పాము కాటుకి గురైతే సాధారణంగా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం చేస్తాం. మరికొందరూ సదరు పాముని చంపి, దాన్ని పట్టుకుని వెళ్లి మరీ చికిత్స పొందిన ఘటనలు చూసి చూశాం. కానీ ఏకంగా ఆ పాముని కరిచి చంపేయడం గురించి విన్నారా. ఈ దిగ్భ్రాంతికర ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..35 ఏళ్ల సంతోష్ లోహార్ అనే వ్యక్తి ఒకరోజు రైల్వే లైన్లు వేసే పనిని ముగించుకుని తన బేస్ క్యాంపులో నిద్రిస్తుండగా ఓ పాము అతనిపై దాడి చేసింది. దీంతో అతడు వెంటనే ఆ పాముని చేతుల్లోకి తీసుకుని రెండు సార్లు కసితీరా కరిచేశాడు. ఈ అసాధారణ చర్యకు పాము అక్కడికక్కడే చనిపోయింది. ఈ దుశ్చర్య తర్వాత లోహార్ ఆస్పత్రిపాలయ్యాడు.
ఓ రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు. అయితే సదరు వ్యక్తి కాటు వేసిన పాముని తిరిగి కొరికేస్తే విషం తగ్గిపోతుందనే మూఢనమ్మకంతో చేశాడట. ఈ విషయం తెలుసుకుని అక్కడ ఆస్పత్రి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఇలా పాము కాటుకి గురయ్యితే ఏం చేయాలో తెలుసుకుందాం..
పాము కాటుకి గురైనప్పుడు త్వరగా చర్య తీసుకోవాలని, వైద్య సహాయం కోరాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఈ తక్షణ వైద్య సంరక్షణ అనేది పలు సమస్యలను నివారించడమే గాక దీర్ఘకాలికి వైకల్యం లేదా మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
తప్పక చేయాల్సినవి..
పాము కరిచినట్లయితే ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లడం వంటివి చేయాలి. కాటే వేసిన ప్రదేశంలో బిగుతుగా ఉన్న దుస్తులను తీసివేయాలి. ప్రభావిత అవయవాన్ని కదలకుండా ఉంచి, బాధితుడిని తక్షణమే సురక్షితంగా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు వైద్య సహాయం కోసం ఎదరుచూస్తున్నప్పుడూ ప్రభావిత అవయవాన్ని గుండె స్థాయికి దిగువున ఉంచి ప్రాథమి చికిత్స అందించాలి. అలాగే బాధితుడికి తినేందుకు, తాగడానికి ఏమి ఇవ్వకూడదని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: ఆ రెస్టారెంట్‌లో దోస, ఇడ్లీ రేట్లు తెలిస్తే కంగుతింటారు: హర్ష గోయెంకా ట్వీట్)
Comments
Please login to add a commentAdd a comment