Hair Care Tips In Telugu: ఉంగరాల జుట్టు ఉండటం అందానికి చిహ్నంగా చెప్తారు. కొంతమంది స్టైల్ కోసం కూడా జుట్టును ఉంగరాలుగా మలుచుకుంటారు. అయితే ఉంగరాల జుట్టు వారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య జుట్టు చిక్కులు పడటం.
ఈ జుట్టు కుదుళ్ల దగ్గర జిడ్డుగా ఉండి చివర్లు పొడిబారినట్లుగా ఉంటాయి. ఉంగరాల జుట్టు కలవారు వారానికి మూడు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. అలాగే జుట్టుకి పోషణను అందించే షాంపూలు, బాదం, అవకాడో గుణాలు కలిగిన షాంపూలు, సల్ఫేట్ రహిత షాంపూలు వాడటం ఉత్తమం.
కొంచెం రింగులు తక్కువ ఉండి, అలలలాగా జుట్టు ఉండేవారికి కూడా ఇదే వర్తిస్తుంది. అయితే వీరు సల్ఫేట్ రహిత షాంపూ లేదా నురగతో శుభ్రపరుచుకోవడం చేసుకుంటే ప్రయోజనాలుంటాయి.
ఒత్తైన కేశాల కోసం సోంపు ఆకులు
►సోంపు ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మృదుత్వం సంతరించుకుంటాయి.
►రెండు లీటర్ల నీటిలో రెండు గుప్పెళ్ల సోంపు ఆకులను వేసి మరిగించి దించాక కొంచెం సేపు కదిలించకుండా అలాగే ఉంచాలి.
►నీరు ఆకులలోని సుగుణాలను ఇముడ్చుకుంటుంది.
►ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్‌ను కలిపి తలస్నానం పూర్తయ్యాక జుట్టుకంతటికీ పట్టేటట్లు పోయాలి.
చదవండి: Hair Care Tips: జుట్టు ఆరోగ్యంగా, సిల్కీగా ఉండాలంటే.. ఇంట్లోనే ఇలా షాంపూ తయారు చేసుకోండి!
Bhagyashree: 53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే! నా బ్యూటీ సీక్రెట్ అదే!
Comments
Please login to add a commentAdd a comment