వర్షాకాలంలో ప్రతిచోటా దోమలు ఎక్కువగా ఉంటాయి. మనం ఎంతలా దోమల నివారిణిలు వాడినా ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటాయి. అయితే కొందరూ ఎక్కువగా దోమ కాటుకి గురవ్వతుంటారు. తమ పక్కన ఉన్నవాళ్లు అబ్బా దోమలు కుడుతున్నాయని ఫిర్యాదులు చేయరు గానీ వీళ్లు మాత్రం అయ్యా..! బాబోయ్ ఈ దోమలు మమ్మల్ని బాగా కుడతున్నాయి అంటూ గొడవచేస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రముఖ ఆరోగ్య నిపుణులరాలు ఊర్వశి అగర్వాల్ వివరించారు. దోమల ఆకర్షణకు కారణమైన జీవనశైలి, ఆహారమే ప్రధాన కారణాలని అన్నారు. ఎలా ఉండటం వల్ల దోమలు ఎక్కువగా కుడతాయంటే..
ఎక్కువగా దోమ కాటుకి దారితీసే కారణాలు..
గట్-స్కిన్..
దోమల ఆకర్షణలో ప్రేగు ఆరోగ్యం ఆశ్చర్యకరమైన పాత్ర పోషిస్తుంది. సమతుల్య గట్ మైక్రోబయోమ్ చర్మంలోని మైక్రోబయోమ్‌ను సానుకూలంగా ఉంచుతుంది. దోమలు తక్కువ ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మ అవరోధాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే రక్తం పీల్చే దోమల వంటి ఇతర జీవులనుఆకర్షించే కొన్ని రకాల సమ్మేళనాల ఉత్పత్తిని తగ్గిస్తుంది.
ఎక్కువగా తినే వాటిని బట్టి...
మనం తీసుకునే పదార్థాలు మన శరీర రసాయన శాస్త్రాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. దాన్ని బట్టే దోమలు తక్కువ లేదా ఎక్కువ ఆకర్షణకు గురవ్వుతాయి. చక్కెర, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే కీటకాలను ఉత్సాహ పరిచేలా శరీరం నుంచి ఒకవిధమైన సువాసన వస్తుంది. కొన్ని ఆహారాలు శరీర ఉష్ణోగ్రత, జీవక్రియ రేటుని ప్రభావితం చేస్తాయి. ఇవి కూడా దోమల ఆకర్షణకు కారణమవుతాయని చెబుతున్నారు నిపుణులు
శరీరం నుంచి వచ్చే వాసన..
శరీరం వాసన అనేది జన్యుశాస్త్రం, ఆహారంకి సంబంధించింది. ఇది ఒకరకంగా మీ ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. లాక్టిక్ ఆమ్లం, అమ్మోనియాతో సహా శరీరం ఉత్పత్తి చేసే సమ్మేళనాలు అంతర్లీన ఆరోగ్య పరిస్థితులకు కారణమవ్వడమే దోమలకు ప్రీతికరంగా అనిపించేందుకు కారణమువుతంది.
అధిక జీవక్రియ రేటు..
ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ని ఉత్పత్తి చేస్తే దోమలు దూరం నుంచే గుర్తిసాయిట. సహజంగా శక్తిమంతంగా ఉన్నా లేదా అధిక జీవక్రియ రేటుని కలిగి ఉంటే ఈ దోమ కాటుకి గురవ్వాల్సి వస్తుంది.
వాపు, రోగనిరోధక పనితీరు
దీర్ఘకాలిక వ్యాధులు బారినపడిన వారిలో రోగనిరోధక స్థితి బలహీనంగా ఉంటుంది. ఇది దోమల ఆకర్షణకు కారణమవుతుంది. అలాగే శరీరం అసమతుల్యత స్థితిలో ఉంటే దోమలను ఆకర్షించే సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది.
దోమ కాటుకి గురవ్వకూడదంటే..
గట్ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి: ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు మద్దతు ఇచ్చేలాక ఫైబర్, పులియబెట్టిన ఆహారాలు, ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
చక్కెర , ఆల్కహాల్‌ను పరిమితం చేయండి: ఈ పదార్ధాలు తీసుకోవడం తగ్గిస్తే శరీరంలో జరిగే రసాయనిక చర్యను నియంత్రిస్తుంది. .
శరీర దుర్వాసనను నియంత్రించండి: రెగ్యులర్ షవర్లు, సహజమైన డియోడరెంట్లను ఉపయోగించడం, వదులుగా ఉండే దుస్తులు ధరించడం వంటివి చేయాలి.
(చదవండి: వాకింగ్ వల్ల మోకాళ్లు దెబ్బతింటాయా.? అలా కాకూడదంటే..?)
Comments
Please login to add a commentAdd a comment