The rainy season
-
వాగు ఎట్లా దాటాలి..
ఇరు గ్రామాల ప్రజల ఆవేదన వంతెన లేక ఇబ్బందులు రాకపోకలకు అంతరాయం వర్షాకాలం వచ్చిందంటే ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి.. ముఖ్యంగా రైతులు పంటపొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కారణం.. ఇరు గ్రామాల మధ్య ఉన్న వాగు పొంగిపొర్లడమే.. భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.. వాగుపై వంతెన నిర్మిస్తే తమ కష్టాలు దూరమవుతాయని ఆయా గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు.. జక్రాన్‌పల్లి : మండలంలోని మనోహరాబాద్ – కలిగోట్ గ్రామాల మధ్య వంతెన నిర్మాణం కలగా మారింది. ఇరు గ్రామాల మధ్య రొడ్డం వాగు ప్రవహిస్తోంది. ఏటా వర్షాకాలం వచ్చిందంటే రెండు గ్రామాల మ«ధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అంతేకాక వాగు దాటి వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే రైతులకు ఇబ్బందులు తప్పవు. వాగు పారితే వాగుకు అటువైపు పంటపొలాలు ఉన్న రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. లేదంటే వేరే రోడ్డు గుండా అటువైపు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు దూరం వెళ్లి తిరిగి రావాల్సి ఉంటుంది. వాగు చుట్టు పక్కన పంట పొలాలు ఉన్న రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. వర్షాలు సకాలంలో కురుస్తున్నా వాగు దాటి వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతునానరు. రైతులకే కాక కలిగోట్,చింతలూర్ గ్రామాల ప్రజలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఈ రెండు గ్రామాల ప్రజలు నిత్యం ఆర్మూర్ పట్టణ ప్రాంతానికి ఈ బైపాస్ రోడ్డు మీదుగానే ప్రయాణిస్తుంటారు. వాగుపై వంతెన లేకపోవడంతో ఆర్మూర్, జక్రాన్‌పల్లి మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు అదనంగా మూడు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో వాహనదారులకు అదనపు భారం పడడమే కాకుండా సమయం కూడా వృథా అవుతోంది. వాగుపై వంతెన నిర్మించాలని గతంలో ప్రజాప్రతినిధులు,అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలోనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణానికి కృషి చేయాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వంతెన లేక ఇబ్బందులు పడుతున్నాం.. -
సర్దన.. వ్యాధులతో హైరానా
అస్తవ్యస్తంగా డ్రై నేజీ వ్యవస్థ పేరుకుపోతున్న పారిశుద్ధ్యం పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు ఇద్దరికి మలేరియా పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు మెదక్‌రూరల్:వర్షాకాలం ప్రారంభమైంది.. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.. గ్రామల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని కలెక్టర్ మొదలుకొని తహశీల్దార్ వరకు వారం వారం వీడియోకాన్ఫరెన్స్‌లలో పదే పదే చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో సీజనల్ వ్యాధులు పొంచి ఉండగా, ఇప్పటికే మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మెదక్ మండలంలోని సర్ధన గ్రామంలో మురికి కాల్వలు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో పారిశుద్ధ్యం పేరుకుపోయింది. అలాగే మురికి కాల్వలపై ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు మురికి కాల్వల్లో ఎక్కడికక్కడ మురికి నీరు నిల్వ ఉండటంతో గ్రామంలో దోమలు, ఈగలు విపరీతంగా వద్ధి చెందాయి. దీంతో రాత్రి పగలు అనే తేడాలేకుండా ప్రజలు దోమలు, ఈగలతో అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. దోమలు విపరీతంగా పెరగడంతో ప్రజలు మలేరియా వంటి వ్యాధులకు గురికావస్తుంది. ఇప్పటికే గ్రామంలోని శ్రీకాంత్, దాసు అనే ఇద్దరు వ్యక్తులు మలేరియా వ్యాధికి గురికాగా, మరికొంతమంది వాంతులు, విరేచనాలకు గురై ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. ప్రజాప్రతినిధులుగాని, అధికారులుగాని పట్టించుకోక పోవడంతో ప్రజలంతా దోమలతో మలేరియా వ్యాధులకు గురవుతుండగా, ఈగలతో వాంతులు, విరేచనాలకు గురవుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, దోమల నివారణ మందులు వేయించాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి వెంటనే గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి గ్రామప్రజలను సీజనల్ వ్యాధులనుంచి రక్షించాలని పలువురు కోరుతున్నారు. ఇద్దరు మలేరియాకు గురయ్యారు: గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించక పోవడంతో మురికి కాల్వల్లో చెత్తా చెదారం పేరుకుపోయింది. దీంతో విపరీతంగా దోమలు, ఈగలు పెరిగిపోయాయి. ఫలితంగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మలేరియాకు గురికాగా, చాలా మంది సీజనల్ వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. –రాంచందర్, సర్ధన గ్రామస్తుడు ఎవరూ పట్టించుకోవడం లేదు: గ్రామంలో పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నా అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదు. గ్రామంలో సమస్యలపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించాం. అయినప్పటికీ అధికారులు ఎవరు మా గ్రామంవైపు కన్నెత్తి చూడటం లేదు. డ్రై నేజీలతోపాటు రోడ్లు కూడా అధ్వాన్నంగానే ఉన్నాయి. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికి గ్రామానికి చెందిన రోడ్లు ఎక్కడికక్కడ గుంతలమాయంగా మారి ప్రజలు కాలి నడకన కూడా నడవలేని స్థితికి చేరింది. –కిరణ్‌కుమార్, సర్ధన గ్రామస్తుడు. మలేరియా వచ్చింది గ్రామంలో విపరీతంగా దోమలు ఉన్నాయి. మురికి కాల్వలు శుభ్రం చేయడం లేదు. గ్రామంలో దోమలు, ఈగలు పెరిగిపోయి వ్యాధులు ప్రబలుతున్నాయి. నేను ఇటీవల మలేరియాకు గురికాగా ప్రై వేట్ ఆస్పత్రికి వెళ్తే వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. –శ్రీకాంత్, మలేరియా బాధితుడు -
వర్షాకాలంలోనూ దాహం కేకలు!
అడుగంటిన తాగునీటి చెరువులు వర్షాలు కురిసినా ఉపయోగం లేదు కాలువలకు నీటి విడుదల ఎప్పుడో.! మచిలీపట్నం : పాలకుల నిర్లక్ష్యం జిల్లా ప్రజల పాలిట శాపంగా మారింది. వర్షాకాలంలోనూ తీర ప్రాంతంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. జూలై వచ్చినా కాలువలకు తాగునీరు విడుదల చేయలేదు. ఎప్పటికి విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాలు సమృద్ధిగానే కురిసినా, ఆ వాన నీటిని చెరువులకు మళ్లించే చర్యలు చేపట్టలేదు. దీంతో తీర ప్రాంతంలోని తాగునీటి చెరువులు అడుగంటి పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గుక్కెడు నీరు ఇవ్వండి మహాప్రభో అని ప్రజలు గొంతెత్తి అరుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కాలువలకు తాగునీటి ఎప్పటికి విడుదల చేస్తారో, ఎప్పటికి చెరువులను నింపుతారనేది తెలియని పరిస్థితి నెలకొంది. అడుగంటిన చెరువులు సముద్రతీరం వెంబడి ఉన్న నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన, గూడూరు, పశ్చిమగోదావరి జిల్లాకు సరిహద్దున ఉన్న కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల్లోని తాగునీటి చెరువులు పూర్తిగా అడుగంటాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కొద్దిపాటి నీరు చెరువుల్లోకి చేరినా అవి పంపింగ్‌కు సరిపడా లేని పరిస్థితి నెలకొంది. మచిలీపట్నం, పెడన పురపాలక సంఘాలతో పాటు బందరు, గూడూరు మండలాలకు తాగునీటిని సరఫరా చేసే తరకటూరు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు పూర్తిస్థాయిలో అడుగంటింది. 5.9 మీటర్ల నీటి సామర్ధ్యం ఉన్న ఈ ట్యాంకులో ప్రస్తుతం 1.20 మీటర్ల నీరు మాత్రమే ఉంది. రెండున్నర మీటర్లకు ఈ ట్యాంకరులో నీటి మట్టం చేరితే డెడ్ స్టోరేజీగా పరిగణిస్తారు. ప్రస్తుతం 1.20 మీటర్ల మేర ఉన్న నీరు పచ్చగా మారి తాగడానికి పనికిరాని పరిస్థితి నెలకొంది. పంపింగ్, లేదా ఆవిరి అవడం ద్వారా రోజుకు నాలుగు పాయింట్లు చొప్పున చెరువులోని నీరు ఖర్చవుతుందని సిబ్బంది చెబుతున్నారు. 20 ఏళ్లలో ఇంతగా చెరువులో నీటిమట్టం పడిపోయినా దాఖలాలు ఈ ఏడాదే చూశామని సిబ్బంది అంటున్నారు. ప్రస్తుతం ఈ ట్యాంకులో ఉన్న నీరు పది, పదిహేను రోజులకు మించి రాదని అది కూడా మూడు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తేనే ఈ లెక్క సరిపోతుందని మునిసిపల్ అధికారులు తెలిపారు. నాగాయలంక మండలం ఎదురుమొండి, నాచుగుంట, ఈలచెట్లదిబ్బ గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే చెరువు పూర్తిస్థాయిలో అడుగంటింది. నాగాయలంక, కోడూరు మండలాల్లోని పది పంచాయతీలకు తాగునీటిని సరఫరా చేసే కమ్మనమోలు మంచినీటి పథకం చెరువులో నీరు లేకపోవటంతో పడకేసింది. ట్యాంకర్ల ద్వారా అరకొరగా .. తీర ప్రాంతంలో వేసవి నుంచి తాగునీటి ఎద్దడి వెంటాడుతూనే ఉంది. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా అరకొరగానే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కృత్తివెన్ను మండలంలోని మాట్లం, పల్లెపాలెం, గరిసపూడి, లక్ష్మీపురం పంచాయతీలకు రోజు విడిచి రోజు ట్యాంకరును పంపుతున్నారు. కుటుంబానికి రెండు బిందెలు చొప్పున మాత్రమే తాగునీటిని ఇస్తున్నారు. నాగాయలంక మండలం గుల్లలమోద, పెదకమ్మవారిపాలెం, దీనదయాళపురం గ్రామాలకు రోజు విడిచి రోజు ట్యాంకరు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటి అవసరాలకు ఒకటి, రెండు బిందెలను వాడుకుని వంటకు స్థానికంగా లభించే ఉప్పునీటినే ఉపయోగించాల్సిన పరిస్థితి ఈ గ్రామాల్లో ఉంది. కోడూరు మండలం దింటిమెరక, పాలకాయతిప్ప, రామకృష్ణాపురం, ఇరాలి గ్రామాల్లోనూ తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో ఒక్క తాగునీటి పథకం పనిచేయటం లేదు. తాగునీటి చెరువులు ఎండిపోవటంతో ట్యాంకర్ల ద్వారా కుటుంబానికి ఇచ్చే రెండు, మూడు బిందెల నీటితోనే అక్కడి ప్రజలు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. కైకలూరులోనూ రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నా అవి ప్రజల తాగునీటి అవసరాలను తీర్చలేకపోతున్నాయి. పరిస్థితి ఇలా ఉన్నా పాలకులు తాగునీటి అవసరాల కోసం నీటిని కాలువలకు విడుదల చేయకపోవటం గమనార్హం. -
కాలనీళ్లు
- ఇళ్లను ముంచెత్తుతున్న మురుగునీరు - కాలనీ వాసులకు ఏటా తప్పని కష్టాలు - గ్రేటర్లో 4600 కి.మీ. మేర మురుగునీటి పైప్లైన్లు - సరిగా సాగని పూడికతీత పనులు - చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోళ్లు సాక్షి,సిటీబ్యూరో: వాన పేరు వింటే నగరంలోని బస్తీ జనాలు హడలిపోతున్నారు. చినుకు పడితే వణికిపోతున్నారు. ఏవైపు నుంచి ఏ నాలా పొంగి ఇళ్ల మీదకు వస్తుందోనని భీతిల్లుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ పరిధిలోని మురుగునీటి కాల్వలు, నాలాలు ఉప్పొంగి సమీప కాలనీలు, బస్తీలను ముంచెత్తుతున్నాయి. గత పక్షం రోజుల్లో మహా నగర పరిధిలో 138.2 మిల్లీమీటర్ల (దాదాపు 13.8 సెంటీమీటర్ల) వర్షపాతం నమోదైంది. నాలాల్లో పూడికతీత సరిగా లేకపోవడంతో ఈ నీరు వర్షపునీటితో కలసి ఇళ్లలోకి చేరుతోంది. మహా నగర వ్యాప్తంగా 4600 కి.మీ. మేర ఉన్న డ్రైనేజీ పైప్లైన్లు, 1500 కి.మీ. విస్తరించిన నాలాలు, మరో 1.85 లక్షలు ఉన్న మ్యాన్‌హోళ్లలో పేరుకుపోయిన మట్టి, చెత్తా చెదారం, పూడికను 60 శాతమే తొలగించారు. దీంతో ఈ దుస్థితి తలెత్తింది. వర్షం పడిన ప్రతిసారీ ఇదే పరిస్థితి. ఎక్కడి మురుగు అక్కడే వివిధ ప్రాంతాల్లో మూతలు లేని మ్యాన్‌హోళ్లలో తినుబండారాల దుకాణాల యజమానులు, బిల్డర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఫుట్‌పాత్ వ్యాపారులు, నిర్మాణ సామగ్రి, కొబ్బరిబోండాలు, ప్లాస్టిక్ పేపర్లు, గ్లాసులు, చెత్తా చెదారం, మట్టితో నింపేస్తున్నారు. దీంతో డ్రైనేజీ లైన్లు పూడుకుపోయాయి. వర్షాలకు ఆయా ప్రాంతాల్లో మురుగు ముంచెత్తుతోంది. ఈ వేసవిలో సుమారు 1840 కి.మీ. మురుగునీటి పైప్లైన్లలో పూడికతీత పనులు అరకొరగా చేపట్టడంతో పరిస్థితి విషమించింది. దీనిపై కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, జలమండలి క్షేత్రస్థాయి అధికారులకు, అత్యవసర కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేస్తున్నా స్పందన అంతంతమాత్రమేనని శివారు వాసులు గగ్గోలు పెడుతున్నారు. గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లలోని వందలాది కాలనీలు, బస్తీల్లో డ్రైనేజి ఔట్లెట్ సదుపాయాలు లేవు. దీంతో వర్షం పడిన ప్రతిసారీ వాన నీటితో కలిసిన మురుగునీరు నివాసాలను ముంచెత్తుతుండడం గమనార్హం. ఇదీ నాలాల దుస్థితి నగరంలో వాన వచ్చిన ప్రతిసారీ ప్రజల ప్రాణాలు నీటిలో కలుస్తున్నాయి. వర్షం కురిస్తే నీరు సాఫీగా వెళ్లే మార్గం లేకపోవడం. నాలాలపైనే అంతస్తులకు అంతస్తులు వెలియడంతో ఈ దుస్థితి నెలకొంది. వీటి అభివృద్ధికి జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించినప్పటికీ ఏళ్లకేళ్లుగా పనులు ముందుకు కదలడం లేదు. దీంతో ఏటా వర్షాకాలంలో జనం ప్రాణాల మీదకు వస్తోంది. తాజాగా మూసీ కాలువలో పడి తరుణ్(7) అనే బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇటీవల సీఎం నగర పర్యటనలో, స్వచ్ఛ కమిటీ సమీక్షలో సైతం నాలాల దుస్థితినే ప్రజలు ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో నష ్టనివారణకు స్వల్ప, దీర్ఘకాలికంగా వీటి అభివృద్ధి పనులు చేయాలని భావించారు. దీనిపై స్వచ్ఛ కమిటీ చేసిన సిఫారసులు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇవీ కమిటీ సిఫారసులు - నాలాల విస్తరణలో ఆస్తులు కోల్పోయే వారికి నష్ట పరిహారం తగినంత ఇవ్వాలి. - ఇల్లు పూర్తిగా కోల్పోయే వారికి కొత్త ఇల్లు ఇవ్వాలి. - ప్రభుత్వ భూముల్లోని ఇళ్ల వారికి కూడా నష్ట పరిహారం చెల్లించాలి. - ప్రైవేటు భూములకు కొత్త చట్టం మేరకు నష్ట పరిహారం చెల్లించాలి. - సత్వర భూసేకరణకు డిప్యూటీ కలెక్టర్ నేతత్వంలో టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో ప్రత్యేకంగా భూసేకరణ విభాగం ఏర్పాటు. - 26 కి.మీ. మేర ఉన్న మేజర్ బాటిల్ నెక్స్‌ను గుర్తించి ప్రథమ ప్రాధాన్యంతో పనులు చేపట్టాలి. ఆస్తులు కోల్పోయే వారికి దాదాపు రూ.223 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. - సివరేజి నాలాల్లోకి చేరకుండా వాటర్ బోర్డు చర్యలు తీసుకోవాలి. - ఏటా నాలాల్లో డీసిల్టింగ్ కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా పరిస్థితి షరా మామూలే. చెత్తను నాలాల్లో వేస్తుండటంతో పరిస్థితులు మొదటికొస్తున్నాయి. - బల్కంపేట్, గ్రీన్‌పార్క్ హోటల్, ధరమ్‌కరణ్ రోడ్, మహబూబ్ కాలేజ్, బైబిల్ హౌజ్, ఫీవర్ ఆస్పత్రి, అంబర్పేట్, మిశ్రీగంజ్ తదితర ప్రాంతాల్లో మురుగునీరు సమీప కాలనీలు, బస్తీలు, రహదారులను ముంచెత్తుతోంది. - చెత్త, మురుగునీరు నాలాల్లో చేరకుండా చర్యలు తీసుకోవాలి. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు నాలాల వద్ద ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయాలి. - నాలాలను ఏడాది పాటు సక్రమంగా నిర్వహించేలా కాంట్రాక్టు ఇవ్వాలి. వాటిని తగినంత వెడల్పు చేయాలి. ఇవన్నీ అమలైతే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదని స్వచ్ఛ కమిటీ తేల్చింది. నదిని తలపించేలా... ఖైరతాబాద్: ఖైరతాబాద్ రైల్వే గేటు ప్రధాన రోడ్డులో డ్రైనేజీ పొంగిపొర్లడంతో రోడ్డు పొడవునా నీరు నిలిచిపోయింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నీరు నిలవడంతో పాదచారులు, వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. సోమవారం రాత్రి ఖైరతాబాద్ ప్రధాన రోడ్డులోని ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద ఉన్న మ్యాన్‌హోల్ కూరుకుపోవడంతో వాటర్‌వర్క్స్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఉదయం చింతల్‌బస్తీ తదితర ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని అటువైపు వె ళ్లకుండా రైల్వేగేటు సమీపంలోని మరో మ్యాన్‌హోల్ వద్ద అడ్డుకట్ట వేశారు. దీంతో నీరు రోడ్డుపై నిలిచిపోయింది. ఎట్టకేలకు ఆ నీటిని ఇంకో మ్యాన్‌హోల్ ద్వారా మళ్లించారు. నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిని మెరుగుపరచాలనివైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆర్.బ్రహ్మయ్య కోరారు. -
అరటి సాగులో సస్యరక్షణ
నులి పురుగు బెడద వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు అరటికి నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. తేలికపాటి నేలల్లో ఉండే ఈ పురుగు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. వీటివల్ల వేర్లపై బుడిపెల వంటివి ఏర్పడుతాయి. ఉధృతి అధికంగా ఉంటే అరటి ఆకులు వాలిపోతాయి. అంచుల చివర్లు నల్లగా మారి మాడిపోతాయి. మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. పంటనాటే ముందు విత్తనశుద్ధి చేసుకుంటే పురుగును నివారించవచ్చు. నులి పురుగు ఆశించినట్లయితే 5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+ 2.5. మి.లీ మోనోక్రొటోఫాస్ లీటరు నీటిలో కలిపి మిశ్రమ ద్రావణం తయారు చేసుకోవాలి. మిశ్రమ ద్రావణంలో అరటి పిలకల దుంపలను ముంచి నాటుకోవాలి. అరటి పెరిగే దశలో పురుగుల నియంత్రణ కోసం కార్బోఫ్యురాన్ 3జీ గుళికలను మొక్కల దగ్గరగా వేయాలి. పంటల మార్పిడి వల్ల కూడా పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. ఆకుమచ్చ తెగులు దీని ప్రభావం వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. బూడిద రంగులో ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవిగా మారుతాయి. ఆకులు మాడిపోయి మొక్కలు గిడసబారుతాయి. తెగులు నియంత్రణ కోసం తోటల్లో నీరు నిల్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. తెగులు ఎక్కువగా ఉంటే 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల క్లోరోథలోనిల్ లీటరు నీటి చొప్పున కలపి పిచికారీ చేయాలి. అలాగే ఒక మి.లీ. ట్రైడిమార్ఫ్ లేదా ప్రొపికొనజోల్ లీటరు నీటి చొప్పున కలిపి రెండు మూడు సార్లు స్ప్రే చేయాలి. కాయముచ్చిక కుళ్లు అరటి కాయల చివర ముచ్చిక వద్ద నల్లగా మారి కుళ్లు మచ్చలు ఏర్పడుతాయి. తెగులు ఆశించిన కాయలను గుర్తించి తొలగించి తగులబెట్టాలి. నివారణ చర్యగా ఒక గ్రామం కార్బండజిమ్ లీటరు నీటిలో కలిపి అరటి గెలలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేసి తెగులును అదుపు చేయవచ్చు. -
విజృంభిస్తున్నాయ్..
కొద్దిపాటి జాగ్రత్తలతో.. విజృంభిస్తున్న వ్యాధుల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే కొంత మేర వాటిని నివారించవచ్చు. ప్రధానంగా దోమలు, ఈగలు, పారిశుధ్యం, తాగునీటి విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. దోమలు వృద్ధి చెందకుండా ఇంటి చుట్టు పక్కల అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతే కాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముందు పగిలిన సీసాలు, కుండీలు, వాడి పారేసిన టైర్లు, పగిలిన కుండలు, ఖాళీ డబ్బాలు, కూలర్లలో నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి. ప్రధానంగా ఇలాంటి ప్రాంతాల్లోనే దోమలు అధికంగా ఉంటాయి. ఎడిస్ దోమలు కృత్రిమంగా నిల్వ ఉన్న నీటిలోనే పెరుగుతాయి. దోమ తెరలు వాడడం, వేప ఆకులతో పొగ పెట్టడం వంటివి చేయాలి. దోమలు ఇళ్లలోకి రాకుండా కిటికీలకు, తలుపులకు సన్నని జాలీలను ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో దోమలు వృద్ధి చెందకుండా జెట్ మస్కిటో కాయిల్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. పందులు పట్టణంలో ఉండకుండా పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉంటే ఆ నీటిలో కిరోసిన్, వాడిన ఇంజిన్ ఆయిల్ చుక్కలను వేయాలి. ఇంటి మూలలు, పాఠశాలల్లో బెంచీల మూలలు, గదుల మూలలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ ప్రదేశాల్లో దోమలు, ఈగలు అధికంగా వృద్ధి చెందే ప్రమాదం ఉంది. పంచాయతీలు, మున్సిపాలిటీల వారు ఎప్పటికప్పుడు మురికి కాలువల శుభ్రత, దోమల మందు స్ప్రే చేయించడం, నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. నీటి విషయంలో.. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు నీటి సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. బోర్లు, బావులు, చేతిపంపులు, తదితర వాటి చుట్టూ ఎలాంటి మురికి నీరు నిలువ ఉండకుండా చూడాలి. చేతి పంపులకు ప్లాట్‌ఫాంలను నిర్మించాలి. మురికికాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలి. రక్షిత మంచినీటి పథకాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. క్లోరినేషన్‌ను పకడ్బందీగా చేపట్టాలి. నీరు సరఫరా అయ్యే పైప్లైన్లను పర్యవేక్షిస్తూ ఉండాలి. లీకేజీలకు మరమ్మతులు చేయించాలి. చేతిపంపులు, బావులు, నల్లాల ద్వారా వచ్చే నీటిని అలాగే పట్టుకోకుండా జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. 10 నుంచి 15 నిమిషాలు కాచిన తర్వాత చల్లారిన నీటినే తాగాలి. చిన్నారుల విషయంలో.. వర్షాకాలంలో చిన్నారులు అస్వస్తతకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ జలుబు, దగ్గు, జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చిన్నారులు తినే ఆహార పదార్థాలపై దోమలు, ఈగలు వాలకుండా చూడాలి. పండ్లు, చాకెట్లు, అన్నం వంటి వాటిని వారి చేతికి ఇవ్వకుండా తల్లిదండ్రులే తినిపించాలి. ఈగలు, దోమలు వాలే తినుబండారాలను కొనవద్దని చిన్నారులకు సర్దిచెప్పాలి. చిన్నారులకు తినిపించే సమయంలో సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. వర్షంలో చిన్నారులు తడవకుండా చూసుకోవాలి. ఏ మాత్రం అస్వస్తతకు గురైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
కళ్ల ముందే కర్ణాటకకు!
తాండూరు: వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. యేటా కాగ్నానది పొంగిపొర్లడం.. ఆ జలాలు దిగువనున్న కర్ణాటకకు తరలిపోతుండడం సాధారణమై పోయింది. భారీ వర్షాలు పడిన సమయంలో నీటి వరద పక్క రాష్ట్రానికి తరలిపోకుండా ‘చెక్’ పెట్టాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వరద నీటి వల్ల తాండూరు ప్రాంతానికి ఏ ప్రయోజనమూ ఉండడం లేదు. ప్రతి ఏడాది వర్షాకాలంలో కాగ్నాలోకి పుష్కలంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ వరద నీటిని వినియోగంలోకి తెస్తే వేలాది ఎకరాలను సాగులోకి తీసుకురావొచ్చు. తాండూరు పట్టణంతోపాటు మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ప్రాంతంలోని 33 గ్రామాలకూ తాగునీటిని అందించొచ్చు. చెక్‌డ్యాం నిర్మాణమెప్పుడో..! కాగ్నా వరద నీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు నదిలో చెక్‌డ్యాం నిర్మించాలని గతంలో ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఏడాది క్రితం రూ.8.52కోట్ల నిధులు మంజూరయ్యాయి. చెక్‌డ్యాం నిర్మాణ స్థలాన్ని ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. నదిలో చెక్‌డ్యాం నిర్మిస్తే నది చుట్టుపక్కల ఉన్న సుమారు 400 బోర్లకు పుష్కలంగా నీరు చేరుతుంది. తద్వారా సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందే వీలుంది. ప్రతిపాదిత చెక్‌డ్యాం నిర్మిస్తే 250-300 మీటర్ల పొడవున 0.35 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంటుంది. దాంతో భూగర్భజలాలు వృద్ధి చెంది భవిష్యత్తులో కరువు తలెత్తినా సాగు, తాగునీటికి సమస్య ఉత్పన్నం కాదు. కర్ణాటకకు ఇలా.. వర్షాకాలంలో కాగ్నా నుంచి తరలిపోతున్న వరద నీటిని కర్ణాటక సద్వినియోగం చేసుకుంటోంది. జలాలు బషీరాబాద్ మండలం ఇందర్చేడ్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తాయి. వరద నీరు ప్రవహించే మార్గంలో అక్కడక్కడ చిన్నచిన్న డ్యామ్‌లు సైతం నిర్మించారు. ఆ రాష్ట్రంలోని కోహెడ్, సేడం తదితర ప్రాంతాల్లో చిన్నచిన్న చెరువులు నింపడం, కాలువల ద్వారా వరద నీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. 1.9టీఎంసీల నీరు కర్ణాటక? వర్షాకాలంలో సుమారు 1.9 టీఎంసీ వరదనీరు కాగ్నా నుంచి కర్ణాటకకు తరలిపోతున్నదని సాగునీటి పారుదల శాఖ అధికారుల ప్రాథమిక అంచనా. చెక్‌డ్యాం నిర్మాణంతో ఈ వరద జలాలు అందుబాటులోకి తెవొచ్చని, దాంతో వందలాది ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.8.50కోట్ల నిధులు మంజూరైనా పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. కాగ్నాలో చెక్‌డ్యాం నిర్మాణానికి స్థలాన్ని కూడా అధికారులు ఎంపిక చేశారు. కానీ టెండర్ల ప్రక్రియ నిర్వహించి పనులు మొదలు పెట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. -
ఇంజిన్ పాడైనా ఇబ్బంది లేదు..!
వర్షాకాలం వచ్చిం దంటే... రోడ్లపై ప్రయాణం నరకాన్ని తలపిస్తుంది. నీటి ప్రవాహం... ట్రాఫిక్ జామ్... లోతు గుంతల్లో వాహనాలు చిక్కుకోవడం ఇంజిన్ ఆగిపోవడం... తిరిగి ఇంజిన్ ఆన్ చేయడానికి ఇబ్బందులు... ఈ ప్రయత్నంలో ఇంజిన్ వైఫల్యం... మరమ్మతులకు భారీ వ్యయం... ఇలాంటి సమస్యలెన్నో వాహన యజమానులను వేధిస్తుంటాయి. ముందస్తు జాగ్రత్తలు వర్షాకాలానికి ముందు ఆయా ప్రతికూలతలను ఎదుర్కొనడానికి వాహన యజమానులు తగిన చర్యలు తీసుకోవాలి. భారీ వర్షం. నీటి ప్రవాహం. రోడ్డుపై ఏర్పడే గుంతల్లో హఠాత్తుగా కారు ఇంజిన్ ఆగిపోతే... అది మనకేకాదు. మన పక్క వాహన యజమానులకూ మనం తీవ్ర ఇబ్బందిని సృష్టించినవారిమవుతాం. వర్షాకాలం ముందస్తు చెకప్స్, సర్వీసింగ్ వంటి చొరవలు తీసుకోకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఇక్కడ ఒక్కసారి బీమా, క్లెయిమ్‌ల సంగతులపై కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది. హైడ్రోస్టాటిక్ నష్టం ఇప్పుడు కార్లు లేదా మోటార్ బైక్‌లు తీసుకుందాం. భద్రత, తగిన ప్రమాణాల డ్రైవింగ్కోసం అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఇందులో అమర్చుతున్నారు. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఆధునిక సాంకేతికత కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తుంది. వర్షాకాలం- రోడ్లపై నీటి ప్రవాహంలో కనబడని పెద్ద గుంతల్లో టైర్లు చిక్కుకుపోయి కార్ల ఇంజిన్ ఆగిపోయే అవకాశం, గేర్లు మారుస్తూ అక్కడి నుంచి కారును వెలుపలికి తీసుకువచ్చే ప్రయత్నంలో ఇంజిన్ విఫలమై జరిగే నష్టం వంటి అంశాలను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలి. దీనినే ‘హైడ్రోస్టాటిక్ నష్టం’గా పేర్కొంటుంటారు. ఇంజిన్ విషయానికి వస్తే.. వాహన ఇంజిన్లు ‘కంబషన్’ అనే సూత్రంపై పనిచేస్తుంటాయి. డ్రైవింగ్‌కు సంబంధించి ఇంజిన్ సిలిండర్లోని ఇంధనాన్ని మండించడం, ఇందుకు వీలుగా పీడనాన్ని సృష్టించడానికి నిరంతర వాయువుల సరఫరా... శక్తి విడుదల ఇత్యాధి అంశాలన్నీ ఈ సూత్రంలో ఇమిడి ఉంటాయి. వర్షపు నీటి గుంతల్లో కారు చిక్కుకుపోయి... దానిని అక్కడ నుంచి గేర్లు మారుస్తూ, బలవంతంగా బయటకు తీసే క్రమంలో మనం పైన పేర్కొన్న ‘ఇంజిన్ ఫోర్స్’ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భంగా ఇంజిన్ భారీ నష్టానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇదే ‘హైడ్రోస్టాటిక్ నష్టం’. కాన్సిక్వెంటల్ నష్టం ఈ తరహా ‘హైడ్రోస్టాటిక్ నష్టాన్ని మోటార్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్స్ భాషలో ‘కాన్సిక్వెంటల్’ నష్టంగా పేర్కొంటారు. మామూలుగా తీసుకునే రెగ్యులర్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలో ఈ తరహా నష్టం కవరవ్వదు. ఒక నిర్దిష్ట చర్య వల్ల సంభవించిన నష్టం కావడమే దీనికి కారణం. అనుకోని సంఘటన వల్ల ఈ నష్టం జరగదు. ఇలాంటి సందర్భాల్లో చిన్నకార్ల ఇంజిన్ రిపేర్‌కు రూ.లక్ష వరకూ ఖర్చవుతుంది. మధ్య తరహా కార్ల విషయంలో ఈ మరమ్మతు వ్యయం రూ. 3 లక్షల వరకూ ఉంటే, ఎస్యూవీ, ప్రీమియం వాహనాల విషయంలో రూ. 10 లక్షలు దాటిపోతుంది. వ్యయ నివారణా మార్గం.. ఇక్కడే ‘ముందు జాగ్రత్త’ అన్న పదాలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనేటప్పుడు, ఈ మొత్తానికి అదనంగా 10 శాతం చెల్లిస్తే కాన్సిక్వెంటల్ నష్టానికి కొండంత అండనిస్తుంది. వాహనదారులూ తస్మాత్ ‘ముందు’జాగ్రత్త మరి!! -
భానుడు భగభగ
కర్నూలు (జిల్లాపరిషత్) : జిల్లాలో వారం రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. సుమారు నెల రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో.. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం నుంచి రోజురోజుకూ వాతావరణం వేడెక్కుతోంది. మంగళవారం 38.8 భానుడు భగభగ డిగ్రీలు నమోదైంది. జిల్లాలో అక్కడక్కడా చిరు జల్లులు కురుస్తున్నా.. ఉక్కపోత మరింత పెరుగుతోంది. గత యేడాదితో పోలిస్తే ఈ నెలలో జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం పెరగడం, గాలిలో తేమ తగ్గిపోవడంతో ఉక్కపోత అధికమైంది. పగలు, రాత్రి వేళల్లోనూ జనం ఉక్కపోత, వేడితో అల్లాడిపోతున్నారు. వర్షాకాలంలో ఈ పరిస్థితేమిటని జనం ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎండాకాలమే కొనసాగుతోందని, ఇది రెండో వేసవికాలమని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసాధారణ వాతావరణ పరిస్థితులతో ప్రజల అనారోగ్యానికి గురవుతున్నారు. రెండు, మూడు రోజులుగా అధిక శాతం ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. అవసరమైతే తప్ప ఎండలో తిరగవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక శాతం నీరు, మజ్జిగ తాగాలని, గొడుగు, టోపీలు వాడాలని చెబుతున్నారు. -
వర్షాకాలంలోనూ ఉక్క‘కోత’
గ్రేటర్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలంలోనూ నగరవాసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదలతో వర్షాల సీజన్లోనూ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దీంతో అధికారుల్లో కలవరం మొదలైంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రాల్లో నీటినిల్వలు పడిపోవడంతో పాటు బొగ్గు కొరతతో ఆశించిన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కావట్లేదు. డిమాండ్-సరఫరా మధ్య 500-700 మెగావాట్ల లోటు నమోదవుతుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రోజూ ఇళ్లకు ఆరు గంటల పాటు అధికారిక కోతలు అమలు చేస్తున్నారు. పరిశ్రమలకు వారంలో ఒకరోజే పవర్ హాలీడే అమలు చేస్తున్నట్లు చెబుతున్నా.. అంతకుమించే కోతలు అమలవుతున్నాయి. తగిన సరఫరా లేకపోవడంతో అత్యవసర లోడ్ రిలీఫ్‌ల పేరుతో రోజూ మధ్యాహ్నం రెండు గంటల పాటు కోత విధిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 37.90 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహ విద్యుత్ కనెక్షన్లు 30.90 లక్షలు, వాణిజ్య కనె క్షన్లు 5.50 లక్షలు, చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల కనెక్షన్లు 40 వేలు, ప్రకటనలు, వీధి దీపాల కనెక్షన్లు 40 వేలకుపైనే ఉన్నాయి. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 2300 మెగావాట్లు ఉం డగా, 1600-1700 మెగావాట్లకు మించి సరఫరా కావడం లేదు. దీనికి తోడు ఏటా కొత్తగా 10 శాతం కనెక్షన్లు పెరుగుతుండగా, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వినియోగం రెట్టింపవుతోంది. దీంతో ఏటా 10-12 శాతం విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం నగరవాసుల అవసరాలు పూర్తిస్థాయిలో తీరాలంటే రోజుకు కనీసం 45-47 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాగా, ప్రస్తుతం 39-40 మిలియన్ యూనిట్లకు మించి సరఫరా కావట్లేదు. -
ఆగస్టుపైనే ఆశలు !
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో గడిచిన రెండు నెలల్లో ఏ ఒక్క మండలంలోనూ సాధారణ స్థాయి వర్షపాతం నమోదు కాలేదు. ఆగస్టు నెల ప్రారంభలో అడపాదడపా చిరుజల్లులు కురుస్తున్నా పంటలు విత్తే స్థాయిలో వానల్లేవు. ఇప్పటికే వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయాధికారులు పత్తి, సోయాబీన్ సాగు చేయవద్దని రైతులకు సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెబుతున్నారు. సాధారణం కంటే తక్కువ.. గతేడాది జూలై నెలాఖరు వరకు 987.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా, ఆగస్టు నెలలో 359.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే రెట్టింపు వర్షం కురిసింది. 5.85 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు(ఆగస్టు 9వ తేదీ) సాధారణ వర్షపాతం 618.8 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 261.7 మిల్లీమీటర్లు నమోదైంది. ఇందులో జూన్‌లో సాధారణ వర్షపాతం 199.5 మిల్లీమీటర్లకు 73.1 మిల్లీమీటర్లు కురిసింది. జూలైలో 329.2 మిల్లీమీటర్లకు 158.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇక ఆగస్టులో సాధారణ వర్షపాతం 314 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉంది. గడిచిన పదేళ్ల గణాంకాల ప్రకారం ఏటా ఆగస్టు నెలలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. పంటలపై ఆశలు గల్లంతే.. జిల్లాలో ప్రధానంగా పత్తి, సోయాబీన్ సాగు చేస్తుంటారు. 90 శాతం వర్షాలపై ఆధారపడి సాగు చేస్తుంటారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 6.50 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు ప్రణాళిక రూపొందించారు. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటి వరకు 5.22 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయని చెబుతున్నా అంతకంటే తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది అధిక వర్షాలతో పంటలు నీటిపాలు కాగా.. ఈ యేడు వర్షాల జాడలేక విత్తిన పంటలపై రైతులు ఆశలు వదులుకుంటున్నారు. రెండుమూడుసార్లు విత్తినా విత్తనాలు మొలకెత్తకపోగా.. మెలకెత్తిన చోట మొక్కలు మాడిపోతున్నాయి. ఈ మొక్కలను రక్షించుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నీటి వసతి ఉన్నవారూ కరెంటు కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తన దశలోనే సుమారు రూ.2 కోట్ల వరకు జిల్లా రైతులు నష్టపోయినట్లు సమాచారం. కళ తప్పిన జాలశయాలు వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా జిల్లాలో ఉన్న 11 ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటి సాధారణ స్థాయి నీటిమట్టానికి చేరుకోలేదు. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద సాగు విస్తీర్ణం ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది ఇప్పటికే ఆయా ప్రాజెక్టుల్లోకి నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరడంతో పలుమార్లు గేట్లు తెరిచి నీటిని బయటకు వదలాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. నీళ్లు లేక జలాశయాలు వెలవెలబోతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం అంతగా లేకపోవడంతో ప్రాజెక్టులు కళ తప్పాయి. ఆయా ప్రాజెక్టుల కింద సుమారు 75 వేల హెక్టార్లు సాగవుతుండగా ఈ సారి వర్షాభావ పరిస్థితులతో సాగుపై ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ప్రధానంగా శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో వరి నాట్లు 20 శాతమే వేసుకున్నారు. వరి విత్తనాలు ఆలస్యంగా అలికి వర్షాలు పడితే నాట్లు వేసుకుందామని రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నాట్లేసినవారు ప్రాజెక్టుల్లో సరిపడా నీరులేక అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో కురిసే వర్షాలపైనే రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇకనైనా వరుణుడు కరుణించాలని వేడుకుంటున్నారు. -
నీళ్లు కరువు.. గుండె‘చెరువు’
మేడ్చల్ రూరల్ : ఖరీఫ్ సీజన్లో సాధారణ వర్షాలు కూడా కురవకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు చిరుజల్లులు తప్ప పూర్తి నేల తడిచింది లేదు. వరుణిడి కోసం ఎదురుచూసిన రైతులు బోరుబావుల వద్ద ఉన్న నీటితో వరి పంట వేసుకున్నారు. దీనికీ అంతంత మాత్రమే నీళ్లు అందుతున్నాయని, వర్షాలు కురవకపోతే భవిష్యత్‌లో ఈ పంటలు కూడా పండే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మొక్కజొన్న సాగుకు సరిపడే వర్షం కూడా కురవలేదని, ఏనాడు ఇంత గడ్డు పరిస్థితి ఎదురవలేదని అంటున్నారు. విత్తన సమయం ముగుస్తుండడంతో రైతులు భవిష్యత్‌పై ఆశలు వదులుకుని ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. నిండని చెరువులు... అడపాదడపా కురిసిన చిరుజల్లులకు చెరువుల్లోకి నీళ్లు చేరలేదు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఎండిపోయి వెలవెలబోతున్నాయి. చెరువుల్లో నీరు లేక భూగర్భజలాలు అడుగంటిపోయి బోరుబావుల్లో నీటిశాతం తగ్గిపోయింది. ఈ వర్షాకాలంలోని జూన్‌లో 123.5 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను కేవలం16.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా, జూలైలో 224 మి.మీ బదులు 68.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈనెల 8వ తేదీ వరకు 14.6 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. వారం రోజులుగా కురిసిన ముసుర్లకు బోరుబావుల వద్ద కొద్దిపాటి పంట సాగు చేపడుతున్నా, ఆలస్యం కావడంతో సగం దిగుబడే వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. పంటల సంగతి ఎలా ఉన్న కరువు ఇలానే కొనసాగితే ఇబ్బందులు తప్పవని జనం ఆందోళన చెందుతున్నారు. చేయూతనందించాలి.. కరువుతో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి ఆదుకోవాలి. పది మందికి అన్నం పెట్టే రైతు పంట సాగు చేయలేక ఇతర పనుల్లోకి కూలీలుగా వెళ్లే పరిస్థితులు వచ్చాయి. అధికారులు, శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటించి రైతులకు చేయూతనందించాలి. - సత్యనారాయణ, సోమారం -
ఖరీఫ్‌లో వరి సాగు అంతంతే..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : కార్తెలు కరిగిపోతున్నాయి. వరుణుడు ‘విశ్వరూపం’ చూపించడం లేదు. చిరుజల్లులతోనే సరిపెడుతున్నాడు. ముసురుతోనే మురిపిస్తున్నాడు. కనీసం భూమైనా తడవడం లేదు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఇప్పటికీ వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచింది. కనీసం జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. నారుమళ్లు బీళ్లుగా మారుతున్నాయి. వరిసాగు జిల్లాలో ఇప్పటివరకు పది శాతానికి కూడా నోచుకోలేదు. ఈ ఖరీ్‌ఫ్‌లో 1.45 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ, ఇప్పటివరకు 850 ఎకరాలలో మాత్రమే సాగైంది. ఫలితంగా ఈ ఏడాది వరిధాన్యం సాగు లేక అందరికీ అన్నంపెట్టే రైతన్నకే మెతుకు కరువయ్యే పరిస్థితి వస్తోంది. ఇప్పటికే బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. రాబోవు రోజుల్లో వర్షాభావంతో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉంది. నాటుకు వెనుకడుగు.. ఈ ఖరీఫ్ ఆరంభంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి వా ణిజ్య పంటలైన పత్తి, సోయాబీన్ పంటలు రైతులు సా గు చేశారు. అనంతరం వర్షాలు కురవక పోవడంతో విత్తనాలు భూమిలోనే వట్టిపోయాయి. బావులు, బోర్లు ఉన్న రైతులు విత్తనాలను కాపాడుకోగలిగారు. ఇప్పటికి పంటలను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఏటా తొలక రి జల్లులతో వరి విత్తనాలు అలికి 25 నుంచి 35 రోజుల మధ్య వ్యవధిలో వచ్చిన నారును నాట్లుగా వేసేవారు. ఈ ఏడాది వర్షాలు లేక విత్తనాలు చాలా ప్రాంతాల్లో అలకలేదు. నీటి సౌకర్యం ఉన్న కొద్ది మంది రైతులు విత్తనాలు అలికినా.. నాట్లు వేయడానికి వెనకడుగు వేస్తున్నారు. మొలక వచ్చిన నారు నాట్లు వేసుకునే గడువు దాటిపోవడంతో నారుమళ్లలో పశువులను వదులుతున్నారు. బోరుబావుల నుంచి నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా అందిస్తామంటే కరెంటు ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? తెలయడం లేదని రైతులు పేర్కొంటున్నారు. వర్షాలు సరైన సమయంలో పడితే ఇప్పటి వరకు 70 శాతం నాట్లు వేసుకుని ఎరువులు చల్లుకునే వారు. గతేడాది అతివృష్టి వల్ల పంటలు నష్టపోగా ఈ ఏడాది అనావృష్టితో కరువు పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి. స్వల్పకాలిక వరి విత్తనాలు 90 నుంచి 100 రోజుల్లో పంట చేతికొచ్చే విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పొలంలో 3 నుంచి 5 మీ.మీ. నీరు ఉన్నప్పుడే నారు వేసుకోవాలంటున్నారు. తీవ్రమైన వర్షప్రభావం జిల్లాలో వాతావరణం అనుకూలంగా లేక ఈ ఖరీఫ్‌లో 16లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్య వసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు 11.20 లక్షల ఎకరాల్లో విత్తనాలు విత్తారు. జూలై 28 వరకు సాధారణ వర్షపాతం 486.3 మిల్లీమీటర్లు కురువాల్సి ఉండగా 216.5 మాత్రమే పడింది. లోటు వర్షపాతం నమోదైంది. గతేడాదిలో ఈరోజు వరకు 829 మీ.మీ కురిసింది. 48 శాతం అధికంగా నమోదైంది. జలాశయాలు, చెరువులు నిండుకుండల తలపించాయి. వాగులు ఉప్పొంగి పంటలను తీవ్రంగా నష్ట పరిచాయి. ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైంది. పంటలు పూర్తిస్థాయిలో సాగు చేసుకోవడానికి జూలైలో కురిసే వర్షాలే కీలకం. ఆగస్టులో కురిసే వర్షాలతో స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పత్తి, సోయాబీన్ పంటలు వేసుకోరాదని విత్తుకునే గడువు ముగిసిందని ఇప్పుడు విత్తుకుం టే పంటనష్టం వాటిల్లుతుందని వ్యవసాయ అధికారు లు సూచిస్తున్నారు.ఎక్కువగా ప్రత్యామ్నాయ పంట లైన నువ్వులు, పొద్దుతిరుగుడు, కంది, ఆముదం, జొన్న పంటలు వేసుకోవాలని ఈ పంటలు ఆగస్టు 10వ తేదీ వరకు విత్తుకోవచ్చని తెలుపుతున్నారు. విత్తుకోలేక ఇళ్లలోనే నిల్వ జిల్లాలో సాగుకు అనుగుణంగా విత్తనాల ప్రణాళికను వ్యవసాయ అధికారులు రూపొందించారు. వరి విత్తనాలు 10 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. 4,200 క్వింటాళ్లు రైతులు తీసికెళ్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కొనుగోలు చేసినవి విత్తుకునేందుకు వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసుకోలేదు. వర్షాలు కురిస్తే విత్తుకుంటామని ఇళ్లలోనే నిల్వ చేసుకుని నిరీక్షిస్తున్నారు. సోయాబీన్ 90 వేల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు 82 వేల క్విం టాళ్లు రైతులు తీసుకె ళ్లారు. వర్షాలు లేక విత్తనాలు మొ లకెత్తక పోవడంతో రెండు, మూడుసార్లు విత్తుకున్నా రు. కందులు 600 క్వింటాళ్లకు 350 క్వింటాళ్ల విత్తనా లు విత్తుకున్నారు. ఇతర విత్తనాలు కొనుగోలు చేసిన వర్షాలు లేకపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు. -
ఫీ వర్రీ
ఉట్నూరు : వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ వ్యాధులతో వణికిపోతుంది. చినుకుపడితే అడవిబిడ్డలను వ్యాధులు ముసురుకుంటాయి. జ్వరాలు, మలేరియా, అతిసారం, కలరా వ్యాధులు రోజుకు ఇద్దరు, ముగ్గురిని బలితీసుకుంటాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వందల సంఖ్యలో గిరిజనులు మృత్యువాత పడతారు. వేల సంఖ్యలో మంచం పడుతా రు. ఏటా అధికారులు మాత్రం ముందస్తుగా చర్యలు తీసుకోవడం లేదు. చనిపోయినపుడే హడావుడి చేసి చేతులు దులుపుకోవడం అలవాటై పోయింది. ఈ ఏడాది కూడా వర్షాకాలం సమీపిస్తుండటంతో గిరిజనులు భయపడుతున్నారు. ఏ గడపలో రోదనలు వినాల్సి వస్తుందోనని వణికిపోతున్నారు. ఐటీడీఏ, ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకు ముందస్తుగా చర్యలు తీసుకోలేదు. గతం గుణపాఠం నేర్పుతున్నా.. 2010 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జ్వరాలు, ఇతర వ్యాధులతో దాదాపు 661 మంది గిరిజనులు మృతిచెందారు. సుమారు 14,376 మంది అతిసార బారిన పడ్డారు. మరో 2,067 మందికి మలేరియా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇంతమంది చనిపోతున్నా ఏటా అధికారులు తాత్కాలిక చర్యలతోనే సరిపెడుతున్నారు. శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు. వ్యాధుల సీజన్ ప్రారంభమైదంటే అధికారులు ర్యాఫీడ్ ఫీవర్ సర్వేలు నిర్వహించి, ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తారు. అంతేగాని నివారణ చర్యలు తీసుకోవడం లేదు. ఏజెన్సీలో పారిశుధ్యం లోపించడం, క్లోరినేషన్ కానరాక పోవడం వల్ల వ్యాధులు ప్రబలుతున్నా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతోంది. సర్కార్ వైద్యం అంతంతే.. జిల్లా వ్యాప్తంగా 8.74 లక్షల గిరిజన జనాభా ఉంది. వీరికి 31 పీహెచ్‌సీలు, 186 ఆరోగ్య ఉప కేంద్రాలు, మూడు సీహెచ్‌సీలు పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తు న్నా వ్యాధులు అదుపులోకి రావడం లేదు. ఆయా కేం ద్రాల్లో 235 పోస్టులు ఖాళీగా ఉన్నా ఐటీడీఏ అధికారులు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాగా, ఉన్న వైద్యులు, సిబ్బంది కూడా 80స్థానికంగా ఉండ టం లేదు. గిరిజనుల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ప్రారంభించిన ఫిన్ పాయింట్ అశించించి ఫలితాలలు ఇవ్వడం లేదు. దీంతో గిరిజనుల ఆరోగ్య స్థితిగతులపై అంచనా వేయడంలో యంత్రాంగం విఫలం అవుతోంది. నిధుల్లేవ్.. దోమ తెరల్లేవ్.. ప్రభుత్వం ఏటా ఎన్ఆర్హెచ్ఎం ద్వారా ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.75లక్షలు, సీహెచ్‌సీకి రూ.2 లక్షలు, ప్రతి సబ్సెంటర్కు అన్‌టైడ్ ఫండ్స్ కింద రూ.10 వేల చొప్పున విడుదల చేస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఇప్పటివరకు నిధుల జాడ లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 31 పీహెచ్‌సీలకు రూ.54.25 లక్షలు, మూడు సీహెచ్‌సీలకు రూ.6 లక్షలు, 186 సబ్‌సెంటర్లకు రూ.18.60 లక్షల అన్‌టైడ్ నిధులు విడుదలకావాలి. ఈ నిధులు విడుదలైతే అయా కేంద్రాల్లో అత్యవసర మందుల కొనుగోళ్లు, కేంద్రాల నిర్వహణ, సౌకర్యాల కల్పనకు అవకాశం ఉంటుంది. కానీ నిధులు విడుదల కాకకపోవడంతో ఆస్పత్రులు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీలో దోమల బెడదతో ఏటా మలేరియా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. దోమల బెడద నుంచి గిరిజనులను రక్షించడానికి ప్రభుత్వం ఏడేళ్లుగా దోమతెరలు పంపిణీ చేయడం లేదు. అధికారులు 1.65 లక్షల దోమ తెరలు అవసరం అని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దోమ తెరలు రాకపోవడంతో ఏజెన్సీలో దోమల బెడద పెరిగి మలేరియా పాజిటీవ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలోనైనా వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకుంటే మేలు.. * ఏజెన్సీ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. వ్యాధుల సీజన్ కావడంతో వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలి. * పల్లెల్లో పారిశుధ్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మంచినీటి పథకాల్లో క్లోరినేషన్ చేయాలి. * పెంట కుప్పలను నివాసాలకు దూరంగా వేసుకునేలా అవగాహన కల్పించాలి. * ర్యాపీడ్ ఫీవర్ సర్వేల ద్వారా గుర్తించిన వారికి సత్వరమే వైద్యం అందించాలి. * పల్లెల్లో నిర్వహించే 104, ఇతర వైద్య శిబిరాల్లో గిరిజనులు పాల్గొనేలా చూడాలి. * గిరిజన గ్రామాల్లో మొబైల్ వైద్య బృందాలు విస్తృతంగా పర్యటించేలా చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఫిన్పాయింట్ కార్యక్రమం అమలు అయ్యేలా చూడాలి. గిరిజన జనాభా : 8.74 లక్షలు ఆరోగ్య కేంద్రాలు : 220 ఆరేళ్లలో మృతులు : 660 అతిసార బాధితులు : 14,376 మలేరియా కేసులు : 2,067 ఆస్పత్రుల్లో ఖాళీలు : 235 -
కొనలేని కేంద్రాలు..!
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రబీలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనకపోవడంతో ఇంకా రైతుల వద్దే ధా న్యం దర్శనమిస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు చేయా ల్సి ఉంది. 15 కొనుగోలు కేంద్రాల్లో 8వేల ఎంటీల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉంది. దీంతో వర్షాకాలం సమీపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సరిపడా గోదాములు లేకే.. పక్షం రోజుల కింద కురిసిన అకాల వర్షాలకు కొంత మేర వరిపంట దెబ్బతినగా.. ఇప్పుడు చేతికొచ్చిన ధా న్యం నేలపాలవుతుందేమోనని దిగులు చెందుతున్నా రు. జిల్లాలో ధాన్యం నిల్వ ఉంచేందుకు సరిపడా గోదాములు లేక నిజామాబాద్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో కొ నుగోలు చేయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నా రు. ఇందుకు సివిల్ సప్లై మేనేజింగ్ డెరైక్టర్ అనిల్‌కుమార్, నిజామాబాద్ జేసీలతో జిల్లా సంయుక్త కలెక్టర్ బి. లక్ష్మీకాంతం ఆదివారం మాట్లాడినట్లు తెలిసింది. గోదాములు లేకపోవడం, వర్షకాలం దృష్ట్యా రైతులు నష్టాల పాలు కాకుండా పక్క జిల్లా రైస్ మిల్లర్లకు కొనుగోలు బాధ్యత అప్పగించనున్నట్లు అధికారులు పేర్కొంటు న్నారు. జిల్లాలోని గోదాములు ప్రస్తుతం ధాన్యంతో పూ ర్తిగా నిండిపోయినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. కొనుగోళ్లు, నిల్వలు.. రబీకి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం 95,463 మెట్రిక్ టన్నుల (ఎంటీ) వరిధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన రూ.125 కోట్లకుపైగా రైతులకు చెల్లించారు. ఐటీడీఏ ద్వారా 13,757 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ద్వారా 1,113 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్‌ల ద్వారా 27,556 మెట్రిక్ టన్నులు, డీఆర్డీఏ ద్వారా 53,037 మెట్రిక్ టన్నులు మొత్తం 95,463 ఎంటీల ధాన్యం కొనుగోలు చేశారు. దీంతో పాటు జిల్లాలోని 24 రైస్ మిల్లర్లు 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోలు చేసినందుకు రూ.88 లక్షలు పీఏసీఎస్‌లకు, రూ.20 లక్షలు డీసీఎంఎస్‌కు, రూ.2కోట్లు మహిళా సంఘాలకు కమీషన్ రూపంలో చెల్లించారు. ఈ ధాన్యాన్ని నిర్మల్, భైంసా, సారంగాపూర్, బోథ్, ఇచ్చోడ, మంచిర్యాల, లక్సెట్టిపేట, జన్నారం, నార్నూర్‌లలో ఉన్న గోదాముల్లో నిల్వ ఉంచారు. నిబంధనలు ఇవీ.. క్వింటాల్ గ్రేడ్-ఏ వరిధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1,345, కామన్ రకానికి రూ.1,310 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నాణ్యతకు సంబంధించి కూడా నిబంధనలు విధించింది. ధాన్యంలో తేమ 18 శాతానికి మించకూడదని నిబంధన పెట్టారు. వ్యర్థాలు ఒకశాతం, చెత్త, తప్పలు ఒక శాతం, రంగుమారిన, పురుగుతిన్న, మొలకెత్తిన ధాన్యం 4శాతం, పూర్తిగా తయారు కానీ, కుంచించుకుపోయిన ధాన్యం 3శాతం, కల్తీరకం ధాన్యం 6శాతం వరకు గరిష్టంగా కోత విధించాలని నిర్ణయించింది. వీటిలో ఏ ఒక్కటి ఒక్క శాతం పెరిగినా ప్రభుత్వం నిర్ణయించిన ధరలో కోత పడుతుందన్నమాట. జిల్లాలో రబీలో వరిధాన్యం దిగుబడి అధికంగా వచ్చింది. ఎక్కువగా కడెం, జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట తదితర 16 మండలాల్లో దిగుబడి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. కడెం కెనాల్‌తో ఈ ఏరియాల్లో వరిపంట అధికదిగుబడి వచ్చినట్లుగా గుర్తిస్తున్నారు. గోదాముల నిర్మాణానికి స్థల పరిశీలన.. జిల్లాలో వెయ్యి మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గోదాముల నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని పరిశీలించేందుకు మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇంజినీర్లు, అధికారులు జిల్లాకు రానున్నారు. కుంటాల, దండేపల్లి, మంచిర్యాల తదితర ప్రదేశాల్లో గోదాముల నిర్మాణం చేపట్టేందుకు స్థల పరిశీలన చేయనున్నారు. -
‘రాడార్’కు స్థలం దొరికిందోచ్..
సాక్షి, ముంబై: వర్షాకాలంలో వాతావరణ వివరాలు పూర్తిగా రాబట్టేందుకు మరో ‘వెదర్ డాప్లార్ రాడార్’ యంత్రాన్ని బిగించేందుకు స్థలం కోసం అన్వేషణ ప్రారంభించారు. అందుకు గోరేగావ్‌లోని ఆరే కాలనీ అటవీ ప్రాంతం లేదా పవయి జలాశయం పరిసరాల్లోని అటవీ ప్రాంతం తెరమీదకు వచ్చాయి. ఇందులో ఓ ప్రాంతాన్ని ఎంపికచేసి అక్కడ డాప్లార్ రాడార్‌ను ఏర్పాటు చేయాలని వాతావరణ శాఖ యోచిస్తోంది. 2005 జూలై 26న కురిసిన భారీ వర్షాలు నగరం, శివారు ప్రాంతాలను ముంచెత్తిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వాతావరణ శాఖకు వివరాలు తెలియజేసే డాప్లార్ రాడార్ అందుబాటులో లేకపోవడంవల్ల స్థానికులకు సరైన సమాచారం అందించలేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. దాంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన వె దర్ డాప్లార్ రాడార్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత శాంతాకృజ్ విమానాశ్రయం పరిసరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు భారీ టవర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాంతో విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతాయనే భయంతో మరోచోట ఏర్పాటు చేయాలని సంకల్పించారు. చివరకు నేవీ నగర్ పరిసరాల్లోని 17 అంతస్తుల అర్చన భ వనం టెరెస్‌పై డాప్లార్‌ను ఏర్పాటు చేశారు. అయితే దీనివల్ల భవనంలో ఉంటున్నవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేగాకా సదరు భవనం చుట్టూ ఉన్న ఎతైన భవనాలవల్ల రాడార్‌కు వాతావరణానికి సంబంధించిన పూర్తి సమాచారం లభించడంలేదు. దీంతో పవయి లేదా ఆరే కాలనీ అటవీ ప్రాంతంలో మరో రాడార్ డాప్లార్‌ను ఏర్పాటు చేయాలనే అంశం రాష్ట్ర ప్రభుత్వం, వాతావరణ శాఖ తెరమీదకు తీసుకువచ్చాయి. అందుకు ఏడు ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో పవయి, ఆరే కాలనీ ప్రాంతాలకు వాతావరణ శాఖ ప్రాధాన్యతనిచ్చింది. ఈ నెల 17వ తేదీ(గురువారం) నుంచి ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న కొండలపై సాంకేతిక సిబ్బంది అధ్యయనం చేస్తారు. ఇందులో సౌకర్యాలను బట్టి ఓ ప్రాంతాన్ని ఎంపికచేసి అనంతరం అక్కడ యంత్రాన్ని ఏర్పాటు చేస్తామని ముంబై వాతావరణ శాఖ డిప్యూటీ డెరైక్టర్ కృష్ణానంద్ హోసాలికర్ చెప్పారు.