Hair Care Tips In Telugu: Amazing Benefits Of Applying Onion Juice To Hair - Sakshi
Sakshi News home page

Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! నల్లని, ఒత్తైన కురులు..!

Published Mon, Aug 22 2022 2:28 PM | Last Updated on Mon, Aug 22 2022 3:47 PM

Hair Care Tips: Amazing Benefits Of Applying Onion Juice - Sakshi

Hair Care Tips In Telugu: ఉల్లి లేని కూరలను.. ఉప్పు లేని పప్పు చారుతో పోల్చుతారు కొంతమంది. ఎందుకంటే ఉల్లి వల్ల వంట రుచికరంగా ఉండడంతోపాటు ఆరోగ్యానికీ ఎంతో మేలు. అలాగే. ఉల్లి వల్ల జుట్టుకు కూడా ఎంతో మంచిదని ఇటీవల కాలంలో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. 

►ఉల్లి రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇది జుట్టును ఊడిపోకుండా కాపాడుతుంది. అందుకు ఏం చేయాలంటే..?
►ఉల్లిని మెత్తగా గ్రైండ్‌ చేసి.. దాన్నుంచి రసాన్ని తీసి.. ఒక గిన్నెలో నిల్వ చేసి కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు రాసుకుంటూ ఉండాలి.
►ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
►ఈ నూనెను గోరువెచ్చగా వేడి చేసు రాసుకున్నా మంచిదే. ఈ నూనె బట్టతల సమస్యలు రాకుండా  కాపాడుతుంది.  

మెరిసే జుట్టును సొంతం చేసుకునేందుకు ఇలా చేయండి
తేనె, ఆలివ్‌ ఆయిల్‌..
►టీ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, టీస్పూన్‌ నిమ్మరసం కలపాలి.
►ఈ మిశ్రమాన్ని కోడిగుడ్డులోని  తెల్లసొనని వేసి కలపాలి.
►దీనిని కుదుళ్ల నుంచి జుట్టుకి పట్టించాలి.
►20 నిమిషాల తరువాత తల స్నానం చేయాలి.

కరివేపాకుతో..
►కప్పు కొబ్బరినూనె, ఒక కప్పు ఆవాల నూనె కలపాలి.
►ఈ మిశ్రమంలో ఒక కప్పు  కరివేపాకుల్ని వేసి  రాత్రంతా నానబెట్టాలి.  
►మరుసటి రోజు  ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి చిన్న మంట పై వేడి చేయాలి.

►కరివేపాకు కాస్త వేగగానే నూనె మిశ్రమంలోంచి తీసేయాలి.
►ఆ తరువాత  దింపేసి మూడు కర్పూరం బిళ్లలు వేయాలి.  
►చల్లారిన తరువాత  నూనె మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి జుట్టుకంతా పట్టించి రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు తలస్నానం చేయా లి.
►ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
చదవండి: Health Tips: కాలీఫ్లవర్‌, క్యారెట్లు, బీట్‌రూట్‌, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement