bites
-
పాముకాటు వీరులు
1960లలో నా భర్త రోమ్ తన స్నేహితులుతో కలిసి ఫ్లోరిడాలోని "ఎవర్ గ్లేడ్" అనే నీటితో నిండిన గడ్డి మైదాన ప్రాంతంలో పాములను వెతుకుతూ వెళ్లేవారు. ఒకసారి తన స్నేహితుడు షూబెర్ట్ తో కలిసి వెళ్ళినప్పుడు వారికి ఒక మోకాస్సిన్ అనే నీటి పాము నీటిలో తేలుతున్న దుంగపై కనిపించింది. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఆ దుంగ నీటిలో మునిగిపోబోయింది. ఎక్కడ ఆ పాము నీటిలోకి తప్పించుకుని వెళ్లిపోతుందో అనే కంగారులో రోమ్ ఆ పాముని చేత్తో పట్టుకుని సంచిలో పెట్టేసాడు. ఆ పాముని సంచిలో పెట్టాక నింపాదిగా "షూబెర్ట్ ఆ పాము నన్ను కరిచింది !" అని అసలు విషయం చెప్పాడు. ఆ విషయం విన్న షూబెర్ట్ ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా "అవి అంతే అప్పుడప్పుడు ఆలా కరుస్తుంటాయి!" అని చాలా తేలికగా అనేశాడు. కాసేపటికి రోమ్ చెయ్య వాసిపోయేసరికి వారు ఆరోజుకి పాములను వెతకటం ఆపేసి ఇంటికి వెళ్లిపోయారు. షూబెర్ట్ మాత్రం రోమ్ చేసిన పని వలన తను ఆ రోజంతా పాములను చూసే మంచి అవకాశం కోల్పాయానని నసుగుతూనే ఉన్నాడు.రోమ్ బాస్ బిల్ హాస్ట మాత్రం ఎంతో అయిష్టంగానే రోమ్ కు మరుసటి రోజు సెలవు తీసుకొనిచ్చాడు. మిగిలిన మిత్రులైతే - "ఆయన ఇంకా నేర్చుకుంటున్నట్టు ఉన్నాడు!", "అమ్మాయిల్ని ఆకట్టుకుందామని అనుకుంటున్నాడా ఏంటి ఈ మూర్ఖుడు!" అనే అన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ తన పని చేస్తున్నప్పుడు చిన్న షాక్ కొడితే తన తోటి ఎలక్ట్రీషియన్ వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో, అలాగే తన సహోద్యోగులు కూడా స్పందించారు. తన పని సరిగ్గా ఎలా చెయ్యాలో తెలియని వాడు అని వారి ఉద్దేశం. మరొకసారి అట్టిల అనే మా స్నేహితుడు తన ఇంటివద్ద పెంచుకుంటున్న పాము నీటి గిన్నె మార్చబోతుంటే, ఆ పాము అతని చేతిపై కాటువేసింది. ఈ సారి రోమ్ కొంత విచక్షణతో "నువ్వు ఆ పాముని ఇంకో సంచిలోనో లేక పెట్టెలోనో ఎందుకు పెట్టలేదు? " అని అడిగాడు. "ఆ పాము మరొక వైపు చూస్తుంది కదా ఈ లోపల నేను చటుక్కున నీరు మార్చేద్దామని అనుకున్నా!" అన్నాడు అట్టిల . ఆ మాట విన్న స్నేహితులంతా , ఒక పక్క నొప్పితో అట్టిల బాధపడుతున్నా అతని అవివేకానికి విరగబడి నవ్వేశారు. చివరకి ఎవరో అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు అనుకోండి. పాములను పట్టుకుని వాటిని రక్షించే వారు (స్నేక్ క్యాచర్స్ ) పాము కాటుకి గురైతే అది వారి తప్పే అవుతుంది తప్ప పాముది కాదు! ఆ పాముని పట్టుకునే వ్యక్తి నిర్లక్ష్యం వలనో లేక కోసం ఏదో హడావిడి చేద్దాం అనే వారి ఉద్దేశం వలనే ఇలా పాముకాటుకు గురవుతారని రోమ్ మరియు అయన స్నేహితులకి 1960ల నుండి ఉన్న అభిప్రాయం. ఈ అభిప్రాయం రీల్స్ / వీడియో లైక్స్ మోజులో ఉన్న ఈ తరానికి కూడా వర్తిస్తుంది. ఈ ఉద్దేశంతోనే ఆలా ఎవరైనా పాములను రక్షించేవారు పాము కాటుకు గురైతే మాత్రం వారిని నిర్దాక్షిణంగా ఆటపట్టిస్తుంటారు. అనుకోకుండా పాముకాటుకు గురైన సాధారణ జనాలకి మాత్రం ఇది వర్తించదులెండి. ఒక రకంగా ఇలాంటి సహచరులను మందలించే సాంప్రదాయమే వారిని నిర్లక్షానికి అవకాశమివ్వకుండా పని చేస్తూ, ఈ రోజుకి జీవించి ఉండేటట్లు చేసింది అనేది నా అభిప్రాయం.కానీ మన దేశంలో అనేక స్నేక్ క్యాచర్స్, అందులోని ముఖ్యంగా యువకులు, వారు పాముకాటుకు గురైన సందర్భాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కొంతకాలం క్రిందట ఒక కుర్రవాడు పల్చటి సంచిలో త్రాచుపామును పట్టుకుని ముడి వేయబోతుంటే, ఆ పాము పల్చటి సంచిలో నుండి కాటు వేసింది. అతను కొన్ని రోజుల హాస్పిటల్లో ఉండగా ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్లంతా అలవాటుగా పరామర్శకు వచ్చారు. ఆ కుర్రాడు ఇదేదో తాను చేసిన ఘనకార్యం వలనే అనుకుని పొంగిపోయాడే తప్ప ఒక్కసారి కూడా ఈ అనుకోని ప్రమాదం ఎందుకు జరిగిందో ఆలోచించలేదు. తన ఘనకార్యం గురించి అనేక సార్లు మాట్లాడుతుంటే, ఒకసారి రోమ్ "అసలు ఇందులో తప్పు ఎవరిది?" అని అడిగాడు . ఆ కుర్రాడైతే కచ్చితంగా సమాధానం చెప్పలేకపోయాడు కానీ తన తప్పయితే ఏమి లేదని బుకాయించాడు. దానికి రోమ్ " నువ్వు సరైన బ్యాగ్ వాడినట్లైతే ఆ పాము నిన్ను కాటు వేసి ఉండేది కాదు కదా!" అని అడిగితే అటు నుండి సమాధానమే లేదు. నేను మా "మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్" మాసపత్రికలో ప్రచురించడం కోసం వ్యాసాలు అడిగితే అనేక మంది తమ పాముకాటు అనుభవం గురించి రాసి పంపారు. ఆలా వచ్చిన వాటిల్లో ఓక వ్యాసం శీర్షిక "నా సాహస పతకం" అని రాసి పంపారు. నాకైతే దాన్ని "నా అజ్ఞాన పతకం" అని మార్చాలని అనిపించింది. ఇలా పాముకాటు నుండి బతికి బయటపడ్డవాళ్లు గమనించని విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి - వారిని కాటేసిన పాముకాటులో ఎంత విషం ఉంది , రెండవది - వారిని కాపాడిన డాక్టర్ ప్రతిభ. ఈ రెండు కారణాలతో వారు బహుశా బ్రతికి బయపడి ఉండవచ్చు. "పాము పోకరీలు" అనే మేము ముద్దుగా పిలిచే ఇలాంటి వారు తమ పాముకాటు సంఘటన ఏదో తమ ప్రతిభ అన్నటు మాట్లాడతారు కానీ అది వారి తెలివితక్కువతనం అని తెలుసుకోవట్లేదు. ఒక వండ్రంగి మేకుని కొట్టబోతే ఆ సుత్తి గురితప్పు వేలుకి తగిలి రక్తం వస్తే, అదేదో తన ప్రతిభ వల్లే అయ్యింది అని అనుకున్నట్లు ఉంటుంది వీరి ప్రవర్తన. పాములను పట్టుకుని రక్షించే మీ స్నేక్ క్యాచర్ స్నేహితులు ఎవరైనా పాముకాటు నుండి కోలుకుని బ్రతికి బయటపడితే మీరు మాత్రం దయచేసి వారిని పరామర్శించడానికి వెళ్లి ఆహా ఓహో అని మాత్రం వారిని పొగడకండి! -రచయిత, ఫోటోలు : జానకి లెనిన్-అనువాదం : చంద్ర శేఖర్ బండి -
బీసీ బాలుల వసతిగృహంలో 13 మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు
-
దోమలు కొందరినే ఎక్కువగా కుడతాయి..ఎందుకో తెలుసా?
వర్షాకాలంలో ప్రతిచోటా దోమలు ఎక్కువగా ఉంటాయి. మనం ఎంతలా దోమల నివారిణిలు వాడినా ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటాయి. అయితే కొందరూ ఎక్కువగా దోమ కాటుకి గురవ్వతుంటారు. తమ పక్కన ఉన్నవాళ్లు అబ్బా దోమలు కుడుతున్నాయని ఫిర్యాదులు చేయరు గానీ వీళ్లు మాత్రం అయ్యా..! బాబోయ్ ఈ దోమలు మమ్మల్ని బాగా కుడతున్నాయి అంటూ గొడవచేస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రముఖ ఆరోగ్య నిపుణులరాలు ఊర్వశి అగర్వాల్ వివరించారు. దోమల ఆకర్షణకు కారణమైన జీవనశైలి, ఆహారమే ప్రధాన కారణాలని అన్నారు. ఎలా ఉండటం వల్ల దోమలు ఎక్కువగా కుడతాయంటే..ఎక్కువగా దోమ కాటుకి దారితీసే కారణాలు..గట్-స్కిన్..దోమల ఆకర్షణలో ప్రేగు ఆరోగ్యం ఆశ్చర్యకరమైన పాత్ర పోషిస్తుంది. సమతుల్య గట్ మైక్రోబయోమ్ చర్మంలోని మైక్రోబయోమ్‌ను సానుకూలంగా ఉంచుతుంది. దోమలు తక్కువ ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మ అవరోధాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే రక్తం పీల్చే దోమల వంటి ఇతర జీవులనుఆకర్షించే కొన్ని రకాల సమ్మేళనాల ఉత్పత్తిని తగ్గిస్తుంది.ఎక్కువగా తినే వాటిని బట్టి...మనం తీసుకునే పదార్థాలు మన శరీర రసాయన శాస్త్రాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. దాన్ని బట్టే దోమలు తక్కువ లేదా ఎక్కువ ఆకర్షణకు గురవ్వుతాయి. చక్కెర, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే కీటకాలను ఉత్సాహ పరిచేలా శరీరం నుంచి ఒకవిధమైన సువాసన వస్తుంది. కొన్ని ఆహారాలు శరీర ఉష్ణోగ్రత, జీవక్రియ రేటుని ప్రభావితం చేస్తాయి. ఇవి కూడా దోమల ఆకర్షణకు కారణమవుతాయని చెబుతున్నారు నిపుణులుశరీరం నుంచి వచ్చే వాసన..శరీరం వాసన అనేది జన్యుశాస్త్రం, ఆహారంకి సంబంధించింది. ఇది ఒకరకంగా మీ ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. లాక్టిక్ ఆమ్లం, అమ్మోనియాతో సహా శరీరం ఉత్పత్తి చేసే సమ్మేళనాలు అంతర్లీన ఆరోగ్య పరిస్థితులకు కారణమవ్వడమే దోమలకు ప్రీతికరంగా అనిపించేందుకు కారణమువుతంది. అధిక జీవక్రియ రేటు..ఎక్కువ కార్బన్డయాక్సైడ్ని ఉత్పత్తి చేస్తే దోమలు దూరం నుంచే గుర్తిసాయిట. సహజంగా శక్తిమంతంగా ఉన్నా లేదా అధిక జీవక్రియ రేటుని కలిగి ఉంటే ఈ దోమ కాటుకి గురవ్వాల్సి వస్తుంది.వాపు, రోగనిరోధక పనితీరుదీర్ఘకాలిక వ్యాధులు బారినపడిన వారిలో రోగనిరోధక స్థితి బలహీనంగా ఉంటుంది. ఇది దోమల ఆకర్షణకు కారణమవుతుంది. అలాగే శరీరం అసమతుల్యత స్థితిలో ఉంటే దోమలను ఆకర్షించే సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది. దోమ కాటుకి గురవ్వకూడదంటే..గట్ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి: ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు మద్దతు ఇచ్చేలాక ఫైబర్, పులియబెట్టిన ఆహారాలు, ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. చక్కెర , ఆల్కహాల్‌ను పరిమితం చేయండి: ఈ పదార్ధాలు తీసుకోవడం తగ్గిస్తే శరీరంలో జరిగే రసాయనిక చర్యను నియంత్రిస్తుంది. . శరీర దుర్వాసనను నియంత్రించండి: రెగ్యులర్ షవర్లు, సహజమైన డియోడరెంట్లను ఉపయోగించడం, వదులుగా ఉండే దుస్తులు ధరించడం వంటివి చేయాలి.(చదవండి: వాకింగ్ వల్ల మోకాళ్లు దెబ్బతింటాయా.? అలా కాకూడదంటే..?) -
ఏకంగా 172 సార్లు పాము కాటుకి గురయ్యాడు..ఐనా ఆ వ్యక్తి..!
అమెరికాలో ఒక వ్యక్తి తన జీవితంలో అత్యంత విషపూరితమైన పాము కాటుకు 172 సార్లు గురయ్యాడు. 20 సార్లు అతని పరిస్థితి చాలా విషమించడంతో అతను చనిపోతాడని అంతా భావించారు.. కానీ 2011లో అతను తన 100 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఈ వ్యక్తిని అమెరికాలో స్నాక్ మ్యాన్ అని పిలిచేవారు. ఈ వ్యక్తి తనను తాను పదే పదే పాముతో కరిపించుకోవడం వల్ల.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని భావించాడు. ఇతని పేరు బిల్ హాస్ట్. ఆయనను చిన్నప్పటి నుంచి ఎన్నో పాములతో కరిపించుకున్నాడు. దీనిని అతను తన వృత్తిగా మార్చుకున్నాడు. మొదట పాములను చంపిన అతను.. ఆ తర్వాత స్నేక్ మ్యూజియం ఏర్పాటు చేశారు. అసలు అతన్ని 172 సార్లు పాములు ఎలా కాటేశాయో వింటే కంగుతింటారు. వామ్మో..! ఇదేం పిచ్చిరా.. దేవుడా అని అంటారు. ఏం జరిగిందంటే.. బిల్ హాస్ట్ పాముల కోసం ఫ్లోరిడాలో మయామి సెర్పెంటారియంను నిర్మించాడు. అందులో ప్రతి జాతికి సంబంధించి ప్రమాదకరమైన పాములు ఉండేవి. అక్కడికి వచ్చేవారి కోసం షోలు నిర్వహించేవారు. నిజానికి అతని ప్రధాన వ్యాపారం పాము కాటుకు వ్యతిరేకంగా ఔషధాలను తయారు చేయడానికి ముడి విషాన్ని ఉత్పత్తి చేయడం. 1990ల నాటికి.. అతను ప్రతి సంవత్సరం ఫార్మాస్యూటికల్ లాబొరేటరీలకు 36 వేల విషం నమూనాలను అందించాడు.ఇలా బిల్ హాస్ట్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఉన్న పదివేలకు పైగా పాములు ఉన్నాయి. వీటిలో సముద్ర, ఆఫ్రికన్, కాటన్‌మౌత్, గిలక్కాయలు, నాగుపాములు, క్రైట్స్, గ్రీన్ మాంబాలు, టైగర్ పాములు, వైపర్లు అనేక ఇతర విషపూరిత జాతులు ఉన్నాయి. అయితే బిల్ హోస్ట్ తన జీవితంలో 17 సార్లు పాము కాటుకు గురికావడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ప్రాణాంతకమైన పాములను ఒట్టి చేతులతో పట్టుకుని వాటి దవడలు విప్పేవాడు. వాటి పదునైన దంతాలు రబ్బరు పొరలోకి చొచ్చుకుపోతాయి. దీంతో పాములోని విషం గాజు సీసాలోకి వస్తాయి. యాంటీవీనమ్‌ను తయారు చేయడానికి తగినంత విషాన్ని తయారు చేయడానికి ఈ ప్రక్రియ వేలసార్లు చేయాల్సి వచ్చింది.రోగనిరోధక శక్తి కోసం అని..నాగుపాము విషం ఇంజెక్షన్ సమయంలో హాస్ట్ ఎక్కువసార్లు కాటుకు గురయ్యేవాడు. కొన్నిసార్లు అతని పరిస్థితి విషమించింది. కాబట్టి దీనిని ఎదుర్కోవటానికి.. హాస్ట్ తనకు తానుగా చిన్న మొత్తాలలో నాగుపాము విషాన్ని ఇంజెక్ట్ చేయడం ప్రారంభించాడు. తద్వారా అతని శరీరం యాంటీ-వెనమ్ రోగనిరోధక శక్తిని పొందుతుంది. అతను దానిని కాలక్రమేణా క్రమంగా పెంచాడు. పాము కాటు చాలా వరకు అతనిని ప్రభావితం చేయకపోవడమే దీని ప్రయోజనం. 1954లో ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన నీలిరంగు క్రైట్ కాటుకు గురయ్యాడు. అతను తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అంతేకాకుండా.. 10 రోజుల తర్వాత ఆ పాము చనిపోయింది. నిజానికి ఈ పాము కాటుకు గురైన వారు ఎవరూ బతకలేదు. కాలక్రమేణా హాస్ట్ రక్తం పాము కాటుకు నివారణగా మారింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 20 మందికి పైగా ప్రాణాలను రక్షించడంలో సహాయపడింది. అతను 100 సంవత్సరాల వరకు జీవించాడు.. పైగా తాను ఇంతలా సుదీర్ఘకాలం జీవించడానికి ప్రధానం కారణం తాను తీసుకున్న పాము విషం మోతాదని పేర్కొనేవాడు. 90 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా, చురుకుదనంతో ఉన్న ఆయన ఆ తర్వాత కూడా చనిపోయేంత వరకు చురుకుదనం తగ్గలేదు.ఇక బిల్ హాస్ట్ అసలు పేరు విలియం ఎడ్వర్డ్ హాస్ట్.. 1910 డిసెంబర్ 30న న్యూజెర్సీలోని ప్యాటర్సన్ లో జన్మించాడు. ఏడేళ్ల వయసులో తొలి పామును పట్టుకున్నాడు. హైస్కూల్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత పాములను పట్టుకునే పనిలో పడ్డారు. ఆ తర్వాత పాన్ అమెరికన్ ఎయిర్ వేస్ లో మెకానిక్, ఫ్లైట్ ఇంజనీర్ గా పనిచేశాడు. ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. అతను తరచూ తన పనిముట్లలో విదేశీ పాములను కూడా సేకరించేవాడు. ఇక వృద్ధాప్యంలో కూడా హాస్ట్ 32 బల్లులు, పాముల విషం మిశ్రమాన్ని తన శరీరంలోకి ఎక్కించాడు. బిల్ కు పాములపై ఉన్న మమకారం వల్ల అమెరికాలో స్నేక్ మ్యాన్ అని పిలిచేవారు.(చదవండి: మన దేశంలో అత్యంత చెత్త వంటకాలు ఇవే..! అందులో ఉప్మా..!) -
కాటు వేసిందని పామునే కరిచి చంపేయడంతో..!
పాము కాటుకి గురైతే సాధారణంగా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం చేస్తాం. మరికొందరూ సదరు పాముని చంపి, దాన్ని పట్టుకుని వెళ్లి మరీ చికిత్స పొందిన ఘటనలు చూసి చూశాం. కానీ ఏకంగా ఆ పాముని కరిచి చంపేయడం గురించి విన్నారా. ఈ దిగ్భ్రాంతికర ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది.వివరాల్లోకెళ్తే..35 ఏళ్ల సంతోష్ లోహార్ అనే వ్యక్తి ఒకరోజు రైల్వే లైన్లు వేసే పనిని ముగించుకుని తన బేస్ క్యాంపులో నిద్రిస్తుండగా ఓ పాము అతనిపై దాడి చేసింది. దీంతో అతడు వెంటనే ఆ పాముని చేతుల్లోకి తీసుకుని రెండు సార్లు కసితీరా కరిచేశాడు. ఈ అసాధారణ చర్యకు పాము అక్కడికక్కడే చనిపోయింది. ఈ దుశ్చర్య తర్వాత లోహార్ ఆస్పత్రిపాలయ్యాడు. ఓ రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు. అయితే సదరు వ్యక్తి కాటు వేసిన పాముని తిరిగి కొరికేస్తే విషం తగ్గిపోతుందనే మూఢనమ్మకంతో చేశాడట. ఈ విషయం తెలుసుకుని అక్కడ ఆస్పత్రి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఇలా పాము కాటుకి గురయ్యితే ఏం చేయాలో తెలుసుకుందాం..పాము కాటుకి గురైనప్పుడు త్వరగా చర్య తీసుకోవాలని, వైద్య సహాయం కోరాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఈ తక్షణ వైద్య సంరక్షణ అనేది పలు సమస్యలను నివారించడమే గాక దీర్ఘకాలికి వైకల్యం లేదా మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తప్పక చేయాల్సినవి..పాము కరిచినట్లయితే ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లడం వంటివి చేయాలి. కాటే వేసిన ప్రదేశంలో బిగుతుగా ఉన్న దుస్తులను తీసివేయాలి. ప్రభావిత అవయవాన్ని కదలకుండా ఉంచి, బాధితుడిని తక్షణమే సురక్షితంగా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు వైద్య సహాయం కోసం ఎదరుచూస్తున్నప్పుడూ ప్రభావిత అవయవాన్ని గుండె స్థాయికి దిగువున ఉంచి ప్రాథమి చికిత్స అందించాలి. అలాగే బాధితుడికి తినేందుకు, తాగడానికి ఏమి ఇవ్వకూడదని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: ఆ రెస్టారెంట్లో దోస, ఇడ్లీ రేట్లు తెలిస్తే కంగుతింటారు: హర్ష గోయెంకా ట్వీట్) -
హెల్మెట్ ధరించలేదు సరికదా, అడిగితే పోలీసు వేలు కొరికేశాడు
హెల్మెట్ ధరించలేదని అడిగినందుకు ఒక వ్యక్తిట్రాఫిక్ పోలీసుపై అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ద్విచక్ర వాహనదారుల రక్షణ కోసం హెల్మెట్ ధరించడం తప్పని సరి. ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతున్న వ్యక్తి పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా జరిగిన వివాదంలో డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసుపై దుర్భాషలాడి ట్రాఫిక్ పోలీసు వేలిని కొరికిన ఘటన బెంగుళూరులో నమోదైంది. విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ దగ్గర సయ్యద్ సఫీని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. హెల్మెట్ ఏదని ప్రశ్నించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ తన స్కూటర్ కీని లాక్కున్నాడు. ఆసుపత్రికి వెళుతుండగా హెల్మెట్ ధరించడం మర్చిపోయానంటూ వివరించే ప్రయత్నం చేశాడు సయ్యద్. మరోవైపు హెడ్ కానిస్టేబుల్ సిద్ధరామేశ్వర కౌజాలగిహెల్మెట్ నిబంధన ఉల్లంఘించినందుకు సఫీని రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన సయ్యద్, ట్రాఫిక్ పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించాడు. హెడ్ కానిస్టేబుల్ ఫోన్‌ను లాక్కొని, వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నారనిప్రశ్నించాడు. అలాగే తన వీడియో వైరల్‌గా మారినా నాకేం ఫరక్ పడదన్నట్టు వాదించాడు. దీంతో పోలీసులు అతగాడిని అరెస్టు చేశారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని దుర్భాషలాడడం, శారీరకంగా గాయపర్చడం, నేరపూరిత బెదిరింపులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. Syed Sharif biting traffic police in Bengaluru He was caught riding bike without Helmet Usually Police don’t ask for helmets to Jali topis in bengaluru pic.twitter.com/IZ9x2o5Iks — Swathi Bellam (@BellamSwathi) February 13, 2024 -
వామ్మో! దోమ కుడితే ఇంత అలానా! ఏకంగా 30 సర్జరీలా!
దోమల వల్ల ఏ డెంగ్యూ లేక మలేరియా వంటి వ్యాధులు వస్తాయని తెలుసు. అంతేగానీ ఏకంగా మూడు వారాల పాటు కోమా, 30 సర్జరీలు చేయించుకోవడం గురించి విన్నారా!. లేదు కదా కానీ ఇక్కడోక వ్యక్తి ఒక్క దోమ కాటు వల్ల ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఔనా! ఇది నిజమా? అని సందేహించొద్దు నిజంగానే జరిగింది. దయ చేసి ఈ దోమల పట్ల జాగ్రత్తగా ఉండండని ఆ వ్యక్తి పలువురికి సలహాలు ఇస్తున్నాడు కూడా. వివరాల్లోకెళ్తే....జర్మన్‌కి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్ రోట్ష్కే 2021లో ఆసియా టైగర్ దోమ అతన్ని కుట్టింది. దీంతో అతనికి కొన్ని రోజులపాటు ఫ్లూ వంటి లక్షణాలతో కూడిన జ్వరం వచ్చింది. ఆ తర్వాత రోట్ష్కే కొద్ది రోజుల్లోనే కోలుకుంటాను అని లైట్ తీసుకున్నాడు. అది కాస్త రోజు రోజుకి విషమించి చనిపోయేంత ప్రాణాంతకంగా మారిపోయింది. ఆ దోమ కాటు కారణంగా బ్లడ్ పాయిజన్‌గా మారిపోయింది. దీంతో కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరతిత్తులు సరిగా పనిచేయడం మానేశాయి. ఆ తర్వాత అతను సుమారు మూడు, నాలుగు వారాలపాటు పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను ఏదో కొద్దిపాటి అదృష్టం కొద్ది కోమా నుంచి బయటపడ్డాడు. ఆ తదనంతరం ఆ దోమ కుట్టిన ప్రాంతంలో ఏర్పడిన గడ్డను తొలగించేందుకు ఏకంగా 30 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో రోట్ష్క్ ఏకంగా సగం తోడను పోగొట్టుకోవాల్సి వచ్చింది కూడా. ఈ సర్జరీల కారణంగా తాను కొన్నేళ్ల పాటు మంచానికే అతుక్కుపోవాల్సి వచ్చిందని, దారుణమైన నరకాన్ని అనుభవించానని ఆవేదనగా చెప్పాడు రోట్ష్క్. ఫారెస్ట్ దోమలుగా పిలిచే ఈ ఆసియా టైగర్ దోమలు పగటిపూటే దాడి చేస్తాయని, దయచేసి వాటి పట్ల బహు జాగ్రత్తగా ఉండాలని రోట్ష్క్ అందర్నీ కోరుతున్నాడు. (చదవండి: షాకింగ్ ఘటన: జడ్జి, ఆమె భర్త, పెంపుడు జంతువులతో సహా మృతి) -
వీడియో తీయొద్దు అన్నందుకు.... డ్యూటీలో ఉన్న పోలీస్‌ని గట్టిగా కరిచి పరార్..
ముంబై: మహారాష్ట్రలో ఒక వ్యక్తి డ్యూటీలో ఉన్న ఒక పోలీస్‌ని గట్టిగా కరిచి గాయపరిచాడు. తమను వీడియో తీస్తున్నాడని ఒక పోలీసు జోక్యం చేసుకుని అడ్డుకున్నందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలో నాగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మకర్ధోక్డా గ్రామానికి చెందిన రాకేష్ పురుషోత్తం గజ్భియే అనే 30 ఏళ్ల వ్యక్తి తనతో వివాదం పెట్టుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేయమంటూ పోలిస్టేషన్‌కి వెళ్లాడు. ఐతే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఆగ్రహం చెందిన వ్యక్తి ఆ పోలిస్టేష్న్ ఆవరణలో ఉన్న పోలీసులందర్నీ ఫోన్లో వీడియో తీయడం ప్రారంభించాడు. దీన్ని గమనించిన ఒక పోలీసు జోక్యం చేసుకుని అడ్డుకున్నందుకు అతన్ని గట్టిగా కరిచి ద్విచక్ర వాహనం పై పారిపోయాడని పోలీసులు తెలిపారు. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకుని గాయపరిచినందుకు సదరు వ్యక్తి గజ్భియేపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: మద్యం బాటిళ్లతో గాజుల తయారీ... జీవనోపాధి ఇస్తూ...వ్యర్థాలకు చెక్) -
యజమాని ముందే పెంపుడు కుక్క దాడి... బాధతో విలవిల్లాడిన చిన్నారి: వీడియో వైరల్
యజమాని ముందే ఒక పెంపుడు కుక్క చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటన ఘజియాబాద్‌లోని హౌసింగ్ సొసైటి లిఫ్ట్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో సదరు పెంపుడు కుక్క యజమాని చూస్తుండగానే ఒక బాలుడిపై కుక్క దాడి చేస్తుంది. దీంతో ఆ చిన్నారి బాధతో విలవిలాడుతూ లిఫ్ట్ ముందుకు వచ్చి నిలబడతాడు. కానీ ఆ యజమాని కనీసం ఆ బాలుడిని ఓదార్చడం గానీ, సాయం చేయడం గానీ చేయకుండా బండరాయిలా నుంచొని ఉంది. పైగా తన కుక్కకు ఏమైన జరిగిందేమోనని చూస్తుందే తప్ప ఆ బాలుడిని ఓదార్చే పని చేయదు. దీంతో ఆకాష్ ఆశోక్ గుప్తా అనే నెటిజన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ఆ లిఫ్ట్‌లో వారిద్దరే ఉన్నారని, ఎవ్వరూ చూడలేదని ఇంతలా నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తారా? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. దీంతో ఘజియాబాద్ పోలీసులు వెంటనే స్పందించి....ఆ బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఇలా దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తించిన మహిళలను వదిలిపెట్టకూడదు...కఠినంగా శిక్షించాలి అంటూ ఫైర్ అయ్యారు. a pet dog bites a kid in the lift while the pet owner keeps watching even while the pet owner the kid is in pain! where is the moral code here just cos no one is looking? . . p.s: @ghaziabadpolice Location: Charms Castle, Rajnagar Extension, Ghaziabad Dtd: 5-Sep-22 | 6:01 PM IST pic.twitter.com/Qyk6jj6u1e — Akassh Ashok Gupta (@peepoye_) September 6, 2022 "दिनांक 05.09.22 को राजनगर एक्सटेंशन स्थित एक सोसाइटी की लिफ्ट में एक कुत्ते द्वारा अपने मालिक की मौजूदगी में बच्चे को काट लेने के वायरल वीडियो के सम्बन्ध में बच्चे के पिता की तहरीर पर थाना नंदग्राम पर अभियोग पंजीकृत करते हुए अग्रिम विधिक कार्यवाही की जा रही हैं" बाइट-सीओ सिटी-2 pic.twitter.com/dvLwBXyUaT — GHAZIABAD POLICE (@ghaziabadpolice) September 6, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
కుక్కను కరిచాడు!
ఫెయిర్‌ఫీల్డ్: మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, మనిషే కుక్కను కరిస్తే వార్త అనే మాటను అక్షరాలా నిజం చేసాడో ప్రబుద్ధుడు. అమెరికాలో ఒక దొంగ మంచి టైమ్ చూసుకొని వృద్ధులున్న ఇంటికి కన్నం వేశాడు. దొంగతనం పూర్తయి పారిపోదామనుకునే సమయంలో ఆ ఇంటికి అమెజాన్ డెలివరీ బాయ్ వచ్చాడు. తను పారిపోయేందుకు డెలివరీ ట్రక్కును, లేదంటే చంపేస్తానని బాయ్‌ను దొంగ బెదిరించాడు. దీంతో భయపడిన అమెజాన్ బాయ్ పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు సదరు ఇంటిని చుట్టుముట్టారు. ఎంత ప్రయత్నించినా దొంగను బయటకు రప్పించలేకపోవడంతో చివరకు పోలీసు జాగిలం కార్ట్(కే9)తో కలిసి ఇంట్లోకి వెళ్లారు. దొంగను గుర్తించిన కుక్క అతన్ని పట్టుకుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ దొంగ కుక్కను కరిచి, కత్తితో పొడిచాడని పోలీసులు ప్రకటించారు. చికిత్స కోసం కుక్కను ఆస్పత్రికి పంపారు. దొంగ మత్తు పదార్థాలు వాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిపై పాత కేసులున్నా యని పోలీసులు గుర్తించారు. కొత్తగా కుక్కను కరిచినందుకు, ట్రక్కు దొంగతనానికి, ఇంట్లో దొంగతనానికి కేసులు నమోదు చేశారు. -
వృద్ధురాలి మెడపై కరిచిన క్వారంటైన్ వ్యక్తి
థెని: తమిళనాడులో ఘాతుకం చోటుచేసుకుంది. శ్రీలంకలో బట్టల వ్యాపారం చేసే ఓ వ్యక్తి స్వస్థలానికి తిరిగి వచ్చి వృద్ధురాలి (90) మెడపై కొరికాడు. ఆమెను ఆస్పత్రిలో చేర్చినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అధికారుల కథనం ప్రకారం.. శ్రీలంకలో బట్టలు అమ్ముకునే వ్యక్తి శుక్రవారం భారత్‌లోకి వచ్చాడు. కరోనా నేపథ్యంలో అతన్ని హోం క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు. అయితే, జక్కమనయకంపట్టిలోని తన ఇంట్లోకి వచ్చిన వెంటనే నగ్నంగా వీధిలోకి పరుగెత్తాడు. ఆ వీధిలో ఉన్న ఓ వృద్ధురాలి మెడపై కొరికాడు. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె శనివారం మరణించిందని వైద్యులు తెలిపారు. (జిత్తుల మారి వైరస్) -
బిల్లు చెల్లించమంటే చెవి కొరికాడు..
సాక్షి, మహానంది : హోటల్‌కు వచ్చాడు.. జొన్నరొట్టె.. చికెన్ తదితర వాటిని ఆర్డర్ చేశాడు.. కడుపునిండా తిన్నాడు.. బిల్లు చెల్లించమని అడిగితే మద్యం మత్తులో గొడవపడి హోటల్ నిర్వాహకుడి కుమారుడి చెవిని కొరికాడు.. ఈ ఘటన మండలంలోని గాజులపల్లెలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. రంగస్వామి, లక్ష్మి గాజులపల్లె మెట్ట వద్ద చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు మహేష్ హోటల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా పనిచేస్తున్నాడు. రొట్టె, పప్పు, చికెన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వారి హోటల్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి వచ్చాడు. కడుపు నిండా తిని సుమారు రూ. 200 బిల్లు చేశాడు. తిన్నవాటికి డబ్బులు ఇవ్వాలని అడుగగా వారితో వాదనకు దిగాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. శివదీక్షలో ఉన్న మహేష్ చెవిని శ్రీను కొరికేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు నంద్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమారు 16 కుట్లు పడ్డాయని తల్లిదండ్రులు తెలిపారు. వారు మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
పాముతో సరదా ఆపై..
-
శరీరాన్ని రెండు ముక్కలు చేసినా వదల్లేదు
టెక్సాస్ : పాము పగబడితే పగతీర్చుకునే వరకు వదిలి పెట్టదంటారు. మరి అది నిజమో కాదో తెలియదు కాని అచ్చం అలాంటి ఘటనే టెక్సాస్ నగరంలో చోటుచేసుకుంది. శరీరాన్ని రెండు ముక్కలుగా నరికినా వేరుపడిన తలతోనే వ్యక్తిని కాటేసిందో పాము. పాము కాటుకు గురైన ఆ వ్యక్తి చావుతో పోరాడి వైద్యుల పుణ్యమా అని బతికి బట్ట కట్టాడు. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్ నగరానికి చెందిన మీలో, జెన్నీఫర్‌లు భార్యాభర్తలు. వాళ్లిద్దరూ ఇంటి పెరట్లో పని చేసుకుంటుండగా జెన్నీఫర్‌కు రాటిల్ స్నేక్ కంటపడింది. పామును చూసి భయపడ్డ ఆమె చేతిలో ఉన్న కత్తితో పామును రెండు ముక్కలుగా నరికింది. తర్వాత ఆ విషయాన్ని భర్త మీలోకి చెప్పింది. ముక్కలుగా నరికిన పాము చచ్చిందనుకున్న మీలో దాన్ని పడేయడానికి చేత్తో వేరుపడిన తల భాగాన్ని పట్టుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న రాటిల్ స్నేక్ అమాంతం అతని చేతిపై కాటు వేసింది. దీంతో అస్వస్థతకు గురైన మీలోను జెన్నీఫర్ ఆస్పత్రికి తరలించింది. అప్పటికే విషం శరీరం మొత్తం వ్యాపించటంతో అతన్ని బతికించటానికి వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జెన్నీఫర్ మాట్లాడుతూ.. ‘‘మామూలుగా పాము కాటుకు గురైన వ్యక్తికి రెండు నుంచి మూడు డోసుల యాంటీ వీనమ్ ఇస్తారు. కానీ మీలోకు మాత్రం ఏకంగా 26 డోసులు ఇవ్వాల్సి వచ్చింది. ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నప్పటికీ కిడ్నీల పనితీరు కొద్దిగా బాగోలేద’’ని తెలిపింది. -
దాడి చేసి అన్న ముక్కు కొరికేశాడు!
