శ్రీదేవి నెక్స్ట్‌ సినిమా.. భారీ ప్రాజెక్టు? | After Mom, Sridevi to act in Mr India 2 | Sakshi
Sakshi News home page

శ్రీదేవి నెక్స్ట్‌ సినిమా.. భారీ ప్రాజెక్టు?

Published Sun, Jun 18 2017 3:56 PM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM

శ్రీదేవి నెక్స్ట్‌ సినిమా.. భారీ ప్రాజెక్టు?

శ్రీదేవి నెక్స్ట్‌ సినిమా.. భారీ ప్రాజెక్టు?

అలనాటి అందాల అతిలోక సుందరి శ్రీదేవికి ఇప్పటికీ తిరుగులేని స్టార్‌డమ్‌ ఉంది. ఒకప్పుడు భారీ స్టార్‌డమ్‌తో, వరుస సినిమాలతో బాలీవుడ్‌ను ఏలిన ఈ సుందరిమణి.. ఇటీవల వచ్చిన ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ సినిమాతో తన హిందీచిత్రసీమలో తనకు తిరుగులేదని మరోసారి చాటుకుంది. ఇప్పటికే ఆమె నటించిన తాజా సినిమా ‘మామ్‌’ విడుదలకు ముందే పాజిటివ్‌ సమీక్షలు వచ్చాయి. ఈ సినిమా శ్రీదేవి కెరీర్‌లో మరో మంచి చిత్రంగా నిలిచిపోతుందని చెప్తుండగా.. ఆమె తదుపరి చిత్రం కోసం భర్త బోనీ కపూర్‌ అప్పుడే సన్నాహాలు ప్రారంభించారు.

ఎంతోకాలంగా వెయిట్‌చేస్తున్న ప్రతిష్టాత్మక ‘మిస్టర్‌ ఇండియా 2’ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెస్తున్నాడు బోనీ కపూర్‌. ఈ సీక్వెల్‌లో శ్రీదేవి, అనిల్‌ కపూర్‌ తమ ఒరిజినల్‌ పాత్రలు పోషించనుండగా.. మరో యువజంట కీలకమైన పాత్రల్లో నటించనుందని సమాచారం. ‘మిస్టర్‌ ఇండియా 2’ కోసం ఇప్పటికే కట్టుదిట్టమైన స్క్రిప్ట్‌ సిద్ధమైందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘మిస్టర్‌ ఇండియా’లో శ్రీదేవి, అనిల్‌ కపూర్‌ జోడీ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. వారు అదే మ్యాజిక్‌ను ఈ సీక్వెల్‌ను చూపించబోతున్నారట. అయితే, మిస్టర్‌ ఇండియా-2ను తెరకెక్కించేందుకు ప్రఖ్యాత దర్శకుడు శేఖర్‌ కపూర్‌ నిరాకరించారని సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త దర్శకుడి కోసం వేట సాగుతోంది. రాకేష్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా, మామ్‌ దర్శకుడు రవి ఉద్యవర్‌ ఈ రేసులో ముందున్నట్టు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement