కథ విన్నాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి: శ్రీదేవి
విన్నాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి: శ్రీదేవి
Published Fri, Jun 23 2017 6:23 PM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM
హైదరాబాద్ : అతిలోక సుందరి శ్రీదేవి నటించిన ‘మమ్’ సినిమా తెలుగు ట్రైలర్ శుక్రవారం హైదరాబాద్‌లో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, తాజాగా రెండో ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఇవాళ సాయంత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ..సినిమా కథ విన్నాక తన కళ్లల్లో నీళ్లు తిరిగాయన్నారు. ఈ చిత్రం కోసం సంవత్సరం పాటు పని చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ... శ్రీదేవి కోసం అయినా ఈ సినిమా చూడాలన్నారు.
అలాగే నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ మమ్ చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉందని ప్రశంసించారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీదేవి చాందినీ సినిమాలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని అన్నారు. కాగా శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మించిన ఈ హిందీ చిత్రం తమిళం, తెలుగులోనూ అనువాద రూపంలో విడుదల కానుంది. మామ్ సినిమాలో ఇద్దరు పాకిస్తానీ నటులు సాజల్ అలీ, అద్నాన్ సిద్ధిఖీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి ఉడయార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలో జులై 7న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చారు.
Advertisement
Advertisement