లక్నో : తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో అన్నపై దాడి చేశాడో తమ్ముడు. సోదరుడి దాడిలో అన్నకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనౌజ్ జిల్లా రామ్లాల్పురాకు చెందిన శ్రీకాంత్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అన్న శోబ్రాన్ వద్దకు వెళ్లి తాగడానికి డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. అందుకు సోదరుడు నిరాకరించడంతో అప్పటికే తాగిన మైకంలో ఉన్న శ్రీకాంత్, తన అన్న శోబ్రాన్ మీద పడి దాడిచేసి ముక్కు కొరికేశాడు. ముక్కుకు తీవ్రగాయం కావడంతో నొప్పి భరించలేక శోబ్రాన్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న కటుంబసభ్యులపై కూడా శ్రీకాంత్ దాడి చేశాడు. హాస్పిటల్లో కోలుకుంటున్న శోబ్రాన్ మాట్లాడుతూ.. ‘తమ్ముడు మా అమ్మానాన్నలతో పాటు మావయ్యపై కూడా దాడికి పాల్పడ్డాడు. ముఖ్యంగా నాపై దాడిచేసి ముక్కు కొరికేశాడు. నా పొట్ట, చేతులపై కూడా దాడి చేసి గాయపరిచాడని’ వివరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
కుక్కల దాడిలో 40 గొర్రెపిల్లల హతం
డోన్ టౌన్ : కృష్ణగిరి మండలం కర్లకుంట శివారులో ఆదివారం కుక్కలు దాడి చేయడంతో 40 గొర్రెపిల్లలు మృతి చెందాయి. బాధితుల వివరాల మేరకు..మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాసులు, వీరకుమార్ మేపు కోసం మందను కృష్ణగిరి మండలం కర్లకుంటకు తీసుకెళ్లారు. ఉదయం గొర్రెపిల్లలను కల్లం(ముళ్లకంప మధ్య)లో ఉంచి గొర్రెల మేపు కోసం బయటకు తీసుకెళ్లారు. ఇంతలో ఊరకుక్కలు కల్లంలో ఉన్న గొర్రె పిల్లలపై దాడి చేశాయి. ఘటనలో 40 గొర్రెపిల్లలు మృతి చెందాయి. మరో పదింటికి తీవ్రగాయాలయ్యాయి. కొద్దిసేపటి తర్వాత ఘటనా స్థలికి చేరుకున్న కాపరులు అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు రూ.1.6 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు. -
షార్క్..ఓ అమేజింగ్ వీడియో
ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి అమేజింగ్ వీడియో నొకదాన్ని అనూహ్యంగా దొరకపుచ్చుకున్నారు. ఒక షార్క్ మరొక షార్క్ ను సగానికి కొరికి పారేసిన వైనం ఈ వీడియోలో రికార్డ్ అయింది. వెస్ జోన్స్ అనే మత్సకారుడు భయానకమైన ఫుటేజ్ ను సాధించాడు. తన గర్ల్ ఫ్రెండ్ తో బ్లూమార్లిన్ చేప ఫిషింగ్ చేస్తుండగా ఈ వీడియోను రికార్డు చేసినట్టు చెప్పారు. -
షార్క్..ఓ అమేజింగ్ వీడియో
-
పిచ్చికుక్క దాడిలో 10మందికి గాయాలు
గుంటూరు: పిచ్చికుక్క దాడిలో పది మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరులోని తమ్మారెడ్డినగర్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో ఇళ్ల వద్ద ఆడుకుంటున్న చిన్నారులపై ఓ పిచ్చికుక్క దాడి చేసింది. ఇది గుర్తించిన చిన్నారుల కుటుంబ సభ్యులు పిల్లలను చికిత్స నిమిత్తం జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీధుల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మాదిగపల్లిలో పిచ్చికుక్కల స్వైరవిహారం
సుండుపల్లి: వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం దిగువమాదిగపల్లిలో ఆదివారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటోన్న ఇద్దరు చిన్నారులను కుక్కలు తీవ్రంగా గాయపర్చి కొంతదూరం పాటు ఈడ్చుకెళ్లాయి. గాయపడిన ఇద్దరు చిన్నారులు మోహిత్ కుమార్ (ఏడాదిన్నర వయసు), బబ్లూ (ఏడాది వయసు)లను సుండుపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా..అక్కడి వైద్యుల సూచనమేరకు తిరుపతికి తరలించారు. -
దడపుట్టిస్తున్న డెంగ్యూ!