బ్యూటిప్స్
► పెదవులు పొడిబారి ఇరఇరలాడుతుంటే... రెండు చెంచాల వెన్నలో, ఒక చెంచా తేనె కలిపి, ఆ మిశ్రమంతో పెదవుల మీద మృదువుగా మర్దనా చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే... పెదవుల్లో తేమ పెరుగుతుంది.
► పచ్చి పసుపులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇది సహజసిద్ధ్దమైన బ్లీచ్ మాదిరిగా ఉపయోగపడుతుంది.
►కమలాపండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసి అందులో పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ముఖంమీద మచ్చలు పోతాయి.
►పుదీనా ఆకులను రుబ్బి నీళ్లు కలిపి మాడుకు పట్టించి కొంతసేపటి తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు.
►గుడ్డు తెల్లసొనను తలకు పట్టించి... గంట తరువాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.