ఘనంగా సత్యసాయి గిరిప్రదక్షిణ | Sai richly giripradaksina | Sakshi
Sakshi News home page

ఘనంగా సత్యసాయి గిరిప్రదక్షిణ

Published Tue, Dec 13 2016 11:17 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ఘనంగా సత్యసాయి గిరిప్రదక్షిణ - Sakshi

ఘనంగా సత్యసాయి గిరిప్రదక్షిణ

పుట్టపర్తి టౌన్‌ : సత్యసాయి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గిరిప్రదక్షిణను చేపట్టారు. ప్రశాంతి నిలయం గణేష్‌ గేట్‌ వద్ద సత్యసాయి చిత్రపటానికి పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలాపనతో గిరిప్రదక్షిణలో భక్తులు ముందుకు సాగారు.గోకులం, ఎనుములపల్లి గణేష్‌ సర్కిల్, ఆర్‌వీజే పెట్రోల్‌ బంక్, చింతతోపుల మీదుగా పట్టణంలో ప్రవేశించి తిరిగి ప్రశాంతి నిలయం గణేష్‌ గేట్‌ వద్ద మంగళహారతితో కార్యక్రమం ముగిసింది. పుట్టపర్తి పరిసర ప్రాంతాలతోపాటు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున గిరిప్రదక్షిణలో పాల్గొని తరించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement