ఆదిలాబాద్ అగ్రికల్చర్ : కార్తెలు కరిగిపోతున్నాయి. వరుణుడు ‘విశ్వరూపం’ చూపించడం లేదు. చిరుజల్లులతోనే సరిపెడుతున్నాడు. ముసురుతోనే మురిపిస్తున్నాడు. కనీసం భూమైనా తడవడం లేదు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఇప్పటికీ వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచింది. కనీసం జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. నారుమళ్లు బీళ్లుగా మారుతున్నాయి. వరిసాగు జిల్లాలో ఇప్పటివరకు పది శాతానికి కూడా నోచుకోలేదు.
ఈ ఖరీ్‌ఫ్‌లో 1.45 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ, ఇప్పటివరకు 850 ఎకరాలలో మాత్రమే సాగైంది. ఫలితంగా ఈ ఏడాది వరిధాన్యం సాగు లేక అందరికీ అన్నంపెట్టే రైతన్నకే మెతుకు కరువయ్యే పరిస్థితి వస్తోంది. ఇప్పటికే బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. రాబోవు రోజుల్లో వర్షాభావంతో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉంది.
నాటుకు వెనుకడుగు..
ఈ ఖరీఫ్ ఆరంభంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి వా ణిజ్య పంటలైన పత్తి, సోయాబీన్ పంటలు రైతులు సా గు చేశారు. అనంతరం వర్షాలు కురవక పోవడంతో విత్తనాలు భూమిలోనే వట్టిపోయాయి. బావులు, బోర్లు ఉన్న రైతులు విత్తనాలను కాపాడుకోగలిగారు. ఇప్పటికి పంటలను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఏటా తొలక రి జల్లులతో వరి విత్తనాలు అలికి 25 నుంచి 35 రోజుల మధ్య వ్యవధిలో వచ్చిన నారును నాట్లుగా వేసేవారు.
ఈ ఏడాది వర్షాలు లేక విత్తనాలు చాలా ప్రాంతాల్లో అలకలేదు. నీటి సౌకర్యం ఉన్న కొద్ది మంది రైతులు విత్తనాలు అలికినా.. నాట్లు వేయడానికి వెనకడుగు వేస్తున్నారు. మొలక వచ్చిన నారు నాట్లు వేసుకునే గడువు దాటిపోవడంతో నారుమళ్లలో పశువులను వదులుతున్నారు. బోరుబావుల నుంచి నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా అందిస్తామంటే కరెంటు ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? తెలయడం లేదని రైతులు పేర్కొంటున్నారు.
వర్షాలు సరైన సమయంలో పడితే ఇప్పటి వరకు 70 శాతం నాట్లు వేసుకుని ఎరువులు చల్లుకునే వారు. గతేడాది అతివృష్టి వల్ల పంటలు నష్టపోగా ఈ ఏడాది అనావృష్టితో కరువు పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి. స్వల్పకాలిక వరి విత్తనాలు 90 నుంచి 100 రోజుల్లో పంట చేతికొచ్చే విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పొలంలో 3 నుంచి 5 మీ.మీ. నీరు ఉన్నప్పుడే నారు వేసుకోవాలంటున్నారు.
తీవ్రమైన వర్షప్రభావం
జిల్లాలో వాతావరణం అనుకూలంగా లేక ఈ ఖరీఫ్‌లో 16లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్య వసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు 11.20 లక్షల ఎకరాల్లో విత్తనాలు విత్తారు. జూలై 28 వరకు సాధారణ వర్షపాతం 486.3 మిల్లీమీటర్లు కురువాల్సి ఉండగా 216.5 మాత్రమే పడింది. లోటు వర్షపాతం నమోదైంది. గతేడాదిలో ఈరోజు వరకు 829 మీ.మీ కురిసింది. 48 శాతం అధికంగా నమోదైంది. జలాశయాలు, చెరువులు నిండుకుండల తలపించాయి. వాగులు ఉప్పొంగి పంటలను తీవ్రంగా నష్ట పరిచాయి. ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైంది.
పంటలు పూర్తిస్థాయిలో సాగు చేసుకోవడానికి జూలైలో కురిసే వర్షాలే కీలకం. ఆగస్టులో కురిసే వర్షాలతో స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పత్తి, సోయాబీన్ పంటలు వేసుకోరాదని విత్తుకునే గడువు ముగిసిందని ఇప్పుడు విత్తుకుం టే పంటనష్టం వాటిల్లుతుందని వ్యవసాయ అధికారు లు సూచిస్తున్నారు.ఎక్కువగా ప్రత్యామ్నాయ పంట లైన నువ్వులు, పొద్దుతిరుగుడు, కంది, ఆముదం, జొన్న పంటలు వేసుకోవాలని ఈ పంటలు ఆగస్టు 10వ తేదీ వరకు విత్తుకోవచ్చని తెలుపుతున్నారు.
విత్తుకోలేక ఇళ్లలోనే నిల్వ
జిల్లాలో సాగుకు అనుగుణంగా విత్తనాల ప్రణాళికను వ్యవసాయ అధికారులు రూపొందించారు. వరి విత్తనాలు 10 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. 4,200 క్వింటాళ్లు రైతులు తీసికెళ్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కొనుగోలు చేసినవి విత్తుకునేందుకు వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసుకోలేదు. వర్షాలు కురిస్తే విత్తుకుంటామని ఇళ్లలోనే నిల్వ చేసుకుని నిరీక్షిస్తున్నారు.
సోయాబీన్ 90 వేల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు 82 వేల క్విం టాళ్లు రైతులు తీసుకె ళ్లారు. వర్షాలు లేక విత్తనాలు మొ లకెత్తక పోవడంతో రెండు, మూడుసార్లు విత్తుకున్నా రు. కందులు 600 క్వింటాళ్లకు 350 క్వింటాళ్ల విత్తనా లు విత్తుకున్నారు. ఇతర విత్తనాలు కొనుగోలు చేసిన వర్షాలు లేకపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు.
ఖరీఫ్‌లో వరి సాగు అంతంతే..
Published Tue, Aug 5 2014 2:02 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement