Postpartum
-
పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే తెలుసా? సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే!
ప్రసవం తరువాత మహిళలకు భర్తతో పాటు, కుటుంబ సభ్యుల తోడు, సహకారం చాలా అసవరం. బిడ్డల సంరక్షణలో ఇంట్లోని పెద్దల మద్దతు కీలక పాత్ర పోషిస్తుంది. లేదంటే కొంతమందిలోఅనేక సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు:డాక్టరు గారూ! మా అమ్మాయికి 24 ఏళ్లు. నాలుగు వారాల కిందట సిజేరియన్ ద్వారా మొదటి కాన్పులో మగబిడ్డను ప్రసవించింది. పిల్లవాడు కొంచెం బరువు తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందీ లేదని డాక్టర్ చెప్పారు. అయినా మా అమ్మాయి మొహంలో సంతోషం లేదు. తరచూ ఏడవటం, కంటినిండా నిద్రపోకవడం, ఆ బిడ్డను సరిగా పెంచలేనని బాధపడటం, భారంగా భావించడం, బిడ్డను ఏమైనా చేసి తాను కూడా చనిపొతే బాగుండునని మాటిమాటికీ దుఃఖించడం చేస్తోంది. మా అల్లుడు, మేమంతా కూడా ఆమెకు ఎంత ధైర్యం చెప్పినా, అలాగే బాధపడుతోంది. తను ఎందుకు ఇలా ఉంటోందో, ఏం చేయాలో అర్థం కావడం లేదు. – పి. విజయలక్ష్మి, హైదరాబాద్మీ కూతురి విషయంలో మీరు పడే బాధ నేనర్థం చేసుకోగలను. మీ అమ్మాయి ‘పోస్ట్ పార్టమ్ డిప్రెషన్’ అనే మానసిక రుగ్మతకు లోనయినట్లు అర్థమవుతుంది. ప్రసవానంతరం 15 శాతం మంది స్త్రీలలో ఈ సమస్య వచ్చే అవకాశముంది. ప్రసవం తర్వాత వచ్చే హార్మోన్ల మార్పులు, నిద్రలేమి, మెదడులో వచ్చే రసాయనిక మార్పులు, వారసత్వ లక్షణాలూ ఇందుకు ముఖ్య కారణాలు. ప్రసవం తర్వాత ఒకటి రెండువారాలు కొంచెం డల్‌గా దిగాలుగా ఉండటం (పోస్ట్ పార్టమ్ బ్లూస్) కొంత సాధారణమైనప్పటికీ, మీ అమ్మాయికి వచ్చిన సమస్యను తీవ్రంగానే పరిగణించాల్సి వస్తుంది.మీరు వెంటనే దగ్గర్లోని మానసిక వైద్యునికి చూపిస్తే వారు కౌన్సెలింగ్, మందుల ద్వారా చికిత్స చేస్తారు. ఆమెలో ఆత్మహత్య భావాలున్నాయన్నారు కాబట్టి, అవసరమైతే అలాంటి వారిని కొన్నాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేయించి మరింత గట్టి వైద్యం చేయించాల్సి ఉంటుంది. ఆమె పూర్తిగా కోలుకునేంతవరకు బిడ్డ సంరక్షణ మీరు తీసుకుని, తల్లి నుంచి బిడ్డకు ఎలాంటి హానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి వైద్య చికిత్స, కుటుంబ సభ్యుల సహకారంతో మీ అమ్మాయి పూర్తిగా కోలుకుంటుంది. డోన్ట్ వర్రీ! -
పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు వ్యాపారం మొదలుపెట్టింది
‘ఇదేమీ జీవితం’ అనే మాట సంప్రీత్ కౌర్ నోటి నుంచి ఎన్నోసార్లు వచ్చేది. నరకాన్ని తలపించే ప్రదేశంలో ఆమె బందీగా లేదు. ఎప్పటిలాగే, అదే ఇంట్లో అదే కుటుంబ సభ్యుల మధ్య ఉంది. ‘ఇదేమీ జీవితం నుంచి ఎందుకీ జీవితం’ వరకు కౌర్ ఆలోచనలు వెళుతున్న చీకటి కాలంలో ఆమె ముందు ఒక వెలుగు కిరణం పడింది. దాని పేరు... మక్రామీ! స్కూల్ నుంచి కాలేజీ వరకు స్టార్ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకుంది హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన సంప్రీత్కౌర్. ప్రెగ్నెన్సీ సమయంలో తొమ్మిదేళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. ఎన్నో ప్రసిద్ధ సంస్థల్లో క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన కౌర్‌కు ఖాళీగా కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు. కాని అనివార్య పరిస్థితులలో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. డెలివరీ తర్వాత కౌర్ ప్రసూతి వైరాగ్యానికి అంటే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కు గురైంది. తాను తనలాగా ఉండలేకపోయేది.ఏవేవో ప్రతికూల ఆలోచనలు. ఎప్పుడూ సందడిగా ఉండే కౌర్‌కు ఎవరితో మాట్లాడాలనిపించే కాదు. ‘మనసుంటే మార్గం ఉంటుంది’ అంటారు. అయితే ఆమె మనసు చీకట్లో కొట్టుమిట్టాడుతోంది. అయినప్పటికీ ఆ మనసు ఒక మార్గాన్ని వెలుతురుగా ఇచ్చింది... అదే మక్రామీ ఆర్ట్. ఆ ఆర్ట్‌కు దగ్గరవుతున్నకొద్దీ తనలోని డిప్రెషన్ మూడ్స్ దూరంగా వెళ్లిపోయేవి. చివరికి అవి కనిపించకుండా పోయాయి. కౌర్ గతంలోలాగే చురుగ్గా ఉండడం మొదలుపెట్టింది.‘మక్రామీ’లో నేర్పు సాధించిన కౌర్ ఆ కళను గాలికి వదిలేయలేదు. తాను ఎంటర్ప్రెన్యూర్ కావడానికి దాన్ని ఒక దారిగా చేసుకుంది. ‘అబ్బాయి పుట్టిన తరువాత, తరచుగా డిప్రెసివ్ మూడ్స్ వచ్చేవి. నా కాలేజి చదువు కోసం తల్లిదండ్రులు ఎంతో ఖర్చు చేశారు. ఉద్యోగ జీవితాన్ని మిస్ అవుతున్నాననే బాధ ఉండేది. ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాను. ఇప్పుడు ఇలా ఖాళీగా ఉండడం ఏమిటీ అని ఆలోచించేదాన్ని. గుంపులో ఉన్నా ఒంటరిగానే ఫీలయ్యేదాన్ని. పిల్లాడితో ఆడుకుంటూ ఆనందించడం కంటే, పిల్లాడు ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూసేదాన్ని. పిల్లాడు నిద్రపోగానే ఒంటరిగా కూర్చొని ఏవేవో ఆలోచించేదాన్ని. ‘పిల్లాడి మీద శ్రద్ధ పెట్టు. వృథాగా ఆలోచించకు’ అని అమ్మ మందలించేది. ఎప్పుడూ సరదాగా ఉండే నేను సీరియస్‌గా మారిపోవడం చూసి మా ఆయన అయోమయానికి గురయ్యేవారు. ఆయనకు ఏం అర్థమయ్యేది కాదు. ఒకరోజు యూట్యూబ్‌లో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కు సంబంధించిన వీడియో చూశాను. తల్లి మూడ్‌స్వింగ్స్ పిల్లాడిపై ప్రభావం చూపుతాయనే విషయం విన్న తరువాత భయమేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నా సమస్యకు నేనే పరిష్కారాన్ని వెదుక్కున్నాను’ గతాన్ని గుర్తు చేసుకుంటుంది కౌర్.‘జస్ట్ ఏ హాబీ’గా పరిచయం అయిన మక్రామీ ఆర్ట్ కౌర్‌ను పూర్తిగా మార్చివేసింది. మునపటి చురుకుదనాన్ని, హాస్యచతురతను తెచ్చి ఇచ్చింది. ‘మక్రామీ ఆర్ట్ ద్వారా అర్థం లేని ఆలోచనకు అడ్డుకట్ట పడింది. మనసు చాలా తేలిక అయింది. కొన్ని ఫ్లవర్ పాట్ హోల్డర్స్‌ను తయారుచేసి వాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. ఒక ఫ్రెండ్ ఇది చూసి తనకు ఆరు పీస్‌లు కావాలని అడిగింది. ఆమె నా ఫస్ట్ కస్టమర్. నా హాబీ అనేది విజయవంతమైన వ్యాపారంగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడడం ఇష్టంలేని నాకు ఇది చాలా గర్వంగా అనిపించింది’ అంటుంది కౌర్. కౌర్ ఆర్ట్‌వర్క్‌కు ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. వారిలో ఒకరు... రెగ్యులర్ కస్టమర్ అయిన అర్చన. ‘కౌర్ ఆర్ట్‌వర్క్ అంటే నాకు ఎంతో ఇష్టం. అత్యంత కఠిన సమయంలో ఆర్ట్ ద్వారా ఎలా బయటపడిందో తెలుసుకున్నాక ఆమె మీద అభిమానం రెట్టింపు అయింది. గోరంత సమస్యనే కొండంత చేసుకొని బాధపడే వారికి కౌర్ గురించి చెబుతుంటాను. ఆమె ఆర్ట్ వర్క్‌లో క్వాలిటీ, చూడగానే ఆకట్టుకునే సృజన నాకు ఇష్టం’ అంటుంది అర్చన.బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నుంచి కౌర్‌కు పెద్ద ఆర్డర్ వచ్చింది. విదేశాల నుంచి కూడా ఆర్డర్లు రావడం మొదలైంది. దేశ, విదేశాల నుంచి ప్రతి నెల పదిహేను వందలకు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. ‘నాలాగే సమస్యలు ఎదుర్కొంటున్న తల్లుల దగ్గరకు వెళ్లి నేను పడిన ఆందోళన, దానినుంచి బయటపడడానికి చేసిన కృషి గురించి చెప్పి మామూలు స్థితికి తీసుకువచ్చేదాన్ని. ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాధించిన విజయం కంటే వారిలో మార్పు తీసుకువచ్చాననే సంతృప్తి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది’ అంటుంది సంప్రీత్ కౌర్. View this post on Instagram A post shared by Atinytwisted| MacrameIndia (@atinytwisted) -
సమీరా ఆ సమస్యతోనే బాధపడింది..అదేదో జన్మహక్కు అన్నట్లు..
తెలుగు తమిళ, బాలీవుడ్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న సమీరా రెడ్డి సైతం ఆ సమస్యతో బాధపడిందట. జనాలంతా అదేదో తమ జన్మహక్కు అన్నట్లు కామెంట్లు చేస్తూ ఆ సమస్య గురించి తెగ మాట్లాడతారని మండిపడుతోంది. ఇలాంటి సందర్భాల్లో మనం ఎలా ఆ సమస్యను ధైర్యంగా ఫేస్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలో చూద్దాం! ఇంతకీ సమీరా ఏ సమస్యతో బాధపడిందంట?..అధిక బరువు. ఆమె ప్రసవానంతరం బయటకి రావడానికే ఇబ్బంది పడిందట. అనుకోకుండా ఓ రోజు తన బాబుతో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లితే అక్కడ సెక్యూరిటీ గార్డు ఆమె ఆధార్ కార్డుని తనిఖీ చేస్తూ చేసిన కామెంట్‌ని తానస్సలు మర్చిపోలేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఏంటి మేడం మరీ ఇంత లావయ్యి పోయారు అంటూ జాలిగా చూసిన చూపు గుర్తొస్తే ఒళ్ల మండిపోతుందంటూ వాపోయింది. మహిళ శరీరాల గురించి కొందరూ అదెదో తమ జన్మహక్కు అన్నట్లు కామెంట్లు చేస్తారు. ఇది ప్రకృతిసహజంగా జరిగే మార్పులు కొన్ని ఉంటాయని అర్థం చేసుకోరు, తెలుసుకోరు అని తిట్టిపోసింది. ముఖ్యంగా మన సమాజంలో ఇలాంటివి మరి ఎక్కువ అని చెప్పుకొచ్చింది. ఇలాంటప్పుడూ మన ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా వాటన్నింటిని ధైర్యంగా ఫేస్ చేయాలి. జన్మనిచ్చే తల్లుల పట్ల గౌరవం లేకపోయిన పర్లేదు కానీ సహజంగా స్త్రీ తల్లి అయ్యాక వచ్చే శరీర మార్పులను ఎగతాళి చేయొద్దని చెబుతోంది. అదేసమయంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరూ తల్లి అయ్యాక కూడా స్లిమ్‌గా ఉండొచ్చు కానీ అలా అందరికీ సాధ్యం కాదని, అందరీ శరీర నిర్మాణాలు ఒకే రీతిలో ఉండవని గుర్తించాలని చెప్పింది. సమీరా 2014లో అక్షయ్ వర్దేని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. ఈ జంటకు 2015లో కొడుకు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు. ఇక ఇలాంటి సమస్యలు సమీరా లాంటి సెలబ్రెటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ ఫేస్ చేసేదే. అయితే ఈ సమస్యకు చెక్‌పెట్టాలంటే.. మన అమ్మమ్మ, నానమ్మల కాలం నాటి చిట్కాలు ఫాలో అయితే ఈజీగా బయటపడొచ్చు. ప్రసవం తర్వాత బరువు తగ్గేందుకు.. సాధారణంగా ప్రసవించిన మహిళలు సాధారణంగా లావుగా కనిపిస్తారు. తగ్గడం కూడా అంత ఈజీగా ఉండదు. ఓ పక్క పిల్లలను చూసుకోవడంతో బిజీగా ఉండటంతో శరీరంపై దృష్టిపెట్టలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి మహిళలు ఒళ్లు తగ్గించుకోవాలంటే వాము నీళ్లే చక్కటి పరిష్కారం. గర్భధారణ సమయంలో కూడా వీటిని తాగొచ్చు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యల్ని అధిగమిస్తుంది. అతిసారం, మలబద్దకాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అంతే కాదు గర్భధారణ సమయంలో ఏర్పడిన అదనపు కొవ్వుని కరిగించడంలో సాయం చేస్తుంది. ప్రతిరోజు మీ డైట్ లో వామ్ము నీళ్ళు తాగడం అలవాటు చేసుకుంటే నాజూకైన అందం మీ సొంతం అవుతుంది. ఈ నీళ్ళు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. యాలకులు, సోంపుతో కలిసి చేసే కషాయం ప్రసవం తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకునేందుకు దోహదపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో 2 కప్పుల నీరు, 4 యాలకులు, 1 స్పూన్ సోంపు వేసి మరిగించాలి. ఈ నీటిని వడగట్టి పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. ఈ విధంగా పరగడుపున త్రాగటం వలన జీవక్రియ రేటు పెరిగి పొట్టలో కొవ్వు కరుగుతుంది. జాజికాయ పాలు శరీర బరువును తగ్గించడంలో ఎంతగానో ఉపకరిస్తుంది. ఒక కప్పు పాలల్లో పావు టీస్పూన్ జాజికాయ పొడి కలిపి మరిగించి, గోరు వెచ్చగా తాగాలి. ఇలా చేస్తే చాలా సులభంగా ప్రసవానంతరం వచ్చిన అధిక బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు. (చదవండి: ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్‌ప్లేస్‌లో చేతులకు వచ్చే సమస్యలు!) -
పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్ లడ్డు
అదేమిటో కానీ, మన ఇంటి వంట కంటే పక్కింటి పోపుకే ఘుమఘుమలు ఎక్కువ. మన పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రం ఉడిపి వాళ్ల ఆరోగ్యవంటలకు మన వంటింట్లో పోపు వేద్దాం. పాలిచ్చే తల్లి ఏమి తినాలో ఉడిపి వాళ్ల మెనూ చూద్దాం. సొప్పు పాల్య కావలసినవి: ►పాలకూర – 2 కట్టలు ►ఉల్లిపాయ– 1 (తరగాలి) ►ఉప్పు – అర టీ స్పూన్ ►మిరియాల పొడి– టీ స్పూన్. ►పోపు కోసం: నెయ్యి– 2 టీ స్పూన్లు ►జీలకర్ర – అర టీ స్పూన్ ►కరివేపాకు– 2 రెమ్మలు. తయారీ: ►పాలకూరను శుభ్రం చేసి తరగాలి. ►బాణలిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేయాలి. ►అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ►ఆ తర్వాత కరివేపాకు వేయాలి. ►ఇప్పుడు పాలకూర, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి మూత పెట్టి సన్న మంట మీద పది నిమిషాల సేపు మగ్గనివ్వాలి (ఆకులోని నీటితోనే మగ్గుతుంది). ►దీనిని పాలిచ్చే తల్లికి రెండు రోజులకొకసారి పెడతారు. మోహన్ లడ్డు కావలసినవి: ►గోధుమ పిండి– కప్పు ►బియ్యప్పిండి– టేబుల్ స్పూన్ ►నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు ►చక్కెర– కప్పు ►నీరు – అర కప్పు ►యాలకుల పొడి– అర టీ స్పూన్ ►జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు ►కిస్మిస్ – టేబుల్ స్పూన్ ►నూనె – పూరీలు కాలడానికి తగినంత. తయారీ: ►వెడల్పు పాత్రలో గోధుమపిండి, బియ్యప్పిండి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నీటిని పోస్తూ ముద్దగా కలపాలి. ►బాణలిలో నూనె వేడి చేసి ఈ పిండినంతటినీ పూరీలు చేసుకోవాలి. ►మోహన్ లడ్డు కోసం చేసే ఈ పూరీలు మెత్తగా ఉండకూడదు, కరకరలాడాలి. ►చల్లారిన తరవాత వీటిని తుంచి చిన్న ముక్కలు చేయాలి. ►బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పూరీ ముక్కల్లో కలపాలి. ►ఒక పాత్రలో చక్కెర వేసి, నీరు పోయాలి. చక్కెర కరిగిన తరవాత, యాలకుల పొడి వేసి మీడియం మంట మీద సిరప్ తయారయ్యే వరకు మరిగించాలి. ►ఈ చక్కెర పాకాన్ని పూరీ ముక్కల మీద పోస్తూ లడ్డు చేయాలి. ఇది ఉడిపి స్పెషల్. చదవండి: Menopause: టాబ్లెట్ల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయొచ్చా? వారికైతే సురక్షితం కాదు.. Facial Brush: మృత కణాలు, దుమ్ము, ధూళి మాయం.. ఈ డివైజ్ ధర ఎంతంటే! -
Hair Care: జుట్టు రాలుతోందా? ఈ లేజర్ హెల్మెట్ వాడితే..
సాధారణ హెల్మెట్.. ప్రయాణాల్లో ప్రాణాలను కాపాడితే.. ఈ లేజర్ హెల్మెట్.. రాలిపోతున్న జుట్టును సంరక్షిస్తుంది. రాలిపోయిన జుట్టును తిరిగి రప్పిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా హెయిర్ గ్రోత్ ఆగిపోయిందని.. కారణం లేకుండానే హెయిల్ లాస్ అవుతోందని వాపోయేవారికి ఈ డివైజ్ ఓ వరం. ప్రసవానంతర సమస్యలతోనో.. వాతావరణ మార్పులతోనో.. ఆహారపు అలవాట్లతోనో.. కారణం ఏదైనా జుట్టు రాలిపోవడం, తిరిగి పెరగకపోవడం.. చాలామందికి ఉండే ప్రధాన సమస్యే. ఆయిల్స్, షాంపూలు, కండిషనర్స్ మారుస్తూ తాపత్రయపడేవారికి ఈ మెషిన్ చక్కటి పరిష్కారం. ఈ డివైజ్‌ని ఆన్ చేసుకుని.. తలకు హెల్మెట్‌లా తగిలించుకుంటే చాలు. ఫలితం చాలా త్వరగా అందుతుంది. జుట్టు పెరుగుదల కోసం ప్రతిరోజూ 25 నిమిషాల పాటు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆన్ – ఆఫ్, అడ్జస్ట్మెంట్ల కోసం ప్రత్యేకమైన రిమోట్.. హెల్మెట్‌తో పాటు లభిస్తుంది. ట్రీట్మెంట్ సెషన్లను ట్రాక్ చేయడానికి రిమోట్లో ఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. దాంతో ప్రత్యేకంగా గడియారం ముందు కూర్చోవాల్సిన పనిలేదు. ఈ మెషిన్ సమర్థవంతమైనది.. సురక్షితమైనది కూడా. అంతేకాదు తేలికగా.. సౌకర్యవంతంగానూ ఉంటుంది. ఇది ప్రతి సెషన్లో ఒక డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. అంతర్నిర్మాణ సెన్సర్‌ను కలిగి ఉంటుంది. దాంతో ఉష్ణోగ్రత స్థాయిని పెరగనివ్వకుండా నియంత్రిస్తుంది. ఈ మోడల్ హెల్మెట్స్ ధర సుమారుగా పదిహేను వందల రూపాయల నుంచి అమ్ముడుపోతున్నాయి. ఇలాంటి డివైజ్‌లను క్వాలిటీతో పాటు వినియోగదారుల రివ్యూల ఆధారంగానే కొనుగోలు చేయాలి. చదవండి: Health: మేనరికపు పెళ్లి.. నాలుగు సార్లు అబార్షన్.. సమస్య ఏమిటి? పరిష్కారం ఉందా? -
రెండు సార్లు అబార్షన్.. చాలా డిప్రెషన్‌కు లోనయ్యా: నటి
Geeta Basra Reveals Why She Spoke About Her Miscarriages: టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ భార్య, నటి గీతా బస్రా ఇటీవలె రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కుమారుడి రాకతో మరోసారి మాతృత్వాన్ని అనుభవించిన ఆమె గతంలో రెండుసార్లు గర్భస్రావానికి గురైంది. తాజాగా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఓపెన్ అప్ అయ్యింది. 'ప్రతి మహిళ తను ప్రెగ్నెంట్ అని తెలిసిన రోజు నుంచి వచ్చే తొమ్మిది నెలల కోసం ఎంతో ఎదురు చూస్తుంటుంది. ఎప్పుడెప్పుడు చిన్నారిని తమ చేతుల్లోకి తీసుకొని ముద్దు చేద్దామా అని కలలు కంటుంది. కానీ దురదృష్టవశాత్తూ అలాంటి సమయంలో మిస్ క్యారేజ్(గర్భస్రావం) జరిగితే జీవితమే కోల్పోయినట్లు అనిపిస్తుంది. నా స్నేహితుల్లో కూడా కొందిరికి ఇలానే జరిగింది. నేను కూడా దీన్ని అనుభవించాను. మొదటిసారి పాప హీర్ పుట్టాక రెండు సార్లు నాకు గర్భస్రావం అయ్యింది. ఆ సమయంలో చాలా డిప్రెషన్‌కు లోనయ్యా. రెండుసార్లు వరుసగా అబార్షన్ కావడంతో ఎంతో బాధపడ్డా. అయితే ఆ సమయంలో నా భర్త నాకు తోడుగా నిలిచారు. చాలామంది అనుకొంటారు సెలబ్రిటీలకు ఏముంటుంది? వాళ్ల జీవితం చాలా సాఫీగా గడుస్తుంది అని కానీ కానీ ప్రతి సెలబ్రిటీ జీవితం అంత సులభం కాదు. వాళ్లకూ అందరిలానే కష్టాలు ఉంటాయి. అమ్మతనం ఆస్వాదించాలనుకున్న వారికి గర్భస్రావం ఓ పీడకలలా మారుతుంది. దీన్నుంచి కోలుకోవడం అంత సులభమేమీ కాదు కానీ అసాధ్యం అయితే కాదు. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి భయటపడేందుకు ప్రయత్నించాలి. ఆశను వదులుకోకూడదు అన్న ధైర్యాన్ని నింపేందుకు నేను నా అనుభవాల్ని పంచుకున్నాను. ఈ విషయాల గురించి మాట్లాడటం ఎంత ముఖ్యమో నేను తెలుసుకున్నాను. దీనికి సోషల్ మీడియాను మించిన బెస్ట్ ఫ్లాట్ ఫాం లేదనిపించింది. ఎట్టి పరిస్థిత్లుల్లోనూ నమ్మకాన్ని కోల్పోకూడదు' అంటూ మహిళల్లో ఎంతో స్పూర్తి నింపింది. కాగా ‘ద ట్రైన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గీత బస్రా 2015లో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్‌తో కలిసి ఏడడుగులు వేసింది. 2016 లో ఈ దంపతులు మొదటిసారిగా తల్లిదండ్రులయ్యారు. ఆ పాపకు హీర్ ప్లాహా అనే పేరు పెట్టారు. అనంతరం ఈ ఏడాది జోవన్ వీర్ సింగ్ ప్లాహా అనే బాబు పుట్టాడు. -
వసతి గృహాల్లో నేలపైనే బాలింతలు.. నేడు హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్ : కరోనా కారణంగా జంటనగరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతి గృహాల్లోని వారికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) హైకో ర్టు బుధవారం విచారణ జరపనుంది. కరోనా వైరస్ బాధితులు, అనుమానితులకు వైద్యం అందించే వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి భద్రత, రక్షణ కలి్పంచాలనే పిల్‌ను కూడా విచారణ చేయనుంది. ఇద్దరు న్యాయవాదులు వేరువేరుగా రాసిన లేఖలను హైకోర్టు పిల్స్‌గా స్వీకరించింది. జంటనగరాల్లో తాత్కాలిక వసతి గృహాలు 8 ఏర్పాటు చేశారని, వాటిలో వారందరూ భౌతిక దూరం పాటించడం లేదంటూ న్యాయవాది వసుదా నాగరాజ్ లేఖ రాశారు. ఆ గృహాల్లో ఇటీవలే పుట్టిన పిల్లలు, బాలింతలు ఉన్నారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ అనుమానితులు, బాధితులకు వైద్యం అందజేసే వారికి భద్రతతోపాటు రక్షణ కూడా కలి్పంచేలా ఉత్తర్వులివ్వాలంటూ న్యాయవాది పి.ఎస్.ఎస్. కైలాశ్ నాథ్ అనే మరో న్యాయవాది రాసిన లేఖను కూడా హైకోర్టు బుధవారం విచారించనుంది. -
పౌష్టికాహారంలో పురుగులు
సాక్షి, బలిజిపేట(విజయనగరం) : గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారంలో పురుగులు కనిపిస్తుండడంతో లబ్ధిదారులు బెంబేలెత్తుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాలు, గుడ్లు, శనగ చెక్కీలు, నువ్వు చెక్కీలు నాణ్యంగా ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాసిరకంగా ఉన్న ఉండలను తినడానికి ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు భయపడుతున్నారు. పొరపాటున చూడకుండా వాటిని తింటే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గుడ్లు కూడా పూర్తిగా కుళ్లిపోవడంతో ఇవేం గుడ్లని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పౌష్టికాహార పదార్థాలు పాడవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.అలాగే పాల ప్యాకెట్లను కేంద్రాల కార్యకర్తలు ఇచ్చే ఇండెంట్ ప్రకారం మొత్తం సరుకును ఒకేసారి సరఫరా చేస్తున్నారు. దీంతో వచ్చిన పాలప్యాకెట్లను కేంద్రాలలో నిల్వ చేయాల్సి వస్తోంది. రోజుల తరబడి పాల ప్యాకెట్లు ఉంచాల్సి రావడంతో పాడవుతున్నాయని కేంద్రాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్లు సరైన సమయానికి సరుకులు సరఫరా చేసిన దాఖాలు లేవు. గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజూ గుడ్డు, పాలు, శనగ, నువ్వు చెక్కీలు ఇవ్వాల్సి ఉంది. అయితే సరుకు ఒకేసారి రావడం... వాటిని నిల్వ చేసి ఇవ్వడంతో పాడుతున్నాయి. చిలకలపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఊర్మిల అనే లబ్ధిదారుకు బుధవారం సరఫరా చేసిన చెక్కీలలో పురుగులు కనిపించాయి. అలాగే గుడ్లు కూడా కూళ్లిపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఈ ఒక్క కేంద్రానిదే కాదని.. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గర్భిణిలు, బాలింతలు, ప్రీ స్కూల్ చిన్నారులకు ఇవ్వాల్సిన మెనూ.. ► సోమ, గురువారాలలో: సాంబారు, అన్నం ► మంగళ, శుక్రవారాలలో పప్పు, ఆకుకూర, అన్నం. ► బుధ, శనివారాలలో కాయగూర లేదా ఆకుకూరతో పప్పు, అన్నం. ► సోమవారం నుంచి శనివారం వరకు గర్భిణిలు, బాలింతలకు గుడ్లు, పాలు, శనగ, నువ్వు చెక్కీలు ► 3 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు నాలుగు రోజులు గుడ్లు. (గురువారం, శనివారం ఉండవు) ► 3 సంవత్సరాల లోపున్న వారికి వారానికి 2 రోజుల మాత్రమే గుడ్లు పంపిణీ చేస్తారు. ► 3 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులలో బరువు తక్కువ ఉండేవారికి బరువు పెరిగేవరకు పాలు పంపిణీ చేస్తారు. కార్యకర్తలు చూసుకోవాలి కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకులను కార్యకర్తలే చూసుకోవాలి. చెక్కీలు, పాలు నెలకొకసారి సరఫరా అవుతున్నాయి. గుడ్లు 10 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అటువంటప్పుడు చూసుకోవాలి. పాడైతే అధికారుల దృష్టికి తీసుకురావాలి. – ఉమాభారతి, సీడీపీఓ, బొబ్బిలి. -
కాన్పు కోసం వెళితే నరకం చూపారు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, నాయుడుపేటటౌన్: కాన్పుకోసం వైద్యశాలకు వెళితే నరకం చూపించారని ఓ బాలింత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. పట్టణంలో ఎన్.హర్షిణి అనే మహిళ శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించింది. ఖమ్మం జిల్లా సారపాక గ్రామానికి చెందిన హర్షిణి భరత్‌తో కలిసి పట్టణంలోని రాజగోపాలపురం 3వ వీధిలో ఐదేళ్లుగా ఉంటోంది. రెండో కాన్పుకోసం స్థానిక పీవీఎస్ వైద్యశాలలో చేరింది. ఆగస్ట్ 3వ తేదీన ఆపరేషన్ చేయగా హర్షిణి మగశిశువుకు జన్మనిచ్చింది. ఐదురోజుల తర్వాత ఆమె ఇంటికి వచ్చింది. వారం తిరగకముందే హర్షిణికి తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు వైద్యశాలకు తీసుకెళ్లారు. ఈ సమయంలో డాక్టర్ రక్తస్రావం కాకుండా తెల్లటి గుడ్డపెట్టి కుట్లు వేసినట్లు హర్షిణి చెబుతోంది. అయితే రక్తస్రావం ఆగకుండా ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో కార్పొరేట్ వైద్యశాలకు తీసుకువెళ్లాలని డాక్టర్ సూచించినట్లు తెలిపింది. దీంతో హర్షిణిని అంబులెన్స్‌లో 19వ తేదీన చెన్నైకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి రక్తస్రావం అవుతున్న చోట కుట్లు వేయడమే కాకుండా తెల్లగుడ్డ పెట్టి ఉన్నట్లు చెప్పారు. నాయుడుపేట వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడంతో గర్భసంచి ఇన్ఫెక్షన్ అయిందని వారు చెప్పారని బాధితురాలు వాపోయింది. అక్కడ ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చిన తర్వాత హర్షిణికి 26వ తేదీన అధికంగా రక్తస్రావం కావడంతో నెల్లూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. వైద్యుల నిర్లక్ష్యంపై పోలీసులతోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలు తెలిపింది. కాగా దీనిపై పీవీఎస్ వైద్యశాలకు చెందిన డాక్టర్ వెంగయ్య మాట్లాడుతూ హర్షిణికి ఆపరేషన్‌ను సక్రమంగానే చేశామన్నారు. ఆమెకు యుటరెస్ సమస్య వల్ల అధిక రక్తస్రావమైందని వైద్యురాలి నిర్లక్ష్యం కాదని చెప్పారు. -
అమ్మలందరూ అలానే ఉంటారా : సెరెనా
లాస్ ఏంజిల్స్: టెన్నిస్ సూపర్‌స్టార్ సెరెనా విలియమ్స్ తనపై వస్తున్న విమర్శలపై మండిపడ్డారు. 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఈ అమెరికా నల్లకలువ ఇటీవల జరిగిన వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, టోర్నమెంట్లలో తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. సొంతదేశం అమెరికాలో జూలై 31న జరిగిన చరిత్రత్మక శాన్‌జోస్ సిలికాన్ వ్యాలీ క్లాసిక్ టోర్నీలో సైతం ఓటమి చవిచూశారు. సెరెనా 2017లో కూతురు అలెక్సిస్ ఒలంపియా ఒహానియన్ జూనియర్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ ఏడాదిలో తిరిగి కోర్టులోకి అడుగుపెట్టిన సెరేనా సరిగా ఆడలేపోయింది. అమ్మ అయిన తర్వాత ఆటలో వెనకబడడంతో ఆమెపై కొందరు విమర్శలు చేస్తున్నారు. వీటన్నిటిపై ఆమె స్పందించారు. తాను ప్రసవానంతర ఉద్వేగాలతో సతమతమవుతున్నాని తెలిపారు. కొన్ని సార్లు తన కూతురుతో కొద్ది సమయం కూడా గడపలేక పోవడం బాధిస్తోందని అన్నారు. తనను విమర్శిస్తున్న వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నారనీ, బిడ్డకు జన్మనిచ్చిన వారెవరైనా మళ్లీ మాములు జీవనం సాగించడం అంత సులువు కాదనిఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన సెరెనా.. విమర్శలకు బదులిచ్చే తీరిక తనకు లేదని ఇదివరకే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
జోరువానలో.. 12 కిలోమీటర్లు డోలీలో..
-
జోరు వానలో.. 12 కి.మీ.లు డోలీలో..
సాలూరు రూరల్: మన్యంలో రహదారులు లేకపోవటంతో అడవి బిడ్డలు నానా అగచాట్లు పడుతున్నారు. అనారోగ్యానికి గురైతే కిలోమీటర్ల కొద్దీ డోలీల్లో నడిచి వెళ్లాల్సిన దుస్థితి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా సాలూరు మండలం గిరిశిఖర కొడమ పంచాయతీ సిరివర గ్రామంలో ఓ బాలింత అనుభవించిన నరకయాతన గిరిజనుల అవస్థలకు అద్దంపట్టింది. గ్రామానికి చెందిన గిందెకు ఆదివారం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. నెలలు నిండకుండానే మూడో కాన్పు కావడంతో పుట్టిన కొద్దిసేపటికే శిశువు కన్నుమూసింది. మరోవైపు గిందెకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో.. భర్త డుంబ్రి, స్థానికులు డోలీకట్టి అందులో గిందెను ఉంచి సోమవారం 12 కి.మీ.కు పైగా కొండ మార్గంలో జోరు వర్షంలో నడిచి దుగ్గేరుకు తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యాధికారుల సూచనల మేరకు ఆమెను 108లో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరానికి తరలించనున్నట్లు సమాచారం. -
మహిళ ఆత్మహత్య
కడప అర్బన్ : కడప నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హబీబుల్లా వీధిలో నివసిస్తున్న మంజుదేవి(32) అనే మహిళ గురువారం రాత్రి తాను నివసిస్తున్న ఇంటి పడక గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల, పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో మధురైలో స్థిరపడ్డ మంజుదేవి తల్లిదండ్రులు అక్కడ స్టేషనరీ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. 12 సంవత్సరాల కిందట కడప నగరం హబీబుల్లావీధికి చెందిన మంగల్‌చంద్ అనే వ్యక్తికి మంజుదేవికి వివాహం జరిగింది. వీరికి సేజల్ (11), అంజలి (9), మనీష్ (7) అనే పిల్లలు ఉన్నారు. మంగల్‌చంద్ ఆర్కేఎం స్ట్రీట్‌లో కాజల్ రెడీమేడ్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. తన తల్లిదండ్రులు, బంధువులతోపాటు ఒకే ఇంటిలో ఉంటున్నాడు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో ఇరువురు కుమార్తెలతో తల్లి మంజుదేవి పడక గదిలో పడుకుంది. కుమారుడు మనీష్‌తోపాటు హాలులో అందరితో కలిసి మంగల్‌చంద్ పడుకున్నాడు. తెల్లవారి చూసేసరికి ఫ్యాన్‌కు మంజుదేవి చీరెతో ఉరేసుకుని వేలాడుతుండడంతో వెంటనే భర్త, బంధువులు రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. కడప అర్బన్ సీఐ దారెడ్డి భాస్కర్‌రెడ్డి, టుటౌన్ ఎస్ఐ అమర్నాథరెడ్డి తమ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని, ఇంటిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. అయితే మృతురాలి తల్లిదండ్రులు మధురై నుంచి కడపకు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఎస్ఐ అమర్నాథ్రెడ్డి తెలిపారు. భార్యాభర్త మధ్య ఏర్పడిన మనస్పర్థలే ఈ సంఘటనకు కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తెలుస్తాయని భావిస్తున్నారు. -
'బాలింతల కోసమే రైళ్లలో జననీ సేవా'
ఢిల్లీ: రైళ్లలో జననీసేవా కార్యక్రమాన్ని బుధవారం రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. బాలింతలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే జననీ సేవా కార్యక్రమం చేపట్టినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. 25 స్టేషన్లలో వేడిపాలు, నీళ్లు అందుబాటులోకి రైల్వేశాఖ తెచ్చినట్టు తెలిపారు. అంతేకాక ఐదు సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల చిన్నారుల వరకు ప్రత్యేక మెను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాజధాని, శతాబ్ది రైలు టిక్కెట్లలో ఆహార నిబంధన సడలింపు తప్పనిసరి చేసినట్టు సురేష్ ప్రభు పేర్కొన్నారు. -
మిద్దె కూలి బాలింత మృతి
-
బాలింత పట్ల కామాంధుడి అసభ్య ప్రవర్తన
మైలవరం (కృష్ణా జిల్లా) : ఆస్పత్రిలో ప్రసవమై వైద్య చికిత్సలో ఉన్న బాలింత పట్ల ఓ కామాంధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మైలవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... రెడ్డిగూడెం మండలం నాగులూరుకు చెందిన ఓ మహిళ మూడు రోజుల క్రితం మైలవరంలోని విజయవాడ బస్టాప్ వెనుక గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవించింది. కాగా తారకరామ నగర్‌కు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుంటాడు. శనివారం సాయంత్రం రామకృష్ణ ఆస్పత్రిలోకి ప్రవేశించి సదరు బాలింత బెడ్ దగ్గరకు వెళ్లాడు. డాక్టర్ గారు పంపారు, వైద్య పరీక్షలు చేయాలంటూ అక్కడున్న అటెండెంట్‌ను బయటకు పంపించాడు. తర్వాత బాలింత శరీరాన్ని చేతులతో తడుముతూ అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు తన సెల్ఫోన్లో ఫొటోలు కూడా తీశాడు. ఆస్పత్రి సిబ్బంది గమనించేసరికి పారిపోయే ప్రయత్నం చేశాడు. రోగి బంధువులు రామకృష్ణను పట్టుకుని చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. -
ఆగని ‘స్వైన్’
స్వైన్‌ఫ్లూ జిల్లాను వణికిస్తోంది. వరుసగా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆ వ్యాధితో మరణించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగు తోంది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారే కాదు.. ఇంటి నుంచి కదలని బాలింతలనూ ఈ వ్యాధి వదలడం లేదు. ఇప్పటికే ఇద్దరు బాలింతలు స్వైన్‌ఫ్లూతో మృతిచెందగా..మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. - విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ - జిల్లాలో మొత్తం 12 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసుల నమోదు - ఆరుగురు మృతి..వారిలో ఇద్దరు బాలింతలు - చికిత్స పొందుతున్న మరో బాలింత సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చలిగాలులు తగ్గిపోతే స్వైన్‌ఫ్లూ వైరస్ సోకదని ప్రభుత్వం, వైద్యశాఖ అధికారులు ప్రకటిస్తూ వచ్చారు. చలి తగ్గిపోయి ఎండలు ముదురుతున్నా జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా బాలింతలు ఈ వ్యాధిబారిన పడుతుండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 28 అనుమానిత స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా అందులో 12 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. ఆరుగురు మరణించగా ఒకరు గుంటూరుజిల్లా వాసి. చనిపోయిన వారిలో ఇద్దరు బాలింతలున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కందుకూరు, ఒంగోలు, జె.పంగులూరు, అద్దంకి, తాళ్లూరు, చీరాల, పొన్నలూరు, టంగుటూరు, సింగరాయకొండ, పామూరు, గుడ్లూరు, చీమకుర్తి, మర్రిపూడి, ఇంకొల్లు మండలాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులపై ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే బాలింతలకు ఎలా వస్తుందనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. మర్రిపూడి మండలం చిమట గ్రామానికి చెందిన వేల్పుల సునీత (25) ఈనెల 7వ తేదీన నెలలు నిండటంతో చీమకుర్తిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో బాబును ప్రసవించింది. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్ రోడ్డులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించగా..అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. వెంటనే వైద్యాధికారులు చిమటలో వైద్యశిబిరం నిర్వహించి చేతులు దులుపుకున్నారు. తాజాగా ఒంగోలుకు చెందిన ఓ బాలింత స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. మహిళ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మంగళవారం అర్ధరాత్రి బెంగళూరు తరలించారు. బెంగళూరు శివారుకు వెళ్లగానే బుధవారం ఉదయం మహిళ మృతిచెందింది. మహిళకు గుండెకు సంబంధించిన సమస్య ఉందని..పుట్టిన బిడ్డకు కూడా అదే సమస్య ఉందని వైద్యులు చెబుతున్నారు. గుండె సమస్యతో పాటు స్వైన్‌ఫ్లూ రావడంతో ఆమె మృతిచెందిందన్నారు. అయితే ఈ బాలింతలకు స్వైన్‌ఫ్లూ ఎలా సోకిందనేది మిస్టరీగానే మిగిలింది. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరినప్పుడు ఈ వ్యాధి సోకితే ఎవరి నుంచి సోకింది..ఆ వ్యాధిగ్రస్తులు ఏమయ్యారనే అంశం బయటకు రావడం లేదు. ప్రస్తుతం ఒంగోలులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరో బాలింత చికిత్స పొందుతోంది. ఆమెకు కూడా స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. బాలింతలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల తొందరగా స్వైన్‌ఫ్లూ సోకే అవకాశం ఉంది. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె.యాస్మిన్ మాట్లాడుతూ ఒంగోలులో చనిపోయిన మహిళ ఇంటికి వెళ్లి రెండుగంటలు మాట్లాడానని అయితే ఆమెకు ఎలా వ్యాధి వచ్చిందో తెలియలేదన్నారు. ఆమె ఎక్కడికీ వెళ్లలేదని, ఒకటికి రెండు సార్లు ఆసుపత్రికే చెకప్‌కు వెళ్లిందన్నారు. అదే విధంగా చిమటకు చెందిన మహిళ విషయంలో ఆమె పక్క బెడ్‌పై ఉన్న పేషంట్ భర్త హైదరాబాద్‌లో పనిచేస్తున్నట్లు మాత్రమే తెలిసిందని, అయితే ఈమెకు ఎలా వచ్చిందనేది తెలియలేదన్నారు. ఆరోగ్యవంతులకు స్వైన్‌ఫ్లూ ఉన్నా బయటపడకపోవచ్చని, వారి ద్వారా ఇది సంక్రమిస్తూ ఉండే అవకాశం ఉందన్నారు. బాలింతలు సాధ్యమైనంత వరకూ బయటకు రాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. -
మురిగిన గుడ్లు.. ముద్ద దిగదు..
‘అంగన్వాడీ’లకు ఛీగుడ్ల సరఫరా ఇనుగుర్తిలో వెలుగు చూసిన వైనం తినలేకపోతున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలు కేసముద్రం : అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు అధ్వానంగా ఉన్నారుు. ఉడకబెట్టిన తర్వాత సొన కారడం, దుర్వాసన రావడంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు వాటివైపు చూడడంలేదు. మండలంలోని ఇనుగుర్తి అంగన్వాడీ కేంద్రంలో గురువారం మురిగిపోరుున గుడ్లు దర్శనమిచ్చారుు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-2లో 12 మంది గర్భిణులు, 20 మంది 6 నెలల నుంచి మూడేళ్లలోపు, 19 మంది 3 ఏళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు ఉన్నారు. అరుుతే కొద్ది రోజులుగా ఈ కేంద్రంలో ఉడకబెడుతున్న గుడ్లు పగిలిపోతుండటం, ఉడికిన గుడ్లన్నీ దుర్వాసన రావడంతో తినలేకపోతున్నారు. నిత్యం కేంద్రంలో భోజనం తినేందుకు వచ్చే గర్భిణులు, పిల్లలు, బాలింతలు గుడ్లు తినడానికి జంకుతున్నారు. కాగా, కేంద్రంలోని గుడ్లు తిన్న ఒకరు అస్వస్థతకు గురై తేరుకున్నట్లు సమాచారం. గుడ్ల పరిస్థితి అన్ని కేంద్రాల్లో ఇలాగే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. నెల రోజుల ముందే సరఫరా.. పది రోజులకోసారి కోడిగుడ్లను కాంట్రాక్టర్ సరఫరా చేయాల్సి ఉంది. కానీ నెలరోజుల ముందే ఒక్కసారిగా గుడ్లను దిగుమతి చేసి వెళ్లిపోతున్నాడు. ఎక్కువ రోజులు కావడం వల్లే గుడ్లు ఇలా చెడిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్క కేంద్రంలో 52 మంది ఉండగా.. ఒకేసారి 1,228 గుడ్లు దిగుమతి చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుందని, అరుుతే చెప్పినా వినకుండా దిగుమతి చే స్తున్నాడని అంగన్వాడీ కార్యకర్త కళావతి తెలిపారు. రవా ణా ఖర్చుల మిగులుబాటు కోసం కాంట్రాక్టర్ ఇలా చేస్తున్నారని, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడుతున్నా రు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంగన్వాడీ కేం ద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరుతున్నారు. -
గుడ్డు గగనమే!
అంగన్వాడీ కేంద్రాలకు నిలిచిన సరఫరా బాలలకు అందని పౌష్టికాహారం కొయ్యూరు: చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా గుడ్డు సరఫరా చేస్తోంది. మన్యంలో బాలింతలు, గర్భిణులకు కూడా ఇందిరమ్మ అమృతహస్తం పథకంలో గుడ్లు అందజేస్తోంది. అయితే ఎం.భీమవరం పరిధిలోని ఎనిమిది అంగన్వాడీల్లో పరిస్థితి అందుకు భిన్నం. మండపల్లిలో అంగన్వాడీ కేంద్రానికి గూడెంకొత్తవీధి మండలంలోని పందిరాయి కొత్తగూడెం నుంచి వెళ్లాలి. ఈ కేంద్రానికి సరఫరా కావాల్సిన గుడ్లు తూర్పు గోదావరి జిల్లా వై.రామవరంలో దించుతారు. అక్కడనుంచి కొండలు, గుట్టలు మీదుగా తీసుకురావడం వల్ల పగిలిపోతున్నాయి. సుమారు 40 కిలోమీటర్ల మేర కాలినడకన తీసుకువెళ్లడంతో చివరి 10 శాతం గుడ్లు కూడా మిగలడం లేదు. వై.రామవరంకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదలకం కొత్తూరు, 30 కిలోమీటర్ల దూరంలోని పుట్టకోటది అదే పరిస్థితి. పోతవరం, ఎం.భీమవరం,చీడికోట, వాలుగూడెం అంగన్వాడీ కేంద్రాలకు వై.రామవరం నుంచి తీసుకువెళ్లాలి. ఈ గ్రామం 17 కిలోమీటర్ల దూరంలోని కొండలపై ఉంది. అక్కడికి గుడ్లు తరలించేసరికి పగిలిపోతున్నాయి. ఇలాచేస్తే మేలు: తూర్పు గోదావరి జిల్లాలో మారేడుమిల్లి మండలం నుంచి పోతవరం గ్రామానికి రహదారి మెరుగ్గానే ఉంటుంది. ఇక్కడ అధికారులు అక్కడ అధికారులతో మాట్లాడి అటు వైపు నుంచి గుడ్లు సరఫరా చేయకగలిగితే అందరికీ గుడ్లు అందే అవకాశం ఉంటుంది. పిల్లలకు పెట్టలేకపోతున్నాం వై.రామవరం నుంచి గుడ్లు తీసుకువస్తుంటే గుడ్లన్ని పగలిపోతున్నాయి. వంద గుడ్లు తెస్తే వాటిలో 90వరకు పగిలిపోతున్నాయి. దీంతో పిల్లలకు గుడ్లు పెట్టలేకపోతున్నాం. - గొలిసింగి దేవామణి, ఎం.భీమవరం అంగన్వాడీ వర్కర్ ప్రత్యామ్నాయం ఆలోచిస్తాం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి నుంచి గుడ్లు తరలించే విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం.పోతవరం వరకు గుడ్లు పంపించే అంశాన్ని పరిశీలిస్తాం. - ప్రసన్న వెంకటేష్, పాడేరు సబ్ కలెక్టర్ -
‘108’ మానవీయత
ఆర్థిక స్థోమత లేకపోవడంతో వైద్యానికి దూరమైన బాలింత 108 సిబ్బంది మానవీయతతో ప్రాణాలతో బయట పడిన బాధితురాలు 108 అంబులెన్స్ సిబ్బంది మానవీయత ప్రదర్శించడంతో నిండు బాలింత ప్రాణాపాయం నుంచి బయట పడింది. ఆమెకు ఆర్థిక సాయం చేయడానికి 108 సిబ్బం ది ఆ గ్రామంలో చందా వసూలు చేసింది. ఆమెకు సకాలంలో వైద్య ం అందేలా చేసింది. వారు సేకరించిన డబ్బుతో వైద్యం సేవలు పొందిన ఆమె.. కోలుకొని శుక్రవా రం సాయంత్రం సొంత గ్రామానికి చేరుకుంది. - కోలారు కోలార్ తాలూకాలోని యలవార గ్రామానికి చెందిన జ్యోతి ఐదు రోజుల క్రితం ప్రసవమై బిడ్డ మరణించింది. ప్రసవం అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకుంది. అయితే రక్తం ఎక్కువగా పోవడం వల్ల ఎస్ఎన్ఆర్ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. ఎస్ఎన్ఆర్ ఆస్పత్రిలో చికిత్స అందించినా మెరుగైన చికిత్స కోసం జ్యోతిని ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రికి తీసుకు వెళ్లాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారు. ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో రెండు రోజులు చికిత్స చేసినా మెరుగైన వైద్యం కోసం జ్యోతి ని బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారు. అయితే కూలి పని చేసుకుని జీవనం సాగించే జ్యోతి కుటుంబానికి అప్పటికే చేతిలో డబ్బులు ఖాళీ కావడంతో నేరుగా ఇంటికి వచ్చింది. కానీ రక్తం 2 హెచ్.బి.కి పడిపోవడంతో జ్యోతి ఆచేతనావస్థలోకి వెళ్లింది. జ్యోతి పరిస్థితిని గుర్తించిన ఆశా కార్యకర్త శారదమ్మ, ఏఎన్ఎం వరలక్ష్మిలు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది శ్రీనివాసమూర్తి తదితరులు గ్రామానికి చేరుకున్నారు. అయితే తీవ్ర అస్వస్థతతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జ్యోతి తన చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో చికిత్సకు ససేమిరా అంది. అంతటితో ఊరుకోని 108 సిబ్బంది మానవీయతను ప్రదర్శించారు. గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులతో చందా వసూలు చేశారు. ఆశా కార్యకర్త శారదమ్మ రెండు వేల రూపాయల సహాయం చేసింది. ఇలా మొత్తం రూ. 15 వేలు జమ కావడంతో 108 సిబ్బంది జ్యోతిని ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో జ్యోతికి ఎనిమిది బాటిళ్ల రక్తం ఎక్కించడంతో కోలుకుంది. జ్యోతి ఆర్థిక స్థితిని గుర్తించిన 108 సిబ్బంది శ్రీనివాసమూర్తి ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ శ్రీరాములుకు పరిస్థితిని వివరించగా.. జ్యోతికి ఉచిత చికిత్స చేయడానికి ఒప్పుకున్నారు. రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స దొరకడంతో జ్యోతి పూర్తిగా కోలుకుంది. అదే 108 అంబులెన్స్‌లో జ్యోతిని సిబ్బంది గ్రామంలో శుక్రవారం సాయంత్రం దిగబెట్టారు. 108 సిబ్బంది మాన వీయతను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. -
బాలింత మృతికి కారకురాలైన ఆర్ఎంపీపై కేసు
కళ్యాణదుర్గం : నిర్లక్ష్యంగా కాన్పు చేసి, గర్భిణి మృతికి కారణమైన ఆర్ఎంపీ కవితపై పో లీసులు కేసు నమోదు చేశారు. కంబదూరు గ్రామంలో జరిగిన ఈ సంఘటన పై శనివారం ‘వైద్యం వికటించి బాలింత మృతి ’అనే కథనం ప్రచురితం కావడంతో జిల్లా కలెక్టర్ సొలామన్ఆరోగ్యరాజ్ తీవ్రంగా స్పందించారు. బాలింత సుమ మృతదేహానికి కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కర్ణాటకలోని సావరాటపురం గ్రామానికి చెందిన సుమ కంబదూరులో బంధువుల ఇంటికి వచ్చిం ది. ఎనిమిది నెలల గర్భిణి సుమకు విరేచనాలు కావడంతో వైద్యంకోసం కంబదూరులోని ఆర్ఎంపీ కవిత వద్దకు తీసుకెళ్లారు. వైద్యం వికటించి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్... వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశాఖ ఉన్నతాధికారులతో కంబదూరు వైద్య సిబ్బంది ఎం చేస్తున్నా రు... ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయని నిలదీసినట్లు తెలిసింది. స్థానిక సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ పురుషోత్తం కంబదూరు ఆస్పత్రికి వెళ్లి అక్కడి డాక్టర్ రంగవేణి, వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. గర్భిణి సుమ ఆర్ఎంపీ వద్దకు వెళ్లడాన్ని ఎందుకు పసిగట్టలేక పోయారని నిలదీశారు. సంబంధిత ఆశావర్కర్ గౌరమ్మ తాను గర్భిణి సుమతో ప్రసవం విషయమై సలహాలు ఇచ్చినా పట్టించుకోలేదని సమాధానమిచ్చింది. ఇకపై ఏ గర్భిణి ఆర్ఎంపీలను ఆశ్రయించకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. మృతదేహానికి పోస్టుమార్టం బాలింత సుమ మృతదేహాన్ని స్వగ్రామం కర్ణాటకలోని సావరాటపురానికి భర్త నటరాజ్, కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఆర్ఎంపీ వైద్యంతోనే మృతి చెందినందున పోస్టుమార్టం నిర్వహించాలని ఎస్ఐ శ్రీదర్ ఆ గ్రామానికి వెళ్లి బాధితులకు నచ్చజెప్పారు. దీంతో మృతదేహాన్ని తిరిగి కంబదూరుకు తీసుకువచ్చారు. తహశీల్దార్ తిమ్మప్పతో ఎస్ఐలో చర్చించారు. అనంతరం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆర్ఎంపీపై చట్టప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్ఎంపీలకు కాన్పులు చేసే అర్హత లేదు ఆర్ఎంపీలు కాన్పులు చేయడానికి అనర్హులని, అలా చేస్తే నేరమని సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ పురుషోత్తం తెలిపారు. మొదటి, రెండవ కాన్పులు ఆస్పత్రులలోనే జరపాలనే ప్రభుత్వ నిబంధనలున్నాయని, గర్భిణి సుమను ప్రభుత్వాస్పత్రికి పంపించాలన్నారు. అయితే ఎనిమిది నెలల గర్భిణికి ఆర్ఎంపీ ప్రసవం చేయడంతో రక్త స్రావం జరిగి ఆమె మరణానికి దారితీసిందన్నారు. సాక్షి ద్వారా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు. తెలసి తెలియని వైద్యంతో ప్రాణాలు తీసేవారి పై చర్యలు తీసుకుని అరికట్టేందేకు అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. -
స్త్రీ, శిశు సంక్షేమానికి ప్రాధాన్యం
గర్భిణులకు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం అధికారులకు మంత్రి పీతల సుజాత ఆదేశాలు విశాఖ రూరల్: వచ్చే ఏడాదికల్లా మాతా, శిశు మరణాలు పూర్తి స్థాయిలో తగ్గేలా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖమంత్రి పీతల సుజాత ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమం, గనులు, భూగర్భ వనరుల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ, వంగలపూడి అనిత ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుజాత మాట్లాడుతూ స్త్రీ, శిశు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వ అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందేలా అధికారులు శ్రద్ధ చూపాలని సూచించారు. మాతా, శిశు మరణాలు తగ్గించాలన్న లక్ష్యంతో నిరుపేదలకు అంగ న్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అయితే సరఫరాలో పలు అక్రమాలు జరుగుతున్నట్టు తనకు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. కేంద్రాల్లో మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలు, శిశువులకు నాణ్యమైన పోషకాహారాన్ని సరఫరా చేయాలని, సరఫరాలో ఎలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అంగన్వాడీలకు భవనాలు: మంత్రి అయ్యన్న మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద అంగన్వాడీ భవనాలు మంజూరు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్విహంచనున్నట్లు తెలిపారు. ఇందులోభాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలకు అవసరమైన మరుగుదొడ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. 2500 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవని, 1700 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఏజేసీ వై.నరసింహారావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ పి.అనసూయ, పీడీ ఎ.ఇ.రాబర్ట్స్, ఏపీడీ చిన్మయిదేవి తదితరులు పాల్గొన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత బలి
సిద్దిపేట టౌన్: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ బాలింత బలి అయ్యింది. సిద్దిపేట మాతాశిశు సంక్షేమ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ మృతిరాలి బంధువులు, పుట్టింటి, అత్తింటి గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. బంధువులు చెప్పిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గంభీరావుపేటకు చెందిన లావణ్య(22) ప్రసవం కోసం సిద్దిపేట మాతాశిశు సంక్షేమ ఆస్పత్రిలో శుక్రవారం చేరారు. మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. కాగా రాత్రి ఆమె అకస్మికంగా అనారోగ్యానికి గురైంది. ఆమె కుటుంబ సభ్యులు డాక్టర్ సుజాతకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. కాంపౌండర్లు సైతం రాలేదు. దీంతో పరిస్థితి విషమించింది. బంధువులు ఆందోళనకు దిగడంతో కాంపౌండర్లు ఓ మాత్ర ఇచ్చారు. అయినా ఆమె ఆరోగ్యంలో మార్పు రాకపోవడంతో ఇంజక్షన్ ఇచ్చారు. ఆరోగ్యం మెరుగుపడకపోగా శరీరం నల్లగా మారింది. తీవ్ర బాధకు లావణ్య గురైంది. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఆయాసపడుతూ మరణించింది. సమాచారం అందుకున్న అత్తింటి గ్రామ ప్రజలు, పుట్టింటికి చెందిన మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామ ప్రజలు, బంధుమిత్రులు మాతా శిశు సంక్షేమ ఆస్పత్రికి శనివారం ఉదయం చేరుకున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే లావణ్య మృతి చెందిందని మండిపడ్డారు. డాక్టర్లు సరైన సమాధానం చెప్పకపోవడంతో రాస్తారోకోకు దిగారు. ఆస్పత్రి గేటు ఎదుట ధర్నా చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆర్డీఓ ముత్యంరెడ్డి విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారుల చర్చలు... సిద్దిపేట తహశీల్దార్ ఎన్వై గిరి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం, సీఐలు సైదులు, ప్రసన్నకుమార్, ఎస్ఐ, పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. అయినా ఆందోళన సద్దుమణగలేదు. బాలింత మృతి చెందిన విషయంపై అ ధికారులు విచారణ నిర్వహించారు. అనంతరం డాక్టర్ సుజాత, నర్సులు దాలమ్మ, మనోరంజనీ, రామభార్గవిలకు మెమో ఇచ్చా రు. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు వీరిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇవ్వడంతో బం ధువులు ఆందోళన విరమించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పసికందుకు అనారోగ్యం... తల్లి మరణంతో పసికందుకు చనుపాలు లేక అనారోగ్యానికి గురైంది. వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇక భర్త దేవరాజు వికలాంగుడు కావడంతో ఇరు కుటుంబాల సభ్యులు విచారం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేశారు. -
అయ్యయ్యో.. ఎంత కష్టం!
రాయదుర్గం టౌన్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వస్తున్న బాలింతలకు కష్టాలు తప్పడం లేదు. శుక్రవారం రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చంటిబిడ్డలతో వచ్చిన పలువురు బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆస్పత్రిలో బెడ్ల కొరత ఉంది. దీంతో ఆపరేషన్ అనంతరం బాలింతలను వరండాలో టార్పాలిన్‌పై పడుకోబెట్టారు. ఫ్యాన్లు కూడా లేకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోయారు. చంటిబిడ్డల పరిస్థితి చూసి తట్టుకోలేక తల్లిదండ్రులు చీర కొంగు, టవళ్లతో గాలి ఊపడం కనిపించింది. క్యాంపు ఏర్పాటు చేసిన ప్రతిసారీ బాలింతలు ఆపరేషన్ కోసం ఉదయమే ఆస్పత్రికి చేరుకుంటున్నారు. అయితే.. అనంతపురం నుంచి వచ్చే వైద్య బృందం కోసం మధ్యాహ్నం 12 వరకు వేచి చూడాల్సి వస్తోంది. శుక్రవారం 115 మంది బాలింతలు రాగా.. వైద్య పరీక్షల అనంతరం 105 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసినట్లు ఇన్చార్జ్ వైద్యాధికారి, క్యాంపు ఆఫీసర్ సత్యనారాయణ తెలిపారు. డాక్టర్ కృష్ణశశి ఆధ్వర్యంలో ఆపరేషన్లు జరిగాయి. ఆపరేషన్ చేయించుకున్న వారికి రూ.880 చొప్పున ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. -
ఆకలికాలం!
కర్నూలు : పచ్చి బాలింత. చేతిలో పసికందు. చేతిలో చిల్లిగవ్వ లేదు. కడుపు మాడుతోంది. పాల కోసం చిన్నారి గుక్కపట్టి ఏడుస్తోంది. ఊరు కాని ఊరులో ఆమెకు దిక్కుతోచలేదు. చేయి చాద్దామంటే ఆత్మాభిమానం అడ్డొచ్చింది. కన్నీళ్లను దిగమింగుతూ.. బిడ్డ పోరు మాన్పేందుకు శతవిధాల ప్రయత్నించింది. ఆకలికి తట్టుకోలేకపోయింది. అయిష్టంగానే తన పరిస్థితి వివరించి తినేందుకు డబ్బులివ్వమని కోరింది. ఆమె కడుపుతిప్పలు అక్కడున్న వారిని కరిగించకపోగా.. బిడ్డను అమ్మేందుకు వచ్చిందనే అపవాదును అంటగట్టింది. చివరకు పోలీసులు.. మీడియా రంగప్రవేశంతో ఆమె కళ్లనిండా నీళ్లు సుడులు తిరిగాయి. అప్పటి వరకు బాధను పంటిబిగువున దాచుకున్న ఆమె ఒక్కసారిగా కన్నీరుమున్నీరైంది. తన మానాన తనను వదిలేయండని ప్రాధేయపడిన ఘటన నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన కృష్ణ, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు సంతానం. కూలి పనులు చేస్తున్నా కుటుంబం గడవని పరిస్థితుల్లో దయనీయ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం మరో మహిళతో కలసి పగిడ్యాలలోని బంధువులను కలిసేందుకు వెళ్తూ కర్నూలు బస్టాండ్ చేరుకుంది. బాలింత కావడంతో ఆకలికి తాళలేకపోయింది. అప్పటికే బిడ్డ ఏడుస్తుండటంతో బస్టాండ్‌కు సమీపంలోని ఆదిత్య లాడ్జి వద్దనున్న పాన్‌షాపు వద్దకు చేరుకొని తన పరిస్థితిని తెలియజేసి డబ్బుల కోసం చేయి చాచింది. ఆ సమీపంలోని అయ్యన్న అనే వ్యక్తి ఆమెతో మాటలు కలిపి బిడ్డను ఇస్తే డబ్బులిస్తానంటూ నమ్మబలికాడు. అందుకామె ఒప్పుకోకపోవడంతో ఓ మహిళ బిడ్డను అమ్మేందుకు యత్నిస్తోందంటూ తనకు తెలిసిన పోలీసులు, మీడియా ప్రతినిధులకు సమాచారం చేరవేశాడు. ఒక్కసారిగా వీరంతా అక్కడికి చేరుకునే సరికి ఆమె బిత్తరపోయింది. ఒకరిపై ఒకరు ప్రశ్నల వర్షం కురిపించడంతో కన్నీరు పెట్టుకుంటూ.. తానెందుకు బిడ్డను అమ్ముకుంటానని వాపోయింది. పగిడ్యాలలోని తన బంధువులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పినా సూటిపోటి మాటలతో ఆమె మనసును గాయపర్చారు. ఎట్టకేలకు ఆమె కన్నీళ్లకు కరిగిపోయిన పోలీసులు ఆమెను గద్వాల బస్సు ఎక్కించి పంపేయడంతో కథ సుఖాంతమైంది. అయితే అప్పటికే ఈ విషయాన్ని మీడియా హడావుడి చేయడంతో కలకలం రేగింది. చివరకు అసలు విషయం తెలుసుకొని ఆమె బీద పరిస్థితికి చలించిపోయారు.