మునిపంపుల(రామన్నపేట),న్యూస్‌లైన్: అన్నదాతకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. హెలెన్ తుపాను ప్రభావంతో అక్టోబర్ నెలలో కురిసిన వర్షాలకు ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నగా, ఈ రబీలోనైనా అప్పులు తీరుతాయనే వరిసాగు చేసిన రైతుల ఆశలు ఆది లోనే ఆవిరయ్యాయి. సమాచారం లే కుండా ఆసిఫ్ నహర్ కాలువకు సోమవారం రాత్రి నీళ్లు వదలడంతో అప్పటికే కాల్వకు పడిన గండ్ల నుంచి వరద నీరు నారుమళ్లలోకి చేరి సుమారు 100ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. దీంతో మునిపంపుల రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం
మూడు నెలల క్రితం కురిసిన వర్షాలకు ఆసిఫ్ నహర్ కాలువకు మునిపంపుల లో మూడుచోట్ల, కక్కిరేణిలో ఒకచోట గండిపడింది. అధికారులు గండ్లను పూడ్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాలువ నీటికోసం ఎదురుచూడకుండా గ్రామ రైతులు బావులు, బోర్లకింద రైతులు రబీసాగును ఆరంభించారు. నార్లుపోసి నాట్లు వేయడానికి పొలాలను సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఐబీ అధికారులు ఇంద్రపాలనగరం పెద్దచెరువు, శోభనాద్రిపురం, నీర్నెముల చెరువులను నింపారు. నీర్నెం ల చెరువు అలుగు నీళ్లతో పొలాలు మునుగుతాయని భావి ంచిన చెరువు దిగువన ఉన్న రైతులు సోమవారంరాత్రి గే ట్లు లేపడంతో నీరు దిగువకు పారింది. పెద్ద ఎత్తున వచ్చిన కాలువనీరు గతంలో పడిన గండ్ల గుండాపోయి పొలాలు మునిగాయి.
దెబ్బతిన్న రోడ్లు
వరద నీటి ఉధృతికి మునిపంపుల-ఇస్కిళ్ల గ్రామాల మధ్య వేసిన రోడ్డు తెగింది. గత వర్షాలకు తెగిన రోడ్డుకు ఇటీవలే మరమ్మతులు చేపట్టారు. మా మిండ్ల శేషాద్రి, కూనూరు రాములు, పాండు, గంగాధరి గోపాల్, డోగిపర్తి జానకిరాములు, సప్పిడి భాస్కర్‌రెడ్డి, భగవంతరెడ్డి, సోమవీరనర్స య్య, సద్దుల మల్లేశం, మిర్యాల రవిలకు చెందిన సుమారు 40 ఎకరాల పొలం, నారు మడులు నీటమునిగి ఇసుక మేట వేసింది. దీంతో రైతులు ఆం దోళన చెందుతున్నారు. తహసీల్దార్ బండఅరుణారెడ్డి, ఎంపీడీఓ కె.సునీత, ఏఈలు జి.కొండయ్య, సదానందం, సర్పంచ్ కూనూరు రాముల మ్మ, పంచాయతీ, రెవెన్యూ కార్యదర్శులు చంద్రశేఖర్, అం జయ్యలు దెబ్బతిన్న పొలాలు, రహదారులను పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు.
రైతుల కష్టం కన్నీటి పాలు
Published Wed, Jan 1 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
Advertisement
Advertisement