'ఆమె దేశంలోనే గొప్ప నటి' | Nawazuddin to team up with Sridevi | Sakshi
Sakshi News home page

'ఆమె దేశంలోనే గొప్ప నటి'

Published Wed, Mar 2 2016 12:15 PM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

'ఆమె దేశంలోనే గొప్ప నటి'

'ఆమె దేశంలోనే గొప్ప నటి'

విలక్షణ పాత్రలతో బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ. పాజిటివ్, నెగెటివ్ అన్న తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో అలరిస్తున్న నవాజ్, ఇప్పుడో స్టార్ హీరోయిన్ తో కలిసి నటించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన నవాజ్, ఆమె దేశంలోనే గొప్పనటి అంటూ కీర్తించాడు.

80, 90 దశకాలలో వెండితెరను శాసించిన స్టార్ హీరోయిన్ శ్రీదేవి, తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని, నాలుగేళ్ల క్రితం ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ సీనియర్ హీరోయిన్ మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతుంది. 'మామ్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు నవాజుద్ధీన్ సిద్దిఖీ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సందర్భంగా నవాజ్, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'పది రోజుల క్రితం నేనో సినిమా అంగీకరించాను. థ్రిల్లింగ్ స్క్రిప్ట్తో రూపొందనున్న ఈ సినిమాలో శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తుంది. నేను అతిథి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎక్కవ శాతం శ్రీదేవిగారితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాను. నా దృష్టిలో దేశంలోనే ఆమె గొప్ప నటి' అంటూ కామెంట్ చేశాడు నవాజ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement