Hair Care: జుట్టు రాలుతోందా? ఈ లేజర్‌ హెల్మెట్‌ వాడితే.. | Hair Care: Laser Helmet For Growth Postpartum How It Works | Sakshi
Sakshi News home page

Laser Helmet: జుట్టు రాలుతోందా? ఈ లేజర్‌ హెల్మెట్‌ వాడితే..

Published Tue, Dec 27 2022 2:55 PM | Last Updated on Wed, Dec 28 2022 11:56 AM

Hair Care: Laser Helmet For Growth Postpartum How It Works - Sakshi

సాధారణ హెల్మెట్‌.. ప్రయాణాల్లో ప్రాణాలను కాపాడితే.. ఈ లేజర్‌ హెల్మెట్‌.. రాలిపోతున్న జుట్టును సంరక్షిస్తుంది. రాలిపోయిన జుట్టును తిరిగి రప్పిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా హెయిర్‌ గ్రోత్‌ ఆగిపోయిందని.. కారణం లేకుండానే హెయిల్‌ లాస్‌ అవుతోందని వాపోయేవారికి ఈ డివైజ్‌ ఓ వరం.

ప్రసవానంతర సమస్యలతోనో.. వాతావరణ మార్పులతోనో.. ఆహారపు అలవాట్లతోనో.. కారణం ఏదైనా జుట్టు రాలిపోవడం, తిరిగి పెరగకపోవడం.. చాలామందికి ఉండే ప్రధాన సమస్యే. ఆయిల్స్, షాంపూలు, కండిషనర్స్‌ మారుస్తూ తాపత్రయపడేవారికి ఈ మెషిన్‌ చక్కటి పరిష్కారం. 

ఈ డివైజ్‌ని ఆన్‌ చేసుకుని.. తలకు హెల్మెట్‌లా తగిలించుకుంటే చాలు. ఫలితం చాలా త్వరగా అందుతుంది. జుట్టు పెరుగుదల కోసం ప్రతిరోజూ 25 నిమిషాల పాటు ఈ ట్రీట్మెంట్‌ తీసుకోవాలి. ఆన్‌ – ఆఫ్, అడ్జస్ట్‌మెంట్‌ల కోసం ప్రత్యేకమైన రిమోట్‌.. హెల్మెట్‌తో పాటు లభిస్తుంది. ట్రీట్మెంట్‌ సెషన్‌లను ట్రాక్‌ చేయడానికి రిమోట్‌లో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. దాంతో ప్రత్యేకంగా గడియారం ముందు కూర్చోవాల్సిన పనిలేదు. 

ఈ మెషిన్‌ సమర్థవంతమైనది.. సురక్షితమైనది కూడా. అంతేకాదు తేలికగా.. సౌకర్యవంతంగానూ ఉంటుంది. ఇది ప్రతి సెషన్లో‌ ఒక డిగ్రీ సెల్సియస్‌ కంటే తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. అంతర్నిర్మాణ సెన్సర్‌ను కలిగి ఉంటుంది. దాంతో ఉష్ణోగ్రత స్థాయిని పెరగనివ్వకుండా నియంత్రిస్తుంది. ఈ మోడల్‌ హెల్మెట్స్‌ ధర సుమారుగా పదిహేను వందల రూపాయల నుంచి అమ్ముడుపోతున్నాయి. ఇలాంటి డివైజ్‌లను క్వాలిటీతో పాటు వినియోగదారుల రివ్యూల ఆధారంగానే కొనుగోలు చేయాలి.

చదవండి: Health: మేనరికపు పెళ్లి.. నాలుగు సార్లు అబార్షన్‌.. సమస్య ఏమిటి? పరిష్కారం ఉందా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement