Routine
-
కింగ్ చార్లెస్‌కి కేన్సర్..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..?
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కేన్సర్‌తో బాధపడుతున్న బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కోంది. ఆయన గత నెలలో ఆరోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లగా కేన్సర్‌గా నిర్దారణ అయినట్లు తెలిపింది. అయితే అది ఏ రకమైన కేన్సర్ అనేది వెల్లడించలేదు. సోమవారం నుంచి చికిత్స మొదలైందని, కాబట్టి కొద్ది రోజు ప్రజావిధుల నుంఇచ తప్పుకుంటారని పేర్కొంది. ఇక బ్రిటిఫ్ ప్రెస్ ప్రకారం ఆయన కెరిర్లో కొన్ని గాయాలు, రెండుసార్లు కరోనా మహమ్మారి బారిని పడటం మినహా రాజ అద్భుతమైన ఆరోగ్యకరమ జీవితాన్నే గడిపారు. ఆయన చక్రవర్తిగా 2022లో సింహాసనాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. పైగా బ్రిటిష్ చరిత్రలో రాజుగా పట్టాభిషేకం అయిన అంత పెద్ద వయసు వ్యక్తి కూడా ఆయనే. ఇక ఆయన లైఫ్‌స్టైల్ విషయానికి వస్తే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తారని అంతరంగికులు చెబుతున్నారు. అందులోనూ ఆయన ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారని అంటునన్నారు. అలాంటి ఆయన ఈ కేన్సర్ మహమ్మారిన బారిన పడటం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆయన ఆహార అలవాట్లు ఎలా ఉండేవి? రోజూవారి దినచర్య ఎలా ఉంటుంది తదితర విశేషాల గురించి తెలుసుకుందామా!. ఆయన ఒకసారి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిజీ షెడ్యూల్‌కు ఆటంకం కలిగించే భోజనం లగ్జరీ లాంటిదని విశ్వసిస్తానని అన్నారు. అంతేగాదు ఆయన సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వంటివి చేస్తారని అధికారిక వర్గాల సమాచారం. 2018లో కార్లెస్ హౌస్‌లో తన 70వ పుట్టిన రోజు పురస్కరించుకుని తనకు సంబంధించిన 70 వాస్తవాల జాబితాలో తాను రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటానని అదికూడా అల్పహారం, రాత్రి భోజనం మాత్రమేనని చెప్పుకొచ్చారు. అంతేగాదు వారంలో రెండు రోజులు పూర్తిగా శాకాహారం భోజనం తింటానని, పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువుగా మొక్కల ఆధారిత ఆహారమే ఎక్కువగా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అల్పాహారంలో ఎక్కువగా చీజ్, ఉడకబెట్టిన గుడ్లు, పాలు, తేనేతో కూడిన డార్జిలింగ్ టీ తదితరాలే తీసుకుంటారని రాయల్ డైట్ పేర్కొంది. ఆయన ఎక్కువగా సేంద్రీయ ఉత్పత్తులనే ఇష్టపడతారని రాయల్ చెఫ్‌లు చెబుతున్నారు. ఇక ఫిట్నెస్ విషయానికి వచ్చేటప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయమాలు చేస్తారని ప్యాలెస్ పేర్కొంది. అలాగే కెనడియన్ ఎయిర్‌ఫోర్స్‌కి సంబంధించిన ఐదు ప్రాథమిక వ్యాయమాలను రోజుకు రెండుసార్లు చేస్తారని తెలిపింది. ముఖ్యంగా రెండు నిమిషాల స్ట్రెచింగ్ ఒక నిమిషం సిట్ అప్లు, మరో నిమిషం బ్యాక్ లెగ్ రైజ్‌లు పుష్ అప్లు 11 నిమిషాలు చేస్తారని వెల్లడించింది. వాటన్నింటి తోపాటు ఆరు నిమిషాల పాలు రన్నింగ్, ప్రతి 75 అడుగులకు డేగ జంప్‌లు చేయడం, వాతావరణం బాగుంటే ఎక్కువ సేపు బహిరంగ ప్రదేశంలో గడపడం వంటివి చేస్తారని రాయల్ ప్యాలెస్ పేర్కొంది. ఇంతలా పిట్‌నెస్‌గా ఉంటూ మంచి ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించనప్పటికీ కొన్ని రకాల వ్యాధులు ఎందుకు దాడి చేస్తాయనేది ఎవ్వరికీ అంతుపట్టని చిక్కు ప్రశ్న. నిజం చెప్పాలంటే వ్యాధికి రాజు, పేద అనే తారతమ్యం ఉండదేమో రావాలి, వేదన అనుభవించాలి అని ఉంటే టైంకి వచ్చి దాని ప్రభావం చూపించేస్తుందేమో కదూ!. View this post on Instagram A post shared by The Royal Family (@theroyalfamily) (చదవండి: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
చర్మ సౌందర్యం కోసం 'ఆదిపురుష్' హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా?
'వన్ నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్. ఆ తర్వాత నాగ చైతన్య దోచెయ్ మూవీలో హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాలు సరిగా ఆడకపోవడంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయిన కృతి అక్కడ వరుస హిట్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవలె ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో సీతగా అలరించింది. సినిమా అంతగా ఆడకపోయినా సీతగా కృతికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే కృతి సినిమాల్లోలాగే బయట కూడా చాలా అందంగా మెరిసిపోతుంటుంది. తన స్కిన్‌కేర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ఈ బ్యూటీ తాజాగా ఈమె తన చర్మ సౌందర్యం కోసం ఏం చేస్తుందో రివీల్ చేసేసింది. అంతేకాకుండా తాను స్కిన్‌కేర్‌లో ఎటువంటి ప్రొడక్ట్స్ వాడుతుందో కూడా బయటపెట్టేసింది. ఇందులో కొన్ని చాలా తక్కువ ధరకే ఉండటం విశేషం. సాధారణంగా హీరోయిన్లు చాలా బ్రాండెడ్ వస్తువులను, ఖరీధైన మేకప్, స్కిన్‌కేర్‌ను ఫాలో అవుతుంటారని అనుకుంటాం. కానీ కృతి రివీల్ చేసిన రొటీన్ చాలా సాధాసీదాగా ఉండటం నెటిజన్లను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొత్తం 7 స్టెప్స్‌ను ఎంచుకున్న కృతి తొలుత డబుల్ క్లెన్సింగ్‌తో మొదలుపెట్టి లిప్‌బామ్‌తో ముగించింది. View this post on Instagram A post shared by Kriti (@kritisanon) -
ఆ డాక్యుమెంటరీ పేరు చెప్పను: అమితాబ్
ముంబై : బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన సోషల్ మీడియాలో తరచూ పోస్టులు పంచుకుంటూ యాక్టివ్‌గా ఉంటున్నారు. కరోనా సోకిన సమయంలో ఆసుపత్రిలో తన దినచర్య ఎలా గడిచిందో వివరిస్తూ.. 'నా గురించి నేనే ఆలోచించాను. పాత క్రికెట్ మ్యాచ్‌లు, ఒక డాక్యుమెంటరీ (పేరు చెప్పను), మొబైల్ ఫోన్ గురించి తెలుసుకోవడానికి కొంత సమయం వెచ్చించాను. ట్విటర్లో కొంత సమయం గడిపాను. తరుచుగా మందులు వేసుకోవడం, విశ్రాంతి తీసుకున్నాను' అంటూ తన దినచర్యను వివరిస్తూ ట్వీట్ చేశారు. జూలై నెలలో అమితాబ్ బచ్చన్ సహా అభిషేక్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో నానావతి హాస్పిటల్లో చికిత్స పొందారు. వారంతా ఇటీవల పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన విషయం తెలిసిందే. (నాపై గౌరవం పోయినా సరే, నేను ఇంతే) ఇక 65 ఏళ్లపైబడిన వారు అవుట్ డోర్ షూటింగ్లో పాల్గొనేందుకు వీలు లేదని మహరాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను ఉద్దేశిస్తూ.. తనకు ఇక ఉద్యోగం దొరుకుందో లేదో అంటూ బిగ్‌బీ సరదాగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన అభిమాని ఒకరు అమితాబ్‌కు ఉద్యోగ అవకాశం ఇస్తున్నట్లు ఓ ఆఫర్ లెటర్‌ను అమితాబ్ పోస్టుకు ట్యాగ్ చేశాడు. దీనికి అమితాబ్.. ‘ఊహించని రీతిలో నాకు ఉద్యోగం వచ్చింది’ చూడండి అంటూ ఆ లేటర్‌ను పంచుకున్నారు. ఇందులో ‘‘ప్రియమైన మిస్టర్ అమితాబ్... కొన్ని కారణాల వల్ల ప్రత్యామ్నాయంగా మీకు ఉద్యోగం ఇచ్చేందుకు మీ దరఖాస్తు తాత్కాలికంగా సమీక్షలో ఉందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము’’ అని ఉంది. (బిగ్ బీకి జాబ్ ఆఫర్ ఇచ్చిన ఫ్యాన్) T 3623 - यहाँ कुछ लोगों के साथ , उनके विचारों पे उत्तर दिए ; कुछ स्वयं सोच विचार किया ; कुछ पुराने क्रिकेट मैच देखे , कुछ समय विश्राम किया ; एक documentary देखी ; नाम ना बताऊँगा 😁 ; दवाओं का सेवन किया ; मोबाइल में और कितने गुण छुपे हैं उनका ज्ञान प्राप्त किया ; प्रणाम किया 🙏 — Amitabh Bachchan (@SrBachchan) August 10, 2020 -
వీసాల్జియా...
మెడిక్షనరీ నాస్టాల్జియాలా వినిపిస్తోంది కదూ! మందెక్కువైన స్థితిలో చాలామంది నాస్టాల్జియాలోకే వెళతారు. కిక్కు తలకెక్కిన దశలో గతాన్నంతా తవ్వి తలకెత్తుకుంటారు. మర్నాడు నిద్రలేవడంతోనే తలదిమ్ముగా, కళ్లు మంటలుగా, కడుపులో వికారంగా ఉంటుంది. పక్క మీద నుంచి లేవడమే కష్టంగా ఉంటుంది. ఎలాగోలా కాలకృత్యాదికాలు కానిచ్చుకుని, రొటీన్లో పడ్డా... రోజంతా నిస్సత్తువగా, ఒళ్లంతా భారంగా అనిపిస్తుంది. డోసెక్కువైతే ఇలాగే ఉంటుంది మరి. దీన్నే మామూలు భాషలో హ్యాంగోవర్ అంటారని తెలిసిందే. దీనినే వైద్య పరిభాషలో ‘వీస్టాల్జియా’ అంటారు. నార్వేజియన్ పదం ‘వీస్టా’ అంటే తప్పతాగడం వల్ల తలెత్తే ఇబ్బంది అని అర్థం. గ్రీకు భాషలో ‘ఆల్జియా’ అంటే నొప్పి అని అర్థం. ఈ రెండు పదాలను మిక్స్ చేసి ఈ పదాన్ని కనిపెట్టారు వైద్యులు. -
రొటీన్...
మెట్రో కథలు నిన్నటి వరకూ ఆమె రొటీన్లో మార్పు లేదు. ఉదయాన్నే ఐదుంపావుకు సరిగ్గా ఎవరో తట్టి లేపినట్టుగా లేచి కూచుంటుంది. మరో నాలుగైదు నిమిషాల్లో టీ పెట్టుకుని బాల్కనీలో- అక్కడ కూచుంటే కింద నుంచి బాగా ఆకులేసిన బొప్పాయి చెట్టు కనిపిస్తుంది- దానిని చూస్తూ కూచుంటుంది. ఐదున్నర నుంచి ఆరువరకు ప్రాణాయామం. ఆరుకు పాపను లేపిందంటే, దానికి బ్రష్ చేయించి, బ్రేక్‌ఫాస్ట్ పెట్టి, మళ్లీ స్నాక్స్ కోసం కాసింత న్యూటెల్లా రాసిన బ్రెడ్ ముక్కలు డబ్బాలో కూరి, యూనిఫామ్ తొడిగి, ఏడున్నరకు బస్ ఎక్కించేదాకా తీరదు. ఆ తర్వాత ట్రాక్ ప్యాంట్ వేసుకొని పైన టీషర్ట్ లాక్కుని లిఫ్ట్‌లో కిందకు దిగి అలా హైటెక్ సిటీ వరకు సైక్లింగ్‌కు బయలు దేరిందంటే ఎనిమిదిన్నర వరకూ అది తన టైమ్. పదిన్నరకు ఆఫీస్. సాయంత్రం నాలుక్కు పాప వచ్చే సమయానికి ఇల్లు. కాస్త డబ్బు ఎక్కువే అయినా జె.ఎన్.టి.యులో ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుక్కున్నప్పటి నుంచి ఆమెకు స్థిమితంగా ఉంది. కొత్త కన్స్ట్రక్షన్. మంచి అమినిటీస్. ఒక గడపకూ మరో గడపకూ సంబంధం లేనట్టుగా ప్రైవసీ. అందరికీ ఐ.డి. కార్డ్స్. అవి చూపితే తప్ప ఎంట్రీ ఇవ్వని సెక్యూరిటీ... చెప్పాలంటే ఇక్కడికొచ్చాక భర్తే కాపాడాలి అనే భయం దాదాపు పోయింది. త్రీ బెడ్రూమ్స్ ఉన్న ఆ ఫ్లాట్‌లో ఒక బెడ్రూమ్లో భర్త ఉంటున్నాడు. ఆరు నెల్ల క్రితం ఒకరోజు నేను ఆ రూమ్‌లో పడుకుంటాను అన్నాడు. పడుకో అంది. అంతే. వాదన పెట్టుకోలేదు. అతడి కోసం ఆమె చాలా మారింది. ఇది కూడా పెద్ద మార్పే. కొత్తల్లో పెద్ద పెద్దగా వాదనకు దిగేది. ఇప్పుడు ఏ విషయాన్నైనా చిన్న గొంతుతో అంతే తీవ్రంగా చెప్పడం నేర్చుకుంది. చిన్నప్పటి నుంచి రెండు వదలొద్దనుకుంది. ఒకటి సైక్లింగ్. రెండు ఉద్యోగం. రెంటినీ వాళ్లూ వీళ్లూ వద్దన్నా తండ్రి లెక్క చేయలేదు. భర్త లెక్క జేస్తాడని అనుకోలేదు. ఉద్యోగం చేసే అమ్మాయి వద్దు అని ముందే చెప్పేయాల్సింది. కాని చెప్పలేదు. చేసుకున్నాడు. చక్కగా ఉద్యోగం చేస్తుంది. చక్కగా ఇల్లు చూసుకుంటుంది. చక్కగా పాపనూ. చక్కగా మొగుణ్ణీ. అయినా చాల్లేదు. ఇంట్లో ఫోన్లు తగ్గించు అన్నాడు ఒకరోజు. మగాళ్లతో మాటలు తగ్గించు అన్నాడు ఇంకోరోజు. క్యాంపులు తగ్గిస్తే మంచిది అని మరో రోజు. ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇళ్లకు చేరే ఆడవాళ్లంటే భయం ఉండదు చాలామందికి. కాని ఆఫీస్ పని మీద ఒక్కరోజైనా సరే ఊరెళ్లొచ్చే ఆడవాళ్లంటే మాత్రం భయం. ఏం... చేయాలంటే అక్కడే చేయలా? ఇక్కడ చేయకూడదా? సరే ఎందుకొచ్చిన గొడవ అని క్యాంపులు డ్రాప్ చేసింది. అతడు చూస్తుండగా ఫోన్లూ మానేసింది. నిజానికి తన టాలెంట్‌కు ఎక్కడో ఉండాలి. కుటుంబం కోసం కుదించుకుంది. తృప్తి లేదు. ఏం చేయాలి? చూడ్డానికి బావుంటుంది. నవ్వితే బాగుంటుంది. ఇదంతా నీ కోసమే. సత్యంగా నీ కోసమే. ఊహూ. నమ్మకం లేదు. పెళ్లయినప్పటి నుంచి గమనిస్తోంది. ఎప్పుడు పక్కన పడుకున్నా మధ్యలో వేరెవరో వచ్చి పడుకోవాలి అన్నట్టుగా ఎడం ఇచ్చి పడుకుంటాడు. అసలు ఎప్పుడైనా సంపూర్ణంగా హృదయంలోకి తీసుకున్నాడా అని. పెళ్లికి ముందు, తర్వాత ఎంతో హుషారుగా, దుముకుతున్నట్టుగా ఉండేది. తను స్తబ్దుగా అయ్యే కొద్దీ తానూ స్తబ్దుగా అయిపోతూ వచ్చింది. ఆ రూపూ.. ఆ ఆకారం.. మొన్నొకరోజు కలీగ్ బలవంతంగా కళ్లజోడు తీయించింది. చూడు. కళ్ల కింద ఎంతెంత పెద్ద చారలు ఉన్నాయో. నువ్వు సంతోషంగా లేవు కదూ. ఏం చెబుతుంది? ఇంకెవరో బంధువు అసలు గుర్తు పట్టనే లేదు. చాలా పొడవైన జుట్టు ఉండేది తనకు. పూర్తిగా బాయిష్ లుక్‌లో హెయిర్ కట్ చేయించుకుంది. చీరలు, చుడీదార్లు.... చాలా బాగుంటాయి. పూర్తిగా మానేసి ప్యాంట్ షర్ట్స్‌లో దిగిపోయింది. లిప్‌స్టిక్... కాటుక... వద్దనే వద్దు. నాకు పని చేయడం ముఖ్యం... బయటి ప్రపంచానికి నేను మగాడి కిందే లెక్క... వేరే ఏ బేరాల్లోనూ ఇంట్రెస్టు లేదు.... హ్యాపీగా ఉందా... ఊహూ. దిలాసా లేదు. ఇంకా ఏం చేస్తే మారుతాడా అని అలోచించి ఆలోచించి, తన ఎద ఎత్తుగా ఉంటుంది, సర్జరీ చేయించి అణిచేద్దామా అని డాక్టర్ దగ్గరకు వెళితే మీ మైండ్ ఖరాబ్ అయ్యింది వెళ్లండి అని పంపించేశాడు. డాక్టర్‌కు ఏం తెలుసు? ఈ ఖరాబును తాను భరించగలదు. కాని ఇతడి కోసం పని మానేసి ఇంట్లో కూచుంటే పూర్తిగా పిచ్చిదైపోతుంది. అయినా ఎందుకు మానేయాలి? ఆడవాళ్లు పనికే కదా పోతున్నారు. ఊళ్లోవాళ్లకి పైట జార్చడానికి పోతున్నారా? ఈ ఫ్లాట్ కొనకముందు ఏదో ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బు అడిగాడు. తాను అక్కర్లేనప్పుడు తన డబ్బు మాత్రం ఎందుకు? ఇవ్వను అంది. మనసులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ ఫ్లాట్ కొంటుంటే వాళ్లూ వీళ్లూ జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించుకోమని సలహా ఇచ్చారు. వద్దని తన పేరు మీదే చేయించుకుంది. ఇప్పుడు తనకో ఇల్లుంది. కూతురుంది. ఉద్యోగం ఉంది. మొగుడు కూడా ఉంటే ఉంటాడు. నిన్న రాత్రి అదీ తేలిపోయింది. డైనింగ్ టేబుల్ మీద భోం చేస్తుంటే- ఇలాగైతే ఉండను. వెళ్లిపోతాను అన్నాడు. దూరంగా పాప పెద్ద సౌండ్‌తో టీవీ చూస్తోంది. వాలకం చూస్తే గొడవ జరిగేలా ఉంది. పెద్ద గొడవ జరిగినా చిన్న గొడవ జరిగినా ఫలితం మాత్రం తాను ముందే నిశ్చయించుకుని ఉంది. అందుకని గొంతు పెంచకుండా మెల్లగా తీవ్రంగానే అంది. ఇంకొక్క మాట మాట్లాడావంటే పళ్లు రాలిపోతాయి. మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు నడు. మళ్లీ వచ్చావంటే కాళ్లు విరగ్గొడతా. ఆ... అని ముందుకు ఉన్నవాడల్లా కుర్చీలో వెనక్కు వాలి నోరెళ్లబెట్టాడు. పాపను తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్లిపోయింది. మరో అరగంటకు ఏం ప్యాక్ చేసుకున్నాడో పాడో వెళ్లిపోయాడు. తెల్లారింది. మెలకువ వచ్చింది. బొప్పాయి చెట్టును చూస్తూ టీ తాగడం పూర్తయ్యింది. పాప స్కూలుకు కూడా వెళ్లిపోయింది. ఏం కొంప మునిగిపోలేదు. నిన్న గడిచినట్టే ఇవాళ కూడా గడుస్తుంది. టైమ్ చూసుకుంది. ట్రాక్ ప్యాంట్ వేసుకుంది. టీషర్ట్ లాక్కుని కిందకు దిగి సైకిల్‌తో రోడ్డు మీదకు వచ్చాక ఒక క్షణం అనిపించింది. రేపతను మళ్లీ రావచ్చు. కాళ్లబేరం చేసుకోవచ్చు. తాను దయతలిచి ఇంట్లోకి అడుగుపెట్టనివ్వొచ్చు. కాని ఈ రొటీన్లో మాత్రం తేడా ఉండకూడదు. అయితే ఒక్కటి మాత్రం తేడా పాటించాలనుకుంటోంది. ఇక మీదట జుట్టు పొడుగ్గా పెంచాలనుకుంటోంది. ఏం... ముచ్చటగా చీర కట్టుకుని ఆఫీసుకు వెళ్లకూడదా? - మహమ్మద్ ఖదీర్‌బాబు