Actress Kriti Sanon Launches Her Own Skincare Brand Hyphen, Netizen Says She Got Heavy Tax Saving Lecture - Sakshi
Sakshi News home page

బర్త్‌ డే నాడు కొత్త బిజినెస్‌లోకి హీరోయిన్‌, నెటిజన్ల రియాక్షన్‌ మామూలుగా లేదు!

Published Fri, Jul 28 2023 12:22 PM | Last Updated on Fri, Jul 28 2023 1:38 PM

Kriti Sanon Launches Her Own Skincare Brand Netizen Says Tax Saving technique - Sakshi

బాలీవుడ్‌ భామ, ఆదిపురుష్‌ హీరోయిన్‌  బర్త్‌డే గాళ్‌ కృతి సనన్‌  సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. తన సొంత స్కిన్‌కేర్ బ్రాండ్‌ను  గురువారం లాంచ్‌ చేసింది. ప్రముఖ బ్రాండ్ mCaffeine మాతృ సంస్థ PEP టెక్నాలజీస్  భాగస్వామ్యంతో  తన బ్యూటీ బ్రాండ్ హైఫెన్‌తో బ్యూటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే న సొంత ప్రొడక్షన్ హౌస్, బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్‌ను ప్రారంభించిన  కృతి సనన్‌  ఇక బిజినెస్ ఉమన్‌గా  రాణించాలనుకుంటోంది. ఈ వెంచర్  ద్వారా  బ్యూటీ వ్యాపార ప్రపంచంలో ఇతర సెలబ్రిటీల సరసన  చేసింది.  (హానర్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌: 200 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌తో రీఎంట్రీ!)

జూలై 27 తన బర్త్‌ డే సందర్భంగా కృతి సనన్ పీఈపీ టెక్నాలజీస్‌తో భాగస్వామ్యంతో హైఫెన్ అనే  ప్రీమియమ్ స్కిన్‌కేర్ లైన్‌ను పరిచయం చేసింది.   హైఫెన్ బ్రాండ్ ద్వారా వినియోగదారులకు అధిక-నాణ్యత చర్మ సంరక్షణ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యం అని పేర్కొంది. దీనికి సంబంధించి వీడియోను  సోషల్‌ మీడియాలో   పోస్ట్‌ చేసింది. బ్యూటీ బ్రాండ్ లాంచ్ వీడియోలో కృతి అద్భుతంగా కనిపించింది. చర్మ సంరక్షణపై తనకున్న అభిరుచిని పాషన్‌గా మార్చుకోవడానికి ఎలా సిద్ధంగా ఉన్నానో తెలిపింది. హైఫన్‌లో PEP టెక్నాలజీస్  30 కోట్లతో మెజారిటీ వాటాదారుగా ఉంటుంది.  కృతి సనన్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్‌గా ఉండనుంది. (ప్రపంచంలో టాప్‌ రిచెస్ట్‌ రాయల్‌ ఫ్యామిలీ ఏదో తెలుసా? )

హైఫన్ మూడు ముఖ్యమైన రోజువారీ ఉత్పత్తులైన బారియర్ కేర్ క్రీమ్, గోల్డెన్ అవర్ గ్లో సీరమ్ , ఆల్ ఐ నీడ్ సన్‌స్క్రీన్ SPF 50 PA++++ని విడుదల చేసింది. అయితే ఈ బ్రాండ్‌ కొంతమంది బ్యూటీ లవర్స్‌ను ఆకట్టుకోగా, మరికొంతమంది నెటిజన్లు రియాక్షన్‌ భిన్నంగా ఉంది. దీపికా పడుకోన్‌  బ్రాండ్‌ను కాపీ చేసిందనికొందరు వ్యాఖ్యానించగా, టాక్స్‌ ఎగ్గొట్టడానికి ఇదో కొత్త ఎత్తుగడని మరికొందరు కమెంట్‌ చేశారు. 

కృతి సనన్ వర్క్ ఫ్రంట్
ఇక కరియర్‌ పరంగా  నిర్మాతగా కృతి సనన్ తన తొలి చిత్రం "తీన్ పట్టి" తో ప్రేక్షకుల ముందుకు రానుంది. టైగర్ ష్రాఫ్‌తో కలిసి మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ  "గణపత్"లో  కూడా కనిపించనుంది.  దీంతోపాటు  షాహిద్ కపూర్ సరసన మరోప్రాజెక్ట్‌కు పనిచేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement