అమ్మను మరిపించిన సత్యసాయి
- వేదాంతి మల్లా ప్రగడ∙శ్రీమన్నారాయణ
పుట్టపర్తి టౌన్: ఆదిపరాశక్తి అమ్మను మరిపిస్తూ లోకకల్యాణార్థం అవతరించిన సర్వాంతర్యామి సత్యసాయి అని వేదాంతి మల్లా ప్రగడ∙శ్రీమన్నారాయణ పేర్కొన్నారు. దసరా వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ మానవాళి సర్వతోముఖాభివృద్ది కోసం సత్యసాయి తన లీలావైభవాన్ని కొనసాగించారన్నారు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమను బోధిస్తూ పరిమిత రూపంలో జన్మించిన సత్యసాయి కాలంంతోపాటు అపరిమిత రూపంగా మానవాళిని సన్మార్గం వైపు నడిపే ఆదిపరాశక్గిగా విరాజిల్లారన్నారు. అనంతరం భక్తులు సత్యసాయి భక్తులు మహాసమాధిని దర్శించుకున్నారు.
నేడు విజయదశమి వేడుకలు
ప్రశాంతి నిలయంలో మంగళవారం విజయదశమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది సత్యసాయి భక్తులు వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే ప్రశాంతి నిలయంలో చేరుకున్నారు.
దసరా వేడుకల్లో భాగంగా విశ్వశాంతి కోసం ఏడు రోజులుగా ప్రశాంతి నిలయంలో బ్రహ్మశ్రీ కొండావధాని నేతృత్యంలో పుర్ణచంద్ర ఆడిటోరియంలో జరుగుతున్న వేదపురుష సప్తాహ యజ్ఞం పూర్ణాహుతితో మంగళవారం ముగియనుంది. అనంతరం భక్తులు పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.అలాగే తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న సత్యసాయి గ్రామ సేవ కార్యక్రమం సైతం ముగియనుంది. మంగళవారం ప్రశాంతి నిలయంలో గ్రామ సేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.