బ్యూటిప్స్
కేశాల నుంచి కాలి వేలు వరకూ పండగరోజున ప్రత్యేక అలంక రణతో ఎలా మెరిసిపోవచ్చో తెలుసుకుందాం...
►సౌందర్యపోషణలో కాలివేళ్లది కూడా ప్రధాన పాత్ర. గోళ్లను చక్కగా కత్తిరించి, చుట్టూ మురికి లేకుండా శుభ్రపరిచి, నెయిల్‌పాలిష్
►వేయాలి.శిరోజాలను శుభ్రపరిచి, ఆరబెట్టుకున్నాక సంప్రదాయ అల్లికలలో జడ లేదా ముడులలోనే ప్రత్యేక అలంకరణలు ఎంచుకోవచ్చు.
►డ్రెస్ ఎంపిక పండగ కళను రెట్టింపు చేసేదై ఉండాలి. చీరలైనా, డ్రెస్సులైనా.. కాంతిమంతమైన రంగులు, డిజైనర్ వర్క్, సౌకర్యంగా ఉండేవి ఎంచుకోవాలి.
►ముఖారవిందానికి కళ తెచ్చేవి కళ్లు, కనుబొమ్మలు, పెదాలు, ఎండ, ఉక్కపోతను దృష్టిలో పెట్టుకొని ఫౌండేషన్ ఎక్కువ వాడకుండా కళ్లు, కనుబొమ్మలు, పెదాలను తీర్చిదిద్దుకోవాలి.
►ఆభరణాలు, శాండిల్స్, హ్యాండ్ బ్యాగ్... ఇలా ప్రతి అలంకరణ వస్తువు పండగను ప్రతిబింబించేలా ఉండాలి.