సాక్షి, రాజన్న సిరిసిల్లా జిల్లా: వానాకాలం పంటను పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం కొంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 52 వేల మెట్రిక్ టన్నులు కొన్నామని, ఇంకా 3 లక్షల టన్నుల పంట కొన్సాల్సి ఉందన్నారు. తడిసిన దాన్యం కూడా కొనే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 4,743 దాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా దాన్యం సేకరిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం దాన్యం కొనుగోలు విషయములో కేంద్రం రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉండాలని హితవు పలికారు. రాష్ట్రంలో వ్యవసాయానికి నీటి వసతులకు కేంద్రం ఎలాంటి సహాయాన్ని అందించలేదని విమర్శించారు.
చదవండి: Seethakka: జైభీమ్ మూవీ ఆస్కార్ అవార్డు గెలుస్తుంది
యాసంగి దాన్యం కొనుగోలుపై కేంద్రం పునఃసమీక్షించుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై గురువారం ఇందిరా పార్క్ వద్ద దర్నాకు కూర్చోబోతున్నామని తెలిపారు. కేంద్రానికి తెలంగాణ ధనం కావాలి కానీ, దాన్యం వద్దు అనే కేంద్ర విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం రెండు నాలుకల ధోరణిని ఎండగట్టబోతున్నామని పేర్కొన్నారు. స్థానిక బీజేపీ ఆసత్య ప్రచారాన్ని నమ్మి వరి వేస్తే రైతు నష్ట పోతారని అన్నారు.
చదవండి: మనం ఏ స్థాయిలో ఉన్నా డ్రెస్సు, అడ్రెస్సు మారకూడదు: ఉప రాష్ట్రపతి
యాసంగి వరి దాన్యం కేంద్రం కొనే విషయం నిజమైతే, పూర్తి పంట కొంటామని రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులను మోసం చేస్తున్న బండి సంజయ్ రెండు చెంపలు పగులకొట్టి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలను నమ్మాలని, పనికిమాలిన వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment