Hair Care: చిన్నపాటి చిట్కాలు పాటిస్తే.. మృదువైన జుట్టు మీ సొంతం! | Beauty Tips In Telugu: Get Smooth Hair Follow These | Sakshi
Sakshi News home page

Hair Care: చిన్నపాటి చిట్కాలు పాటిస్తే.. మృదువైన జుట్టు మీ సొంతం!

Published Sat, Oct 2 2021 11:44 AM | Last Updated on Sat, Oct 2 2021 12:12 PM

Beauty Tips In Telugu: Get Smooth Hair Follow These - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ప్రతి ఒక్కరూ ఒత్తైన, మెరిసే, సిల్కీ హెయిర్‌ కోసం ఆరాటపడుతుంటారు. కానీ జట్టు ఒత్తుగా ఉన్నప్పుడు చిక్కబడి విపరీతంగా విసిగిస్తుంటుంది. ఎక్కడికైనా అర్జంటుగా వెళ్లాల్సి వచి్చనప్పుడు తల దువ్వుకోవాలన్నా, ఏదైనా సరికొత్త హెయిర్‌ స్టైల్‌ చేసుకుందామన్నా అస్సలు కుదరదు. చిక్కులు పడే కురులను చిన్నపాటి చిట్కాల ద్వారా మృదువుగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం.. 

తలస్నానం చేసిన చేసిన తరువాత సాధారణంగా మందమైన టవల్‌ లేదా బట్టతో తలను గట్టిగా తుడుచుకుంటూ ఉంటారు. దానికి బదులు పలుచటి వస్త్రంతో తలను మృదువుగా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ చిక్కుపడదు. ప్రతి మూడు నెలలకోసారి స్ప్లిట్‌ ఎండ్స్‌ తీసేసి, జుట్టును ట్రిమ్‌ చేయాలి. జుట్టుకు పోషకాలనందించే స్పాను తప్పనిసరిగా నెలకోసారి చేసుకోవాలి. 


 

దీర్ఘకాలికంగా బాధిస్తున్న చిక్కులకు కెరాటిన్‌ ట్రీట్‌మెంట్‌ కూడా బాగా పనిచేస్తుంది. దీనివల్ల జుట్టు మృదువుగా మారడమేగాక మెరుపుని సంతరించుకుంటుంది. 
ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల సీరమ్‌లు దొరుకుతున్నాయి. వీటిలో మీ జుట్టుకు నప్పే సీరమ్‌ను వాడడం వల్ల కూడా కురులు మృదువుగా మారతాయి. 


 

సల్ఫేట్‌ తక్కువగా ఉండే షాంపు వాడడం వల్ల జుట్టు ఎక్కువ చిక్కుపడదు. 
చర్మసంరక్షణలో వాడే గ్లిజరిన్‌ కేశాల సమస్యలకు మంచి పరిష్కారం చూపుతుంది. గ్లిజరిన్‌ను జుట్టుకు కండీషనర్‌లా పట్టిస్తే.. కురులు పొడిబారడం తగ్గి మృదుత్వాన్ని సంతరించకుంటాయి. 
మార్కెట్లో దొరికే హెయిర్‌ మాస్క్‌లు కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న మాసు్కలు జుట్టును పదిలంగా ఉంచుతాయి. తేనె, ఆలివ్‌ ఆయిల్‌లను హెయిర్‌ మాస్‌్కగా వాడితే స్ప్లింట్‌ ఎండ్స్, చిక్కులు పడడం తగ్గుతుంది.

ఆలివ్‌ ఆయిల్, తేనెను సమపాళల్లో తీసుకుని మైక్రో వేవ్‌లో 30 సెకన్ల పాటు ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి కొద్దిగా మజ్జిగ కలిపి జుట్టుకు పట్టించాలి. అరగంటపాటు ఆరనిచ్చి సాధారణ షాంపూతో కడిగేయాలి. 
మనం పడుకునేటప్పుడు తలకింద పెట్టుకునే దిండు కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల దిండు కవర్‌ సిల్క్‌తో తయారైనదిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కాటన్‌ దిండు కవర్‌ వల్ల వెంట్రుకలు పొడిబారతాయి.  
ఇవన్నీ పాటిస్తే జుట్టు చిక్కులు పడడం తగ్గుతుంది.  
చదవండి: Hair Care: తెల్ల జట్టు సమస్యా.. హెన్నా పెడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement