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తే మాపై దాడులు చేశారు. కేసీఆర్ మాటలకు ప్రజలు ఆశ్యర్యానికి గురవుతున్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనేందుకు కేంద్ర ఒప్పుకుందా? లేదా?. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తేవద్దు అంటే ఎక్కడ పోసుకోమంటావు. నీ ఫాంహౌజ్‌లో పోసుకోమంటావా’ అని సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చదవండి: ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు..
Comments
Please login to add a commentAdd a comment