చిన్నపిల్లల్లో చుండ్రు రావడం కాస్త తక్కువే అయినా చలికాలంలో అప్పుడప్పుడు కనిపిస్తుండటం మామూలే. దీని నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలివి...
►పిల్లలకు వారానికి 3–4సార్లు తలస్నానం చేయించాలి. తలకు తేమనిచ్చే ఆయిల్స్, లోషన్స్ వంటివి అప్లై చేస్తుండాలి.
ఒకసారి జుట్టు రాలడం తగ్గిన తర్వాత హెయిర్ ఆయిల్స్, లోషన్స్ వాడుతూ మాటిమాటికీ మాడు పొడిబారకుండా చూసుకోవాలి.
►అన్ని విటమిన్లతో పాటు ప్రత్యేకంగా విటమిన్ బీ కాంప్లెక్స్ లభ్యమయ్యే ఆహారాలు తీసుకోవాలి. అందులో జింక్ మోతాదులు ఎక్కువ ఉండటం మరింత మేలు చేస్తుంది.
► ఒకసారి డాక్టర్ సలహా తీసుకుని కెటకెనజోల్, సాల్సిలిక్ యాసిడ్, జింక్ ఉన్న షాంపూలను వారానికి 2–3 సార్లు... అలా 4–6 వారాల పాటు వాడాల్సి ఉంటుంది. ► అప్పటికీ తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులతో పాటు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు సీబమ్ సెక్రిషన్స్ తగ్గించే మందుల్ని కూడా వాడాల్సి రావచ్చు.
చిన్నపిల్లల్లో చుండ్రు సమస్య.. ఎలా వదిలించాలి?
Published Tue, Dec 26 2023 4:47 PM | Last Updated on Tue, Dec 26 2023 4:48 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment