కాడి వదిలేస్తున్నారు | farmers are not showing interest on agriculture | Sakshi
Sakshi News home page

కాడి వదిలేస్తున్నారు

Published Sat, Jan 25 2014 12:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

రాష్ట్రానికి ధాన్యాగారంగా పేరొందిన మన జిల్లాలో ఈ దాళ్వాలో వరి సాగును చాలా మంది రైతులు వదిలేస్తున్నారు. వరుస విపత్తులతో అప్పుల పాలైన అన్నదాత సార్వాలో కుదేలయ్యాడు.

 సాక్షి, ఏలూరు :
 రాష్ట్రానికి ధాన్యాగారంగా పేరొందిన మన జిల్లాలో ఈ దాళ్వాలో వరి సాగును చాలా మంది రైతులు వదిలేస్తున్నారు. వరుస విపత్తులతో అప్పుల పాలైన అన్నదాత సార్వాలో కుదేలయ్యాడు. నీటి ఎద్దడి, డెల్టా ఆధునికీకరణ కారణంగా మెట్టలో 45 వేల ఎకరాలు, కృష్ణా డెల్టాలో   25 వేల ఎకరాలు, గోదావరి డెల్టాలో 6వేల ఎకరాల్లో రైతులు ఈసారి వరి పంట వేయలేకపోతున్నారు. ఆ స్థానంలో మినుము, పెసర, నువ్వు, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటల సాగుకు ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలో ఒడిదుడుకుల మధ్య మొదలైన దాళ్వా వరినాట్లు చివరి దశకు చేరుకున్నాయి. గోదావరి డెల్టాలో 3లక్షల 67వేల 500 ఎకరాల్లో వరి నాట్లు వేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 3 లక్షల 37వేల 500 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. మిగిలిన 30 వేల ఎకరాల్లో ఈ నెలాఖరులోపు నాట్లు పూర్తవుతాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.  మెట్టలో సుమారు 60 వేల ఎకరాల్లో వరి ఊడ్చారు. జిల్లా కృష్ణా డెల్టా పరిధిలో నాట్లు నత్తనడకన సాగుతున్నాయి.
 
  కృష్ణా కాలువకు నవంబర్ వరకు నీరు విడుదల చేయకపోవడం వల్ల పంట ఆలస్యమవుతోంది. కృష్ణా డెల్టాలో 58 వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా, 32 వేల ఎకరాల్లో మాత్రమే దాళ్వాలో వరి సాగు చేయాలనుకున్నారు. చివరకు ఈ విస్తీర్ణం కూడా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. మిగిలిన రైతులు ఆరుతడి పంటలైన అపరాల సాగువైపు మళ్లుతున్నారు. ఈ ఆయకట్టు పరి ధిలో వరి నాట్లు ఇటీవలే మొదలుపెట్టారు. దెందులూరు నియోజకవర్గంలో సుమారు 500 ఎకరాలు అటు కృష్ణా, ఇటు గోదావరి జలాలకు దూ రమై రెండింటికీ చెడ్డ రేవడిలా ఉన్నా యి. గోదావరి కాలువకు దగ్గరగా ఉ న్న ఈ పొలాలు కృష్ణా కాలువ పరిధిలోకి రావటంతో సాగునీరు అందక కొన్ని చోట్ల అపరాలు వేస్తుంటే, మరి కొన్ని బీళ్లుగా మారుతున్నాయి.
 
 ఖరీఫ్‌లో గత ఏడాది జూన్ 20 నాటికి రైతులు నారుమడులు వేసి నా భారీ వర్షాల వల్ల సెప్టెంబర్ వరకూ నాట్లు కొనసాగాయి. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి. గత ఏడాది అక్టోబర్‌లోనే ‘పై-లీన్’ తుపాను, అల్పపీడనం, హెలెన్ తుపాను తీవ్రంగా నష్టపరిచాయి. ఈ కారణంగా మాసూళ్లు అలస్యమాయ్యాయి. సాధారణంగా రబీ సాగు కోసం డిసెంబర్ 20లోపు నారుమళ్లు వేసి, జనవరి 15 లేదా 20లోపు నాట్లు పూర్తిచేయాలని వ్యవసాయాధికారులు చెబుతుం టారు. ఈ ఏడాది కూడా నాట్లు ఆలస్యమయ్యాయి. డిసెంబర్ నెలాఖరు నాటికి  గోదావరి డెల్టాలో అక్కడక్కడా నాట్లు ప్రారంభమయ్యా యి. ఆ సమయానికి కృష్ణా డెల్టాలో నారుమళ్ల ప్రక్రియ మొదలైంది. గోదావరి డెల్టాలో నాట్లు వేస్తుం డగా, కృష్ణా డెల్టాలో వచ్చే నెలలో కూడా నాట్లు కొనసాగుతాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement