dadagiri
-
నడిరోడ్డుపై కర్రలతో టీడీపీ నేత దాదాగిరి..
సాక్షి, అమరావతిబ్యూరో : రాజధాని అమరావతిలో సామాన్య ప్రజలకు రక్షణ కరువైంది. అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతోంది. తాము చెప్పిందే వేదం... చెప్పినట్లు వినాల్సిందే.. లేదంటే దాడే.. అన్న రీతిలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. సచివాలయానికి కూతవేటు దూరంలో రోడ్డు పైనే సాధారణ జనాన్ని చితకబాదుతున్నారంటే రాజధానిలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మందడానికి చెందిన టీడీపీ నేత గుర్రం సాయికృష్ణ ఓ హోటల్ మేనేజర్‌పై నడిరోడ్డుపైనే కర్రలతో దాడికి పాల్పడ్డాడు. పాత బకాయి చెల్లించి బిర్యానీ తీసుకెళ్లాలని సూచించడంతో... నన్నే డబ్బులు అడుగుతావా అంటూ మేనేజర్‌పై ఒక్కసారిగా కర్రలతో దాడికి దిగాడు. ఈ ఘటన ఈ నెల 17వ తేదీ జరగగా 18వ తేదీ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి జరిగిన రోజే బాధితుడు జి. నాగసురేష్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసేందుకు జంకినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీడీపీ నేతలు హెచ్చరించినా బాధితుడు వెనక్కి తగ్గకపోవడంతో ఎట్టకేలకు 18వ తేదీ దాడికి పాల్పడిన గుర్రం సాయి, శశిధర్, శ్రీనివాసరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిని కేసు నుంచి ఎలాగైనా తప్పించేందకు ఓ జెడ్పీటీసీ సభ్యుడితో సహా నియోజకవర్గ టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నారని తుళ్లూరు పోలీసులు చెబుతున్నారు. మందడం టీడీపీ నేతలపైనే ఫిర్యాదులు స్థలం విషయమై తాను చెప్పినట్లు వినకపోవడంతో ఈ ఏడాది జనవరిలో మందడం గ్రామానికి చెందిన టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడ్డాడు. మందడం పంచాయతీ కార్యాలయంలోనే తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ, భౌతికంగా దాడి చేశాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే టీడీపీ నేతపై కేసు నమోదు చేయకుండా అప్పట్లో నియోజకవర్గ నేతలు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే పంచాయతీ కార్యదర్శి వెనక్కితగ్గకపోవడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. టీడీపీ హయాంలో ప్రజలకు రక్షణ కరువు ఈ ఏడాది ఫిబ్రవరిలో తుళ్లూరు మండలం వెంకటపాలెంలో రెండో దశ నీరు – ప్రగతి కార్యాక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా జి.కొండూరు మండలానికి చెందిన రామాంజనేయులు సీఎం ముందు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో జల సంరక్షణ కాదు.. జనానికి రక్షణ కరువైందని వాపోయాడు. మందడం గ్రామానికి చెందిన మాదల సుబ్బయ్య కుమారుడు తనపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదని కన్నీటిపర్యంతమయ్యాడు. దీంతో సీఎం కల్పించుకుని రామాంజనేయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులకు వంతపాడేలా మాట్లాడారు. అనంతరం రామాంజనేయులుకు న్యాయం చేయాలని రూరల్ ఎస్పీ అప్పలనాయుడును ఆదేశించారు. ఇది జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంత వరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అలాగే అనంతవరంలో మట్టి తరలింపులో టీడీపీ నేతల మధ్యే బేదాభిప్రాయాలు తలెత్తడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. రాజధాని గ్రామాల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని వారు కోరుతున్నారు. -
స్టార్ క్రికెటర్‌తో శ్రీదేవి స్టెప్స్
అతిలోకసుందరి శ్రీదేవి తన 300వ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది. రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన శ్రీదేవి, త్వరలో రిలీజ్ అవుతున్న మామ్ సినిమా మీదే ఆశలు పెట్టుకుంది. తన 300వ సినిమా కావటం, భర్త బోనీ కపూర్ స్వయంగా నిర్మిస్తుండటంతో మామ్ ను ఎలాగైన సక్సెస్ చేయాలని భావిస్తుంది. అందుకే బాలీవుడ్ తో పాటు అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమోషన్ లోభాగంగా మాజీ క్రికెటర్ గంగూలి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న దాదాగిరి షోలో పాల్గొంది శ్రీదేవి. ఓ బెంగాల్ చానల్ లో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమంలో సినీ తారలు పాల్గొనటం ఇదే తొలిసారి. శ్రీదేవి లాంటి టాప్ స్టార్ తొలిసారిగా హాజరవుతుండటంతో షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో సెక్యూరిటీ పెంచారట, అంతేకాదు కేవలం చిన్నారుల మధ్యే ఈ స్పెషల్ ఎపిసోడ్ ను షూట్ చేశారు. త్వరలో ప్రసారం కానున్న ఈ షో కోసం శ్రీదేవి తో కలిసి గంగూలి డ్యాన్స్ కూడా చేశాడు. ఈ కార్యక్రమంలో శ్రీదేవితో పాటు ఆమె భర్త, నిర్మాత బోని కపూర్, దర్శకుడు రవి వడయార్ ను కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మామ్ ఘనవిజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. -
కేసీఆర్ దాదాగిరి చేయి.. పాతరేయకు!
మెదక్ ఉప ఎన్నిక పోలింగ్ తేది సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతునే ఉంది. తాజాగా మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ .. కేసీఆర్ పై మాటల బాణాల్ని సంధించారు. మంచి కోసం చేయడానికి 'దాదాగిరి' చేసినా ఫర్వాలేదు.. కాని మీడియాను పాతరేస్తాం అనే మాటలు సమంజసం కాదు అని అన్నారు. దాదాగిరి చేయాల్సి వస్తే తప్పును తప్పుగానే చూపించాలని.. అంతేకాని మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి జవదేకర్ విజ్క్షప్తి చేశారు. అభివృద్ది కోసం పాటు పడండి. కేంద్రప్రభుత్వం సహకరిస్తుంది. కేంద్ర, రాష్ట్రం కలిసి మెలిసి ఉండాలి. తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం అని అన్నారు. అంతేకాని మీడియాను పాతరేస్తాం అని అనడం పద్దతి కాదు అని ఆయన ధీటుగా జవాబిచ్చారు. మీడియా కూడా బాధ్యతగా ప్రవర్తించాలన్నారు. పాతరేస్తామని వాడిన భాషనే పాతరేయాలని కేసీఆర్ కు సూచించారు. మెదక్ జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డికి మద్దతుగా ప్రకాశ్ జవదేకర్ ప్రచారాన్ని నిర్వహించారు. బుర్ర ఉన్నవాళ్లు బీజేపీ అభ్యర్థికి ఓటేయ్యరు అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జవదేకర తప్పుపట్టారు. బుర్ర, హృదయం ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటు వేస్తారని ఆయన అన్నారు. 25 కోట్లమంది బీజేపీ ప్రభుత్వాన్ని మద్దతు తెలిపారన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు దేశంలోని పేద ప్రజల్ని అవమాన పరిచారని జవదేకర్ అన్నారు.