కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రబీలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనకపోవడంతో ఇంకా రైతుల వద్దే ధా న్యం దర్శనమిస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు చేయా ల్సి ఉంది. 15 కొనుగోలు కేంద్రాల్లో 8వేల ఎంటీల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉంది. దీంతో వర్షాకాలం సమీపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సరిపడా గోదాములు లేకే..
పక్షం రోజుల కింద కురిసిన అకాల వర్షాలకు కొంత మేర వరిపంట దెబ్బతినగా.. ఇప్పుడు చేతికొచ్చిన ధా న్యం నేలపాలవుతుందేమోనని దిగులు చెందుతున్నా రు. జిల్లాలో ధాన్యం నిల్వ ఉంచేందుకు సరిపడా గోదాములు లేక నిజామాబాద్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో కొ నుగోలు చేయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నా రు. ఇందుకు సివిల్ సప్లై మేనేజింగ్ డెరైక్టర్ అనిల్‌కుమార్, నిజామాబాద్ జేసీలతో జిల్లా సంయుక్త కలెక్టర్ బి. లక్ష్మీకాంతం ఆదివారం మాట్లాడినట్లు తెలిసింది. గోదాములు లేకపోవడం, వర్షకాలం దృష్ట్యా రైతులు నష్టాల పాలు కాకుండా పక్క జిల్లా రైస్ మిల్లర్లకు కొనుగోలు బాధ్యత అప్పగించనున్నట్లు అధికారులు పేర్కొంటు న్నారు. జిల్లాలోని గోదాములు ప్రస్తుతం ధాన్యంతో పూ ర్తిగా నిండిపోయినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది.
కొనుగోళ్లు, నిల్వలు..
రబీకి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం 95,463 మెట్రిక్ టన్నుల (ఎంటీ) వరిధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన రూ.125 కోట్లకుపైగా రైతులకు చెల్లించారు. ఐటీడీఏ ద్వారా 13,757 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ద్వారా 1,113 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్‌ల ద్వారా 27,556 మెట్రిక్ టన్నులు, డీఆర్డీఏ ద్వారా 53,037 మెట్రిక్ టన్నులు మొత్తం 95,463 ఎంటీల ధాన్యం కొనుగోలు చేశారు. దీంతో పాటు జిల్లాలోని 24 రైస్ మిల్లర్లు 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
ధాన్యం కొనుగోలు చేసినందుకు రూ.88 లక్షలు పీఏసీఎస్‌లకు, రూ.20 లక్షలు డీసీఎంఎస్‌కు, రూ.2కోట్లు మహిళా సంఘాలకు కమీషన్ రూపంలో చెల్లించారు. ఈ ధాన్యాన్ని నిర్మల్, భైంసా, సారంగాపూర్, బోథ్, ఇచ్చోడ, మంచిర్యాల, లక్సెట్టిపేట, జన్నారం, నార్నూర్‌లలో ఉన్న గోదాముల్లో నిల్వ ఉంచారు.
నిబంధనలు ఇవీ..
క్వింటాల్ గ్రేడ్-ఏ వరిధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1,345, కామన్ రకానికి రూ.1,310 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నాణ్యతకు సంబంధించి కూడా నిబంధనలు విధించింది. ధాన్యంలో తేమ 18 శాతానికి మించకూడదని నిబంధన పెట్టారు. వ్యర్థాలు ఒకశాతం, చెత్త, తప్పలు ఒక శాతం, రంగుమారిన, పురుగుతిన్న, మొలకెత్తిన ధాన్యం 4శాతం, పూర్తిగా తయారు కానీ, కుంచించుకుపోయిన ధాన్యం 3శాతం, కల్తీరకం ధాన్యం 6శాతం వరకు గరిష్టంగా కోత విధించాలని నిర్ణయించింది.
వీటిలో ఏ ఒక్కటి ఒక్క శాతం పెరిగినా ప్రభుత్వం నిర్ణయించిన ధరలో కోత పడుతుందన్నమాట. జిల్లాలో రబీలో వరిధాన్యం దిగుబడి అధికంగా వచ్చింది. ఎక్కువగా కడెం, జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట తదితర 16 మండలాల్లో దిగుబడి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. కడెం కెనాల్‌తో ఈ ఏరియాల్లో వరిపంట అధికదిగుబడి వచ్చినట్లుగా గుర్తిస్తున్నారు.
గోదాముల నిర్మాణానికి స్థల పరిశీలన..
జిల్లాలో వెయ్యి మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గోదాముల నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని పరిశీలించేందుకు మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇంజినీర్లు, అధికారులు జిల్లాకు రానున్నారు. కుంటాల, దండేపల్లి, మంచిర్యాల తదితర ప్రదేశాల్లో గోదాముల నిర్మాణం చేపట్టేందుకు స్థల పరిశీలన చేయనున్నారు.
కొనలేని కేంద్రాలు..!
Published Mon, Jun 9 2014 3:59 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement