నల్లని ఒత్తైన జుట్టు అందరికీ ఇష్టమే! ఐతే రోజువారీ పనుల్లో పడి కేశ సౌందర్యానికి తగినంత శ్రద్ధ తీసుకోవడం కుదరట్లేదనేది ఎక్కువ మంది చెప్పే కారణం. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే కేవలం ఆరోగ్య ఆహారం మాత్రమే తీసుకుంటే జుట్టు సంబంధిత సమస్యలు దూరం కావు. అవసరమైన నూట్రీషన్లు, ప్రొటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు కూడా అందుతున్నాయో లేదో గమనించుకోవాలి. ఇవన్నీ కేవలం పండ్లలో మాత్రమే దొరుకుతాయని అనుకుంటే పొరపాటే. రకరకాల విత్తనాల్లో కూడా ఈ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని పచ్చిగా లేదా ఉడికించి ఎలా తిన్నా మీ జుట్టు ఒత్తుగా పెరగడానికి తోడ్పడతాయి. వెంట్రుకల ఆరోగ్యనికి మేలు చేసే విత్తనాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
అవిసె గింజలు
ఈ గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. జుట్టు రాలడాన్ని నివారించి, మాడు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. వీటిల్లో ప్రొటీన్లు, మ్యాగ్నీషియం, పొటాషియం, జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది.
నువ్వులు
నల్లని లేదా తెల్లని నువ్వుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫ్యాటీ ఆమ్లాలు వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. ఇవి జుట్టు పెరగడాన్ని ప్రోత్సహించి, సహజంగా మెరిసేలా చేస్తుంది.
చదవండి: Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!!
పొద్దు తిరిగుడు గింజలు
పొద్దు తిరిగుడు గింజల్లో విటమిన్ ‘ఇ’తోపాటు ఇతర పోషకాలు చర్మ, జుట్టు సంబంధిత సమస్యల నివారణలో కీలకంగా వ్యవహరిస్తాయి.
గుమ్మడి విత్తనాలు
జుట్టు సమస్యలను ఎదుర్కొవడంలో గుమ్మడి విత్తనాల తర్వతే ఏదైనా అని చెప్పవచ్చు. గుమ్మడి విత్తనాలను పోషకాల గని అనికూడా అంటారు. దీనిలో జింక్, మాగ్నీషియం, కాల్షియం, ఐరన్.. వంటి ఎన్నోఖనిజాలు ఉంటాయి. వెంట్రుకలు చిట్లడాన్ని, ఊడటాన్ని నివారిస్తుంది కూడా.
చియా విత్తనాలు
వీటిల్లో ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లతోపాటు ముఖ్యమైన ఖనిజాలు జుట్టు ఆరోగ్యం పెరగడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా చియా విత్తనాలల్లోని ఐరన్, సెలీనియం వెంట్రుకల కుదుళ్లను బలపరచి, వేగంగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment