‘శ్రీదేవిది సహజ మరణం కాదు’ | Sridevi Death Kerala DGP Claim Actress Was Murdered | Sakshi
Sakshi News home page

కేరళ డీజీపీ సంచలన వ్యాఖ్యలు.. ఖండించిన బోనీకపూర్‌

Published Fri, Jul 12 2019 7:10 PM | Last Updated on Fri, Jul 12 2019 7:17 PM

Sridevi Death Kerala DGP Claim Actress Was Murdered - Sakshi

భారతదేశ సినీ చరిత్రలో లేడీ సూపర్‌ స్టార్‌గా నిలిచిన అలనాటి అందాల తార శ్రీదేవి మరణించి నేటికి ఏడాదికి పైనే అయ్యింది. ఇప్పటికి కూడా శ్రీదేవి అభిమానులు ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో శ్రీదేవి ఓ బాత్‌టబ్‌లో పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీదేవి మృతి చుట్టూ ఎన్నో అనుమానాలు. కానీ వాటికి సరైన సమాధానం మాత్రం లభించలేదు. అభిమానుల మనసుల్లో నేటికి కూడా ఈ అనుమానాలు అలానే ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీదేవి మృతి గురించి మరో సారి చర్చ ప్రారంభమయ్యింది. ఈ చర్చను ​ప్రారంభించిన వ్యక్తి సామాన్యుడు కాదు. కేరళ జైళ్ల శాఖ డీజీపీగా పని చేస్తున్న రిషిరాజ్‌ సింగ్‌ ఈ చర్చను తెరమీదకు తీసుకొచ్చారు.

కేరళ కౌమిది పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషిరాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవిది సహజ మరణం కాదని బాంబు పేల్చారు. అతిలోక సుందరిది సహజ మరణం కాదని తన స్నేహితుడు, ఫొరెన్సిక్ నిపుణుడు డాక్టర్ ఉమదత్తన్ చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. దాంతో మరోసారి దేశవ్యాప్తంగా శ్రీదేవి మృతి చర్చనీయాంశమైంది. శ్రీదేవి మరణం గురించి తాను ఉమదత్తన్‌తో మాట్లాడినప్పుడు ఆయన పలు అనుమానాలను వ్యక్తం చేసినట్లు రిషిరాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

ఆయన మాటాల్లోనే.. ‘ఏ మనిషి అయినా ఒక్క అడుగు లోతు ఉన్న బాత్‌టబ్‌లో పడి చనిపోవడం అసంభవం. ఒక వేళ సదరు వ్యక్తి విపరీతంగా తాగితే.. తప్ప ఇలా చనిపోయే అవకాశం లేదు. అలాకాకుండా ఎవరైనా వ్యక్తి కావాలని నీటిలో ముంచితే అప్పుడు ఆ వ్యక్తి చనిపోయే అవకాశం ఉంది. అయితే శ్రీదేవికి అతిగా తాగే అలవాటు లేదు. పైగా ఎ‍ంత మత్తులో ఉన్నా సరే ఊపిరాడని పరిస్థితి ఎదురైతే.. మన శరీరం వెంటనే రియాక్టయి.. మత్తును తాత్కాలికంగానైనా బ్రేక్‌ చేస్తుంది. కానీ శ్రీదేవి విషయంలో అలా జరగలేదు’ అన్నారు రిషిరాజ్‌ సింగ్‌.

మరోటి శ్రీదేవి దుబాయ్‌లో బీమా చేయించడం.. ఆమె అక్కడ మరణిస్తేనే బీమా పరిహారం అందుతుంది అనే అంశం కూడా అనుమానాస్పదంగానే ఉందన్నారు. చివరకు శ్రీదేవి కూడా దుబాయ్‌లోనే మరణించడం ఈ అనుమానానికి బలం చేకూరుస్తుందన్నారు. శ్రీదేవి మరణించిన తర్వాత బీమా పరిహారానికి సంబంధించిన వార్తలు పేపర్లలో కూడా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ పోలీసు అధికారి, ఫోరెన్సిక్‌ నిపుణుడు శ్రీదేవి మరణం గురించి సందేహాలు వ్యక్తం చేయడంతో మరోసారి ఈ టాపిక్‌ గురించి చర్చ జరుగుతోంది.

అవన్ని ఊహాజనిత వార్తలే : బోనీ కపూర్‌
అయితే శ్రీదేవి మృతి పట్ల రిషిరాజ్‌ సింగ్‌ వ్యక్తం చేసిన అనుమానాలను బోనీ కపూర్‌ కొట్టి పారేస్తున్నారు. అవన్ని ఊహాజనిత ప్రశ్నలే అంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement