Lice
-
Health Tips: తల దురదతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే
Health Tips In Telugu: ఒక్కోసారి మనం బాస్‌తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడుతుంటుంది. ఆ సమయంలో కలిగే ఇబ్బంది ఇంతా అంతా కాదు. తల దురదకు కేవలం పేలు లేదా చుండ్రు వంటివి మాత్రమే కాదు, అలర్జీ కూడా కారణం కావచ్చు. అలర్జీ అనేది కేవలం శరీరంపై దద్దుర్ల రూపేణా మాత్రమే వస్తుందనుకోవడానికి వీలు లేదు. తలలో కూడా వస్తుంది. ముందుగా ఈ దురద ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే దాన్ని నివారించడం సులభమవుతుంది. కొన్ని రకాల క్రిముల వల్ల, కొంతమందికి సాధారణంగానే అరచేతులు, అరికాళ్లలో ఎక్కువ చెమట పడుతుంది. ఎప్పటికప్పుడు చెమటను తుడుచుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. కొంతమంది ఎక్కువగా నీటిలో నానుతూ పనిచేస్తుంటారు. నీటిలో అదేపనిగా నానడం కూడా అలర్జీకి కారణమవుతుంది. కొన్ని సార్లు డిటర్జెంట్లు కూడా కొంతమందిలో అలర్జీకి కారణమవుతాయి. అదేవిధంగా కొన్ని రకాలైన నూనెలు, ఎరువులు, ఇంధనాలతో కూడా ఈ సమస్య వస్తుంది. పరిష్కారాలు ఇలా ఇబ్బంది పెట్టే తల దురద నుంచి తప్పించుకోవటానికి మిరియాలు బాగా ఉపయోగపడుతాయి. అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ పాలతో కలిపి బాగా నూరాలి. తర్వాత కొద్దిగా నీళ్లలో ఉడికించి పేస్టు మాదిరిగా చేసి దాన్ని ఆరబెట్టి కొద్దిగా వేడి ఉండగానే తలకు రుద్దాలి. అరగంట తర్వాత శీకాయ పొడితో తలస్నానం చేయాలి. ఈవిధంగా వారానికి మూడు, నాలుగు సార్లు చేస్తే తలదురద పూర్తిగా పోతుంది. ఆహారం ద్వారా: ఉప్పు, పులుపు, కారం తక్కువగా ఉండే, బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు అధికంగా ఉండే తాజా పళ్ళు, గ్రీన్ సలాడ్లను తీసుకోవడం మంచిది. మంచినీరు బాగా తాగడం, తగినంత వ్యాయామం, ధ్యానం చేయడం ద్వారా కూడా దురదలను తగ్గించుకోవచ్చు. దురద, దద్దుర్లు నిరోధించేందుకు మరికొన్ని జాగ్రత్తలు. ►దురద సమస్య ఎక్కువగా ఉంటే ముందు జాగ్రత్తగా తీపి పదార్ధాలను తినటం తగ్గించాలి. ►శరీరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ►మనం వంటికి రుద్దుకునే సబ్బు లేదా తలకు రాసుకునే నూనె, మనం వాడే స్ప్రే లేదా కొత్త మోడల్ దుస్తులకు ఉపయోగించే మెటీరియల్ కూడా మన చర్మానికి సరిపడకపోవచ్చు. అందువల్ల ఉన్నట్టుండి దురదలు వస్తుంటే, మన అలవాట్లలో కొత్తగా వచ్చిన మార్పేమిటో తెలుసుకుని దానినుంచి దూరంగా ఉండటం ఉత్తమం. చదవండి👉🏾 వయసు యాభై దాటిందా? పాలు,పెరుగు, చీజ్ తీసుకుంటే... -
Beauty Tips: పేనుకొరుకుడు సమస్యా.. గురివింద గింజలు, బొప్పాయి పూల రసంతో..
వ్యాధి నిరోధక శక్తి తన కణాల మీద తానే దాడి చేయడం వల్ల ఎదురవుతున్న సమస్యలలో పేనుకొరుకుడు ఒకటి. ఎంత అందమైన జుట్టు ఉంటే మాత్రం ఏం లాభం? పేను కొరుకుడుకు గురయిన వారి మనోవేదన మనం తీర్చలేము. పేనుకొరుకుడు అనగానే తలలో పేల వల్ల వచ్చే సమస్య కదా... మనకు అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదులే అని అనుకోవడానికి వీలు లేదు. అది పేరుకు మాత్రమే పేను కొరుకుడు. అంటే పేల వల్ల మాత్రమే వచ్చే ఇబ్బంది కాదు. పేలు లేని వారికి కూడా వచ్చే ఆటో ఇమ్యూన్ వ్యాధి.... ఒకోసారి వ్యాధి నిరోధక శక్తి తన కణాలపై తానే దాడి చేస్తుంటుంది. దానివల్ల ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి. దానితో బాధపడేవారికయితే దానిగురించి తెలుస్తుంది కానీ, అందరికీ అలోపేసియా లేదా పేను కొరుకుడు గురించి తెలియదు కదా.. ఇంతకీ పేనుకొరుకుడు అంటే తలలో లేదా గడ్డం మీద, చెంపల మీద, మీసాల వద్ద గుండ్రంగా పావలా బిళ్ల మేరకు వెంట్రుకలు ప్యాచ్‌లా ఊడిపోయి నున్నగా మారి చూడటానికి చాలా అంద వికారంగా తయారవుతుంది. మొదట్లోనే దానిని నివారించకపోతే కనుబొమల మీద కూడా అలా వెంట్రుకలు ఊడిపోయి నున్నగా వికారంగా ఉంటుంది. దాని నివారణకు ట్రైకాలజిస్టులు లోపలికి తీసుకునే మందులతోపాటు ఆ ప్యాచ్‌లలో ఇంజెక్షన్లు చేస్తారు. అది ఖర్చుతోపాటు బాధ కూడా కలిగిస్తుంది. దానిబదులు కొన్ని ఇంటి చిట్కాలు ప్రయత్నించి చూస్తే సరి.... ►పొగాకు కాడను బాగా నలగ్గొట్టి పొడిలా చేసి దానిని కొబ్బరినూనెలో వేసి నానబెట్టాలి. తర్వాత పొగాకును బాగా పిసికి నూనెను వడకట్టాలి. ►పేను కొరుకుడు మచ్చలు ఉన్న చోట ఆ నూనెను ప్రతిరోజూ రాస్తే అక్కడ తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి. ఇలా తగ్గుతుంది... ►గురివింద గింజలను అరగ దీసి తలకు పట్టిస్తే పేలు మాయమయిపోతాయి. ►పేను కొరుకుడును నివారిస్తుంది. రోజూ రెండుసార్లు ఇలా చేస్తుంటే త్వరలోనే మంచి ఫలితం కనపడుతుంది. ►నెల రోజులపాటు రోజూ మూడుపూటలా మందార పూలను తలపై రుద్దుతూ ఉంటే పేను కొరుకుడు సమస్య తొలగిపోతుంది. ►మందార ఆకులకు సమానంగా నువ్వుల నూనె కలిపి తైలం తయారు చేసుకుని తలకు రాస్తూ ఉంటే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ►ఎండబెట్టిన మందార పూలచూర్ణాన్ని పాలల్లో కలిపి రెండు పూటలా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ►జిల్లేడు పాలు రాసినా మంచిదే. అయితే, వెంటనే చేతులు కడుక్కోవాలి. జిల్లేడు పాలు కంటిలోకి పోతే ప్రమాదం. ►బొప్పాయి పూల రసంతో వెంట్రుకలు రాలిన చోట రెండుపూటలా రుద్దాలి. పేల నివారణకు ఇంటి చిట్కాలు ►వెల్లుల్లిని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి. దానికి నిమ్మరసం కలపండి. ►ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేయండి. ►ఆ తర్వాత దువ్వెనతో దువ్వితే పేలు వచ్చేస్తాయి. ►రాత్రి పడుకోవటానికి ముందు కొంచెం వైట్ వెనిగర్ తీసుకోని తలకు పట్టించి షవర్ క్యాప్ లేదా టవల్ తో మీ తలను కవర్ చేయాలి. ►రాత్రి అలా వదిలేసి ఉదయం తలస్నానం చేసి దువ్వెనతో దువ్వితే పేలు బయటకు వస్తాయి. చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. -
వారెవ్వా.. పేన్లను దంచి వ్యాక్సిన్ తయారు చేశాడు
Google Doodle Rudolf Weigl: వ్యాక్సిన్లు.. రకరకాల జబ్బుల నుంచి మనిషికి రక్షణ అందించే కవచాలు. కరోనా తర్వాత వీటి గురించి దాదాపు పూర్తి సమాచారం అందరికీ తెలుస్తోంది. గతంలో ఎలాంటి ఎలాంటి వ్యాక్సిన్లు ఉండేవి, వాటిని ఎలా తయారు చేస్తున్నారు, సైడ్ ఎఫెక్ట్స్, వాక్సిన్లతో రక్షణ ఎలా అందుతుంది.. ఇలాంటి వివరాలన్నీ తెలిసిపోతున్నాయి. అయితే వైరస్, బ్యాక్టీరియాల నుంచే వాటిని అభివృద్ధి చెందిస్తారని.. అందుకు ఓ పోలాండ్ సైంటిస్ట్ చేసిన ప్రయోగాలే మూలమని మీలో ఎంతమందికి తెలుసు? .. ఇవాళ గూగుల్‌లో డూడుల్‌గా కనిపిస్తోంది కూడా ఆయనే. పోలాండ్‌కు చెందిన రుడాల్ఫ్ వెయిగ్ల్.. అతిపురాతనమైన, ప్రమాదకరమైన టైఫస్ అంటువ్యాధికి సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను తయారు చేసిన మొదటి సైంటిస్ట్. ఈయన వ్యాక్సిన్‌ను ఎలా తయారుచేశారో తెలుసా? పేన్లను దంచి.. ఆ పేస్ట్‌తో. అవును.. వెగటుగా అనిపించినప్పటికీ ఇది నిజం. ఈ ప్రయోగమే ఆ తర్వాతి కాలంలో చాలా వ్యాక్సిన్ల తయారీకి ఒక మార్గదర్శకంగా మారిందంటే అతిశయోక్తికాదు. ►రుడాల్ఫ్ స్టెఫాన్ జన్ వెయిగ్ల్.. 1883, సెప్టెంబర్ 2న ఆస్స్ర్టో హంగేరియన్ టౌన్ ప్రెరవు(మోరావియా రీజియన్)లో పుట్టాడు. తండడ్రి టీచర్.. తల్లి గృహిణి. పుట్టింది జర్మనీలోనే అయినప్పటికీ పోలాండ్‌లో స్థిరపడింది ఆ కుటుంబం. ►పోలాండ్ ఎల్‌వీవ్‌లోని యూనివర్సిటీలో బయోలాజికల్ సైన్స్ చదివాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అస్ట్రో-హంగేరియన్ ఆర్మీ కోసం 1914 నుంచి పారాసిటాలజిస్ట్‌గా పని చేశాడు. ►పోలాండ్‌ను జర్మనీ ఆక్రమించుకున్నాక.. లెంబర్గ్ ఇనిస్టిట్యూట్‌లో రీసెర్చర్‌గా కొంతకాలం పని చేశాడు. ఆ టైంలో తూర్పు యూరప్‌లో లక్షల మంది టైఫస్ బారిన పడగా, దానికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలోకి దిగాడు. ఆపై ఎల్‌వీవ్‌లో తన పేరు మీద ఒక ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పి.. ఆపై అక్కడే టైఫస్ మీద, వైరల్ ఫీవర్ మీద ఆయన పరిశోధనలు మొదలయ్యాయి. ►తొలి దశ ప్రయోగాల్లో జబ్బును తగ్గించే ఫలితం రానప్పటికీ.. లక్షణాల్ని తగ్గించి ఉపశమనం ఇచ్చింది ఆయన తయారు చేసిన వ్యాక్సిన్. ఆ తర్వాత రాకీ మౌంటెన్ స్పాటెడ్ ఫీవర్‌కు సైతం వ్యాక్సిన్ తయారు చేశాడాయన. ►1909లో ఛార్లెస్ నికోలె.. లైస్(పేను)వల్ల టైఫస్ అంటువ్యాధి ప్రబలుతుందని గుర్తించాడు. అందుకు రికెట్ట్‌సియాప్రోవాజెకి బ్యాక్టీరియా కారణమని కనిపెట్టాడు. ఆ తర్వాత టైఫస్ వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ►టైఫస్ వ్యాక్సిన్ కోసం అప్పటిదాకా ఎవరూ చేయని ప్రయోగం చేపట్టాడు వెయిగ్ల్. జబ్బు కారణమైన పేను కడుపులోనే రికెట్ట్సియా ప్రోవాజెకి ని ప్రవేశపెట్టి వాటిని పెంచి.. ఆ పేన్లను చిత్తు చేసి వ్యాక్సిన్ పేస్ట్ తయారు చేశాడు. ముందు ఆరోగ్యవంతమైన పేన్లను పన్నెండు రోజులపాటు పెంచాడు. వాటికి టైఫస్ బ్యాక్టీరియాను ఇంజెక్ట్ చేశాడు. ఆపై మరో ఐదు రోజులపాటు వాటిని పెంచాడు. చివరికి వాటిని చిత్తు(గ్రైండ్ చేసి).. ఆ పేస్ట్‌ను వ్యాక్సిన్‌గా ఉపయోగించాడు. ►పేన్లను పెంచడానికి మనుషుల రక్తం కావాలి. కాబట్టి.. ఒక ప్రత్యేకమైన తెర ద్వారా వాటిని మనుషుల రక్తం పీల్చుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వందల మంది జబ్బు పడగా.. వాళ్లను చికిత్స ద్వారా మామూలు స్థితికి తీసుకొచ్చాడు. 1918లో గినియా పందుల మీద, మనుషుల మీద వాటిని ట్రయల్స్ నిర్వహించాడు. ►1930లో వ్యాక్సిన్ అధికారికంగా మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. ►అయితే దేశ విద్రోహ కార్యాకలాపాలకు నెలవైందన్న ఆరోపణలతో 1944లో సోవియట్‌యూనియన్ ఆయన ఇనిస్టిట్యూట్‌ను మూసేసింది. ►1936-43 మధ్య చైనాలో ఈ తరహా వ్యాక్సిన్లను ప్రయోగించి సక్సెస్ అయ్యారు. కష్టం-ప్రమాదకరమైనదైనప్పటికీ.. ఆ వ్యాక్సిన్ ప్రయోగాలు విజవంతం అయ్యాయి. ►1957 ఆగష్టు 11న 73 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశాడు ►1942, 1978(మరణానంతరం)లో నోబెల్ బహుమతికి వెయిగ్ల్ పేరు నామినేటఅయ్యింది. కానీ, అవార్డు దక్కలేదు. అయితే ఇతర దేశస్తులతో పని చేశాడన్న ఆరోపణలు ఆయనకు అవార్డు దక్కనివ్వలేదు. ►2003లో ప్రపంచం ఆయన పరిశోధనల్ని ‘రైటస్ ఎమాంగ్ ది నేషన్స్ ఆఫ్ ది వరల్డ్’ గౌరవంతో స్మరించుకుంది. రుడాల్ఫ్ వెయిగ్ల్ 138వ పుట్టినరోజు సందర్భంగా.. గూగుల్ డూడుల్ ద్వారా ఆయన్ని గుర్తు చేస్తోంది గూగుల్. రెండో ప్రపంచ యుద్ద సమయంలో పోలాండ్‌ను జర్మనీ ఆక్రమించుకున్నాక.. వెయిగ్ల్‌ను బలవంతంగా వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్లాంట్‌లోకి దించారు. అక్కడ ఆయన తెలివిగా పనివాళ్లను తన ప్రయోగాలకు ఉపయోగించుకున్నాడు. అంతేకాదు తనకు తాను లైస్ ద్వారా టైఫస్‌ను అంటిచుకుని రిస్క్ చేసి మరీ పరిశోధనలు చేశాడు. తన పరిశోధనలు, ప్రయోగాలతో వ్యాక్సిన్‌ను రూపొందించి.. వేల మంది ప్రాణాలు కాపాడాడిన వెయిగ్ల్‌ను ఒక సైంటిస్ట్‌గా మాత్రమే కాదు.. హీరోగా ప్రపంచం ఆయన్ని కొనియాడుకుంటోంది. - సాక్షి, వెబ్ స్పెషల్