న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు మే19కల్లా దక్షిణ అండమాన్ సముద్రానికి చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సోమవారం(మే13) తెలిపింది. నిజానికి దక్షణి అండమాన్ సముద్రానికి రుతుపవనాలు మే 22న చేరుకోవాల్సి ఉంది.
అయితే రెండు రోజుల ముందే రుతుపవనాలు అక్కడికి చేరుకోనున్నాయని తెలిపింది. కేరళకు రుతుపవనాలు జూన్1న రానున్నట్లు వెల్లడించింది. కేరళ నుంచి ముందుకు కదలి దేశవ్యాప్తంగా జులై 15వ తేదీ కల్లా రుతుపవనాలు వ్యాపించనున్నాయని ఐఎండీ తెలిపింది.
రుతుపవనాల వల్ల ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను ఐఎండీ మే చివరి వారంలో ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment