'మామ్'గా అతిలోక సుందరి | Sri Devi MOM First look | Sakshi

'మామ్'గా అతిలోక సుందరి

Mar 14 2017 10:09 AM | Updated on Sep 5 2017 6:04 AM

'మామ్'గా అతిలోక సుందరి

'మామ్'గా అతిలోక సుందరి

ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అతిలోక సుందరి శ్రీదేవి, ఇప్పటి వరకు ఫుల్ ఫాంలోకి రాలేదు

ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అతిలోక సుందరి శ్రీదేవి, ఇప్పటి వరకు ఫుల్ ఫాంలోకి రాలేదు. ఇంగ్లీష్ వింగ్లీష్ తరువాత నటించిన తమిళ సినిమా పులి తీవ్రంగా నిరాశపరచటంతో తన నెక్ట్స్ సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకుంది. ఇటీవల గ్లామరస్ డ్రస్సుల్లో అదరగొడుతున్న శ్రీదేవి త్వరలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

శ్రీదేవి భర్త, బోనీ కపూర్ నిర్మాణ సారథ్యంలో  రవి ఉడయార్ దర్శకత్వంలో మామ్ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది శ్రీదేవి. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, అభిమన్యూ సింగ్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 14న రిలీజ్కు రెడీ అవుతోంది. రీ ఎంట్రీలో సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్న శ్రీదేవి ఈ సినిమాతో బ్లార్ బస్టర్ సాదిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement