
సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న శివరాజ్‌పాటిల్
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి మహాసమాధిని కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్‌పాటిల్ దర్శించుకున్నారు. బుధవారం రాత్రి ఆయన బెంగళూరు నుంచి ప్రశాంతి నిలయానికి చేరుకొన్నారు. గురువారం ఉదయం సత్యసాయి మహాసమాధిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయనను శాంతిభవన్ అతిథి గృహంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం మర్యాదపూర్వకంగా కలుసుకొని సత్యసాయి చిత్రపటాన్ని అందజేశారు. అనతరం శివరాజ్‌పాటిల్ 9 గంటలకు ఇక్కడి నుంచి బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు.