స్టార్ క్రికెటర్తో శ్రీదేవి స్టెప్స్ | Sourav Ganguly shakes a leg with Sridevi | Sakshi
Sakshi News home page

స్టార్ క్రికెటర్తో శ్రీదేవి స్టెప్స్

Published Sat, Jul 1 2017 12:36 PM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

స్టార్ క్రికెటర్తో శ్రీదేవి స్టెప్స్

స్టార్ క్రికెటర్తో శ్రీదేవి స్టెప్స్

అతిలోకసుందరి శ్రీదేవి తన 300వ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది. రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన శ్రీదేవి, త్వరలో రిలీజ్ అవుతున్న మామ్ సినిమా మీదే ఆశలు పెట్టుకుంది. తన 300వ సినిమా కావటం, భర్త బోనీ కపూర్ స్వయంగా నిర్మిస్తుండటంతో మామ్ ను ఎలాగైన సక్సెస్ చేయాలని భావిస్తుంది. అందుకే బాలీవుడ్ తో పాటు అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రమోషన్ లోభాగంగా మాజీ క్రికెటర్ గంగూలి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న దాదాగిరి షోలో పాల్గొంది శ్రీదేవి. ఓ బెంగాల్ చానల్ లో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమంలో సినీ తారలు పాల్గొనటం ఇదే తొలిసారి. శ్రీదేవి లాంటి టాప్ స్టార్ తొలిసారిగా హాజరవుతుండటంతో షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో సెక్యూరిటీ పెంచారట, అంతేకాదు కేవలం చిన్నారుల మధ్యే ఈ స్పెషల్ ఎపిసోడ్ ను షూట్ చేశారు. త్వరలో ప్రసారం కానున్న ఈ షో కోసం శ్రీదేవి తో కలిసి గంగూలి డ్యాన్స్ కూడా చేశాడు.

ఈ కార్యక్రమంలో శ్రీదేవితో పాటు ఆమె భర్త, నిర్మాత బోని కపూర్, దర్శకుడు రవి వడయార్ ను కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మామ్ ఘనవిజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement