శిరోజాలకు... కొబ్బరి పాలు.. ఉసిరి నూనె | Beauty tips:Hair care special | Sakshi
Sakshi News home page

శిరోజాలకు... కొబ్బరి పాలు.. ఉసిరి నూనె

Published Tue, Jul 31 2018 12:06 AM | Last Updated on Tue, Jul 31 2018 12:06 AM

 Beauty tips:Hair care special - Sakshi

వెంట్రుకలు రాలడం సమస్యకు ప్రధాన కారణం కుదుళ్లకు సరైన పోషణ లభించకపోవడం. వెంట్రుకల కుదుళ్లు నిగనిగలాడుతూ ఉండాలంటే.....

తేనెలో ఆలివ్‌ ఆయిల్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారైనా ఈ విధంగా చేస్తే వెంట్రుకలు సహజసిద్ధమైన మెరుపును కోల్పోకుండా ఉంటాయి. గాఢరసాయనాల గాఢత తగ్గి వెంట్రుకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.పచ్చికొబ్బరిని మెత్తగా రుబ్బి, పాలు పిండి తీయాలి. ఈ పాలను వెంట్రుక కుదుళ్లకు పట్టేలా మాడుకు, జుట్టు మొత్తానికి పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈవిధంగా చేస్తుంటే వెంట్రుకల మృదుత్వం దెబ్బతినకుండా ఉంటుంది. 
 
కొబ్బరి నూనె – ఉసిరి నూనె సమపాళ్లలో తీసుకొని, మాడుకు పట్టేలా రాసుకోవాలి. వారంలో రెండు సార్లయినా ఈ నూనెను తలకు పట్టించి,. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. మాడు ఆరోగ్యం దెబ్బతినేలా చేసేది చుండ్రు. చుండ్రు నియంత్రణలో ఉంచుకోవడానికి ఇంటి చిక్సితలు పాటిస్తూనే చర్మవైద్యులు చెప్పే సూచనలు పాటించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement