సాక్షి, హైదరాబాద్: వరి సాగుపై పూటకో మాట చెప్పి రాష్ట్రప్రభుత్వం రైతులను గందరగోళంలోకి నెడుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన లేఖ ప్రకారం రాష్ట్రప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కచ్చితంగా ధాన్యం కొనుగోలు చేస్తుందని చెప్పారు.
కేంద్రం ఇచ్చిన భూసార పరీక్షల నిధులను కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. శనివారం అరుణ మీడియాతో మాట్లాడుతూ యాసంగిలో రైతులను వరి వేయొద్దని చెప్పిన రాష్ట్ర సర్కార్.. రాత్రికి రాత్రి వారిని ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమంటే ఎలా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment