రబీ సీజన్‌లో రైతులకు యూరియా కష్టాలు తప్పేలా లేవు. అవసరం మేరకు ఎరువుల నిల్వలు అందుబాటులో లేవు. ప్రస్తుతానికి ఇబ్బంది తలెత్తకపోయినప్పటికీ, రానున్న రోజులలో యూరియా కొరత ఏర్పడే అవకాశాలు లేకపోలేదని వ్యవసాయశాఖ వర్గాలే పేర్కొంటున్నాయి.
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ఈసారి రబీ వరి సాగు ఆశాజనకంగా ఉంది. సీజన్‌లో ఆశించిన మేరకు వర్షాలు కురియ డం, ప్రాజెక్టులు నిండుకుండలను తలపించడంతో రైతులు రబీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఎ రువుల కొరతే రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో ఈ ఏడాది రబీ పంటలకు 1.29 లక్షల మె ట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు.
జనవరి నెలాఖరు వరకు 71,330 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని తేల్చారు. కాగా ప్రస్తుతం 30,484 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటు లో ఉంది. అంటే, అవసరంలో సగం కూడా యూరియా నిల్వలు జిల్లాలో అందుబాటులో లేవన్నమాట.
అవసరం మేరకు యూరియా అందుబాటులో లే కపోవడానికి జిల్లాలో స్థలం సమస్యే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. గోదాములు ఖాళీ లేకపోవడంతో యూరియా అదనపు నిల్వ లు తెప్పించలేకపోతున్నామంటున్నారు. పీఏసీఎస్‌లలో చేపట్టిన గోదాముల నిర్మాణం పనులు పూర్తయితే ఈ సమస్యకు కొంత మేరకు పరిష్కారం లభించనుంది. అయితే మరో రెండేళ్లకు గానీ ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా లేవు.
‘కాంప్లెక్స్’ఫుల్ : యూరియా పరిస్థితి ఇలా ఉం టే.. కాంప్లెక్స్ ఎరువుల పరిస్థితి ఇందుకు విరుద్ధం. వీటి నిల్వలు జిల్లాలో భారీగా ఉన్నాయి. ప్రస్తుతానికి 40,769 మెట్రిక్ టన్నులున్నాయి. వీ టి ధరలు చుక్కలనంటుతుండటంతో రైతులెవ్వ రూ కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు.
జిల్లాలో వరినాట్లు ఊపందుకుంటున్నాయి.
ఈ సారి 3.25 లక్షల ఎకరాలలో వరి సాగయ్యే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ గుర్తించింది. ఇప్పటికే రెండు లక్షల ఎకరాలలో నాట్లు పడ్డాయి. బోర్లు, కాలువల నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలలో వరి నాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్, మాక్లూర్, ఆర్మూర్, సిరికొండ తదితర మండలాలలో నాట్లు ఊపందుకున్నాయి. ఈ వరికే యూరి యా అవసరం ఎక్కువగా ఉంటుంది.
రైతులు వరికి యూరియాను ఎకరానికి రెండు దఫాల్లో నాలుగు నుంచి ఐదు బస్తాలు వరకు వినియోగిస్తుంటారు. నాట్లు వేసుకున్నాక 25 రోజుల తర్వాత ఈ ఎరువును వేస్తారు. అందువల్ల ఇప్పుడిప్పుడే యూరియాకు డిమాండ్ పెరుగుతోంది. ఎకరానికి రెండున్నర బస్తాలకు మించి యూరియా వాడవద్దని వ్యవసాయాశాఖా అధికారులు పేర్కొంటున్నారు.
వరి తర్వాత మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పం టలకు యూరియా అవసరం ఉంటుంది. ఈ రబీ లో 1.37 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుం దని అంచనా. ఈ పంటకు కూడా రెండుసార్లు యూరియా అవసరం ఉంటుంది. పొద్దుతిరుగు డు పంట 50 వేల ఎకరాలలో సాగవుతుందని భావిస్తున్నారు. కనీసం ఎకరానికి రెండు బస్తాలై నా యూరియా వేయాల్సి ఉంటుంది.
యూరియా ముప్పు
Published Thu, Jan 23 2014 5:08 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement