హెల్త్‌ – బ్యూటిప్స్‌ | Drinking Tea Made With Hibiscus Leaf Reduces Blood Pressure | Sakshi
Sakshi News home page

హెల్త్‌ – బ్యూటిప్స్‌

Published Sun, Apr 7 2019 12:13 AM | Last Updated on Sun, Apr 7 2019 12:13 AM

Drinking Tea Made With Hibiscus Leaf Reduces Blood Pressure - Sakshi

►మందారపూలను బాగా ఎండబెట్టి వాటిని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. ఆ నూనెను ప్రతిరోజు తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదు మందార పువ్వుల్ని నానబెట్టి, మెత్తగా పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించి తల స్నానం చేస్తే జుట్టు పట్టులా మెరిసిపోతుంది. 

►మందార ఆకుతో చేసిన టీని తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. మందార ఆకు టీ సేవించటం వలన రోగనిరోధక శక్తి పెరిగి తద్వారా జలుబు, దగ్గు తగ్గటానికి సహాయపడుతుంది. మందార ఆకు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

►జామ పువ్వులను మెత్తగా నూరి కళ్లపై ఉంచితే కళ్లు తేటగా తయారవుతాయి. కళ్ల కలక, కళ్లు నీరు కారడం, కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలకు అద్భుత ఫలితం కనిపిస్తుంది. 

►ఆయాసం ఉన్నవారు రెండు చిటికెల పసుపు, ఒక చిటికెడు మెత్తటి ఉప్పు రోజూ తీసుకోవడం మంచిది. వేడి టీలో తొమ్మిది చుక్కల నిమ్మరసం, అర చెంచా తేనె కలిపి వేడివేడిగా తాగడం చాలా మంచిది.

►గోధువు పిండిలో తాజా మీగడను కలుపుకుని ఆ మిశ్రవూన్ని వుుఖం, మెడ, చేతులకు పట్టించుకోవాలి. నలుగు పెట్టుకున్నట్టుగా చేతితో మిశ్రవూన్ని తొలగించాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. దీనిలో గంధం పొడి ఉపయోగిస్తే ఇంకా వుంచి ఫలితం ఉంటుంది.

►వెడల్పాటి పాత్రలో అర లీటరు శుభ్రమైన నీటిని తీసుకుని దానిలో ఒక స్పూను రాళ్ళ ఉప్పును కలుపుకోవాలి. ఆ నీటిలోకి వుుఖంపెట్టి కళ్ళు వుూస్తూ, తెరుస్తూ చేయాలి. దీనివల్ల మీ అలసిన కళ్ళు ఫ్రెష్‌ అవతాయి.

►వేప ఆకులు నీటిలో వురిగించుకుని ఆ నీటితో వుుఖాన్ని, చేతులను కడుగుతుండటం వల్ల చికెన్‌పాక్స్‌ వల్ల ఏర్పడ్డ వుచ్చలు తొలగిపోతాయి. బియ్యంపిండిలో మీగడ కలిపి ఆ పేస్ట్‌ని వుుఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువు  అయ్యి కాంతులీనుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement