వ్యాధి నిరోధక శక్తి తన కణాల మీద తానే దాడి చేయడం వల్ల ఎదురవుతున్న సమస్యలలో పేనుకొరుకుడు ఒకటి. ఎంత అందమైన జుట్టు ఉంటే మాత్రం ఏం లాభం? పేను కొరుకుడుకు గురయిన వారి మనోవేదన మనం తీర్చలేము. పేనుకొరుకుడు అనగానే తలలో పేల వల్ల వచ్చే సమస్య కదా... మనకు అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదులే అని అనుకోవడానికి వీలు లేదు. అది పేరుకు మాత్రమే పేను కొరుకుడు. అంటే పేల వల్ల మాత్రమే వచ్చే ఇబ్బంది కాదు. పేలు లేని వారికి కూడా వచ్చే ఆటో ఇమ్యూన్ వ్యాధి....
ఒకోసారి వ్యాధి నిరోధక శక్తి తన కణాలపై తానే దాడి చేస్తుంటుంది. దానివల్ల ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి. దానితో బాధపడేవారికయితే దానిగురించి తెలుస్తుంది కానీ, అందరికీ అలోపేసియా లేదా పేను కొరుకుడు గురించి తెలియదు కదా.. ఇంతకీ పేనుకొరుకుడు అంటే తలలో లేదా గడ్డం మీద, చెంపల మీద, మీసాల వద్ద గుండ్రంగా పావలా బిళ్ల మేరకు వెంట్రుకలు ప్యాచ్‌లా ఊడిపోయి నున్నగా మారి చూడటానికి చాలా అంద వికారంగా తయారవుతుంది.
మొదట్లోనే దానిని నివారించకపోతే కనుబొమల మీద కూడా అలా వెంట్రుకలు ఊడిపోయి నున్నగా వికారంగా ఉంటుంది. దాని నివారణకు ట్రైకాలజిస్టులు లోపలికి తీసుకునే మందులతోపాటు ఆ ప్యాచ్‌లలో ఇంజెక్షన్లు చేస్తారు. అది ఖర్చుతోపాటు బాధ కూడా కలిగిస్తుంది. దానిబదులు కొన్ని ఇంటి చిట్కాలు ప్రయత్నించి చూస్తే సరి....
►పొగాకు కాడను బాగా నలగ్గొట్టి పొడిలా చేసి దానిని కొబ్బరినూనెలో వేసి నానబెట్టాలి. తర్వాత పొగాకును బాగా పిసికి నూనెను వడకట్టాలి.
►పేను కొరుకుడు మచ్చలు ఉన్న చోట ఆ నూనెను ప్రతిరోజూ రాస్తే అక్కడ తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి.
ఇలా తగ్గుతుంది...
►గురివింద గింజలను అరగ దీసి తలకు పట్టిస్తే పేలు మాయమయిపోతాయి.
►పేను కొరుకుడును నివారిస్తుంది. రోజూ రెండుసార్లు ఇలా చేస్తుంటే త్వరలోనే మంచి ఫలితం కనపడుతుంది.
►నెల రోజులపాటు రోజూ మూడుపూటలా మందార పూలను తలపై రుద్దుతూ ఉంటే పేను కొరుకుడు సమస్య తొలగిపోతుంది.
►మందార ఆకులకు సమానంగా నువ్వుల నూనె కలిపి తైలం తయారు చేసుకుని తలకు రాస్తూ ఉంటే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
►ఎండబెట్టిన మందార పూలచూర్ణాన్ని పాలల్లో కలిపి రెండు పూటలా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
►జిల్లేడు పాలు రాసినా మంచిదే. అయితే, వెంటనే చేతులు కడుక్కోవాలి. జిల్లేడు పాలు కంటిలోకి పోతే ప్రమాదం.
►బొప్పాయి పూల రసంతో వెంట్రుకలు రాలిన చోట రెండుపూటలా రుద్దాలి.
పేల నివారణకు ఇంటి చిట్కాలు
►వెల్లుల్లిని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి. దానికి నిమ్మరసం కలపండి.
►ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేయండి.
►ఆ తర్వాత దువ్వెనతో దువ్వితే పేలు వచ్చేస్తాయి.
►రాత్రి పడుకోవటానికి ముందు కొంచెం వైట్ వెనిగర్ తీసుకోని తలకు పట్టించి షవర్ క్యాప్ లేదా టవల్ తో మీ తలను కవర్ చేయాలి.
►రాత్రి అలా వదిలేసి ఉదయం తలస్నానం చేసి దువ్వెనతో దువ్వితే పేలు బయటకు వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment