‘సౌందర్యానికి అసలైన అందం జుట్టే’ నన్న విషయం.. జుట్టు విపరీతంగా ఊడుతున్నవారికే బాగా తెలుస్తుంది. ఏ ఆయిల్ వాడితే జుట్టు బలపడుతుంది? ఏ షాంపూ యూజ్ చేస్తే హెయిర్ రాలిపోకుండా ఉంటుంది? ఎలాంటి చిట్కాలు పాటిస్తే జుట్టు పెరుగుతుంది? అంటూ సమయం కేటాయించి మరీ ఆరా తీస్తుంటారు. కానీ పరిష్కారం దొరికేలోపే తల పలచబడుతుంది.
దాంతో విగ్గు పెట్టుకోవడమో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ట్రీట్మెంట్ చేయించుకోవడమో... వంటి దిద్దుబాటు చర్యలు చేపడుతుంటారు. అలాంటి వారికి ఈ ‘లేజర్ కూంబ్’ ఓ వరమే. ఈ దువ్వెనతో దువ్వుకుంటే చాలు.. కురులు ఒత్తుగా మారతాయి. 9 మెడికల్ గ్రేడ్ లేజర్స్ (ఎల్‌ఈడీ లైట్స్ కాదు) కలిగిన ఈ డివైజ్ హై క్వాలిటీ టీత్స్ (దువ్వెన పళ్లు)ను కలిగి మంచి ఫలితాన్ని అందిస్తోంది. డివైజ్ సామర్థ్యాన్ని బట్టి.. 8 లేదా 11 నిమిషాల చొప్పున వారానికి 3 సార్లు దీన్ని వినియోగించాల్సి ఉంటుంది.
ఎలాంటి నొప్పి లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ట్రీట్మెంట్ అందిస్తుంది ఈ గాడ్జెట్. సుమారు 500 గ్రాములు కలిగిన ఈ దువ్వెనను ఉపయోగించడం చాలా సులభం. దీని లేజర్ లైట్ ఎనర్జీ తలలోని హెయిర్ ఫాలికల్స్‌ని(కుదుళ్లను) సున్నితంగా ప్రేరేపిస్తుంది. దీని ధర సుమారు రూ. 28 వేల వరకూ ఉంటుంది. ఇలాంటివి కొనుగోలు చేసేటప్పుడు ఇంటర్నేషనల్ మెడికల్ లైసెన్స్ కలిగిన డివైజ్‌ని మాత్రమే రివ్యూలు చూసి కొనుక్కోవాలి. ఇవి చార్జర్ సాయంతో నడుస్తాయి. భలే బాగుంది కదూ!
చదవండి: Groundnuts Health Benefits: ఉడకబెట్టిన పల్లీలు తినడం ఇష్టమా? ఇవి విడుదల చేసే సెరోటోనిన్ వల్ల..
Comments
Please login to add a commentAdd a comment