సాక్షి, హైదరాబాద్: నగరం వేదికగా కొనసాగుతున్న సెయిలింగ్ మాన్‌సూన్ రెగట్టా పోటీల్లో మరోసారి తెలంగాణ సెయిలర్లు రాణిస్తున్నారు. సాగర్‌లో జరుగుతున్న 15వ మాన్‌సూన్ రెగట్టాలో బుధవారం అండర్–16 ఆప్టిమిస్ట్ ఫ్లీట్‌లో ఉద్బవ్ స్కూల్ నుంచి గోవర్ధన్
పల్లార, లాహిరి కొమరవెల్లి, దీక్షిత కొమరవెల్లి విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. గోవర్ధన్ తన విజయాలతో రెండవ స్థానం కన్నా ముందే ఉన్నప్పటికీ అగ్రస్థానం కోసం మరో 4 రేసులతో నైపుణ్యాలను ప్రదర్శించాలి. సెయిలింగ్ స్టార్ లాహిరికి ఓ ప్రమాదంలో ఎడమ చేయి విరగడంతో మొదటి రెండు రేసులకు అనుమతించలేదు. చివరకు వైద్యుడి పర్యవేక్షణలో అనుమతించడంతో లాహిరి ఒక రేసులో మొదటి స్థానంలో నిలిచింది. అయినప్పటికీ 39 సెయిలర్ ఫ్లీట్‌లో ప్రశంసనీయంగా 19వ స్థానంలో నిలిచింది.
ఐఎల్‌సీఏ 4 బాలుర విభాగంలో టీఎస్‌సీ మైసూర్‌కు చెందిన కృష్ణ దివాకర్ మధ్యప్రదేశ్‌కు చెందిన ఏకలవ్య బాథమ్ (3వ స్థానం)ను బీట్ చేసి అగ్రస్థానంలో నిలిచాడు. శశాంక్ బాథమ్ రెండవ స్థానంలో ఉన్నాడు. బాలికల విభాగంలో సోమ్యా సింగ్, అలియా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంటర్నేషనల్ 420 మిక్స్‌డ్ లోకల్స్‌లో తనుజా కామేశ్వర్, వైష్ణవి అగ్రస్థానంలో నిలిచారు. బాలికల హాఫ్ రిగ్ ఫ్లీట్‌లో అఖిల కొప్పుల (13) స్వర్ణం, రెయిన్‌బో హోమ్స్ ముషీరాబాద్‌కు చెందిన నికిత జీరు (12) రజతం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment